పుణే సూపర్ ఆటతో ఐపీఎల్–10 ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత ఏడాది అవమానకర రీతిలో ఏడో స్థానంలో నిలిచిన జెయింట్ టీమ్ ఈసారి అదరగొట్టే ప్రదర్శనతో టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ప్రత్యర్థి వేదికపై 162 పరుగుల సాధారణ స్కోరు చేసి కూడా జెయింట్ అద్భుత ఆటతీరుతో ఆ స్కోరును కాపాడుకోగలిగింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా ముంబై ఇండియన్స్ ఛేదనలో బోర్లా పడింది. ఫలితంగా రెండు మరాఠా జట్ల పోరులో వరుసగా మూడోసారీ పుణేదే పైచేయి అయింది.