
ముంబై:టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. రోహిత్ శర్మ తన కూతురు సమైరా తో కలిసి వున్న ఓ ఫోటో ను పోస్ట్ చేశాడు.ఇక రోహిత్‌కు తన కూతురు సమైరా అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.తన కూతురు కు సంబంధించి వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు.కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవాధికంగా వాయిదాపడటంతో ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రస్తుతం ఇంట్లోనే గడుపుతున్నాడు.
ఈ నేపథ్యంలో గురువారం తన గారాలపట్టి సమైరాను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఓ ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.దానికి 'ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా' అనే క్యాప్షన్ ఇచ్చాడు.ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే వైరల్ అయింది.అటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.
(చదవండి:Eng Vs Ind: షెడ్యూల్ ముందుకు జరపండి! )
Comments
Please login to add a commentAdd a comment