సీఎస్‌కేను 6 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్ (PC: IPL)
IPL 2023 CSK Vs KKR- Nitish Rana: గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణాకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అతడికి 24 లక్షల రూపాయల భారీ జరిమానా పడింది. అదే విధంగా జట్టు మొత్తానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2023లో ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది కేకేఆర్.
చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత సమయంలో బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తిచేయలేకపోయింది. ఈ నేపథ్యంలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు కేకేఆర్ సారథి నితీశ్ రాణాకు ఈ మేరకు ఫైన్ విధించారు.
అప్పుడు 12 లక్షలు.. ఇప్పుడు 24 లక్షలు
కాగా ఈ సీజన్‌లో కేకేఆర్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో (మే 8)లో పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సందర్భంలోనూ కోల్‌కతా ఈ తప్పిదం చేసింది. పదహారో ఎడిషన్‌లో ఇది మొదటి తప్పు కాబట్టి అప్పుడు నితీశ్‌కు 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు.
ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ
కానీ.. మే 14 నాటి మ్యాచ్‌లోనూ మరోసారి ఇదే తప్పిదం పునరావృతం చేయడంతో నిబంధనల ప్రకారం అతడికి 24 లక్షల జరిమానా విధించారు. అదే విధంగా ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ప్రతి సభ్యుడికి ఆరు లక్షల ఫైన్ లేదంటే మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించనన్నుట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
కాగా చెపాక్‌లో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన కేకేఆర్.. ధోని సేనను 144 పరుగులకు కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డా నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రాణా(57), రింకూ సింగ్(54) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు అర్థ శతకాలతో రాణించి జట్టుకు విజయం అందించారు. ఇక సీఎస్‌కే మీద గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా నిలిచే ఉంది.
చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని
వాళ్లు మమ్మల్ని అవుట్ చేయలేదు.. మా అంతట మేమే! మరీ చెత్తగా..
Comments
Please login to add a commentAdd a comment