
మనీష్ పాండే అద్భుత క్యాచ్
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. తన మైమరిపించే ఫీల్డింగ్‌తో నితీష్ రాణా, ఆండ్రూ రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. వర్షంతో మ్యాచ్ ఆగిపోగా.. పునప్రారంభమైన నాలుగు బంతులకే కోల్‌కతా స్టార్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణా స్టాన్ లేక్ బౌలింగ్‌లో ఆఫ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని గల్లీలో ఆడే ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పాండే రెప్పపాటు సమయంలో గాల్లో డైవ్ చేసి అందుకున్నాడు. అయితే తొలుత పాండే చేతుల నుంచి బంతి జారినట్లే జారి చిక్కింది. దీంతో నితీష్ రాణా18(14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు) పెవిలియన్ చేరాడు.
చేజారిన నరైన్ క్యాచ్.!
షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాండే మరో సారి అద్భుత ఫీల్డింగ్‌తో బంతిని సిక్సు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో సమన్వయం కోల్పోయిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి క్యాచ్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి దూరంగా పడటంతో క్యాచ్ చేజారింది. సెకన్ల వ్యవధిలోనే పాండే అద్బుత ఫీల్డింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రస్సెల్ క్యాచ్ అందుకున్న పాండే..
ఆండ్రూరస్సెల్ (9)ను పాండే మరోసారి అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. స్టాన్‌లేక్ వేసిన 14 ఓవర్ రెండో బంతికి రస్సెల్ షాట్‌కు ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాండే ముందుకు పరుగెత్తి అద్భుత డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాండే ఫీల్డింగ్‌తో జాంటీ రోడ్స్‌ను తలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment