IPL 2021: SRH Fans Troll Kedar Jadhav, Manish Pandey for Repeated Failures - Sakshi
Sakshi News home page

IPL 2021: వాళ్లిద్దరినీ బ్యాన్‌ చేయండి.. తిరిగి డబ్బు చెల్లించమనండి.. ఫ్యాన్స్‌ ట్రోల్స్‌

Published Sun, Sep 26 2021 1:26 PM | Last Updated on Mon, Sep 27 2021 9:44 AM

IPL 2021: SRH Fans Troll Kedar Jadhav Manish Pandey Slam Repeated Failures - Sakshi

Netizens Trolls SRH Players: ఐపీఎల్‌-2021లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంతటి ఘోరమైన ఓటమిని తట్టుకోలేకపోతున్నామని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇలా జరిగి ఉండేది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ గెలుస్తారా అంటూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

ముఖ్యంగా శనివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌ వంటి వాళ్లకు ఇకనైనా స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. వాళ్లిద్దరూ ఫ్రాంఛైజీ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే బాగుంటుందంటూ సోషల్‌ మీడియా వేదికగా మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. కాగా పంజాబ్‌ కింగ్స్‌తో సెప్టెంబరు 25న జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్‌ సేన 5 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 

తాజా ఓటమితో.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి సన్‌రైజర్స్‌ అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచి.. 8 పరాజయాలతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో ఆరెంజ్‌ ఆర్మీ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. మ్యాచ్‌ మ్యాచ్‌కు ఆటగాళ్లను పదే పదే మార్చడం.. వార్నర్‌ అన్నను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక.. తుది జట్టులో చోటు కల్పించకుండా అవమానించారని, సరైన ప్రణాళిక లేకుండా ఈ సీజన్‌లో చేదు అనుభవాన్ని మిగిల్చారని ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జట్టుకు భారంగా మారిన మిడిలార్డర్‌ ‘జాతి రత్నాలు’.. మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌ను ఇకనైనా వదిలించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. వాళ్లిద్దరినీ బ్యాన్‌ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో మనీశ్‌ పాండే 23 బంతుల్లో 13 పరుగులు చేయగా.. కేదార్‌ జాదవ్‌.. 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ రవి బిష్ణోయి బౌలింగ్‌లో అవుట్‌ అయ్యారు. ఇక ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌ (కేకేఆర్‌పై 61 (నాటౌట్‌)) మినహా మిగతా మ్యాచ్‌లలో మనీశ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేదార్‌ జాదవ్‌ సైతం ఆశించినంతగా రాణించలేదన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement