హెన్రిచ్ క్లాసెన్ (PC: IPL/SRH Twitter)
IPL 2023 SRH Vs KKR: ‘‘ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఆఖరి ఓవర్లలో మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ పని పూర్తి చేయడంలో విఫలమయ్యాం’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ విచారం వ్యక్తం చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్న మార్కరమ్.. తాను మాత్రం ఆరంభంలో తడబాటుకు లోనయ్యానని.. అదే ఓటమికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
రాణా, రింకూ మెరుగ్గా
ఐపీఎల్-2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో రైజర్స్ ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సొంతమైదానంలో 5 పరుగుల తేడాతో కేకేఆర్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
నితీశ్ రాణా కెప్టెన్ ఇన్నింగ్స్(31 బంతుల్లో 42 పరుగులు)కు తోడు.. రింకూ సింగ్(35 బంతుల్లో 46 పరుగులు) రాణించడంతో మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ 166 పరుగులకే పరిమితమైంది.
మార్కరమ్ (PC: IPL Twitter)
క్లాసెన్ రాణించినా
ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(18), అభిషేక్ శర్మ(9)తో పాటు హ్యారీ బ్రూక్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ మార్కరమ్.. 40 బంతుల్లో 41 పరుగులు చేయగలిగాడు. ఆరో స్థానంలో వచ్చిన క్లాసెన్ 20 బంతుల్లో 36 పరుగులతో ఆకట్టుకున్నాడు.
అదే ప్రభావం చూపింది
అయితే, ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన నేపథ్యంలో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో రైజర్స్‌ను కట్టడి చేశాడు. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులే రావడంతో హైదరాబాద్ ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. తాను ఆరంభంలో బంతులు వృథా చేయడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు.
ఇదో గుణపాఠం
‘‘బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మాకు శుభారంభమే లభించింది. కానీ.. లక్ష్య ఛేదనలో తడబడ్డాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఇదొక గుణపాఠం. లోపాలు సవరించుకుని ముందుకు సాగుతాం’’ అని మార్కరమ్ చెప్పుకొచ్చాడు.
కాగా విజయంతో ఈడెన్ గార్డెన్స్‌లో తమకు ఎదురైన పరాభవానికి రైజర్స్‌పై కేకేఆర్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కేకేఆర్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి(4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2023: లిటన్ దాస్ స్థానంలో బిగ్ హిట్టర్.. ఇక
నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్
#KKR clinch a nail-biter here in Hyderabad as Varun Chakaravarthy defends 9 runs in the final over.@KKRiders win by 5 runs.
— IndianPremierLeague (@IPL) May 4, 2023
Scorecard - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/g9KGaBbADy
Comments
Please login to add a commentAdd a comment