ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం, మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ (70) బుధవారం కన్నుమూశారు. 90 టెస్టుల్లో 25.20 సగటుతో 325 వికెట్లు తీసిన విల్లీస్ 70వ దశకంలో ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచారు. 64 వన్డేల్లో ఆయన 80 వికెట్లు పడగొట్టారు. 1981లో హెడింగ్లీలో జరిగిన యాషెస్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులకే 8 వికెట్లు తీసిన బాబ్ సంచలన ప్రదర్శన ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. 18 టెస్టుల్లో ఆయన ఇంగ్లండ్‌కు కెప్టెన్ గా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment