సీఎస్‌కే ఆటగాళ్లు (ఫైల్ ఫొటో)
ముంబై : ఐపీఎల్-11 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఇప్పటికి 7 సార్లు ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు సార్లు మాత్రమే టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. 2010లో ముంబై ఇండియన్స్, 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరులతో జరిగిన ఫైనల్లో గెలిచి చెన్నై వరుసగా ట్రోఫీలందుకుంది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని గెలుపొందింది. కోల్‌కతాతో జరిగిన 2012 ఫైనల్లో ఛేజింగ్‌కు మొగ్గు చూపిన చెన్నై ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో 2015 సీజన్ ఫైనల్లో సైతం ఫీల్డింగ్ ఎంచుకొని మరో పరాజయం చవిచూసింది. ఇక తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ధోని సేన ఛేజింగ్‌కే మొగ్గు చూపింది. ఈ లెక్కన చెన్నై ఛేజింగ్ గండంలో చిక్కుకుంటుందా.. లేక చరిత్రను తిరగరాస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గత పది సీజన్ల ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలుపొందడం ఇక్కడ మరో విశేషం.
సన్‌రైజర్స్‌కు కలిసొచ్చెనా..
2009 సీజన్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ జట్టు డెక్కెన్ చార్జర్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. 2016 సీజన్‌లో వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ సైతం తొలుత బ్యాటింగ్ చేసే టైటిల్ నెగ్గింది. ఈ లెక్కన హైదరాబాద్‌కు కలిసొస్తుందా అన్ని విషయం కూడా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment