fast bowler
-
'మళ్లీ స్కూల్‌కు వెళ్తా.. విండీస్ టూర్లో కూడా చదువుకున్నా'
క్వేనా మఫాకా.. దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అంత్యంత పిన్న వయస్కుడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో 18 ఏళ్ల మఫాకా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా ఈ ఘనతను మఫాకా తన పేరిట లిఖించుకున్నాడు.ఈ ఏడాది జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో మఫాకాకు సీనియర్ ప్రోటీస్ జట్టులో చోటు దక్కింది. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని ఈ యువ సంచలనం అందిపుచ్చుకోలేకపోయాడు. విండీస్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు 54 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ఐపీఎల్లో కూడా మఫాకా ఆడాడు.ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరపున క్యాచ్‌రిచ్ లీగ్‌లోకి అడగుపెట్టాడు. కానీ అక్కడ కూడా ఈ ప్రోటీస్ యువ పేసర్ తన మార్క్ చూపించలేకపోయాడు. ఐపీఎల్లో 2 మ్యాచ్‌లు ఆడిన మఫాక ఏకంగా 89 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ సాధించాడు. దీంతో మిగితా మ్యాచ్‌లకు ముంబై ఫ్రాంచైజీ అతడిని పక్కన పెట్టింది. అయితే మఫాకా వికెట్లు సాధించకపోయినప్పటకి 150 పైగా వేగంతో బౌలింగ్ చేసి అందరని ఆకట్టుకున్నాడు.చదవును కొనసాగిస్తున్నా?ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అనంతరం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాక పలు అసక్తికర విషయాలను వెల్లడించాడు. ఓ వైపు క్రికెట్‌ను, మరో వైపు తన చదువును ఎలా బ్యాలెన్స్ చేశాడో అతడు చెప్పుకొచ్చాడు."నేను తిరిగి ఇంటికి వెళ్లాక ప్రిలిమ్స్(స్కూల్ ఎడ్యూకేషన్) కోసం సిద్దమవుతాను. మళ్లీ నా స్కూల్‌కు వెళ్తాను. విండీస్ టార్ సమయంలో కూడా నా చదువును కొనసాగించాను. ఓ వైపు కొంచెం కొంచెం చదవుతూ నా ఆటపై దృష్టి పెట్టాను. ప్రిలిమ్స్ తర్వాత నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ పరీక్షలతో నా పాఠశాల విద్య పూర్తి అవుతోంది. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అదే విధంగా ప్రోటీస్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతీ ఒక్క ఆటగాడి చిరకాల స్వప్నం. క్రికెట్ అంటే నాకు చిన్నతనం నుంచే మక్కువ ఎక్కువ. ఆరు, ఏడేళ్ల వయస్సు నుంచే దక్షిణాఫ్రికా తరపున ఆడాలని కలలు కన్నాను అని ఐవోఎల్.కామ్( iol.com.za)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2024లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ తనకు చివరి రెడ్ బాల్ మ్యాచ్ అని వెల్లడించాడు. ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదని, అందుకే రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 34 ఏళ్ల వరుణ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తన సొంత మైదానమైన కీనన్ స్టేడియంలో (జంషెడ్పూర్) రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. 2010 దశకంలో టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న వరుణ్.. 2011-15 మధ్యలో 9 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 52 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన వరుణ్ 65 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. వరుణ్ దేశవాలీ క్రికెట్లో జార్ఖండ్‌తో పాటు బరోడా జట్టుకు కూడా ఆడాడు. 2014 ఓల్డ్‌ట్రాఫర్డ్ టెస్ట్‌లో రాకాసి బౌన్సర్‌తో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ముక్కు పగలగొట్టడం ద్వారా వరుణ్ వెలుగులోకి వచ్చాడు. -
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ డౌన్.. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆతర్వాత మొయిన్ అలీ, కొద్ది రోజుల గ్యాప్‌లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ విన్నర్ అలెక్స్ హేల్స్, తాజాగా త్రీ టైమ్ యాషెస్ సిరీస్ విన్నర్, బ్రాడ్ సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్ ఓ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నానని ఫిన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్సెక్స్ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన ఫిన్.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్‌సెక్స్‌కు ఆడిన ఫిన్.. ఆతర్వాత ససెక్స్‌ను మారాడు. ససెక్స్ తరఫున ఫిన్ కేవలం 19 మ్యాచ్‌లే ఆడాడు. ససెక్స్‌కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్, కెరీర్‌ను కొనసాగించలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. -
వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.. ఇలాంటి బౌలర్ అత్యవసరం
టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాకు కనిపించిన సమస్య.. ఫాస్ట్ బౌలర్ల కొరత. బుమ్రా లాంటి మరో బౌలర్ మనకు కనిపించడం లేదు. అర్ష్‌దీప్ సింగ్ కాస్త అలాగే కనిపించినప్పటికి కీలకమైన సెమీఫైనల్లో తేలిపోయాడు. భువనేశ్వర్, షమీల సంగతి సరేసరి. అయితే టీమిండియాలో గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసిరే బౌలర్లు తక్కువే. ఉమ్రాన్ మాలిక్ వేసే ప్రతీ బంతి గంటకు 150 కిమీ వేగంతోనే ఉంటుంది. ఆస్ట్రేలియా లాంటి ఫాస్ట్ పిచ్‌లపై ఇలాంటి బౌలర్లు కచ్చితంగా కావాలి. ఇక యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ కూడా ఆస్ట్రేలియా పిచ్‌లకు సరిగ్గా అతుకుతాడు. కానీ టీమిండియా సెలెక్టర్లకు ఇలాంటి వాళ్లు కనిపించరు. అలాంటి ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌కు సరిసమానంగా గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసురుతున్న మరో ఆణిముత్యం కంటపడ్డాడు. అతనే జమ్మూ కశ్మర్‌కు చెందిన వసీమ్ బషీర్. ఎంత లేదన్నా 145 కిమీ వేగంతో బంతులు విసురుతున్న బషీర్ ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. తన పదునైన పేస్ బౌలింగ్‌తో.. బౌన్సర్లతో ముప్పతిప్పలు పెడుతున్నాడు. 22 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న బషీర్‌కు మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ అండర్ 25 టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బషీర్‌ను గుర్తించాలంటూ కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. త్వరలో ఐపీఎల్ మినీవేలం జరగనున్న నేపథ్యంలో బషీర్‌ను కొనుగోలు చేసే అవకాశముంది. అదే పనిలో టీమిండియాకు కూడా ఇలాంటి బౌలర్లు ఇప్పుడు అత్యవసరంగా మారిపోయారు. Next 150kmph from Kashmir! Are there more Umran Maliks in J&K? Yes, this is Waseem Bashir, a 22-year-old pacer from Kashmir, who probably bowls over 145kmph (could even be 150kmph+)! He is a part of the J&K U-25 team and has been scaring batters with pace! #IPL teams take note pic.twitter.com/0ijkDt21xh — Mohsin Kamal (@64MohsinKamal) November 17, 2022 చదవండి: ధోని కొత్త కారులో కేదార్ జాదవ్, రుతురాజ్‌ల షికారు. అందం చూపించొద్దన్నారు.. మందు కూడా పాయే; ఏమిటీ కర్మ? -
వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ కన్ను మూత
వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థామ్సన్.. మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. "మా అన్నయ్య, మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అలాన్ థామ్సన్ మరణించారు. కొన్ని రోజులు కిందట అతనికి హిప్(తుంటి గాయం) సర్జరీ జరిగింది. కానీ అన్నయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. అఖరికి అలాన్ మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు" అని అతడి సోదరుడు ట్విటర్లో పేర్కొన్నారు. కాగా విక్టోరియాకు చెందిన అలాన్ ఆస్ట్రేలియా తరపున ఒక వన్డే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడారు. నాలుగు టెస్టుల్లో 12 వికెట్లు అలాన్ సాధించారు. అదే విధంగా అతని బౌలింగ్ యాక్షన్ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. అందుకే అతనిని ముద్దుగా "ఫ్రాగీ" అని పిలుచుకోనేవారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విక్టోరియా తరపున 44 మ్యాచ్‌లు ఆడిన అలాన్.. 184 వికెట్లు పడగొట్టారు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి వికెట్ ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 1971 జనవరి 5న ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్ ఆసీస్‌కు ప్రాతినిద్యం వహించిన అలాన్ థామ్సన్ పడగొట్టారు. తద్వారా వన్డేల్లో తొలి వికెట్ సాధించిన బౌలర్‌గా అలాన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అలాన్ 22 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించారు. చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, ఐపీఎల్ ఆటగాడు, 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ ఈశ్వర్ పాండే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా సోమవారం (సెప్టెంబర్ 12) ప్రకటించాడు. 2014 న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈశ్వర్ పాండే.. భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపీఎల్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఈశ్వర్ 2014 ఐపీఎల్ సీజన్లో ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సీజన్లో సీఎస్కే అతన్ని 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో 25 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టిన ఈశ్వర్.. 2013, 2016 సీజన్లలో పూణే జట్టుకు ఆడాడు. ఈశ్వర్ 2012-13 రంజీ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కెరీర్ మొత్తంలో 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 58 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 71 టీ20లు ఆడిన ఈశ్వర్.. 394 వికెట్లు (263, 63, 68) సాధించాడు. అప్పట్లో ధోని ఈశ్వర్‌కు వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. అయితే పూర్తిగా ఫామ్ కోల్పోయిన అతను క్రమంగా ఐపీఎల్ నుంచి కనుమరుగయ్యాడు. -
‘యూకేలో పెరిగితే ఇంతకాలం బతికేవాడిని కాను’
జోహెన్నెస్‌బర్గ్: మాజీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ మైకెల్ హోల్డింగ్ జాత్యహంకార ధోరణిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదృష్టవశాత్తు తాను ఇంగ్లండ్‌లో పెరగలేదని.. లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే తాను మరణించేవాడినని పేర్కొన్నాడు. యవ్వనంలో ఉండగా తాను చాలా దూకుడుగా వ్యవహరిచేంవాడినని.. ఆ సమయంలో తాను ఇంగ్లండ్‌లో ఉంటే కచ్చితంగా ఈపాటికే మరణించేవాడినన్నాడు మైకెల్. అమెరికాలో చోటు చేసుకున్న జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత వచ్చిన బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో మైకెల్ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. జాత్యాహంకార ధోరణిపై మైకెల్ ‘‘వై వీ నీల్, హౌ వి రైజ్’’ అనే పుస్తకాన్ని రాశాడు. త్వరలోనే ఇది విడుదల కానుంది. ఈ క్రమంలో మైకెల్ మాట్లాడుతూ.. ‘‘నేను జమైకాలో పెరిగాను. కనుక ఎప్పుడు జాత్యహంకారాన్ని చవి చూడలేదు. కానీ అక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్లిన ప్రతి సారి నేను నేను దాన్ని ఎదుర్కొన్నాను. ప్రతిసారి నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని.. ఇది నీ దేశం కాదు.. త్వరలోనే నీవు నీ స్వస్థలం వెళ్తావు. అక్కడ నీకు ఇలాంటి చెడు అనుభవాలు ఎదురుకావని నాకు నేనే నచ్చచెప్పుకునేవాడిని’’ అని తెలిపాడు. ‘‘ఇక యువకుడిగా ఉన్నప్పుడు నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నేను న్యూజిలాండ్ (1980) లో ఉండగా మైదానం నుంచి ఒక స్టంప్‌ను బయటకు తన్నాను. అదృష్టం కొద్ది నేను ఇంగ్లండ్‌లో పెరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆనాటి నా ప్రవర్తన తర్వాత నేను ఇంతకాలం బతికి ఉండేవాడినే కాదు” అని హోల్డింగ్ ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “ఈ విషయంలో నేను ఓ స్టాండ్ తీసుకుంటే నా కెరీర్ ఇప్పుడున్నంత కాలం ఉండేది కాదు. అలానే నాకు ఈ సుదీర్ఘ టెలివిజన్ కెరీర్ కూడా ఉండేది కాదు. తమ హక్కుల కోసం నిలబడి అన్యాయాన్ని ఎదిరించిన నల్లజాతీయులు బాధితులవుతున్నారని మేము చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. ఒకవేళ నేను కూడా ఈ జాత్యహంకార ధోరణి గురించి మాట్లాడి ఉంటే వారు ‘మరో యువకుడు మనల్ని ఎదరిస్తున్నాడు.. అతనిని వదిలించుకోండి’ అని చెప్పేవారు. అప్పుడు నేను పేడ కుప్పలో మరొక వ్యక్తిగా ఉండేవాడిని” అన్నాడు హోల్డింగ్. -
ప్రసిద్ద్ కృష్ణ.. మేడిన్ ఆస్ట్రేలియా
పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సంచలన ప్రదర్శన(4/54)తో ఆకట్టుకున్న టీమిండియా నయా పేస్ టాలెంట్ ప్రసిద్ద్ కృష్ణ.. ఆసీస్ లెజెండరీ పేసర్ జెఫ్ థామ్సన్ శిష్యరికంలో రాటు దేలాడు. థామ్సన్ ఇచ్చిన చిట్కాలతో తన పేస్‌కు పదును పెట్టాడు. స్వతహాగా ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ అభిమాని అయిన ఆయన.. ఆస్ట్రేలియా పిచ్‌లపై కఠోర సాధన చేశాడు. అలాగే ఎంఆర్ఎఫ్ అకాడమీలో ఆసీస్ ఆల్ టైమ్ గ్రేట్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వద్ద కూడా శిక్షణ తీసుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల సూచనలు, సలహాలతో పాటు కఠోర సాధనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ కర్ణాటక కుర్రాడు.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంగా ఉద్భవించాడు. కాగా, పూణేలోని ఎమ్సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ను అందుకున్న ప్రసిద్ద్.. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శనతో అదరగొట్టాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్ ఓవర్లలో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత దాయాదుల క్రికెట్ పోరు..? -
నాకు మిగిలింది ఏడేళ్లు మాత్రమే: శ్రీశాంత్
న్యూఢిల్లీ: ఐపీఎల్–2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల శిక్షా కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్న భారత వెటరన్ పేసర్ శ్రీశాంత్ త్వరలోనే క్రికెట్ ఆడనున్నాడు. కేరళ ఆటగాడైన శ్రీశాంత్‌ను ఆ జట్టు రంజీ ట్రోఫీల్లో అవకాశం కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు. కాగా రాబోయే రోజుల్లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటానని సోషల్ మీడియాలో శ్రీకాంత్ తెలిపాడు. అయితే ప్రస్తుతం తనకు 37 ఏళ్లని, ఇంకా కేవలం ఏడేళ్లు మాత్రమే తనకు అవకాశముందని అన్నాడు. ఉన్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని మెరుగ్గా రాణిస్తానని తెలిపాడు. కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల శ్రీశాంత్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే క్రికెట్ అంటే తనకు ప్రాణమని, ఏ జట్టులోనైనా ఆడేందుకు సిద్దమని శ్రీశాంత్ తెలిపాడు. మరోవైపు ఐపీఎల్లో ఏ జట్టులో ఆడేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని అడగగా, తాను ముంబై ఇండియన్స్‌తో ఆడటానికి ఇష్టపడతానని అన్నాడు. గతంలో ముంబైకు ఆడిన సందర్భంలో తనకు లభించిన మద్దతు కారణంగానే ఆ జట్టుకు మొదటి ప్రాముఖ్యత ఇస్తానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
బాబ్ విల్లీస్ కన్నుమూత
ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం, మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ (70) బుధవారం కన్నుమూశారు. 90 టెస్టుల్లో 25.20 సగటుతో 325 వికెట్లు తీసిన విల్లీస్ 70వ దశకంలో ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచారు. 64 వన్డేల్లో ఆయన 80 వికెట్లు పడగొట్టారు. 1981లో హెడింగ్లీలో జరిగిన యాషెస్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులకే 8 వికెట్లు తీసిన బాబ్ సంచలన ప్రదర్శన ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. 18 టెస్టుల్లో ఆయన ఇంగ్లండ్‌కు కెప్టెన్ గా వ్యవహరించారు. -
ఐసీసీ తీరుపై షోయబ్ అక్తర్ అసంతృప్తి
కరాచి: ఫాస్ట్ బౌలర్ల విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అనుసరిస్తున్న తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో ఫాస్ట్ బౌలర్లకు ఐసీసీ ఊపిరాడకుండా చేస్తుందని.. దీంతో క్రికెట్ తన ఆకర్షణను కోల్పోయే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లే రియల్ క్యారెక్టర్లు అనే విషయాన్ని ఐసీసీ గుర్తుంచుకోవాలని అక్తర్ సూచించారు. ఆటగాళ్లు తమ భావోద్వేగాలను వ్యక్త పరిచే విషయంలో ఐసీసీ అనేక నిబంధనలు విధిస్తోందని అక్తర్ వాపోయారు. 60, 70వ దశకాల్లోని ఫాస్ట్ బౌలర్లు ఇలాంటి నిబంధనలను ఎదుర్కోలేదని.. తమ ఉద్వేగాలను ప్రదర్శించడంలో వారు ఎప్పుడూ భయపడలేదని ఈ సందర్భంగా వెల్లడించారు. ఐసీసీ నిబంధనలు బ్యాట్స్‌మెన్ అనుకూలంగా ఉంటున్నాయని.. ఈ నిబంధనల వలనే ఫాస్ట్ బౌలర్ల క్వాలిటీ తగ్గుతుందని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తమ ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనపై అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ అక్తర్
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరో ఇంటివాడయ్యాడు. అవును.. ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రంలోని హరిపూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల అమ్మాయిని షోయబ్ నిఖా చేసుకున్నాడు. రుబాబ్ అనే ఈ అమ్మాయితో అత్యంత రహస్యంగా హరిపూర్లోనే అక్తర్ నిఖా అయ్యిందన్న విషయాన్ని పాకిస్థాన్‌కు చెందిన దునియా టీవీ వెల్లడించింది. హక్ మహర్ కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించారని, అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లికి అక్తర్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారని ఆ టీవీ చెప్పింది. వాస్తవానికి అక్తర్ తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు తొలుత కథనాలు వచ్చినా, వాటన్నింటినీ ట్విట్టర్ ద్వారా తీవ్రంగా ఖండించాడు. కానీ ఈనెల 12వ తేదీన అక్తర్ కుటుంబం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి, పెళ్లి విషయాన్ని ఖరారు చేసుకుందని అక్తర్‌కు సన్నిహిత వర్గాలు పీటీఐకి తెలిపాయి.