
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్–11లో పటిష్ట బౌలింగ్ వనరులు కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో గేల్ ధాటికి కుదేలైన రైజర్స్ బౌలింగ్ విభాగం తిరిగి పుంజుకొని సత్తా చాటాలని చూస్తోంది. సీజన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన హైదరాబాద్ గత మ్యాచ్‌లో గేల్ సెంచరీతో విరుచుకుపడటంతో తొలి ఓటమిని చవిచూసింది. దీంతో తిరిగి గాడిన పడి చెన్నైపై ఆధిపత్యం చూపాలని తహతహలాడుతోంది. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, స్టాన్‌లేక్, షకీబుల్ హసన్‌లతో రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నా... బ్యాటింగ్‌లో ముందుండి నడిపించే వారు కరువవడం ఇబ్బందిగా మారింది.
కెప్టెన్ విలియమ్సన్ సాధికారిక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా... భారీ స్కోర్లు చేయడానికి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. శిఖర్ ధావన్, మనీశ్ పాండే, హేల్స్, సాహా, యూసుఫ్ పఠాన్, షకీబ్ చెలరేగితే సన్‌రైజర్స్‌కు ఎదురుండదు. మరోవైపు గత మ్యాచ్‌లో భారీ విజయంతో జోరు మీద ఉన్న చెన్నై... అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. రాజస్తాన్ రాయల్స్‌పై మెరుపు శతకంతో చెలరేగిన వాట్సన్‌తో పాటు రైనా, ధోని, రాయుడు, బిల్లింగ్స్, బ్రేవో, జడేజాలతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment