ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్‌కు ఆడిన హ్యారీ బ్రూక్ (PC: IPL/SRH)
IPL 2023- SRH- Harry Brook: భారత క్రికెట్ అభిమానుల గురించి తాను అలా మాట్లాడకపోవాల్సిందంటూ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో సెంచరీ చేసిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్న తర్వాతే తన మానసిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు.
కాగా ఐపీఎల్-2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 13.25 కోట్ల రూపాయాల భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 24 ఏళ్ల ఈ మిడిలార్డర్ బ్యాటర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
నోళ్లు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు
వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో శతకం బాదిన తర్వాత.. తనను ట్రోల్ చేసిన వాళ్ల నోళ్లు మూయించాను అంటూ బ్రూక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
పశ్చాత్తాపంతో
ఈ విషయం గురించి తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న హ్యారీ బ్రూక్.. ‘‘అప్పుడు నేను ఓ ఇడియట్‌లా ప్రవర్తించాను. ఇంటర్వ్యూలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాపపడ్డాను.
హోటల్ గదిలో కూర్చుని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయగానే.. చూడకూడని కామెంట్లు ఎన్నో చూశాను. అప్పటి నుంచి నెట్టింటికి కొంతకాలం పాటు దూరం కావాలని నిర్ణయించుకున్నాను.
భారీ మొత్తానికి న్యాయం చేయలేక
నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా.. కేవలం ఆట మీదే దృష్టిసారించాను. తద్వారా నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగైంది’’ అని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 కోసం సన్‌రైజర్స్ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ న్యాయం చేయలేకపోయాడు.
ఆడిన 11 ఇన్నింగ్స్‌లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్-2024 వేలానికి ముందు బ్రూక్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అతడు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. విండీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విండీస్ చేతిలో ఓటమిపాలైంది.
చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!
Comments
Please login to add a commentAdd a comment