SRH Vs LSG: Markram And Glenn Phillips Out In Back To Back Deliveries In Krunal Bowling - Sakshi
Sakshi News home page

SRH VS LSG: కీలక మ్యాచ్‌లో తేలిపోయిన మార్క్రమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌.. వరుస బంతుల్లో..!

Published Sat, May 13 2023 5:01 PM | Last Updated on Sat, May 13 2023 5:42 PM

Markram, Glenn Phillips Out in Back To Back Deliveries In Krunal Bowling - Sakshi

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు తడబడుతున్నారు. ఇన్నింగ్స్‌  ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌.. ఓ దశలో మార్క్రమ్‌, క్లాసెన్‌ ధాటిగా ఆడుతుండటంతో భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా ఊహించారు. అయితే వీరిద్దరు కృనాల్‌ పాండ్యా (13వ ఓవర్‌) బౌలింగ్‌లో వరస బంతుల్లో పెవిలియన్‌కు చేరి దారుణంగా నిరాశపరిచారు. మార్క్రమ్‌ (20 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరుగా పరుగులు సాధించగా.. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన గ్లెన్‌ ఫిలిప్స్‌ తొలి బంతికే క్లీన్‌ బౌల్డయ్యాడు. కీలక మ్యాచ్‌లో వీరిద్దరూ తేలిపోవడంతో భారీ స్కోర్‌పై గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు ఢీలా పడిపోయారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. 13 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36), రాహుల్‌ త్రిపాఠి (20), మార్క్రమ్‌ (28) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (0), అభిషేక్‌ శర్మ (7) దారుణంగా నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ 2, యుద్ద్‌వీర్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌, అమిత్‌ మిశ్రా తలో వికెట్‌ పడగొట్టారు. ప్లే ఆఫ్స్‌ నేపథ్యంలో లక్నో కంటే సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో మార్క్రమ్‌ సేన గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. 

చదవండి: లక్నోతో సన్‌రైజర్స్‌ కీలక పోరు.. 13 కోట్ల ఆటగాడికి మరో సారి నోఛాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement