IPL 2021: Harshal Patel Breaks Bumrah IPL Record Vs Sunrisers Hyderabad - Sakshi
Sakshi News home page

RCB Vs SRH : ఆర్సీబీ బౌలర్‌ ఖాతాలో అరుదైన రికార్డు.. బుమ్రా రికార్డు బద్దలు 

Published Thu, Oct 7 2021 3:27 PM | Last Updated on Thu, Oct 7 2021 7:49 PM

IPL 2021 2nd Phase: Harshal Patel Breaks Bumrah IPL Record Vs Sunrisers Hyderabad - Sakshi

Harshal Patel Breaks Bumrah IPL Record: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ చరిత్రను తిరగరాసాడు. ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్‌ జ‌స్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు(27 వికెట్లు)ను బద్దలు కొట్టి.. ఓ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బుధ‌వారం స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హ‌ర్ష‌ల్.. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ప్ర‌స్తుతం ఈ సీజ‌న్‌లో హ‌ర్ష‌ల్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ కనీసం  మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండడంతో అతను ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్ల రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డు చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్‌లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా, లీగ్‌ ద‌శ‌లో మ‌రో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 
చదవండి: Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement