rising pune
-
ఐపీఎల్–10 విజేత ముంబై ఇండియన్స్
-
ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర
-
ముంబై మహాన్
♦ ఐపీఎల్–10 విజేత ముంబై ఇండియన్స్ ♦ మూడోసారి టైటిల్ సాధించిన రోహిత్ సేన ♦ ఫైనల్లో పరుగు తేడాతో పుణేపై అద్భుత విజయం ♦ కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన ♦ స్మిత్ పోరాటం వృథా డ్రామా... చివరి బంతి వరకు డ్రామా... తక్కువ స్కోర్ల మ్యాచే అయినా ఐపీఎల్ ఫైనల్ అంటే ఎంత ఉత్కంఠగా సాగాలో అలాగే సాగింది. అనూహ్య రీతిలో మలుపులు తిరిగి ఆటను చివరి క్షణం వరకు రక్తి కట్టించింది. ఈ అద్భుత పోరులో చివరకు ముంబై అనుభవం గెలిచింది. ఒకే ఒక్క పరుగుతో ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరం. తొలి బంతిని మనోజ్ తివారీ చక్కటి ఫోర్‌గా మలిచాడు. అయితే తర్వాతి రెండు బంతుల్లో తివారీ, స్మిత్‌లను అవుట్ చేసిన జాన్సన్ మ్యాచ్‌ను ముంబై చేతుల్లోకి తెచ్చాడు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేసినా పుణేకు ఓటమి తప్పలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, మూడో పరుగు తీసే ప్రయత్నంలో సుచిత్ త్రోకు క్రిస్టియాన్ అవుటయ్యాడు. పాపం రైజింగ్ పుణే సూపర్ జెయింట్... అతి జాగ్రత్త జట్టు కొంప ముంచింది. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే పరిమితం చేయగలిగినా... టి20 తరహా దూకుడు ఎక్కడా చూపించకుండా ఒత్తిడి పెంచుకుంది. 20 ఓవర్లలో ఏ దశలోనూ జట్టు రన్‌రేట్ కనీసం 7 పరుగులు దాటలేదు. చివరి వరకు నిలిచి విజయం వైపు నడిపించగలడని నమ్మిన స్టీవ్ స్మిత్ చివరకు ఈ పాపంలో భాగమయ్యాడు. సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2017 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా పట్టుదలగా ఆడిన రోహిత్ సేన ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ రోహిత్ శర్మ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పుణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు లభించింది. కీలక భాగస్వామ్యం... ఆరంభంలో ముంబై ఇండియన్స్ ప్రదర్శన గత మ్యాచ్‌లో కోల్‌కతా ఆటను తలపించింది. పుణే పదునైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కాగా, చివర్లో కృనాల్ ఇన్నింగ్స్ ఆ జట్టును నిలబెట్టింది. ఐపీఎల్ ఫైనల్లో 31వ బంతికి గానీ తొలి ఫోర్ రాలేదు... ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మందగమనానికి ఇది ఉదాహరణ. తొలి రెండు ఓవర్లలో 7 పరుగులే రాగా... మూడో ఓవర్లో ఉనాద్కట్ రెండు వికెట్లతో దెబ్బ తీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి పార్థివ్ (4) అవుట్ కాగా, అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో సిమన్స్ (3) ఆటను ఉనాద్కట్ ముగించాడు. తొలి 5 ఓవర్లలో 16 పరుగులే చేయగలిగిన ముంబై, ఆరో ఓవర్లో మరో 16 పరుగులతో పవర్‌ప్లేను 32 పరుగులతో ముగించింది. ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో రోహిత్ నాలుగు ఫోర్లు బాదడం విశేషం. అయితే ఈ జోరు ఎంతో సేపు నిలవలేదు. స్మిత్ చక్కటి త్రోకు అంబటి రాయుడు (12) రనౌట్ కాగా, జంపా ఒకే ఓవర్లో రోహిత్, పొలార్డ్ (7) వికెట్లు తీశాడు. శార్దుల్ ఠాకూర్ సమయస్ఫూర్తితో బౌండరీ వద్ద క్యాచ్ పట్టి రోహిత్‌ను వెనక్కి పంపగా, జంపా బౌలింగ్‌లో తివారీ చేతికి పొలార్డ్ చిక్కాడు. క్రిస్టియాన్ బంతికి హార్దిక్ పాండ్యా (10) అవుట్ కాగా, అతని అద్భుత ఫీల్డింగ్‌కు కరణ్ శర్మ (1) రనౌటయ్యాడు. ఈ దశలో కృనాల్, జాన్సన్ జోడి ముంబైని ఆదుకుంది. ఫలితంగా చివరి మూడు ఓవర్లలో జట్టు 37 పరుగులు సాధించింది. క్రిస్టియాన్ వేసిన చివరి ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన కృనాల్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. కృనాల్, జాన్సన్ ఎనిమిదో వికెట్‌కు 36 బంతుల్లో 50 పరుగులు జోడించారు. అతి జాగ్రత్త... పుణే ఇన్నింగ్స్ కూడా నెమ్మదిగానే ప్రారంభమైంది. రాహుల్ త్రిపాఠి (3)ని బుమ్రా అవుట్ చేయగా... రహానే, స్మిత్ కలిసి జాగ్రత్తగా ఆడారు. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోలేదు. మధ్యలో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడినా... స్మిత్ తన 23వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేదు. అయితే 14 పరుగుల వద్ద రహానే ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కృనాల్ వదిలేయడం పుణేకు కలిసొచ్చింది. అయితే ఈ భాగస్వామ్యం మాత్రం మరీ నెమ్మదిగా సాగింది. చివరకు 57 బంతుల్లో 54 పరుగులు జోడించిన తర్వాత రహానేను అవుట్ చేసి జాన్సన్ ఈ జోడీని విడదీశాడు.ఆ తర్వాతి ముంబైకి ఒక్కసారిగా పట్టు చిక్కింది. ధోని (10), తివారి (7) విఫలం కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. చివరి వరకు ఒంటరిగా పోరాడిన స్మిత్ జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమన్స్ (సి అండ్ బి) ఉనాద్కట్ 3; పార్థివ్ పటేల్ (సి) శార్దుల్ (బి) ఉనాద్కట్ 4; రాయుడు రనౌట్ 12; రోహిత్ శర్మ (సి) శార్దుల్ (బి) జంపా 24; కృనాల్ పాండ్యా (సి) రహానే (బి) క్రిస్టియాన్ 47; పొలార్డ్ (సి) తివారీ (బి) జంపా 7; హార్దిక్ పాండ్యా ఎల్బీడబ్ల్యూ (బి) క్రిస్టియాన్ 10; కరణ్ శర్మ రనౌట్ 1; జాన్సన్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–7, 2–8, 3–41, 4–56, 5–65, 6–78, 7–79, 8–129. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–19–2, వాషింగ్టన్ సుందర్ 4–0–13–0, శార్దుల్ ఠాకూర్ 2–0–7–0, ఫెర్గూసన్ 2–0–21–0, జంపా 4–0–32–2, క్రిస్టియాన్ 4–0–34–2. రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) పొలార్డ్ (బి) జాన్సన్ 44; రాహుల్ త్రిపాఠి ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 3; స్మిత్ (సి) రాయుడు (బి) జాన్సన్ 51; ధోని (సి) పార్థివ్ పటేల్ (బి) బుమ్రా 10; మనోజ్ తివారీ (సి) పొలార్డ్ (బి) జాన్సన్ 7; క్రిస్టియాన్ రనౌట్ 4; సుందర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–17, 2–71, 3–98, 4–123, 5–123, 6–128. బౌలింగ్: కృనాల్ 4–0–31–0, జాన్సన్ 4–0–26–3, బుమ్రా 4–0–26–2, మలింగ 4–0–21–0, కరణ్ శర్మ 4–0–18–0. ఐపీఎల్–10 అవార్డీలు అరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు; రూ.10 లక్షలు): వార్నర్ (641 పరుగులు; హైదరాబాద్) పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు; రూ.10 లక్షలు): భువనేశ్వర్ (26 వికెట్లు; హైదరాబాద్) ఫర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ.10 లక్షలు): సురేశ్ రైనా ఎమర్జింగ్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): బాసిల్ థంపీ ఫెయిర్ ప్లే అవార్డు : గుజరాత్ లయన్స్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): బెన్ స్టోక్స్ రన్నరప్ (రూ. 10 కోట్లు): రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ విన్నర్ (రూ. 15 కోట్లు): ముంబై ఇండియన్స్ -
ఐపీఎల్ విజేత ఎవరో?
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 విజేత ఎవరో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్- ముంబై ఇండియన్స్ ల మధ్య తుది సమరం జరుగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 3–0తో పుణెదే పైచేయి అయినా... ‘ఫైనల్ పంచ్’తో ఆ మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. తన సారథ్యంలో మరో లీగ్ టైటిల్‌ను సాధించాలని రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతుండగా... కెప్టెన్‌గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్ స్మిత్ పట్టుదలగా ఉన్నాడు. పుణె అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్ స్మిత్‌తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్‌కు ఇప్పుడు మరో మ్యాచ్‌లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పుణెకు తిరుగుండదు. మరొకవైపు బ్యాటింగ్‌లో కూడా ముంబైకి తిరుగులేదు. ప్రధానంగా రోహిత్ , అంబటి రాయుడు, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్‌లపైనే ముంబై బ్యాటింగ్ లో కీలకం. ఇరు జట్లు గత మ్యాచ్ లో ఆడిన తుది జట్టుతోనే బరిలోకి దిగుతున్నాయి. దాంతో ముంబై ఇండియన్స్ జట్టులో హర్భజన్ సింగ్ కు స్థానం దక్కలేదు. ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), పార్ధీవ్ పటేల్, అంబటి రాయుడు, సిమన్స్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, మిచెల్ జాన్సన్, కరణ్ శర్మ, బూమ్రా, మలింగా పుణె తుది జట్టు: :స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారీ,ఎంఎస్ ధోని, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గ్యుసన్, ఆడమ్ జంపా, శార్దూల్ ఠాకూర్, ఉనద్కత్ -
ఐపీఎల్ విజేత ఎవరో?
-
నేడే చూడండి... మహా సంగ్రామం
-
నేడే చూడండి... మహా సంగ్రామం
♦ నేడు హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ ♦ ముంబై ఇండియన్స్‌తో రైజింగ్ పుణే ఢీ ♦ మూడో టైటిల్‌పై రోహిత్ సేన దృష్టి ♦ తొలి ట్రోఫీపై స్మిత్ బృందం గురి తొమ్మిదేళ్లలో రెండు సార్లు విజేతగా నిలిచి, మరోసారి ఫైనల్లో ఓడిన జట్టు ఒకవైపు... లీగ్‌లోకి అడుగు పెట్టిన రెండో ఏడాదే టైటిల్‌పై గురి పెట్టిన జట్టు మరోవైపు... అభిమానుల అంచనాలకు తగినట్లుగా రాణించి అగ్రస్థానంలో నిలిచిన టీమ్ ఒకవైపు... ఏడాది క్రితం పరాభవం నుంచి కోలుకొని, ఆపై అనూహ్యంగా దూసుకుపోయి పోటాపోటీగా రెండో స్థానంలో నిలిచిన టీమ్ మరోవైపు... ఐపీఎల్–10లో నిలకడగా రాణించిన రెండు జట్ల మ«ధ్యే అంతిమ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్లో రెండు మరాఠా జట్ల మధ్య పోరులో 3–0తో పుణేదే పైచేయి అయినా... ‘ఫైనల్ పంచ్’తో ఆ మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. తన సారథ్యంలో మరో లీగ్ టైటిల్‌ను సాధించాలని రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతుండగా... కెప్టెన్‌గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్ స్మిత్ పట్టుదలగా ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు జరగబోయే ఈ మహా సంగ్రామంలో అంతిమ విజేత ఎవరో? సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ వినోదానికి రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2017 ఫైనల్లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచినా, తొలి క్వాలిఫయర్‌లో ముంబైనే చిత్తు చేసి పుణే ఫైనల్లోకి అడుగు పెట్టగా... టేబుల్ టాపర్ ముంబై రెండో క్వాలిఫయర్‌లో కోల్‌కతాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉండటంతో పాటు తాజా ప్రదర్శన అనంతరం మానసికంగా కూడా ఇరు జట్లు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా మూడు నాకౌట్ మ్యాచ్‌ల తరహాలో కాకుండా ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగాలని అంతా కోరుకుంటున్నారు. ఆ ఇద్దరు... ఎమ్మెస్ ధోనిని పుణే యాజమాన్యం కెప్టెన్‌గా తొలగించిందేమో గానీ కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పించలేకపోయింది! ఈ సీజన్లో పుణే అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్ స్మిత్‌తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్‌కు ఇప్పుడు మరో మ్యాచ్‌లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పుణేకు తిరుగుండదు. వీరిద్దరు బ్యాటింగ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. తొలి క్వాలిఫయర్‌లో ధోని బ్యాటింగ్ అతని సత్తాను మళ్లీ చూపించగా, స్మిత్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఓపెనింగ్‌కు తోడు రహానే కూడా వేగంగా ఆడటం అవసరం. ఈ సీజన్లో మధ్య ఓవర్లలో (7–15) పుణే బ్యాటింగ్ వేగం మరీ మందకొడిగా ఉంది. దీనిని సరిదిద్దాలంటే మిడిలార్డర్ రాణించాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లోనూ స్టోక్స్ అందుబాటులో లేకపోయినా గట్టెక్కిన పుణే, ఈ సారి ముంబైపై మరింత పదునైన వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. గత మ్యాచ్ నెగ్గిన జట్టులో పుణే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. విదేశీ ఆటగాళ్లలో క్రిస్టియాన్ చివరి ఓవర్లలో కీలకం కానున్నాడు. లీగ్ దశలో తమ చివరి పది మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి సూపర్ ఫామ్ కనబర్చిన పుణే, ఆ తర్వాత క్వాలిఫయర్‌లో కూడా చెలరేగింది. తమ టైటిల్ కలను నిజం చేసే మరో విజయం కోసం ఆ జట్టు ఎంతగా శ్రమిస్తుందో చూడాలి. అంతా బాగుంది... పవర్‌ప్లేలో ప్రత్యర్థికి అతి తక్కువ పరుగులు ఇచ్చి బ్యాటింగ్ సమయంలో మాత్రం చివరి 5 ఓవర్లలో చితక్కొట్టడంలో ఈ సీజన్లో ముంబై విజయమంత్రం దాగి ఉంది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ 43 ఫోర్లు బాదితే, సిక్సర్లే 45 కొట్టడం విశేషం. ఇక బౌలింగ్‌లో ముఖ్యంగా మెక్లీనగన్, బుమ్రా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు రాణించడంతో మలింగ వైఫల్యం పెద్దగా కనపడలేదు. తన ఐపీఎల్ కెరీర్లో మలింగ ఇంతగా ఎప్పుడూ విఫలం కాలేదు. మెక్లీనగన్ కోలుకుంటే అతడిని తుది జట్టులోకి తీసుకుంటారా లేక జాన్సన్‌ను కొనసాగిస్తారా చూడాలి. గత మ్యాచ్‌లో చెలరేగిన కరణ్ శర్మకు ఉప్పల్ మైదానంలో అందరికంటే ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్‌లో కూడా ముంబైకి తిరుగులేదు. సిమన్స్ విఫలమవుతున్నా, ఫైనల్ పోరులో మాత్రం జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. రోహిత్ ఫామ్‌లోకి రాగా.. రాయుడు, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్‌ల మెరుపులు ముంబైకి భారీ స్కోరు అందించగలవు. అన్నింటికీ మించి వీరిలో తొమ్మిది మందికి ఐపీఎల్ ఫైనల్లో ఆడి ఒత్తిడిని తట్టుకున్న అనుభవం ఉండటం కూడా ముంబైకి అదనపు బలంగా మారనుంది. పదేళ్ల ఐపీఎల్లో అటు ఆటతో పాటు ఇటు భారీ బలగంతో కూడా అందరినీ ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్, మిగతా జట్లను వెనక్కి తోస్తూ ముచ్చటగా మూడో టైటిల్ గెలిస్తే అది సరైన ముగింపు అవుతుంది. ♦ గత మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేదు. ఫైనల్ అంటే ఫైనలే. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే విజేతగా నిలుస్తారు. –స్మిత్ ♦ పుణేపై మాకు రికార్డు బాగా లేదు. అయితే ఏ ఒక్కరి పైనో ఆధారపడకుండా సమష్టిగా ఆడి ఫైనల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంది. –రోహిత్ శర్మ రాత్రి గం. 8 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం సాధారణ టి20 తరహా బ్యాటింగ్ పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఈ సీజన్లో అటు పెద్ద స్కోర్లు, ఇటు తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. ఆటగాళ్ల ప్రతిభ మినహా మ్యాచ్ ఫలితాలపై అసాధారణంగా పిచ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం నగరంలో తీవ్రమైన ఎండ. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం లేదు. ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లలో ఒకసారి మాత్రమే కొద్దిసేపు వాన అడ్డు పడినా, ఓవర్ల కోత లేకుండా పూర్తి మ్యాచ్ సాగింది. ⇔ ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్. గతంలో 2010లో చెన్నై చేతిలో ఓడిన జట్టు... 2013, 2015లలో చెన్నైనే ఓడించి విజేతగా నిలిచింది. ⇔ ధోని ఐపీఎల్ ఫైనల్ ఆడటం ఇది ఏడో సారి. రెండు సార్లు (2010, 2011) టైటిల్ గెలిచిన జట్టుకు అతను కెప్టెన్. ⇔ ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న అతి పిన్న వయస్కుడు వాషింగ్టన్ సుందర్ (17 ఏళ్ల 228 రోజులు) తుది జట్ల వివరాలు (అంచనా) రైజింగ్ పుణే సూపర్ జెయింట్: స్మిత్ (కెప్టెన్), రహానే, త్రిపాఠి, మనోజ్ తివారి, ధోని, క్రిస్టియాన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గూసన్, జంపా, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), సిమన్స్, పార్థివ్ పటేల్, అంబటి రాయుడు, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, జాన్సన్/మెక్లీనగన్, కరణ్ శర్మ, బుమ్రా, మలింగ. -
'ఐపీఎల్ టైటిల్ మాదే'
హైదరాబాద్: రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ఆదివారం జరిగే తుది పోరులో కచ్చితంగా విజయం సాధించి టైటిల్ ను సాధిస్తామని అంటున్నాడు ముంబై ఇండియన్స్ బౌలర్ కరణ్ శర్మ. క్వాలిఫయర్-2 మ్యాచ్ లో నాలుగు వికెట్ల సాధించి కోల్ కతా పతనాన్ని శాసించిన కరణ్ శర్మ.. రైజింగ్ పుణెపై కూడా తమదే పైచేయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'మేము ఫైనల్ మ్యాచ్ ను గెలవడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. కచ్చితంగా టైటిల్ ను గెలిచి తీరుతాం. పుణెపై ఓటముల రికార్డు అనేది గతం. రేపు జరగబోయే మ్యాచ్ లో విజేతలుగా నిలుస్తాం'అని కరణ్ శర్మ స్పష్టం చేశాడు. అయితే ఫైనల్ మ్యాచ్ లో తుది జట్టులో స్థానంపై హర్భజన్ సింగ్ తో పోటీ ఉందా అనే విషయంలో కరణ్ శర్మ సమాధానం దాటేశాడు. అది తన చేతుల్లో ఉండదని, జట్టు సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉంటుందన్నాడు. కేవలం అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడమే తనకు ముఖ్యమన్నాడు. 'బౌలింగ్ చేయడమే నాకు తెలిసింది. మ్యాచ్ గెలవడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తా. నేను జట్టులో లేకపోయినప్పటికీ ఎక్కువ శ్రమిస్తునే ఉంటా'అని కరణ్ శర్మ తెలిపాడు. -
రైజింగ్ పుణె వ్యూహం ఫలించింది..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. ఐపీఎల్ ఆరంభంలో మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ గా తప్పించి పెద్ద సాహసమే చేసింది పుణె. ఆ జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను నియమించడంతో పాటు ఫ్రాంచైజీ పేరులో కూడా కొద్ది పాటి మార్పు చేసింది. గతేడాది రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ గా బరిలోకి దిగిన ఆ జట్టు.. ప్రస్తుత సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్గా పోరుకు సిద్ధమైంది. ఇదిలా ఉంచితే, టోర్నీ ఆరంభంలో ఆడపా దడపా విజయాలతో వెనుకబడినప్పటికీ, చివరికి వచ్చేసరికి ఫైనల్ కు చేరి భళా అనిపించింది. అయితే పుణె తుది పోరుకు చేరడంలో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు వాషింగ్టన్ సుందర్ పాత్ర వెలకట్టలేనిది. ముంబై ఇండియన్స్ తో్ జరిగిన క్వాలిఫయర్ -1లో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. . నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు సాధించాడు. దాంతో పాటు 16 పరుగులు మాత్రమే ఇచ్చి పటిష్టమైన ముంబైని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 10 మ్యాచ్ లాడిన సుందర్ ఎనిమిది వికెట్లు తీసి పుణె విజయాల్లో తన వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించాడు. కేవలం ఓ అనామక క్రికెటర్ లా లీగ్ లో కి ప్రవేశించిన సుందర్ ఇప్పుడు స్టార్ బౌలర్ మాదిరి ప్రశంసలు అందుకుంటున్నాడు స్మిత్ వికెట్ పడగొట్టి జట్టులోకి వచ్చాడు.. రైజింగ్ పుణే జట్టుకు గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సుందర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అశ్విన్ లోటును భర్తీ చేసేందుకు సుందర్ ఎంపిక చేసింది పుణె. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్‌హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణే జట్టు నెట్స్‌లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరిద్దరూ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్ లకు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. అయితే సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. వాషింగ్టన్ ఎంపికలో పుణె వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కీలక మ్యాచ్ లో సాధారణ స్కోరును కాపాడుకుని పుణె విజయంలో సాధించడంలో సుందర్ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను తన స్పిన్ మ్యాజిక్ తో బోల్తా కొట్టించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. -
ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పుణే
-
‘సుందరం’... సుమధురం
►ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పుణే ►చెలరేగిన సూపర్ జెయింట్ ►20 పరుగులతో ముంబై చిత్తు ►రాణించిన సుందర్, శార్దుల్ ►ఆకట్టుకున్న ధోని, రహానే, తివారి పుణే సూపర్ ఆటతో ఐపీఎల్–10 ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత ఏడాది అవమానకర రీతిలో ఏడో స్థానంలో నిలిచిన జెయింట్ టీమ్ ఈసారి అదరగొట్టే ప్రదర్శనతో టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ప్రత్యర్థి వేదికపై 162 పరుగుల సాధారణ స్కోరు చేసి కూడా జెయింట్ అద్భుత ఆటతీరుతో ఆ స్కోరును కాపాడుకోగలిగింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా ముంబై ఇండియన్స్ ఛేదనలో బోర్లా పడింది. ఫలితంగా రెండు మరాఠా జట్ల పోరులో వరుసగా మూడోసారీ పుణేదే పైచేయి అయింది. బ్యాటింగ్‌లో రహానే, తివారి అర్ధ సెంచరీలు... ఆపై తన ఫ్రాంచైజీ యజమానులు మునివేళ్లపై నిలబడి చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉండగా ధోని మెరుపు సిక్సర్ల ప్రదర్శన పుణేను మెరుగైన స్థితిలో నిలిపాయి. అనంతరం 17 ఏళ్లు కుర్రాడు వాషింగ్టన్ సుందర్ ముగ్గురు ముంబై స్టార్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను పుణే చేతుల్లోకి తెచ్చేశాడు. లీగ్‌లో రెండో ఏడాదే ఫైనల్ చేరి సత్తా చాటిన స్మిత్ సేన, ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధించగా, ముంబైకి రెండో క్వాలిఫయర్ రూపంలో టైటిల్ పోరుకు చేరేందుకు మరో అవకాశం ఉంది. ముంబై: సంచలన ఆటతో పుణే సూపర్ జెయింట్ ఐపీఎల్–10 ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం వాంఖెడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పుణే 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మెస్ ధోని (26 బంతుల్లో 40 నాటౌట్; 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. పార్థివ్ పటేల్ (40 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (3/16), శార్దుల్ ఠాకూర్ (3/37) ప్రత్యర్థి పని పట్టారు. నేడు జరిగే ఎలిమినేటర్‌లో విజేతగా నిలిచే జట్టుతో ముంబై 19న రెండో క్వాలిఫయర్ ఆడుతుంది. ఆ రెండు ఓవర్లు... ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి తొలి ఓవర్లోనే డకౌట్... రెండో ఓవర్లో స్మిత్ (1) డగౌట్‌కు... పవర్ ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు కేవలం 33 పరుగులు. ఇలాంటి స్థితిలో రెండు కీలక భాగస్వామ్యాలు పుణేకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి. ముందుగా రహానే, తివారి మూడో వికెట్‌కు 65 బంతుల్లో 80 పరుగులు జోడించగా, ఆ తర్వాత తివారి, ధోని కలిసి నాలుగో వికెట్‌కు 44 బంతుల్లో 73 పరుగులు జత చేశారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో రహానే, తివారి చాలా జాగ్రత్తగా ఆడారు. దాంతో పరుగులు రావడం గగనంగా మారిపోయింది. ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు పూర్తిగా ఆగిపోయాయి. హార్దిక్ వేసిన ఒక ఓవర్లో పుణే 15 పరుగులు రాబట్టినా, ఆ తర్వాత మళ్లీ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. ఈ క్రమంలో 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే, ఐపీఎల్లో 3 వేల పరుగులు కూడా దాటాడు. అయితే చక్కటి బంతితో రహానేను అవుట్ చేసి కరణ్ ఈ జోడీని విడదీశాడు. తాను ఎదుర్కొన్న ఐదో బంతికి ధోని భారీ సిక్సర్ బాదినా... తివారి మాత్రం ధాటిగా ఆడలేకపోయాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్న సమయంలో ఒక దశలో 32 బంతుల వ్యవధిలో కేవలం ఒక ఫోర్, ఒక సిక్సర్ మాత్రమే వచ్చాయంటే పరిస్థితి అర్థమవుతుంది. 18 ఓవర్లు ముగిసేసరికి పుణే స్కోరు 121 పరుగులు మాత్రమే. అయితే చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు రాబట్టడం విశేషం. మెక్లీనగన్ వేసిన 19వ ఓవర్లలో ధోని 2 భారీ సిక్సర్లు బాదగా, తివారి 6, 4 కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ధోని మరో 2 సిక్సర్లు కొట్టడంతో పుణే 15 పరుగులు సాధించింది. పార్థివ్ మినహా... లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే తడబడింది. ఒకవైపు పార్థివ్ దూకుడుగా ఆడగా, మరో ఎండ్‌లో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఉనాద్కట్ ఒక పరుగే ఇవ్వగా... తర్వాతి మూడు ఓవర్లలో పార్థివ్ ఒక్కో సిక్సర్ బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే దురదృష్టకర రీతిలో సిమన్స్ (5) అవుట్ కావడంతో ముంబై పతనం ప్రారంభమైంది. పార్థివ్ కొట్టిన షాట్ బౌలర్ శార్దుల్ చేతికి తగిలి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్లను పడేసే సమయంలో సిమన్స్ క్రీజ్ బయటే ఉన్నాడు. తర్వాతి ఓవర్లో సుందర్ ముంబైని పెద్ద దెబ్బ కొట్టాడు. తొలి బంతికి రోహిత్ (1)ను అవుట్ చేసిన అతను, నాలుగో బంతికి అంబటి రాయుడు (0) ఆట ముగించాడు. తన తర్వాతి ఓవర్లోనే పొలార్డ్ (7)ను సుందర్ వెనక్కి పంపించగా, కొద్ది సేపటికి హార్దిక్ (14) కూడా అవుటయ్యాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పార్థివ్ క్రీజ్‌లో ఉండటంతో ముంబై విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే శార్దుల్ వేసిన ఓవర్‌తో ముంబై పూర్తిగా విజయావకాశాలు కోల్పోయింది. భారీ షాట్లు ఆడే క్రమంలో ఈ ఓవర్ మూడో బంతికి కృనాల్ పాండ్యా (15), చివరి బంతికి పార్థివ్ లాంగాఫ్‌లో క్రిస్టియాన్కే క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత ముంబై ఆట నామమాత్రమే అయింది. -
ధోని దూకుడు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 163 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అజింక్యా రహానే(56;43 బంతుల్లో 5 ఫోర్లు 1సిక్స్), మనోజ్ తివారీ(58;;48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు, మహేంద్ర సింగ్ ధోని(40 నాటౌట్;26 బంతుల్లో 5 సిక్సర్లు) దూకుడు జత కావడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ త్రిపాఠి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(1) కూడా వెంటనే పెవిలియన్ చేరడంతో పుణె తొమ్మిదిపరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరుణంలో రహానే -తివారీల జోడి స్కోరు బోర్డును చక్కదిద్దింది.ఈ క్రమంలోనే రహానే 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 80 పరుగులు జత చేసిన తరువాత రహానే మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అప్పుడు తివారీకి ధోని జతకలిశాడు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో పుణె రన్ రేట్ తగ్గింది. అయితే ఆఖరి రెండు ఓవర్లలో ధోని బ్యాట్ ఝుళిపించడంతో పుణె స్కోరు బోర్డులో వేగం పెరిగింది. చివరి రెండు ఓవర్లలో ధోని నాలుగు సిక్సర్లు సాధించడం ఇక్కడ విశేషం. దాంతో పుణె నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మలింగా, మెక్లీన్ గన్, కరణ్ శర్మలకు తలో వికెట్ దక్కింది. -
ప్రతీకారం తీరేనా?
⇒నేడు తొలి క్వాలిఫయర్‌లో రైజింగ్ పుణేతో ముంబై ఇండియన్స్ ఢీ ⇒గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు ⇒ఓడిన జట్టుకు మరో అవకాశం ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన ముంబై ఇండియన్స్ తొలి క్వాలిఫయర్‌లో అసలు సిసలు ప్రత్యర్థిని ఎదుర్కోబోతోంది. ఇప్పటిదాకా ముంబైకి నాలుగు పరాజయాలు మాత్రమే ఎదురుకాగా ఇందులో రెండు సార్లు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ చేతిలోనే చిత్తయ్యింది. ఇప్పుడు మరోసారి కీలక తరుణంలో పుణేతో ఆడాల్సి వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా స్మిత్ సేనపై ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ఫైనల్ బెర్త్ దక్కించుకున్న తొలి జట్టుగా నిలవాలని ముంబై ఆశిస్తోంది. అటు ముంబైపై తమకున్న సూపర్ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ మరోసారి పైచేయి సాధించాలని పుణే భావిస్తోంది. అయితే ప్రారంభంలోకన్నా రెండో దశలో అనూహ్య ఆటతీరుతో చెలరేగుతున్న పుణే... ఇప్పటికే తాహిర్ సేవలను కోల్పోగా తాజాగా డాషింగ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండానే బరిలోకి దిగబోతోంది. దీంతో అద్భుత ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేయాలంటే ఆ జట్టు తీవ్రంగా చెమటోడ్చాల్సిందే. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరే అవకాశం ఉండటంతో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశాలున్నాయి. ఓడిన జట్టు 19న బెంగళూరులో జరిగే రెండో క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ సీజన్లో ముంబై అన్ని జట్లను ఓడించినా పుణేపై గెలుపు రుచి చూడలేకపోయింది. ఆ జట్టుపై ఆడిన రెండుసార్లూ ఓటమిని ఎదుర్కొన్న ముంబైపై కాస్త ఒత్తిడి నెలకొంది. ఈసారైనా తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థికి షాక్ ఇవ్వాలనే కసితో ఉంది. తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతాపై రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించి విజయవంతమైన ముంబై ఈ కీలక మ్యాచ్‌లో తుది జట్టు కూర్పుపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. మరోవైపు తమ చివరి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఆడుతూ ప్లే ఆఫ్ వైపు దూసుకెళుతున్న పంజాబ్‌ను దారుణంగా ఓడించిన పుణే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బౌలర్లు మరోసారి రాణిస్తే ఫైనల్‌కు చేరడం కష్టమేమీ కాదనే అభిప్రాయంతో ఉంది. బ్యాటింగే బలం... సీజన్లో ఇప్పటిదాకా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విజయవంతమైంది. ఓపెనర్లు సిమన్స్, పార్థివ్‌లతో పాటు పొలార్డ్, కెప్టెన్ రోహిత్, నితిశ్ రాణా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక పాండ్యా సోదరులు కృనాల్, హార్దిక్ తమ ఆల్‌రౌండ్ షోతో జట్టుకు వెన్నెముకలా నిలిచారు. స్టోక్స్ లేకుండానే... వాస్తవానికి పుణే జట్టు ప్లే ఆఫ్ వరకు చేరుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదు. అయితే మ్యాచ్‌లు జరుగుతున్నకొద్దీ ఈ జట్టు ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆరితేరుతూ ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లోనైతే తమ బౌలర్ల ప్రతిభతో పంజాబ్‌ను కేవలం 73 పరుగులకే కుప్పకూల్చగలిగింది. పేసర్లు జయదేవ్ ఉనాద్కట్ ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టాడు. శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ అతడికి సహకరిస్తున్నారు. ఈ త్రయం మరోసారి ముంబైపై విజృంభించాలని భావిస్తుంది. స్పిన్నర్ జంపా కూడా రాణించడం ఈ జట్టుకు కలిసొచ్చేది. బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, రహానే, ధోని, మనోజ్ తివారి ఫామ్‌లో ఉండడం అనుకూలాంశం. ⇒రాత్రి గం. 8.00 నుంచిసోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రైజింగ్ పుణెకు ఎదురుదెబ్బ
పుణె: ఐపీఎల్-10లో ప్లే ఆఫ్ కు చేరి మంచి ఊపుమీద ఉన్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పెట్టి మరీ దక్కించుకున్న ఆ జట్టు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ప్లే ఆఫ్ కు దూరమవుతున్నాడు. బెన్ స్టోక్స్ ను ఉన్నపళంగా వచ్చేయమంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) హెచ్చరికలు జారీ చేయడంతో అతను స్వదేశానికి పయనం కానున్నాడు. స్టోక్స్ ప్లే ఆఫ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని కింగ్స్ పంజాబ్ మ్యాచ్ తరువాత పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. ప్లే ఆఫ్ కు స్టోక్స్ లేకపోవడం పూడ్చలేని లోటుగా స్మిత్ అభివర్ణించాడు. 'జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో స్టోక్స్ స్వదేశానికి వెళ్లనున్నాడు. స్టోక్స్ ప్లే ఆఫ్ కు లేకపోవడం పూడ్చలేని లోటు. అయినప్పటికీ మాకున్న అనేక ఆప్షన్లను పరిశీలించి స్టోక్స్ లేని లోటును పూడ్చుకుంటామని ఆశిస్తున్నా. రిజర్వ్ బెంచ్ లో మా జట్టు మెరుగ్గానే ఉంది. దాంతో స్టోక్స్ కు ప్రత్యామ్నాయం వెతుకుతాం' అని స్మిత్ పేర్కొన్నాడు. మరొకవైపు కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. 'ఇది మాకు చాలా గొప్ప రోజు. మా బౌలర్లు చెలరేగి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లు ముగిసే వరకూ ఆటగాళ్ల కోసం అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలువురు కొత్త ఆటగాళ్లకు వెలుగులోకి వచ్చారు. దాంతో మా జట్టు సమతుల్యంగా తయారైంది. రెండో విడత మ్యాచ్ ల్లో మా జట్టు అనేక మంచి విజయాల్ని సొంతం చేసుకుంది' అని జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్లో 12 మ్యాచ్ లు ఆడిన స్టోక్స్ 316 పరుగులు నమోదు చేశాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 నాటౌట్. ఇక బౌలింగ్ లో 12 వికెట్ల తీసి ఫర్వాలేదనిపించాడు.ప్రస్తుతం అతను స్వదేశానికి పయనం కానుండటంతో పుణెకు ప్లే ఆఫ్ కు ముందు గట్టి ఎదురుదెబ్బగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
సన్ రైజర్స్ కు షాక్
-
సన్ ‘రైజ్’ కాలేదు
►సొంతగడ్డపై హైదరాబాద్‌కు తొలి ఓటమి ►సాధారణ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన వార్నర్ బృందం ►జైదేవ్ ఉనాద్కట్ హ్యాట్రిక్‌తో రైజింగ్ పుణే జయభేరి ►బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చివరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 13 పరుగులు కావాలి. చేతిలో 4 వికెట్లున్నాయి. ఉప్పల్‌లో ఉప్పెనల్లే రెచ్చిపోతున్న హైదరాబాద్‌కు ఇదేమంత కష్టం కాదు. కానీ...! విచిత్రం ఆ ఓవర్లో ఒక్క పరుగైనా చేయలేదు! కారణం జైదేవ్ ఉనాద్కట్ ‘హ్యాట్రిక్’ బౌలింగ్. ఫలితం హైదరాబాద్ పరాజయం. హైదరాబాద్: ఈ సీజన్లో సొంతగడ్డపై పరాజయమన్నదే ఎరుగని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ తక్కువ స్కోరు మ్యాచ్‌లో ఓడిపోయింది. రైజింగ్ పుణే బౌలర్ ఉనాద్కట్ (5/30) హ్యాట్రిక్ వికెట్ల వలలో విలవిల్లాడింది. ఐపీఎల్–10లో ఇది మూడో హ్యాట్రిక్. సూపర్ జెయింట్‌కు ఎనిమిదో విజయం. ప్లే–ఆఫ్‌కు దాదాపు బెర్తును ఖాయం చేసుకునే స్థితికి చేరుకుంది పుణే. రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓడింది. తద్వారా ప్లే–ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకుంది వార్నర్ సేన. మొదట పుణే 20ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేయగా... హైదరాబాద్ 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమైంది. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. యువరాజ్ రాణించినా... 149 పరుగుల సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ను స్టోక్స్ (3/30) చావుదెబ్బ తీశాడు. కీలకమైన శిఖర్ ధావన్ (19), విలియమ్సన్ (4) వికెట్లతో పాటు డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్)లనూ అతనే ఔట్ చేశాడు. తర్వాత యువరాజ్ (43 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లాసిక్ ఇన్నింగ్స్‌తో లక్ష్యం చేర్చే బాధ్యతను తీసుకున్నా... పొంచివున్న ఉనాద్కట్ ముప్పును తప్పించలేకపోయాడు. ఒక దశలో 117/4తో పటిష్టస్థితిలో ఉన్న హైదరాబాద్ నెత్తిన అదే స్కోరుపై పిడుగువేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో యువీని, నమన్ (9)ను ఔట్ చేసిన ఉనాద్కట్ పుణేకు గెలుపు దారి చూపాడు. హ్యాట్రిక్ సాగిందిలా... ఇక తన మరుసటి ఓవర్, ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు ఉనాద్కట్ సిద్ధమయ్యాడు. తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి స్టోక్స్ క్యాచ్‌తో బిపుల్ శర్మ (8) ఔట్. మూడో బంతికి రిటర్న్ క్యాచ్‌తో రషీద్ ఖాన్ డకౌట్. నాలుగో బంతిని భువనేశ్వర్ (0) గాల్లోకి లేపాడు... మనోజ్ తివారి క్యాచ్! అంతే హ్యాట్రిక్. మిగతా రెండు బంతులకూ ఉనాద్కట్ పరుగులివ్వలేదు.దీంతో మెయిడిన్ హ్యాట్రిక్ ఓవర్‌గా నిలిచింది. స్టోక్స్ మెరుపులు... అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన రైజింగ్ పుణే ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. సన్‌రైజర్స్ ఆటగాడు బిపుల్ శర్మ ఓపెనర్లిద్దరినీ దెబ్బమీద దెబ్బ తీశాడు. మొదట బిపుల్ డైరెక్ట్ త్రోతో రాహుల్ త్రిపాఠి (1)ని రనౌట్ చేశాడు. అప్పుడు జట్టు స్కోరు 6 పరుగులే! కాసేపటికి బిపుల్ బౌలింగ్‌లో రహానే (22) యువరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో స్మిత్ (39 బంతుల్లో 34), స్టోక్స్ (25 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్సర్లు) జాగ్రత్తగా ఆడారు. ఇద్దరూ మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాక... రెండు పరుగుల వ్యవధిలో ఇద్దరూ నిష్క్రమించారు. జట్టు స్కోరు 99 వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో స్టోక్స్ క్లీన్‌బౌల్డ్ కాగా... 101 పరుగుల వద్ద స్మిత్‌ను సిద్ధార్థ్ కౌల్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన ధోని (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడినా... సిద్ధార్థ్ కౌల్ వైవిధ్యమైన బంతులతో పుణే బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ధోనితో పాటు క్రిస్టియాన్ (4), ఠాకూర్లను ఔట్ చేశాడు. ►17 ఐపీఎల్ చరిత్రలో నమోదైన మొత్తం ‘హ్యాట్రిక్’లు. బాలాజీ, ఎన్తిని, రోహిత్ శర్మ, ప్రవీణ్, చండిలా, నరైన్, ప్రవీణ్ తాంబే, వాట్సన్, అక్షర్ పటేల్, బద్రీ, టై, ఉనాద్కట్ ఒక్కోసారి ‘హ్యాట్రిక్’ సాధించగా... యువరాజ్ రెండు సార్లు, అమిత్ మిశ్రా మూడుసార్లు ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు. -
సన్ రైజర్స్ కు షాక్
-
సన్ రైజర్స్ కు షాక్
హైదరాబాద్:ఇప్పటివరకూ సొంతమైదానంలో ఓటమి ఎరుగకుండా దూసుకుపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు తొలిసారి షాక్ తగిలింది. ఐపీఎల్-10లో భాగంగా శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పుణె విసిరిన 149 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి ఓటమి పాలైంది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(40;34 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్), యువరాజ్ సింగ్ (47;43 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లు) రాణించిన జట్టును గెలిపించలేకపోయారు. వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్ల ఘోరంగా విఫలం కావడంతో సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు.ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడంతో సన్ రైజర్స్ పరాజయం పాలైంది. రైజింగ్ పుణె ఆటగాళ్లలో ఉనాద్కత్ ఐదు వికెట్లతో సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఇది పుణెకు ఎనిమిదో విజయం కావడంతో 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరువైంది. అంతకుముందు పుణె ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే రాహుల్ త్రిపాఠి(1)వికెట్ ను కో్ల్పోయింది. అనవసర పరుగు కోసం యత్నించిన త్రిపాఠి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరుణంలో అజింక్యా రహానేకు స్టీవ్ స్మిత్ జతకలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రహానే(22) రెండో వికెట్ గా అవుట్ కావడంతో పుణె గాడి తప్పినట్లు కనబడింది. కాగా, స్మిత్-బెన్ స్టోక్స్ లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో పుణె తిరిగి తేరుకుంది. అయితే స్టోక్స్(39), స్మిత్ (34)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అయితే చివర్లో మహేంద్ర సింగ్ ధోని(31;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు చేసింది. -
సన్ రైజర్స్ కు సాధారణ లక్ష్యం
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 149 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే రాహుల్ త్రిపాఠి(1)వికెట్ ను కో్ల్పోయింది. అనవసర పరుగు కోసం యత్నించిన త్రిపాఠి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరుణంలో అజింక్యా రహానేకు స్టీవ్ స్మిత్ జతకలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రహానే(22) రెండో వికెట్ గా అవుట్ కావడంతో పుణె గాడి తప్పినట్లు కనబడింది. కాగా, స్మిత్-బెన్ స్టోక్స్ లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో పుణె తిరిగి తేరుకుంది. అయితే స్టోక్స్(39), స్మిత్ (34)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అయితే చివర్లో మహేంద్ర సింగ్ ధోని(31;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో సిద్ధార్ద్ కౌల్ నాలుగు వికెట్లతో రాణించగా, రషిద్ ఖాన్, బిపుల్ శర్మలకు తలో వికెట్ దక్కింది. -
సన్ రైజర్స్ జోరు కొనసాగిస్తుందా?
హైదరాబాద్: ఇప్పటివరకూ సొంత మైదానంలో ఓటమి ఎరుగని సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విజయంపై కన్నేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలుత ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. సన్ రైజర్స్ జట్టులోకి ఆశిష్ నెహ్రా, బిపుల్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను పటిష్టం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ప్రస్తుతం పుణే 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా... సన్‌రైజర్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీ ఆరంభంలో తడబడినా... కీలక సమయంలో పుంజుకొని పుణే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆ జట్టు ఆడిన చివరి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు ఉండటం విశేషం. ఇదే జోరులో మరో గెలుపు కోసం పుణే బరిలోకి దిగుతోంది. మరోవైపు ఉప్పల్‌లో ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ విజయం సాధించి అజేయంగా ఉంది. వరుసగా ఆరో విజయంపై ఆ జట్టు దృష్టి సారించింది. ఫామ్‌లో ఉన్న స్టోక్స్, త్రిపాఠి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి... గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పుణేకు విజయాన్ని అందించారు. మరోసారి త్రిపాఠి శుభారంభం అందించడంతో పాటు... కెప్టెన్ స్మిత్, వికెట్ కీపర్ ధోని బ్యాట్ ఝుళిపిస్తే పుణే భారీ స్కోరు చేయడం ఖాయం. ఇప్పటి వరకు జట్టు గెలిచిన ప్రతీ మ్యాచ్‌లోనూ కొత్త హీరో పుట్టుకొచ్చాడు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బౌలర్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. స్పిన్నర్ తాహిర్‌తో పాటు పేసర్ ఉనాద్కట్, వాషింగ్టన్ సుందర్ రాణిస్తున్నారు. ఢిల్లీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలైన సన్‌రైజర్స్ తిరిగి పట్టు బిగించాలని చూస్తోంది. అయితే సొంత వేదికపై విజయపరంపరను కొనసాగించాలనే పట్టుదలతో హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ ఉన్నాడు. కోల్‌కతా మ్యాచ్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించిన వార్నర్‌తో పాటు, శిఖర్ ధావన్, హెన్రిక్స్, కేన్ విలియమ్సన్ మంచి ఫామ్‌లో ఉండటం జట్టకు కలిసొచ్చే అంశం. యువరాజ్ సింగ్ కూడా కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ సన్ బౌలింగ్ విభాగాన్ని తక్కువ చేయలేం. డెత్ ఓవర్ల స్పెషలిస్టు బౌలర్ భువనేశ్వర్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తమ విలువేంటో ఇప్పటికే తెలియ జేశారు. వెటరన్ స్టార్ ఆశిష్ నెహ్రాతో పాటు యువ బౌలర్లు సిరాజ్, సిద్ధార్థ్ కౌల్ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. రైజింగ్ పుణె తుది జట్టు:స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారి, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోని, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉనాద్కత్, ఇమ్రాన్ తాహీర్ సన్ రైజర్స్ తుది జట్టు; డేవిడ్ వార్నర్(కెప్టెన్),శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, యువరాజ్ సింగ్, హెన్రిక్యూస్, నమాన్ ఓజా, బిపుల్ శర్మ,భువనేశ్వర్, రషిద్ ఖాన్, సిద్ధార్ధ కౌల్, ఆశిష్ నెహ్రా -
లయన్స్‌పై సూపర్ జెయింట్ అద్భుత విజయం
-
సింగిల్ హ్యాండ్ స్టోక్స్...
-
సింగిల్ హ్యాండ్ స్టోక్స్...
