'ఐపీఎల్ టైటిల్ మాదే' | Confident of Winning the Final, Says Karn Sharma | Sakshi
Sakshi News home page

'ఐపీఎల్ టైటిల్ మాదే'

Published Sat, May 20 2017 4:47 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

'ఐపీఎల్ టైటిల్ మాదే'

'ఐపీఎల్ టైటిల్ మాదే'

హైదరాబాద్: రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ఆదివారం జరిగే తుది పోరులో కచ్చితంగా విజయం సాధించి టైటిల్ ను సాధిస్తామని అంటున్నాడు ముంబై ఇండియన్స్ బౌలర్ కరణ్ శర్మ. క్వాలిఫయర్-2 మ్యాచ్ లో నాలుగు వికెట్ల సాధించి కోల్ కతా పతనాన్ని శాసించిన కరణ్ శర్మ.. రైజింగ్ పుణెపై కూడా తమదే పైచేయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

 

'మేము ఫైనల్ మ్యాచ్ ను గెలవడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. కచ్చితంగా టైటిల్ ను గెలిచి తీరుతాం. పుణెపై ఓటముల రికార్డు అనేది గతం. రేపు జరగబోయే మ్యాచ్ లో విజేతలుగా నిలుస్తాం'అని కరణ్ శర్మ స్పష్టం చేశాడు. అయితే ఫైనల్ మ్యాచ్ లో తుది జట్టులో స్థానంపై హర్భజన్ సింగ్ తో పోటీ ఉందా అనే విషయంలో కరణ్ శర్మ సమాధానం దాటేశాడు. అది తన చేతుల్లో ఉండదని, జట్టు సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉంటుందన్నాడు. కేవలం  అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడమే తనకు ముఖ్యమన్నాడు. 'బౌలింగ్ చేయడమే నాకు తెలిసింది. మ్యాచ్ గెలవడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తా. నేను జట్టులో లేకపోయినప్పటికీ ఎక్కువ శ్రమిస్తునే ఉంటా'అని కరణ్ శర్మ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement