సన్ రైజర్స్ కు షాక్ | pune beats sunrisers by 12 runs | Sakshi
Sakshi News home page

సన్ రైజర్స్ కు షాక్

Published Sat, May 6 2017 7:54 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

సన్ రైజర్స్ కు షాక్

సన్ రైజర్స్ కు షాక్

హైదరాబాద్:ఇప్పటివరకూ సొంతమైదానంలో ఓటమి ఎరుగకుండా దూసుకుపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు తొలిసారి షాక్ తగిలింది. ఐపీఎల్-10లో భాగంగా శనివారం  నగరంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పుణె విసిరిన 149 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి ఓటమి పాలైంది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(40;34 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్), యువరాజ్ సింగ్ (47;43 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లు) రాణించిన జట్టును గెలిపించలేకపోయారు. వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్ల ఘోరంగా విఫలం కావడంతో సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు.ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడంతో సన్ రైజర్స్ పరాజయం పాలైంది. రైజింగ్ పుణె ఆటగాళ్లలో ఉనాద్కత్ ఐదు వికెట్లతో సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఇది పుణెకు ఎనిమిదో విజయం కావడంతో 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరువైంది.

అంతకుముందు పుణె ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే రాహుల్ త్రిపాఠి(1)వికెట్ ను కో్ల్పోయింది. అనవసర పరుగు కోసం యత్నించిన త్రిపాఠి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరుణంలో అజింక్యా రహానేకు స్టీవ్ స్మిత్ జతకలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రహానే(22) రెండో వికెట్ గా  అవుట్ కావడంతో పుణె  గాడి తప్పినట్లు కనబడింది. కాగా, స్మిత్-బెన్ స్టోక్స్ లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో పుణె తిరిగి తేరుకుంది. అయితే స్టోక్స్(39), స్మిత్ (34)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అయితే చివర్లో మహేంద్ర సింగ్ ధోని(31;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement