
టామ్ మూడీ
ముంబై: ఐపీఎల్-11 సీజన్ ఫైనల్లో తమ ఓటమికి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సనే కారణమని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మూడీ మాట్లాడుతూ.. ‘వాట్సన్ ఇన్నింగ్స్ ప్రత్యేకం. మేం పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించాం. కానీ తన ప్రత్యేకమైన ఆటతో మా విజయాన్నిలాగేసుకున్నాడు. ఈ సీజన్ అద్భుతంగా సాగింది. మేం ఇంట (హోం గ్రౌండ్), బయట అద్భుతంగా రాణించాం. కొన్ని మ్యాచ్‌లు ఓడినప్పటికి టోర్నీలో మాపై అంతగా ప్రభావం చూపలేదు. కేన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తనలోని మూడు కోణాలను ప్రపంచానికి చాటి చెప్పాడు. రషీద్ గొప్ప క్రికెటర్. భారత అభిమానులు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం అతని మాయలో పడిపోయింది. బౌలింగ్‌లోనే కాదు.. మైదానంలోని అతని కమిట్‌మెంట్ చాలా గొప్పది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో షేన్ వాట్సన్ అద్భుత సెంచరీతో చెన్నై టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment