వరుసగా సన్‌రైజర్స్ రెండో ఓటమి (Photo Credit: iplt20.com)
Lucknow Super Giants vs Sunrisers Hyderabad: ‘‘వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే వికెట్లు కోల్పోయాం. ఈరోజు ఏడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. కచ్చితంగా మా బ్యాటర్ల ఆట తీరు మెరుగుపడాల్సి ఉంది.
లోపాలు సరిచేసుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబడుతూ ముందుకు సాగే వీలు ఉంటుంది’’ అని సన్‌రైజర్స్ హెడ్‌కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఐపీఎల్-2023లో బ్యాటర్ల దారుణ వైఫల్యమే తొలి రెండు మ్యాచ్‌లలో ఓటములకు కారణమైందని పేర్కొన్నాడు.
పేలవమైన ప్రదర్శనతో రైజర్స్ వరుస ఓటములు
ఇప్పటికైనా తమ బ్యాటింగ్ విభాగం పొరపాట్లు సరిచేసుకోవాలని, ఆ మేరకు కావాల్సిన చర్యలు చేపడతామని లారా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్‌ను ఎనిమిదో స్థానంతో ముగించిన సన్‌రైజర్స్.. పదహారో ఎడిషన్‌నూ పేలవంగా ఆరంభించింది.
సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన రైజర్స్... శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది.
ఎయిడెన్ అన్న.. హ్యారీ బ్రూక్ మరీ ఘోరంగా
తొలి మ్యాచ్‌లో టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా.. లక్నోలో మ్యాచ్‌లో 50/1తో పర్వాలేదనిపించినా.. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ గోల్డెన్ డకౌట్ కాగా.. హ్యారీ బ్రూక్(3) మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి స్వల్ప లక్ష్యం విధించిన హైదరాబాద్ జట్టుపై రాహుల్ సేన ఘన విజయం సాధించింది. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడంతో రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి వచ్చి చేరింది.
వాళ్లిద్దరు అవుట్ అవడం దెబ్బతీసింది
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లారా మాట్లాడుతూ.. అన్మోల్‌ప్రీత్ సింగ్ అవుటైన తర్వాత.. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్, హ్యారీబ్రూక్ వెనువెంటనే పెవిలియన్ చేరడం తమను చావు దెబ్బతీసిందన్నాడు. కనీసం 150- 160 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. పిచ్‌ను నిందిస్తూ ఓటమికి సాకులు వెతుక్కోబోమని.. తమ బ్యాటింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని లారా చెప్పుకొచ్చాడు.
చదవండి: టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది!
ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు
An all-round @krunalpandya24 performance and a clinical @LucknowIPL chase at home to move to the 🔝 of the table 👌🏻👌🏻 #TATAIPL
— IndianPremierLeague (@IPL) April 8, 2023
We have got the #LSGvSRH clash summed up for you 🔽 pic.twitter.com/d0m9foUkqf
Comments
Please login to add a commentAdd a comment