వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థామ్సన్.. మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. "మా అన్నయ్య, మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అలాన్ థామ్సన్ మరణించారు.
కొన్ని రోజులు కిందట అతనికి హిప్(తుంటి గాయం) సర్జరీ జరిగింది. కానీ అన్నయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. అఖరికి అలాన్ మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు" అని అతడి సోదరుడు ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా విక్టోరియాకు చెందిన అలాన్ ఆస్ట్రేలియా తరపున ఒక వన్డే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడారు.
నాలుగు టెస్టుల్లో 12 వికెట్లు అలాన్ సాధించారు. అదే విధంగా అతని బౌలింగ్ యాక‌్షన్ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. అందుకే అతనిని ముద్దుగా "ఫ్రాగీ" అని పిలుచుకోనేవారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో విక్టోరియా తరపున 44 మ్యాచ్‌లు ఆడిన అలాన్.. 184 వికెట్లు పడగొట్టారు.
వన్డే క్రికెట్ చరిత్రలో తొలి వికెట్
ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 1971 జనవరి 5న ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్ ఆసీస్‌కు ప్రాతినిద్యం వహించిన అలాన్ థామ్సన్ పడగొట్టారు. తద్వారా వన్డేల్లో తొలి వికెట్ సాధించిన బౌలర్‌గా అలాన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అలాన్ 22 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment