'కరణ్ ను ఆడించడం అద్భుత నిర్ణయం'
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో స్పిన్నర్ కరణ్ శర్మను ఆడించడం అద్భుత నిర్ణయని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి మంచి నిర్ణయం తీసుకున్నాడని కొనియాడారు. వార్నర్, క్లార్క్ ను ఎలా కట్టడి చేయాలో కరణ్ కు తెలుసునన అన్నారు. ఆడిలైడ్ పిచ్ ను పరిశీలిస్తే అతడిని జట్టులోకి తీసుకోవడం ఏమాత్రం పొరపాటు కాదన్నారు.
అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన కరణ్ శర్మ తొలిరోజు సెంచరీ హీరో వార్నర్(145)ను అవుట్ చేశాడు. 23 ఓవర్లు వేసి 89 పరుగులిచ్చాడు. ఒక మేడిన్ ఓవర్ వేశాడు. ఆడిలైడ్ టెస్టు కరణ్ శర్మకు తొలి టెస్టు కావడం విశేషం. ఇషాంత్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశాడని గవాస్కర్ ప్రశంసించారు.