ఢిల్లీతో మ్యాచ్ కు స్టీవ్ స్మిత్ దూరం | steve Smith out due to illness | Sakshi
Sakshi News home page

ఢిల్లీతో మ్యాచ్ కు స్టీవ్ స్మిత్ దూరం

Published Tue, Apr 11 2017 7:58 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

ఢిల్లీతో మ్యాచ్ కు స్టీవ్ స్మిత్ దూరం

ఢిల్లీతో మ్యాచ్ కు స్టీవ్ స్మిత్ దూరం

పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా ఇక్కడ మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ కు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. అనారోగ్యంగా కారణంగా ఢిల్లీతో జరిగే మ్యాచ్ నుంచి స్మిత్ వైదొలిగాడు. స్టీవ్ స్మిత్ స్థానంలో  అజింక్యా రహానే తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మరొకవైపు ఢిల్లీ జట్టు నుంచి కార్లోస్ బ్రాత్ వైట్ ను తొలగించారు. అతని స్థానంలో కోరీ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పుణె తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ పుణె రెండు మ్యాచ్ లు ఆడగా ఒకదాంట్లో విజయం సాధించింది. ఇక ఢిల్లీ ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది. దాంతో పుణెతో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టాలని ఢిల్లీ భావిస్తోంది.

ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), ఆదిత్యా తారే, శ్యామ్ బిల్లింగ్స్,కేకే నాయర్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, కోరీ అండర్సన్, క్రిస్ మోరిస్, ప్యాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, నదీమ్

పుణె తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), డు ప్లెసిస్, మయాంక్ అగర్వాల్, త్రిపాఠి, బెన్ స్టోక్స్,ఎంఎస్ ధోని, భాటియా, చాహర్, ఆడమ్ జంపా, ఇమ్రాన్ తాహీర్, దిండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement