గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 219 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
రషీద్ ఖాన్ 32 బంతుల్లో 79 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రషీద్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ 41 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ మూడు వికెట్లు తీయగా.. పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
21 బంతుల్లో ఫిఫ్టీ బాదిన రషీద్ ఖాన్.. గుజరాత్ 164/8
219 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ ఓటమి ఖరారైనప్పటికి రషీద్ ఖాన్ తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. 21 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో ఐపీఎల్‌లో తొలి అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 54, అల్జారీ జోసెఫ్ ఏడు పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 219.. గుజరాత్ స్కోరు 90/5
219 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 11 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.డేవిడ్ మిల్లర్ 39, రాహుల్ తెవాటియా 10 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 219.. గుజరాత్ స్కోరు 84/5
సూర్యకుమార్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 219
ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 103 పరుగులు చేసి ఐపీఎల్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు.
17 ఓవర్లలో ముంబై స్కోరు 164/5
17 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఐదు పరుగులు చేసిన టిమ్ డేవిడ్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.
14 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 139/3
12 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్35, విష్ణు వినోద్ 29 పరుగులతో ఆడుతున్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో నెహాల్ వదేరా(15) క్లీన్‌బౌల్డ్ కావడంతో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
ముంబైని దెబ్బతీసిన రషీద్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. తొలుత రోహిత్‌ను ఔట్ చేసిన రషీద్.. ఇషాన్ కిషన్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. ప్రస్తుతం ముంబై రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
6 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 61/0
ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 31, రోహిత్ శర్మ 29 పరుగులతో బ్యాటింగ్ ఆడుతున్నారు.
2 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 20/0
2 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 15, ఇషాన్ కిషన్ నాలుగు పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా 57వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ
Skipper Pandya calls it right and @gujarat_titans elect to field first 💪
Another #TATAIPL blockbuster finish coming your way, LIVE & FREE on #JioCinema#MIvGT #IPLonJioCinema pic.twitter.com/sF6gBdD5lb
— JioCinema (@JioCinema) May 12, 2023
వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ఇరుజట్ల మధ్య పోరు కావడంతో ఆసక్తిగా మారింది. ఇరుజట్లు గతంలో రెండుసార్లు తలపడగా.. చెరో విజయాన్ని నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment