T20 World Cup 2021: Jasprit Bumrah Became India's Leading Wicket-Taker in Men's T20Is - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన బుమ్రా...

Published Sat, Nov 6 2021 5:12 PM | Last Updated on Sat, Nov 6 2021 6:58 PM

Jasprit Bumrah becomes Indias leading wicket taker in mens In T20s - Sakshi

Jasprit Bumrah becomes Indias leading wicket taker in mens In T20s   టీమిండియా స్టార్‌ ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా రికార్డు నెలకొల్పాడు. నవంబర్‌5న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో  2 వికెట్లు తీసిన బుమ్రా, ఈ ఘనతను సాధించాడు.  అంతర్జాతీయ టీ20ల్లో  బుమ్రా మొత్తంగా 64 వికెట్లు పడగొట్టాడు.

దీంతో స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ను (63 వికెట్లు) అధిగమించాడు. తర్వాతి స్థానాల్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ (55),భువనేశ్వర్‌ కుమార్‌ (50), రవీంద్ర జడేజా (43),హార్ధిక్‌ పాండ్యా (42) ఉన్నారు. ఆదేవిధంగా మరో రికార్డును బుమ్రా ఈ మ్యాచ్‌లో సాధించాడు. స్కాట్లాండ్‌పై మెయిడిన్ ఓవర్ వేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా నిలిచాడు. 

చదవండి: Chris Gayle: సన్‌ గ్లాసెస్‌తో బరిలోకి.. క్రిస్‌ గేల్‌ రిటైర్మెంట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement