T20 WC 2021: Ravindra Jadeja Hilarious Response If AFG Loses to NZ Question - Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: ఇంకేం చేస్తాం.. బ్యాగులు సర్దేసి ఇంటికి వెళ్తాం.. ఇచ్చిపడేశావ్‌ కదా భయ్యా!

Published Sat, Nov 6 2021 9:02 AM | Last Updated on Sat, Nov 6 2021 9:22 AM

T20 WC 2021: Ravindra Jadeja Hilarious Response If AFG Loses to NZ Question - Sakshi

PC: ICC

‘Bag pack kar ke ghar jayenge’ – Ravindra Jadeja’s hilarious response Goes Viral: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. భారత్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో తన వంతు పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ జట్టు పతనాన్ని శాసించాడు. తద్వారా రవీంద్ర జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మ్యాచ్‌ గెలిచిన అనంతరం జడ్డూ మాట్లాడుతూ.. తన ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు. నవంబరు 5 నాటి ఆటను పూర్తిగా ఆస్వాదించినట్లు పేర్కొన్నాడు. ఇలా సమష్టిగా ఆడితే టీ20 ఫార్మాట్‌లో తమను ఎవరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశాడు. ఇక చమత్కారంగా మాట్లాడటంలో జడ్డూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. స్కాట్లాండ్‌పై విజయం అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు.

నమీబియాపై భారీ విజయంతో పాటు న్యూజిలాండ్‌- అఫ్గనిస్తాన్‌ మ్యాచ్‌ ఫలితంపై భారత్‌ సెమీస్‌ అవకాశాలు ఆధారపడిన నేపథ్యంలో జడేజాకు వ్యంగ్య ధోరణితో కూడిన ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ న్యూజిలాండ్‌ను అఫ్గానిస్తాన్‌ ఓడించలేకపోతే ఎలా, అప్పుడేం చేస్తారు? అని మీడియా ప్రతినిధులు అడిగారు.  

జడేజా కూడా అంతే వేగంగా కాస్త వ్యంగ్యం జోడించి  ‘అప్పుడు బ్యాగ్‌లు సర్దేసి ఇంటికి వెళ్లిపోతాం, ఇంకేం చేస్తాం’...అంటూ బదులిచ్చాడు!  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘మన సంగతి.. సత్తా వాళ్లకు తెలియదు భయ్యా.. ఇచ్చి పడేశావ్‌ కదా’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

స్కోర్లు:
స్కాట్లాండ్‌- SCO 85 (17.4)
భారత్‌- 89/2 (6.3)

చదవండి: Virat Kohli: పుట్టినరోజున సంతోషం.. జడ్డూ సూపర్‌.. నవంబరు 7న ఏం జరుగుతుందో మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement