wickets
-
మురళీధరన్ అదే చేశాడు! – సచిన్ టెండూల్కర్
‘‘1993లో మురళీధరన్‌ని కలిశాను. అప్పట్నుంచి మా స్నేహం అలాగే ఉంది. ఎంతో సాధించినా సాధారణంగా ఉంటాడు. అతను ఏదైనా అడిగితే కుదరదని చెప్పడం కష్టం.. అందుకే పిలవగానే ఈ వేడుకకి వచ్చాను’’ అన్నారు భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘800’ ట్రైలర్‌ని సచిన్ టెండూల్కర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆటలో గెలు పోటములు ఉంటాయి. మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు.. అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి’’ అన్నారు. ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘నేను సచిన్ ఫ్యాన్‌ని. మరో వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘800’ మానవత్వంతో కూడిన కథ’’ అన్నారు ఎంఎస్ శ్రీపతి. ‘‘మురళీధరన్గారి పాత్ర చేయడం ఓ పెద్ద బాధ్యత’’ అన్నారు మధుర్ మిట్టల్. -
వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్స్
-
ధోని తోపు కబాటే తప్పు చేసిన ఓకేనా? థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నాడు?
-
బౌలర్లు చెలరేగితే అట్లనే ఉంటది.. ఒకే రోజు 21 వికెట్లు!
బెంగళూరు: కర్ణాటక, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మ్యాచ్ రెండో రోజు మంగళవారం మొత్తం 21 వికెట్లు కుప్పకూలాయి. ఓవర్‌నైట్ స్కోరు 213/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ గోపాల్ (56 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కూడా కర్ణాటక తడబడింది. ఆట ముగిసేసరికి ఆ జట్టు 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. సౌరభ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 647 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 577 పరుగులు సాధించింది. చదవండి: Sunil Gavaskar 174-ball 36 Runs: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని -
క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్ షేన్ వార్న్
క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు ఎందరో ఉంటారు.. కానీ తమ ఆటతో ప్రత్యర్థులనే ఓ ఆటాడించి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని లెజెండ్‌గా మారేది మాత్రం కొందరే. అటువంటి దిగ్గజ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్పిన్నింగ్ దిగ్గజం షేన్ వార్న్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్న్ తన క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాయిలు అధిగమించాడు. అలానే చెరిగిపోని రికార్డులు మరెన్నో తన పేరుమీద లిఖించుకున్నాడు. ఇలాంటివి బోలెడు ఉన్నా షేన్ వార్న్‌కి క్రికెట్ కెరీర్లో మర్చిపోలేని రోజు ఏదైనా ఉందంటే 2006 ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 700వ వికెట్ సాధించడమనే చెప్పాలి. విక్టోరియన్ గ్రౌండ్లో 89,155 మంది ప్రేక్షకుల మధ్య ఇంగ్లాండ్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్ తీసి అంతవరకు ఎవరికీ సాధ్యపడని ఘనతను సాధించి చూపాడు. ఆ వికెట్‌తో ప్రపంచ క్రికెట్ చరిత్రోలో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం అదే మ్యాచ్‌లో వార్న్ నలుగురు బ్యాట్స్మెన్లను పెవిలియన్‌కు తన టెస్ట్ కెరీర్లో ఐదు వికెట్లను పడగొట్టడం ద్వారా 37వ చివరి ఐదు వికెట్ల హాల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్-2021లో అత్యధిక వికెట్ల వీరులు వీరే!
Who Has Taken Most Wickets in T20 World Cup 2021?: యూఏఈ వేదికగా జరుగుతన్న టీ20 ప్రపంచకప్-2021 తుది దశకు చేరుకుంది. సోమవారం(నవంబర్8) భారత్-నమీబియా మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసింది. దీంతో సెమిఫైనల్స్‌కు గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, గ్రూపు-2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ ఆర్హత సాధించాయి. నవంబర్ 10 న తొలి సెమిపైనల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి. రెండో సెమీపైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. ఇక టీ20 ఫార్మాట్ అంటే సాదారణంగా ఫోర్లు, సిక్స్‌లుతో బ్యాటర్లు చేలరేగడం చూస్తూ ఉంటాం. కానీ ఈ సారి భిన్నంగా బౌలర్ల హవా కొనసాగింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఒకే ఒక్క సారి స్కోర్‌బోర్డ్ 200 ధాటింది. అదికూడా టీమిండియా.. ఆఫ్గానిస్తాన్‌పై నమోదు చేసింది. ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్ట బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లపై ఓలుక్కేద్దాం.. టీ20 ప్రపంచకప్-2021లో ఇప్పటివరకు అత్యధిక వికెట్ల వీరులు వీరే.. 1. వనిందు హసరంగా: 8 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా మొదటి స్ధానంలో ఉన్నాడు. దీంట్లో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. 2. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)- 5 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు; సగటు- 9.90 3. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 5 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు; సగటు- 10.45 4.షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 6 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు; సగటు- 11.18 5.డ్వైన్ ప్రిటోరియస్ (దక్షిణాఫ్రికా)- 5 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు; సగటు- 11.22 6.అన్రిచ్ నార్ట్జే (దక్షిణాఫ్రికా)- 5 ఇన్నింగ్స్‌లలో 9 వికెట్లు; సగటు- 11.55 7.జోష్ డేవీ (స్కాట్లాండ్)-5 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు; సగటు- 13.66 8.ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)- 5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు; సగటు- 13.37 9.జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు; సగటు- 13.75 10.రషీద్ ఖాన్ (ఆఫ్గానిస్తాన్)- 5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు; సగటు- 14.00 చదవండి: T20 WC 2021: ఎలిమినేటెడ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్.. కెప్టెన్ మాత్రం లేడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన బుమ్రా...
Jasprit Bumrah becomes Indias leading wicket taker in mens In T20s టీమిండియా స్టార్ ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. నవంబర్5న స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన బుమ్రా, ఈ ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో బుమ్రా మొత్తంగా 64 వికెట్లు పడగొట్టాడు. దీంతో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను (63 వికెట్లు) అధిగమించాడు. తర్వాతి స్థానాల్లో రవిచంద్రన్ అశ్విన్ (55),భువనేశ్వర్ కుమార్ (50), రవీంద్ర జడేజా (43),హార్ధిక్ పాండ్యా (42) ఉన్నారు. ఆదేవిధంగా మరో రికార్డును బుమ్రా ఈ మ్యాచ్‌లో సాధించాడు. స్కాట్లాండ్పై మెయిడిన్ ఓవర్ వేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా నిలిచాడు. చదవండి: Chris Gayle: సన్ గ్లాసెస్‌తో బరిలోకి.. క్రిస్ గేల్ రిటైర్మెంట్! -
చరిత్ర తిరగరాసిన ఆర్సీబీ బౌలర్.. బుమ్రా రికార్డు బద్దలు
Harshal Patel Breaks Bumrah IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ చరిత్రను తిరగరాసాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు(27 వికెట్లు)ను బద్దలు కొట్టి.. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బుధవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హర్షల్.. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కనీసం మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండడంతో అతను ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా, లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు -
వారెవ్వా బుమ్రా.. తొలి వికెట్; వందో వికెట్ ఒకేలా
లండన్: టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఓలీ పోప్‌ను ఔట్ చేయడం ద్వారా వంద వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 24 టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న బుమ్రా జడేజాతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఓవరాల్‌గా బుమ్రా టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల క్లబ్లో చేరిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ 18 టెస్టుల్లోనే 100 వికెట్ల మార్క్‌ను చేరుకొని ఓవరాల్‌గా మూడో స్థానంలో.. టీమిండియా తరపున తొలి స్థానంలో ఉన్నాడు. చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా ఘన విజయం అయితే బుమ్రా తన తొలి టెస్టు వికెట్‌ను ఎలా దక్కించుకున్నాడో.. సరిగ్గా వందో వికెట్ కూడా దాదాపు అలాగే పొందడం చర్చనీయాంశంగా మారింది. ఇక బుమ్రా తన తొలి వికెట్‌ను కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఏబీ డివిలియర్స్ రూపంలో అందుకున్నాడు. బుమ్రా డెలివరీని ఏబీ డివిలియర్స్ ఆడే క్రమంలో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇక బమ్రా వందో వికెట్ కూడా అలాగే వచ్చింది. ఆఫ్‌స్టంప్ మీదుగా వచ్చిన బంతిని అంచనా వేయడంలో పోప్ పొరబడ్డాడు. బంతి అద్భుతంగా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని నేరుగా వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం బుమ్రా తొలి వికెట్.. వందో వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక 368 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా జట్టుగా రాణించి ఓవల్ గడ్డపై 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. మళ్లీ ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఉమేశ్ బౌలింగ్‌లో ఆండర్సన్(2) ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 210 పరుగుల వద్ద తెరపడింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా బుమ్రా, శార్దూల్, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చదవండి: IND Vs ENG 4th Test: కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం.. 1st 100th @Jaspritbumrah93 🐐 pic.twitter.com/2hclZrVAFD — ʝä. (@jattuu12) September 6, 2021 -
బుమ్రా రికార్డ్‌ను బద్దలు కొట్టిన చాహల్
అహ్మదాబాద్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భారత్ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో చాహల్ ఈ ఘనతను సాధించాడు. పొట్టి ఫార్మాట్లో పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రా(50 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును చాహల్ ఈ మ్యాచ్‌లో అధిగమించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో జోస్ బట్లర్‌ను ఔట్ చేసిన చాహల్.. పొట్టి ఫార్మాట్లో 60వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చాహల్ ఈ ఘనతను కేవలం 46వ మ్యాచ్‌లోనే సాధించాడు. ఓవరాల్‌గా చాహల్‌కు ఇది భారత్ తరఫున వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా చాహల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. -
ఐపీఎల్లో నాలుగో బౌలర్‌గా
-
విజయానికి 2 పరుగులు.. 5 వికెట్లు టపాటపా
-
విజయానికి 2 పరుగులు.. 5 వికెట్లు టపాటపా
జైపూర్: ఐపీఎల్ మహిళల టి20 చాలెంజ్‌లో భాగంగా బుధవారం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరల్లో ఆసక్తి చేసింది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్ దీప్తి శర్మ చివరల్లో ముగ్గురిని క్లీన్‌బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అప్పటికే వెలాసిటీ టీమ్ విజయం ఖాయం అయిపోవడంతో దీప్తి ప్రదర్శన వృధా అయింది. వెలాసిటీ 18 బంతులకు 2 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి టపాటపా మూడు వికెట్లు పడగొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన మిథాలీ సేన 16.5 ఓవర్లలో 111 పరుగులు చేసి మూడో వికెట్ నష్టపోయింది. ఇక్కడ నుంచి వరుసగా ఐదు వికెట్లు కోల్పోయింది. టాప్ స్కోరర్ డానియల్ వ్యాట్(46) మూడో వికెట్‌గా ఔటైంది. తర్వాత వేదాకృష్ణమూర్తి రనౌటయింది. ఇక్కడి నుంచి దీప్తి షో మొదలైంది. 17 ఓవర్ తొలి బంతికి మిథాలీ రాజ్‌ను బౌల్డ్ చేసింది. మూడో బంతికి శిఖా పాండే, ఐదో బంతికి అమిలా కెర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపింది. ఈరోజు మ్యాచ్‌లో దీప్తి పడొట్టిన నాలుగు వికెట్లు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. 4 ఓవర్ 5 బంతికి ఓపెనర్ హెలే మాథ్యూస్‌ను అవుట్ చేసిన దీప్తి చివర్లో మళ్లీ మాయాజాలం చేసింది. విజయానికి 2 పరుగులు చేయాల్సిన దశలో వెలాసిటీ టీమ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 8 వికెట్ల తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో వెలాసిటీ టీమ్ చివరకు మూడు వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. (చదవండి: మంధానకు షాక్.. మిథాలీ సేనదే విజయం) -
4 బంతుల్లో 4 వికెట్లు
జైపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2018–19 సీజన్లో అరుదైన ఘనత నమోదైంది. రాజస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ పేసర్ ముదస్సిర్ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 99వ ఓవర్ బౌలింగ్ చేసిన ముదస్సిర్ (5/90) మూడో బంతికి చేతన్ బిస్త్ (159; 24 ఫోర్లు)ను ఆ తర్వాత వరుసగా తజిందర్ సింగ్ (0), రాహుల్ చహర్ (0), తన్వీర్ ఉల్ హఖ్ (0)లను ఎల్బీడబ్ల్యూలుగా పెవిలియన్ పంపాడు. రంజీ చరిత్రలో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం ఇది రెండో సారైతే... ఆ నాలుగు ఎల్బీడబ్ల్యూలే కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఢిల్లీ ఆటగాడు శంకర్ సైనీ (1988 హిమాచల్ ప్రదేశ్‌పై) ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూకశ్మీర్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. మరో హ్యాట్రిక్..: మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తమిళనాడు పేసర్ ఎం. మొహమ్మద్ మరో హ్యాట్రిక్ నమోదు చేశాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 142వ ఓవర్ చివరి బంతికి యశ్ దూబే (6)ను ఔట్ చేసిన మొహమ్మద్ (4/98) తన మరుసటి ఓవర్ తొలి రెండు బంతులకు రజత్ పాటిదార్ (196; 17 ఫోర్లు, 1 సిక్స్), మిహిర్ హిర్వాణి (0)లను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు. -
అశ్విన్ 600 సాధిస్తాడా?
‘నేను ఇప్పటికి 50 టెస్టులు మాత్రమే ఆడాను. ఇప్పుడు సాధించిన వికెట్ల సంఖ్యను భవిష్యత్తులో రెట్టింపు చేస్తాననే నమ్మకం ఉంది’... నాగ్‌పూర్ టెస్టులో 300 వికెట్ల మైలురాయిని చేరిన అనంతరం భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్య ఇది. కేవలం ఆరేళ్ల కాలంలో 54 టెస్టుల్లోనే 300 వికెట్లు పడగొట్టగలిగిన అశ్విన్ ఈ తరహాలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతను అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన తర్వాత అశ్విన్‌కంటే ఎక్కువ వికెట్లు ఎవరూ తీయలేకపోయారు. ఇంత చిన్న కెరీర్లోనే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 26 సార్లు పడగొట్టడం అశ్విన్ మినహా మరే బౌలర్‌కూ సాధ్యం కాలేదు. సచిన్, సెహ్వాగ్‌లకు కూడా సాధ్యం కాని రీతిలో ఏకంగా ఏడు సార్లు అతను ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఇప్పటి వరకు ఉన్న తన గణాంకాలు అశ్విన్‌కు ఏదీ అసాధ్యం కాదనే చెబుతున్నాయి. ముఖ్యంగా 2015, 2016, 2017లలో వరుసగా మూడేళ్ల పాటు అతను 50కు పైగా వికెట్లు తీయడం విశేషం. అయితే అశ్విన్ కెరీర్లో రెండో కోణం చూస్తే గత మూడేళ్ల కాలంలో భారత్ సొంతగడ్డపై పెద్ద సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లు ఆడటం కూడా అతనికి కలిసొచ్చింది. భారత్‌లో 34 టెస్టుల్లోనే 216 వికెట్లు తీసిన అతను విదేశాల్లో 20 టెస్టుల్లో 84 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. 2018లో టీమిండియా పెద్ద సంఖ్యలో విదేశాల్లో టెస్టులు ఆడనుంది. ఇందులో ముందుగా దక్షిణాఫ్రికా పర్యటన, ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లు ఉన్నాయి. ఈ మూడు చోట్ల కలిపి అశ్విన్ ఆడింది 9 టెస్టులే. వీటిలో అతను 24 వికెట్లే తీయగలిగాడు. ఈ రికార్డును అతను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. పైగా విదేశీ గడ్డపై ఒకే స్పిన్నర్ అంటూ కెప్టెన్ కోహ్లి పరోక్షంగా చెబుతున్న నేపథ్యంలో ఆ ఒక్కడు కచ్చితంగా అతనే కావాలి. టెస్టుల్లో అందరికంటే వేగంగా ‘వికెట్ల ట్రిపుల్ సెంచరీ’ చేసిన ఈ చెన్నై ఇంజినీర్ తన ఆరేళ్ల ప్రస్థానంలో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. అయితే విదేశీ పర్యటనల తర్వాతే అతని కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. 2013లో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్ టెస్టులో 42 ఓవర్లు బౌలింగ్ చేసి కూడా ఒక్క వికెట్ తీయలేకపోవడంతో అతను తుది జట్టులో చోటు కోల్పోయాడు. భారత్ ఆడిన తర్వాతి తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింటిలో స్థానం దక్కనే లేదు. మిగిలిన రెండు మ్యాచ్‌లలో తీసింది 3 వికెట్లే! అంతే...అశ్విన్ కెరీర్ ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. అయితే అతను అధైర్యపడలేదు. పట్టుదలతో మళ్లీ స్థానం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. చిన్ననాటి కోచ్ మొదలు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వరకు అందరికీ తన సమస్య చెప్పుకున్నాడు. వారి సూచనలు, సలహాలతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకొని కొత్త అస్త్రాలతో అశ్విన్ సిద్ధమయ్యాడు. 2015లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు కొత్త అశ్విన్‌ను చూపించింది. ఆ మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన అశ్విన్ ఆ తర్వాత ఆగలేదు. కట్టల కొద్దీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ధాటికి సంగక్కర, ఆమ్లా, డివిలియర్స్, విలియమ్సన్, కుక్, రూట్, స్మిత్... ఒకరేమిటి, ఇలా ఎంతో మంది దిగ్గజాలు చేతులెత్తేసినవారే! స్పిన్‌కు ఏమాత్రం అనుకూలించని కోల్‌కతా పిచ్‌పై మౌనం వహించిన అశ్విన్, ఇప్పుడు నాగ్‌పూర్ టెస్టులో మళ్లీ సత్తా చాటాడు. ఇదే జోరు, ఫామ్ కొనసాగిస్తే మాత్రం తాను అభిమానించే అనిల్ కుంబ్లే వికెట్ల (619) సంఖ్యకు అశ్విన్ చేరువ కావడం అసాధ్యం కాకపోవచ్చు. 54 300 వికెట్లు పడగొట్టేందుకు అశ్విన్‌కు పట్టిన టెస్టులు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీ (56 టెస్టులు) పేరిట ఉన్న రికార్డును తిరగరాస్తూ అందరికంటే వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. సరిగ్గా లిల్లీ ఈ మైలురాయిని చేరిన రోజే (1981 నవంబర్ 27) అశ్విన్ కూడా అదే ఘనత సాధించడం విశేషం. అయితే ఇన్నింగ్స్లపరంగా చూస్తే అశ్విన్ (101) కంటే వేగంగా మురళీ ధరన్ (91) 300 వికెట్లు పడగొట్టాడు. 5 భారత్ తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఐదో బౌలర్ అశ్విన్. కుంబ్లే (619), కపిల్‌దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), జహీర్ ఖాన్ (311) మాత్రమే అతనికంటే ముందున్నారు. -
వికెట్ల ధీరుడు ’రషీద్’
-
బూమ్రా అరుదైన ఘనత
హరారే: టీమిండియా యువ పేస్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన ఓవరాల్ టీ 20ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. దీంతో పాటు ఒక క్యాలెండర్ ఇయర్లో 50 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా ఘనత సాధించాడు. జింబాబ్వే తో జరిగిన తొలి టీ 20లో రెండు వికెట్లు తీసిన బూమ్రా యాభై వికెట్ల మార్కును చేరాడు. 2016లో ఇప్పటివరకూ 40 టీ 20 మ్యాచ్‌లు (అంతర్జాతీయ టీ 20, దేశవాళీ టీ 20) ఆడిన బూమ్రా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. ఈ ఏడాది బూమ్రా 17 అంతర్జాతీయ టీ 20ల్లో 21 వికెట్లు , 14 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించాడు. కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నీలో 9 మ్యాచ్‌లాడి 14 వికెట్లు తీశాడు. బూమ్రా తరువాత స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ 49 వికెట్లతో (35 మ్యాచ్‌లు) రెండో స్థానంలో, డ్వేన్ బ్రేవో 39 వికెట్లు(38 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉన్నారు. అయితే భారత్ తరపున ధవల్ కులకర్ణి రెండో స్థానంలో ఉన్నాడు. టీ 20ల్లో ధవల్ కులకర్ణి 22 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు సాధించాడు. అయితే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మాత్రం డ్వేన్ బ్రేవో పేరిట ఉంది. 2015లో బ్రేవో 47 మ్యాచ్‌లకు గాను 69 వికెట్లు సాధించాడు. అతని తరువాత సునీల్ నరైన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2014లో సునీల్ నరైన్ 66 వికెట్లు సాధించి ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఉన్నాడు.