⇒మెరుపు సెంచరీ చేసిన పుణే బ్యాట్స్‌మన్ ⇒లయన్స్‌పై సూపర్ జెయింట్ అద్భుత విజయం ఐపీఎల్లో రికార్డుస్థాయిలో రూ. 14.5 కోట్ల మొత్తాన్ని దక్కించుకున్న బెన్ స్టోక్స్ తన షాట్ల పదునెంటో చూపించాడు. తొలి ఓవర్ నుంచే మొదలైన పుణే ఇన్నింగ్స్ పతనానికి ఒంటిచేత్తో అడ్డుకట్ట వేస్తూ లక్ష్యానికి చేర్చాడు. వీరోచిత సెంచరీతో కడదాకా నిలిచి జట్టును గెలిపించాడు. పుణే: గుజరాత్ లయన్స్ జట్టును అదృష్టం వెక్కిరిస్తోంది. దురదృష్టం వెంటాడుతోంది. గత మ్యాచ్‌లో ‘సూపర్’ ఓవర్‌దాకా పోరాడినా చివరి బంతుల్లో ‘ఫ్లాప్’ అయింది. రైజింగ్ పుణేపై తొలి ఓవర్ నుంచే దెబ్బ మీద దెబ్బ తీసినా ‘ఒకే ఒక్కడు’ స్టోక్స్‌ను అదుపు చేయలేక గెలుపును అందుకోలేకపోయింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.5 ఓవర్లలో 161 పరుగులు చేసి ఆలౌట్ కాగా... తర్వాత పుణే 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి గెలిచింది. ‘సూపర్’ స్టోక్స్ (63 బంతుల్లో 103 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. స్టోక్స్ అద్భుతం... లక్ష్యం 162... కానీ తొలి 6 బంతుల్లోనే 2 వికెట్లు! మరుసటి ఓవర్లో మరో వికెట్... రహానే (4), స్మిత్ (4), తివారి (0) అవుట్... వెరసి 10 పరుగులకే 3 వికెట్లు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన బ్యాటింగ్ ధాటిని చూపెట్టాడు. ధోనితో కలిసి ముందు వికెట్‌ను కాపాడాడు. తర్వాత ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్టోక్స్... ధోని (26)తో ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. అనంతరం కొండంత లక్ష్యాన్ని భారీ సిక్సర్లతో సులువు చేశాడు. చివరి ఓవర్‌కు ముందు కండరాలు పట్టేయడంతో కాసేపు విలవిల్లాడిన స్టోక్స్ ఆఖరి ఓవర్లో ఆ యాతనతోనే తన టి20 కెరీర్లో తొలి సెంచరీ (61 బంతుల్లో)ని పూర్తి చేశాడు.రైజింగ్‌కు విక్టరీని అందించాడు. ఓపెనర్ల శుభారంభం...: అంతకుముందు ఓపెనర్లు ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెకల్లమ్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి గుజరాత్‌కు శుభారంభం అందించారు. ధాటిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ దెబ్బతీశాడు. జోరుమీదున్న కిషన్‌తో పాటు ఫించ్ (13), డ్వేన్ స్మిత్ (0)లను అవుట్ చేయడంతో లయన్స్ ఇన్నింగ్స్ తడబడింది. రైనా (8) రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన వారంతా ఒకట్రెండు బౌండరీలతో అలరించారు తప్ప ఎవరూ ఆదుకోలేకపోయారు. దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 29; 3 ఫోర్లు), జడేజా (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) కాసేపు ధాటిగా ఆడటంతో గుజరాత్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. తాహిర్, ఉనాద్కట్ చెరో 3 వికెట్లు తీశారు. -
కోహ్లి సేనకు సాధారణ లక్ష్యం
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 158 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(45;32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోగా, రాహుల్ త్రిపాఠి(37;28 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్స్), మనోజ్ తివారీ(44 నాటౌట్; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాతయుతంగా ఆడారు. ఇక చివర్లో మహేంద్ర సింగ్ ధోని(21 నాటౌట్; 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పుణెకు ఆదిలోనే అజింక్యా రహానే(6) వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో త్రిపాఠికి జత కలిసిన స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. క్రీజ్ లోకి వచ్చీ రావడంతోనే స్మిత్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే స్టువర్ట్ బిన్నీ వేసిసన 14 ఓవర్ చివరి బంతికి స్మిత్ అవుట్ అయ్యాడు. దాంతో పుణె స్కోరులో వేగం తగ్గింది. ఆపై మనోజ్ తివారి-మహేంద్ర సింగ్ ధోనిలు మెల్లగా ఇన్నింగ్స్ ను నిర్మించారు. అయితే ఆఖరి ఓవర్లలో పుణె సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల్ని సాధించడంలో విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సమిష్టగా రాణించి పుణెను భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు. -
పుణే ‘రైజింగ్’ విక్టరీ
-
గుజరాత్ తొలి విజయం
-
‘టై’తక్కలాడించాడు
►ఆండ్రూ టైకి ఐదు వికెట్లు ►హ్యాట్రిక్ సాధించిన లయన్స్ బౌలర్ ►గుజరాత్ తొలి విజయం ►7 వికెట్లతో రైజింగ్ పుణే చిత్తు ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆండ్రూ టై సంచలన బౌలింగ్‌కు తోడు మెకల్లమ్, డ్వేన్ స్మిత్ మెరుపు బ్యాటింగ్‌తో లయన్స్ విజయాల బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన రైనా సేన సొంతగడ్డపై చెలరేగి జెయింట్‌కు ఝలక్ ఇచ్చింది. సమష్టి ప్రదర్శనతో గుజరాత్ సత్తా చాటగా... సీజన్లో శుభారంభం తర్వాత తడబడుతూ వచ్చిన రైజింగ్ పుణే ఖాతాలో ‘హ్యాట్రిక్’ పరాజయం చేరింది. రాజ్‌కోట్: ఐపీఎల్ కెరీర్లో 150వ మ్యాచ్ ఆడిన సురేశ్ రైనా, పదో సీజన్లో గుజరాత్ లయన్స్‌కు తొలి విజయం అందించి ఈ మ్యాచ్‌ను మరింత మధురంగా మార్చుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో లయన్స్ 7 వికెట్ల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (28 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్ తివారి (27 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రూ టై (5/17) అద్భుత బౌలింగ్‌తో చెలరేగాడు. అనంతరం గుజరాత్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. మెకల్లమ్ (32 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 53 బంతుల్లోనే 94 పరుగులు జోడించి గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించగా...చివర్లో రైనా (22 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఫించ్ (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) 31 బంతుల్లోనే 61 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముగించారు. కీలక భాగస్వామ్యం... ఇన్నింగ్స్ మూడో బంతికే గుజరాత్‌కు షాక్ తగిలింది. స్లిప్‌లో రైనా ఒంటి చేత్తో అత్యద్భుత క్యాచ్ పట్టడంతో రహానే (0) వెనుదిరిగాడు. ఈ దశలో త్రిపాఠి,, స్మిత్ దూకుడైన భాగస్వామ్యం (32 బంతుల్లో 64 పరుగులు) పుణేను నిలబెట్టింది. ముఖ్యంగా ప్రవీణ్ వేసిన ఐదో ఓవర్లో సూపర్ జెయింట్ పండుగ చేసుకుంది. ఈ ఓవర్లో త్రిపాఠి తొలి మూడు బంతుల్లో 6, 6, 4 బాదగా చివరి రెండు బంతులకు స్మిత్ 2 ఫోర్లు కొట్టడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. అయితే టై తన తొలి ఓవర్లోనే త్రిపాఠిని అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. మరికొద్దిసేపటికే స్మిత్ కూడా అవుటయ్యాడు. స్టోక్స్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) జోరును టై అడ్డుకోగా... ధోని (5) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే తివారి, అంకిత్ శర్మ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్‌కు 29 బంతుల్లోనే 47 పరుగులు జత చేసి జెయింట్‌ను ఆదుకున్నారు. చివరి ఓవర్లో ‘హ్యాట్రిక్’తో టై పుణేను పూర్తిగా కట్టి పడేశాడు. తొలి మూడు బంతులకు టై వరుసగా అంకిత్ శర్మ, మనోజ్ తివారి, శార్దుల్ ఠాకూర్లను అవుట్ చేశాడు. ఆరంభం అదిరింది... ఛేదనను లయన్స్ విధ్వంసకర రీతిలో ప్రారంభించింది. అంకిత్ వేసిన తొలి ఓవర్లో స్మిత్ 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో 16 పరుగులు రాగా... 2వ, 4వ ఓవర్లలో లయన్స్ 11 పరుగుల చొప్పున రాబట్టింది. ఆ తర్వాత తాహిర్ మొదటి ఓవర్లో మెకల్లమ్ 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగిపోయాడు. తాహిర్ తర్వాతి ఓవర్ గుజరాత్‌కు మరింత కలిసొచ్చింది. మొదటి మూడు బంతుల్లో మెకల్లమ్ 4, 4, 6 కొట్టగా, స్మిత్ మరో బౌండరీ బాదడంతో ఏకంగా 20 పరుగులు లభించాయి. ఎట్టకేలకు స్మిత్‌ను ఠాకూర్ అవుట్ చేసి పుణేకు ఊరటనందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే తక్కువ వ్యవధిలో మెకల్లమ్, కార్తీక్ (3) వెనుదిరిగారు. అయితే రైనా, ఫించ్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా రెండు ఓవర్ల ముందే జట్టును గెలిపించారు. ► 16 ఐపీఎల్ చరిత్రలో నమోదైన మొత్తం ‘హ్యాట్రిక్’ల సంఖ్య. లక్ష్మీపతి బాలాజీ, మఖాయ ఎన్తిని, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండిలా, సునీల్ నరైన్, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, సామ్యూల్ బద్రీ, ఆండ్రూ టై ఒక్కోసారి ‘హ్యాట్రిక్’ సాధించగా... యువరాజ్ సింగ్ రెండు సార్లు, అమిత్ మిశ్రా అత్యధికంగా మూడుసార్లు ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు. -
శాంసన్ శతక్కొట్టుడు..
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తొలి సెంచరీ నమోదైంది. మంగళవారం ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సంజూ శాంసన్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. అయితే సిక్సర్ తో సెంచరీ సాధించిన శాంసన్.. మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. పుణె స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన బంతిని భారీ షాట్ గా ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు రిషబ్ పంత్(31;22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ గా నిష్క్రమించాడు. చివర్లో క్రిస్ మోరిస్(38 నాటౌట్;4 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఢిల్లీ మిగతా ఆటగాళ్లలో శ్యామ్ బిల్లింగ్స్(24) ఫర్వాలేదనిపించగా, ఆదిత్య తారే డకౌట్ అవుటయ్యాడు. ఈ మ్యాచ్ లో రైజింగ్ పుణె టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. అనారోగ్యంగా కారణంగా ఢిల్లీతో జరిగే మ్యాచ్ నుంచి స్మిత్ వైదొలిగాడు. స్టీవ్ స్మిత్ స్థానంలో అజింక్యా రహానే తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మరొకవైపు ఢిల్లీ జట్టు నుంచి కార్లోస్ బ్రాత్ వైట్ ను తొలగించారు. అతని స్థానంలో కోరీ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. -
ఢిల్లీతో మ్యాచ్ కు స్టీవ్ స్మిత్ దూరం
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా ఇక్కడ మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ కు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. అనారోగ్యంగా కారణంగా ఢిల్లీతో జరిగే మ్యాచ్ నుంచి స్మిత్ వైదొలిగాడు. స్టీవ్ స్మిత్ స్థానంలో అజింక్యా రహానే తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మరొకవైపు ఢిల్లీ జట్టు నుంచి కార్లోస్ బ్రాత్ వైట్ ను తొలగించారు. అతని స్థానంలో కోరీ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పుణె తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ పుణె రెండు మ్యాచ్ లు ఆడగా ఒకదాంట్లో విజయం సాధించింది. ఇక ఢిల్లీ ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది. దాంతో పుణెతో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టాలని ఢిల్లీ భావిస్తోంది. ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), ఆదిత్యా తారే, శ్యామ్ బిల్లింగ్స్,కేకే నాయర్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, కోరీ అండర్సన్, క్రిస్ మోరిస్, ప్యాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, నదీమ్ పుణె తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), డు ప్లెసిస్, మయాంక్ అగర్వాల్, త్రిపాఠి, బెన్ స్టోక్స్,ఎంఎస్ ధోని, భాటియా, చాహర్, ఆడమ్ జంపా, ఇమ్రాన్ తాహీర్, దిండా -
అశ్విన్ స్థానంలో 18 ఏళ్ల కుర్రాడు
చెన్నై: రైజింగ్ పుణే జట్టుకు గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్ధానంలో 18 ఏళ్ల తమిళ కుర్రాడు ఎంపికయ్యాడు. కొద్ది రోజుల క్రితం స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతూ ఐపీఎల్‌కు అశ్విన్ దూరమైన విషయం తెలిసిందే. అశ్విన్ లోటు తీర్చేందుకు పుణే జట్టు తమిళ యువ క్రికెటర్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసింది. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్‌హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో కీలక పాత్ర పోశించాడు. అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణే జట్టు నెట్స్‌లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరు పణే కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. ‘దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎలాంటి అంచానాలు లేవు, అవకాశం వస్తే ఆడడానికి నేను సిద్దంగా ఉన్నాను. నెట్స్‌లో చాలసార్లు ధోనికి బౌలింగ్ చేశాను. ధోని చాలసార్లు నన్ను ప్రశంసించాడు. అతను చాల సలహాలు ఇచ్చాడు’.అని తన ఎంపికపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ ఎంపికతో సుందర్ పుణే స్పిన్ విభాగంలోని ఇమ్రాన్ తాహీర్, ఆడమ్ జంపా, అంకత్ శర్మ, తమిళనాడు ఆటగాడు బాబా అపరజిత్ల సరసన చేరాడు. తమిళనాడు కోచ్ హ్రిషికేశ్ కనిత్కర్ ఆర్పీఎస్ జట్టు సహాకోచ్గా ఉండడం సుందర్ ఎంపికకు కలిసొచ్చింది. -
ధోనిపై వేటు!
-
ధోనిపై వేటు!
ముంబై:ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10వ సీజన్ కు సంబంధించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ధోనిని తొలగించారు. ఈ మేరకు ఆదివారం పుణె యాజమాన్యం తుది నిర్ణయం తీసుకుంది. గతేడాది ధోని నేతృత్వంలో పుణె సూపర్ జెయింట్స్ పేలవమైన ఆట తీరుతో టాప్-4లో స్థానం సంపాదించలేకపోయింది. గత ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ జట్టుతో పాటు, పుణె సూపర్ జెయింట్స్ లు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లీగ్ దశలో గుజరాత్ టాప్ లో నిలిస్తే, పుణె చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్-9 సీజన్ లో 14 మ్యాచ్‌లాడిన పుణె.. కేవలం ఐదు విజయాల్ని మాత్రమే నమోదు చేసి యాజమాన్యం పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది. ఈ క్రమంలోనే ఏడో స్థానానికి పరిమితమైంది పుణె. మరొకవైపు ధోని కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. 12 ఇన్నింగ్స్ ల్లో ఒక హాఫ్ సెంచరీ సాధించి 284 పరుగులు సాధించాడు. ఈ అంశాలను నిశితంగా పరిశీలించిన పుణె యాజమాన్యం.. ధోనిని కెప్టెన్ గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో ఆస్ట్రేలియా కు చెందిన స్టీవ్ స్మిత్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది. ధోని కెప్టెన్సీపై పుణె యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగానే చెప్పొచ్చు. 2010, 11ల్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్స్ ను సాధించడంలో ధోని పాత్ర వెలకట్టలేనింది. దాంతో పాట 2010, 14 చాంపియన్స్ లీగ్ టైటిల్స్ ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. గతేడాది ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన పుణె.. కెప్టెన్ గా ధోనిని తొలగించడం తొందరపాటు నిర్ణయంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.