కేకేఆర్‌తో పోరుకు రైజర్స్ సై (PC: IPL/BCCI)
IPL 2023 SRH Vs KKR: సొంతగడ్డపై.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్-2023లో గత మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఓడించిన రైజర్స్.. కోల్‌కతాపై విజయపరంపరను కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
మరోవైపు ఈడెన్ గార్డెన్స్‌తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని నితీశ్ రాణా సేన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ఒకే ఒక మార్పు.. ! రాయ్ వచ్చేస్తున్నాడు!
దాదాపుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించనున్న రైజర్స్.. అకీల్ హొసేన్ స్థానంలో మార్కో జాన్సెన్‌ను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ఇంగ్లంగ్ విధ్వంసకర వీరుడు జేసన్ రాయ్ పూర్తి ఫిట్‌గా ఉన్న నేపథ్యంలో కేకేఆర్ డేవిడ్ వీజ్ స్థానాన్ని అతడితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
రాయ్ రాకతో కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టం కానుంది. కాగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన జేసన్ రాయ్ 160 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్థ శతకం(61) ఉంది.
ముఖాముఖి పోరులో
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌హెచ్- కేకేఆర్ మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ కేవలం తొమ్మిదింట విజయాలు సాధించగా.. 15 సార్లు గెలుపు కేకేఆర్‌ననే వరించింది. అయితే, గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 23 పరుగులతో పైచేయి సాధించడం ద్వారా ఎస్‌ఆర్‌హెచ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
పిచ్, వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పిచ్‌పై పచ్చిక ఉన్న నేపథ్యంలో ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే పరిస్థితి ఉంది.
ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్ తుది జట్లు(అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.
కోల్‌కతా నైట్ రైడర్స్
జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ.
చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్
చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు..
It's time for Physix practicals says Prof. Klaasen 🥼🔥 pic.twitter.com/CHNQ0LKF8P
— SunRisers Hyderabad (@SunRisers) May 4, 2023
Comments
Please login to add a commentAdd a comment