వారికంటే ఆ కసి నాకే ఎక్కువగా ఉంది: కోహ్లి | Virat Kohli Says More than fans I want to win the IPL | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 4 2018 9:47 PM | Last Updated on Wed, Apr 4 2018 9:47 PM

Virat Kohli Says More than fans I want to win the IPL - Sakshi

విరాట్‌ కోహ్లి

బెంగళూరు : ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గాలనే కసి అభిమానులకు కన్నా తనకే ఎక్కువగా ఉందని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తెలిపాడు. బుధవారం ట్రైనింగ్‌ సెషన్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘టైటిల్‌ గెలవాలనే కోరిక అభిమానుల కన్నా నాకే ఎక్కువగా ఉంది. గత పదేళ్లుగా నేను బెంగళూరు జట్టుతో కొనసాగుతున్నా. మూడు సార్లు ఫైనల్‌కు చేరి తృటిలో టైటిల్‌ చేజార్చుకున్నాం. ఈ సారి 120 శాతం ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకుంటాం.  గత సీజన్‌లలో ఆర్సీబీ బ్యాటింగ్‌ విభాగంలో పటిష్టంగా ఉండేది. కానీ ఈ సారి వేలం మా బౌలింగ్‌ విభాగానికి ఊపును తీసుకొచ్చింది. ఈ సీజన్‌లో మా అవకాశాలు గురించి నేను ఆశావాహక ధృక్పథంతో ఉన్నానని’  చెప్పుకొచ్చాడు. 

ఇక ఈ సారీ వేలంలో బౌలర్లపై దృష్టి సారించిన ఆర్సీబీ  స్పిన్నర్లు యజువేంద్ర చహల్‌, వాషింగ్టన్‌ సుంధర్‌, పవన్‌ నేగి, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీలను తీసుకుంది. ఉమేశ్‌ యాదవ్‌, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌వోక్స్‌, నవదీప్‌సైనీ, సిరాజ్‌, టీమ్‌ సౌతీలతో పేస్‌ విభాగం సైతం బలంగా కనిపిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement