kedar jadav
-
24 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోసిన రుతురాజ్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా తమిళనాడుతో నిన్న (అక్టోబర్ 10) ప్రారంభమైన ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో మహారాష్ట్ర ఓపెనర్, టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఉగ్రరూపం దాల్చాడు. తొలి రోజు ఆటలోనే సెంచరీ పూర్తి చేసిన ఈ పూణే కుర్రాడు.. రెండో రోజు ఆటలో మరింత చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 184 బంతులను ఎదుర్కొన్న రుతురాజ్ 24 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 195 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రుతురాజ్‌కు జతగా గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో కేదార్ జాదవ్ (56), అజిమ్ ఖాజీ (88) అర్ధసెంచరీలతో రాణించడంతో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. విఘ్నేశ్, సాయ్ కిషోర్ తలో 2 వికెట్లు, క్రిస్ట్, విజయ్ శంకర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. 49 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. జగదీశన్ (77) అర్ధసెంచరీతో రాణించగా.. బాబా అపరాజిత్ (20), బాబా ఇంద్రజిత్ (47) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ సాయ్ సుదర్శన్ డకౌటై నిరశపర్చగా.. ప్రస్తుతం ప్రదోశ్ పాల్ (33), విజయ్ శంకర్ (22) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు.. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 238 పరుగులు వెనుకపడి ఉంది. మహా బౌలర్లలో ప్రదీప్ దడే 2 వికెట్లు పడగొట్టగా.. రాజవర్ధన్ హంగేర్కర్, సత్యజిత్ బచ్చవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఐపీఎల్: ‘వాళ్లిద్దరినీ బ్యాన్ చేయండి.. తిరిగి డబ్బు చెల్లించమనండి’
Netizens Trolls SRH Players: ఐపీఎల్-2021లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంతటి ఘోరమైన ఓటమిని తట్టుకోలేకపోతున్నామని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇలా జరిగి ఉండేది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ గెలుస్తారా అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా శనివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, మనీశ్ పాండే, కేదార్ జాదవ్ వంటి వాళ్లకు ఇకనైనా స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. వాళ్లిద్దరూ ఫ్రాంఛైజీ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా పంజాబ్ కింగ్స్‌తో సెప్టెంబరు 25న జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ సేన 5 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజా ఓటమితో.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి.. 8 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. మ్యాచ్ మ్యాచ్‌కు ఆటగాళ్లను పదే పదే మార్చడం.. వార్నర్ అన్నను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక.. తుది జట్టులో చోటు కల్పించకుండా అవమానించారని, సరైన ప్రణాళిక లేకుండా ఈ సీజన్లో చేదు అనుభవాన్ని మిగిల్చారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు భారంగా మారిన మిడిలార్డర్ ‘జాతి రత్నాలు’.. మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌ను ఇకనైనా వదిలించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. వాళ్లిద్దరినీ బ్యాన్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో మనీశ్ పాండే 23 బంతుల్లో 13 పరుగులు చేయగా.. కేదార్ జాదవ్.. 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ రవి బిష్ణోయి బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఇక ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్ (కేకేఆర్‌పై 61 (నాటౌట్)) మినహా మిగతా మ్యాచ్‌లలో మనీశ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేదార్ జాదవ్ సైతం ఆశించినంతగా రాణించలేదన్న సంగతి తెలిసిందే. SRH owners after buying Kedar Jadhav :#SRHvsPBKS #KedarJadhav pic.twitter.com/mjNNoH3kaH — Vikrant Gupta (@SomewhereNowhe8) September 25, 2021 #PBKSvSRH (Bhuvi Shami Ellis) Well fought Holder you deserve to be in winning side for your tremendous all-round performance But situation of Warner Kane Saha Kedar Jadhav And Manish Pandey.... 🤣 🤣 🤣 🤣 🤣 pic.twitter.com/9v4131iI7O — Roopam Anurag (@RoopamAnurag) September 25, 2021 Manish Pandey played 4 seasons with SRH and cost them 44 crores plus many games, brand value as well. That has to be one of the costliest "CTC" kinda hiring of the IPL. — Manish (@iHitman7) September 25, 2021 We don't have just one we have 3 1.Manish pandey 2.kedar jadhav 3.vijay shankar pic.twitter.com/MOJSkFkJAz — tarakbingumalla (@taraksrinivas) September 25, 2021 -
బ్యాటింగ్ చేయడు... బౌలింగ్ చేయలేడు!
ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు ...ఈసారి ఐపీఎల్లో కేదార్ జాదవ్ ప్రదర్శన ఇది. చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా, 8 మ్యాచ్‌లలో అతనికి అవకాశం లభించింది. కానీ ఒక రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా అతడి నుంచి కనీస ప్రదర్శన కూడా రాలేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా అతడిని సరిగ్గా వాడుకోలేదు. సోమవారం మ్యాచ్‌లో మరో 14 బంతులు మిగిలి ఉన్న సమయంలో ఏడో స్థానంలో అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. అతి కష్టమ్మీద 7 బంతుల్లో 4 పరుగులు చేయగలిగాడు. ఎప్పుడూ ఫిట్నెస్ సమస్యలతో బాధపడే జాదవ్, చివరి ఓవర్లో జడేజాతో పాటు రెండో పరుగు తీయలేక కూర్చుండిపోయాడు! ఈ సీజన్లో బౌలింగే చేయని కేదార్, చురుకైన ఫీల్డర్ కూడా కాదు. యువ ఆటగాళ్లు రుతురాజ్, జగదీశన్‌లను పక్కన పెట్టి మరీ జాదవ్‌కు సీఎస్కే వరుస అవకాశాలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2018 వేలంలో ఏకంగా రూ. 7.8 కోట్లకు చెన్నై అతడిని తీసుకుంటే ఒక్కటే మ్యాచ్ ఆడి గాయంతో దూరమయ్యాడు. 2019లో కూడా 12 ఇన్నింగ్స్‌లు ఆడినా చేసింది 162 పరుగులే. ‘సీనియర్ సిటిజన్స్’ అంటూ ఇప్పటికే పలు వ్యంగ్య విమర్శలు ఎదుర్కొంటున్న చెన్నై 35 ఏళ్ల జాదవ్‌కు అవకాశాలు ఇస్తోంది. మరోవైపు గత ఏడాది 26 వికెట్లతో ‘పర్పుల్ క్యాప్’ అందుకొని చెన్నై ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన ఇమ్రాన్ తాహిర్‌కు 10 మ్యాచ్‌లలో కూడా అవకాశం దక్కలేదు. బ్రేవో గాయపడినా... అతని స్థానంలో తాహిర్‌ను తీసుకునే ఆలోచన చెన్నై చేయలేదు. -
జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధిస్తూ, ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని నేరుగా కలుసుకుని సంబరపడిపోతూ ఉంటారు ఫ్యాన్స్. వారి విజయాలను తమ గెలుపుగా భావిస్తూ, ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది ‘‘అభిమానం’’ పేరిట పిచ్చి వేషాలు వేయడమే గాకుండా హద్దులు దాటి కామెంట్లు చేస్తూ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగిపోతోంది.(చదవండి: ‘కేదార్ ఒక్కడేనా.. నువ్వూ సరిగ్గా ఆడలేదు’) క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ కాగా, సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని, బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. (చదవండి: సీఎస్కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!) దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్ చేజారిపోయిందంటూ సీఎస్కే ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు. అయితే కొంతమంది మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్యకర కామెంట్లు చేశారు. ధోని చిన్నారి కూతురు జీవాపై విషం చిమ్ముతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు సరిగ్గా ఆడనట్లయితే తనపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ధోని ఫ్యాన్స్ వీళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన కామెంట్లు చేయరంటూ విరుచుకుపడ్డారు. -
‘కేదార్ ఒక్కడేనా.. నువ్వూ సరిగ్గా ఆడలేదు’
అబుదాబి: కోల్‌కతా విసిరిన లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన చెన్నై సూపర్‌కింగ్స్ ఆటతీరు పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ కూల్ ధోని, కేదార్ జాదవ్ తమను తీవ్ర నిరాశకు గురిచేశారని, కాస్త మెరుగ్గా ఆడి ఉంటే గెలుపు సొంతమయ్యేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఎస్కేపై 10 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ కాగా, సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. (చదవండి: ఛేజింగ్‌లో చేతులెత్తేసిన ధోని బృందం) ఇక కేకేఆర్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, చెన్నై తరఫున షేన్ వాట్సన్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగిలిన వాళ్లంతా ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేశారు. ముఖ్యంగా ఆఖరి 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన తరుణంలో కెప్టెన్ ధోని క్లీన్‌బౌల్డ్ కాగా, 12 బంతులు ఎదుర్కొన్న కేదార్ జాదవ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరు కలిసి 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశారు. ఇక చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా వరుసగా 6, 4, 4 బాదినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ధోని, కేదార్ జాదవ్‌లను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బంతులు వృథా చేసి ఓటమికి కారణమయ్యారంటూ సెటైరికల్ వీడియోలు షేర్ చేస్తున్నారు. ‘‘ఇదిగో వీళ్లిద్దరూ డాట్ బాల్స్ ఇలాగే తింటారు’’అంటూ ఓ నెటిజన్ పేర్కొనగా, ‘‘ఇద్దరూ కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు, మీ పర్ఫామెన్స్ అంతకు మించి. ధోని ఏమో భారీ షాట్లు ఆడాలనుకున్నాడు. కేదార్ మాత్రం నేనొక్కడినే ఆడితే ఏం లాభం ఉంటుందిలే అన్నట్లు మిన్నకుండిపోయాడు. మ్యాచ్ తర్వాత వీళ్లిద్దరి ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి. ఇది టెస్ట్‌మ్యాచ్ బ్యాటింగ్ ’’ అంటూ మరికొంత మంది మీమ్స్ షేర్ చేశారు. ఇక ఇంకొంత మంది మాత్రం, ఈ మ్యాచ్‌లో ధోని విఫలమైన విషయాన్ని పక్కనబెట్టి, కేవలం కేదార్నే ఓటమికి బాధ్యున్ని చేయడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. Here Dhoni and Jadhav eating dot balls. #CWC19 #CWC2019 #Dhoni @ICC pic.twitter.com/gnJevsARvF — Gautham Reddy (@Sama_Gautham_) October 7, 2020 #CSKvKKR #IPL2020 Everyone blaming Kedar Jadhav for CSK's defeat. Meanwhile Dhoni - pic.twitter.com/UP24KdVtY9 — pacific_pirate🏴☠️ (@pacific_pirate_) October 7, 2020 When you don’t play well but everyone blames Kedar Jadhav for the loss pic.twitter.com/K8ovjZvSgP — Bunny (@Bunny_I_) October 7, 2020 -
సీఎస్కే జోరుకు ముంబై బ్రేక్
ముంబై: డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో ఇప్పటివరకు హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న సీఎస్కేను ముంబై ఇండియన్స్ అడ్డుకుంది. బుధవారం స్థానిక వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై 37 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 133 పరుగులకు పరిమితమైంది. కేదార్ జాదవ్(58) మినహా ఎవరూ రాణించలేకపోయారు. దీంతో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలనుకున్న సీఎస్కేకు భంగపాటు తప్పలేదు. ముంబై బౌలర్లలో మలింగ, హార్దిక్ పాండ్యాలు చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. బెహ్రన్‌డార్ఫ్ రెండు వికెట్లు తీశాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. డికాక్(4) త్వరగానే వెనుదిరిగాడు. ఇక కుదురుకున్నాడనుకున్న తరుణంలో రోహిత్(13) కూడా జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన యువరాజ్(4) తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబైను సూర్యకుమార్(59), కృనాల్(42)లు ఆదుకున్నారు. చివర్లో హార్దిక్ పాండ్యా(25; 8 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్సర్లు), పొలార్డ్(17; 7 బంతుల్లో 2 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో చహర్, మోహిత్, తాహీర్, జడేజా, బ్రేవోలు తలో వికెట్ సాధించారు. -
వన్డేల్లోనూ అదే కథ!
సుదీర్ఘ కాలంగా భారత గడ్డపై టెస్టుల్లో దండయాత్ర చేస్తూ వచ్చినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన శ్రీలంక వన్డేల్లో మాత్రం అక్కడక్కడా కొన్ని గుర్తుంచుకోదగ్గ మ్యాచ్‌లు ఆడింది.అయితే మొత్తంగా చూస్తే సొంతగడ్డపై భారత్ జోరు ముందు ద్వైపాక్షిక సిరీస్‌లలో లంక పూర్తిగా తలవంచింది. తొమ్మిది సార్లు భారత్‌తో తలపడిన ఆ జట్టు ఒక్కసారి సిరీస్‌ను ‘డ్రా’ చేసుకోవడం మినహా ప్రతీసారి ఓడింది. ఇటీవలే తమ దేశంలో కూడా టీమిండియా చేతిలో 0–5తో చిత్తుగా ఓడిన ఆ జట్టు టెస్టు సిరీస్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఇక్కడైనా పోటీ ఇస్తుందా చూడాలి. సాక్షి క్రీడా విభాగం: భారత జట్టు గత ఏడాదిన్నర కాలంలో ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడితే ఏడింటిలోనూ విజేతగా నిలిచింది. ఇదీ టీమిండియా అద్భుత ఫామ్‌కు సూచన. సరిగ్గా ఇదే సమయంలో శ్రీలంక కూడా ఎనిమిది ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడింది. అయితే వాటిలో ఒక్క ఐర్లాండ్‌పై మినహా మిగిలిన ఏడూ ఓడింది! ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ చేతుల్లో క్లీన్‌స్వీప్ కావడానికి ముందు తమ సొంతగడ్డపై జింబాబ్వే చేతిలో కూడా ఆ జట్టు సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక తాజా పరిస్థితి టెస్టులకంటే వన్డేల్లో భిన్నంగా ఏమీ లేదని అర్థమవుతోంది. కొన్ని మార్పులతో ఆ జట్టు వన్డే సిరీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు సూపర్ స్టార్ విరాట్ కోహ్లి లేకపోయినా భారత జట్టు అంతే బలంగా కనిపిస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై నెగ్గిన జట్టంతా ఇప్పుడు మరో సిరీస్ విజయానికి సన్నద్ధమైంది. తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. రేపటి నుంచి జరిగే ఈ మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా లేక శ్రీలంక కోలుకుంటుందా అనేది ఆసక్తికరం. ►9 భారతగడ్డపై భారత్, శ్రీలంక మధ్య జరిగిన వన్డే సిరీస్‌లు. ఇందులో భారత్ 8 గెలవగా... 1997–98లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ మాత్రం 1–1తో డ్రాగా ముగిసింది. ►48 భారత్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 48 వన్డేలు జరిగాయి. ఇందులో భారత్ 34 గెలిచి 11 ఓడింది. మరో 3 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. ►2 ఎనిమిది సిరీస్‌లలో భారత్ 2 సార్లు క్లీన్‌స్వీప్ చేసింది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2014లో జరిగిన సిరీస్‌లో భారత్ 5–0తో గెలిచింది. ► 155ఓవరాల్‌గా భారత్, శ్రీలంక 155 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో భారత్ 88 గెలిచి, 55 ఓడింది. మరో 11 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ తిరిగి ప్రారంభం
సాక్షి, బెంగళూరు: భారత్- ఆస్ట్రేలియా నాలుగో వన్డే మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.అంతకు ముందు వర్షంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భారత విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు అవసరం. ఇక టీమిడింయా బ్యాట్స్‌మన్ కేదార్‌జాదవ్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 6 ఫోర్లు ఒక సిక్సుతో 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక అంతకు ముందు భారత్ (పాండ్యా) నాలుగో వికెట్ కోల్పోయింది. 147 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి క్లిష్ట స్థితిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన జాదవ్‌తో పాండ్యా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ వీలిచిక్కినప్పుడుల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డు పరుగెత్తించారు. అయితే ఇద్దరు హాఫ్‌సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సందర్భంలో పాండ్యా 41(1 ఫోర్, 3 సిక్సులు) ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(18 నాటౌట్)తో జాదవ్(55 నాటౌట్) పోరాడుతున్నాడు. -
4 లో ఎవరు?
రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో వన్డే వరల్డ్ కప్ జరిగిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు భారత జట్టు తరఫున నాలుగో స్థానంలో మొత్తం 11 మంది వేర్వేరు ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈ మధ్య కాలంలో 16 జట్లు వన్డేలు ఆడగా... ఇతర జట్లతో పోలిస్తే అందరికంటే ఎక్కువ మందిని ఆ స్థానంలో పరీక్షించింది టీమిండియానే. కీలకమైన ‘టూ డౌన్’ స్థానంలో ఏ మ్యాచ్‌లో ఎవరు దిగుతారో చెప్పలేని పరిస్థితి టీమిండియాలో ఉంది. వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయాలతో పాటు చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కూడా చేరడంతో ఇప్పటి వరకు ఈ లోపం పెద్దగా బయటపడకపోయినా, మున్ముందు దీనికి పరిష్కారం చూడాల్సిన బాధ్యత కోహ్లి సేనపై ఉంది. సాక్షి క్రీడా విభాగం: వన్డేలకు సంబంధించి నాలుగో స్థానం ఎంతో కీలకం. గుడ్డిగా బ్యాట్ ఊపినట్లు కాకుండా పరిస్థితులను బట్టి ఆడటం ముఖ్యం. జట్టు ఇన్నింగ్స్ బాగా సాగుతుంటే అందులో జోరు తగ్గిపోకుండా కొనసాగించడమే కాదు... టీమ్ కష్టాల్లో ఉంటే ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆ ఆటగాడిపై ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అటు పేస్, ఇటు స్పిన్‌ను కూడా సమర్థంగా ఆడగల నైపుణ్యం నాలుగో నంబర్ ఆటగాడికి అవసరం. పూర్తి స్థాయిలో ఓపెనర్‌గా మారిన తర్వాత కూడా జట్టు అవసరాల దృష్ట్యా సచిన్ స్థాయి ఆటగాడు కూడా 38 వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడాడంటే ఆ స్థాయి ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. అయితే ఇటీవల భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్‌ను చూస్తే తాను నాలుగో స్థానంలో ఆడాల్సి ఉంటుందని ఏ ఆటగాడు కచ్చితంగా ఊహించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఈ స్థానం కోసం ప్రయత్నిస్తున్న బ్యాట్స్‌మెన్‌కు నిలదొక్కుకునేందుకు తగిన సమయమే ఇవ్వడం లేదు. వన్డేల్లో మన ముగ్గురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ధావన్, రోహిత్, కోహ్లి టాపార్డర్‌లో 1, 2, 3 స్థానాల్లో ఆడతారని తడుముకోకుండా చెప్పే అవకాశం ఉండగా... నాలుగో స్థానం మాత్రం ఎవరికీ కాకుండా పోతోంది. మనీశ్ పాండే ఫెయిల్! నాలుగో స్థానంలో ఆడించి ప్రయత్నం చేసిన 11 మందిలో ముగ్గురిపై టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అనుభవం పరంగా కెరీర్ ఆరంభంలోనే ఉన్నా... వీరిలో సరైన వ్యక్తిని ఎంచుకునే అవకాశం కనిపించింది. కేదార్ జాదవ్, మనీశ్ పాండే, లోకేశ్ రాహుల్‌లకు ఇటీవల వరుసగా అవకాశాలు లభించాయి. వీరికి లభించిన పరిమిత అవకాశాల్లోనే వారిని తీసి పడేయాల్సిన అవసరం లేదు కానీ అవకాశం లభించిన సమయంలో మాత్రం వారి నుంచి ఆశించిన ఆట కనిపించలేదు. కోల్‌కతా వన్డేలో 121/2తో దాదాపు సగం ఓవర్లు మిగిలి ఉన్న మెరుగైన స్థితిలో పాండే క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికే ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ స్థితిలో భారీ స్కోరు చేసేందుకు పాండేకు మంచి అవకాశం లభించినా... అతను పేలవమైన రీతిలో అవుటై చివరి వరుస బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. నిజానికి ఇప్పుడు జట్టుకు దూరమైనా... యువరాజ్ తన ఆఖరి 9 ఇన్నింగ్స్‌లలో నాలుగో స్థానంలో 358 పరుగులు చేసి ఆ స్థానంలో తన విలువను చూపించాడు. పాండే 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 183 పరుగులే చేయగా... జాదవ్, రాహుల్ ఆకట్టుకోలేదు. ఎవరు నిలబడతారు? 2015 ప్రపంచ కప్ తర్వాతి నుంచి ఆడిన 11 మందిలో రహానే పరిస్థితి భిన్నంగా ఉంది. సత్తా ఉన్నా అతడిని నాలుగో స్థానంలో ఆడించకుండా కేవలం బ్యాకప్ ఓపెనర్‌గా, ఎవరైనా గాయపడితేనే అవకాశం ఇస్తున్నారు. రాయుడు, దినేశ్ కార్తీక్, మనోజ్ తివారి ఆట దాదాపుగా ముగిసి పోయింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని పూర్తి స్థాయిలో నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడని వినిపించింది కానీ కోహ్లి దానిని సీరియస్‌గా పట్టించుకున్నట్లు లేదు. శ్రీలంకలో పాండేకు ముందు రాహుల్‌కు నాలుగో స్థానంలో అవకాశం ఇస్తే అతను విఫలమయ్యాడు. ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో పాండే ఫెయిలవ్వగా... ఇండోర్‌లో అనూహ్యంగా హార్దిక్ పాండ్యాకు అవకాశం లభించింది. ఆదివారం మ్యాచ్‌కు ముందు ఈ స్థానంలో పాండ్యా రెండు సార్లు విఫలమైన విషయం మరచిపోవద్దు. మనీశ్ పాండే తన కెరీర్లో ఎక్కువ భాగం మిడిలార్డర్లోనే ఆడగా, రాహుల్ కెరీర్ మొత్తం ఓపెనర్‌గానే సాగింది. 32 వన్డేలు ఆడినా ఇంకా జాదవ్‌ను నమ్మలేని పరిస్థితి ఉంది. లంకతో ఒక మ్యాచ్‌లో నంబర్ 4 అవకాశం ఇస్తే అతను దానిని ఉపయోగించుకోలేదు. 2019 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య అయితే కాదు కానీ... పూర్తిగా ఉపేక్షించాల్సిన చిన్న విషయం కూడా కాదు. కాబట్టి అందుబాటులో ఉన్నవారిలో ఒకరికి వరుసగా ఎక్కువ మ్యాచ్‌లలో అవకాశం కల్పిస్తే భారత్‌కు అవసరమైన నంబర్ 4 ఆటగాడు లభించేస్తాడు. -
అతనొక ఆణిముత్యం: గవాస్కర్
కోల్‌కతా: దాదాపు రెండేళ్ల తరువాత భారత్ జట్టులో పునరాగమనం చేసి సత్తా చాటుతున్న భారత ఆల్ రౌండర్ కేదర్ జాదవ్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలాకాలం తరువాత ఆరోస్థానంలో భారత్ కు లభించిన ఒక ఆణిముత్యమంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. చక్కటి మ్యాచ్ ఫినిషింగ్ లక్షణాలున్న జాదవ్‌కు ఆరోస్థానం అతికినట్లు సరిపోతుందంటూ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.' ఆరోస్థానం జాదవ్ ఖిల్లా. ఒక ఆణిముత్యం లాంటి క్రికెటర్‌ను భారత్ చాలాకాలం తరువాత వెతికిపట్టిందని అనుకుంటున్నా. కేదర్ జాదవ్ బంతిని హిట్ చేసే విధానం చాలా బాగుంది. కచ్చితమైన షాట్లతో భారత్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఆరోస్థానమే అతనికి సరైన స్థానం 'అని గవాస్కర్ తెలిపాడు. మరొకవైపు భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కోహ్లికి అదేమీ భారం కాదన్నాడు. కెప్టెన్సీ బాధ్యత అతని బ్యాటింగ్ పై ఎటువంటి ప్రభావం చూపదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
జయహో కేదర్ జాదవ్..
పుణె: ఇటీవల కాలంలో భారత యువ క్రికెటర్లు తమకు అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపెట్టడం లేదు. ప్రస్తుతం భారత క్రికెట్లో కీలకంగా మారిన జస్ప్రిత్ బూమ్రా, హార్దిక్ పాండ్యాలు తమకు ఇచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకుని జట్టులో సెటిల్ అయిపోయారు. మరోవైపు మరో్ యువ క్రికెటర్ మనీష్ పాండే కూడా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దాంతో జట్టులో స్థానం ఆశిస్తున్న పలువురు వెటరన్స్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఆటగాడు కేదర్ జాదవ్ ఇటీవల ఊహించని విధంగానే జట్టులోకి పునరాగమనం చేసి అతుక్కుపోయాడు. 2014 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత వన్డే జట్టులో అరంగేట్రం చేసిన కేదర్ జాదవ్‌కు ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు.తొలుత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా జాదవ్ సేవలందించాడు. దానిలో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వికెట్ కీపర్ గా పూర్తి బాధ్యతలు కూడా నిర్వర్తించాడు కూడా. అయితే మారుతున్న పరిస్థుతుల దృష్ట్యా ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్ లో అతను ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా మారాడు. ఇప్పుడు అదే ఆ క్రికెటర్ కు వరంలా మారింది. అటు బ్యాట్స్తోనూ, ఇటు బంతితోనూ ఆకట్టుకుంటున్నాడు జాదవ్. ఇప్పటివరకూ 13 వన్డేలు ఆడిన జాదవ్.. 9 ఇన్నింగ్స్ ల్లో ఆరు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్లు తీసిన ఈ క్రికెటర్.. రెండో వన్డేలో 11 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. కాగా, కీలకమైన మూడో వన్డేలో మూడు వికెట్లు తీసి కివీస్ టాపార్డర్‌కు షాకిచ్చాడు. న్యూజిలాండ్ 12.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న స్థితిలో కెప్టెన్ విలియమ్సన్ ను ఎల్బీగా పెవిలియన్ కు పంపడంతో వికెట్ల వేటను ఆరంభించిన కేదర్.. ఆ తరువాత రాస్ టేలర్, టామ్ లాధమ్లను అవుట్ చేసి అతనిలో బౌలింగ్ ప్రతిభను చాటుకున్నాడు. అయితే ఆ తరువాత ప్రస్తుతం ఇంగ్లండ్ జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు పాటు బౌలింగ్ వేసిన జాదవ్ 23 పరుగులిచ్చాడు. కాగా, వికెట్లను సాధించడంలో మాత్రం విఫలమైనా బౌలింగ్ ఎకానమీ పరంగా ఆకట్టుకున్నాడు. అశ్విన్ లాంటి ఆఫ్ స్పిన్నరే 7.87 ఎకానమీ నమోదు చేస్తే, జాదవ్ మాత్రం 5.75 ఎకానమీ రేట్ తో పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఆ తరువాత 351 పరుగుల లక్ష్య ఛేదనలో తన వంతు పాత్రను జాదవ్ సమర్ధవంతంగా నిర్వర్తించాడు. 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ తన కెరీర్ లో రెండో వన్డేలు సెంచరీ చేశాడు. ప్రధానంగా ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఒత్తిడి సమయంలో కేదర్ జాదవ్ చేసిన సెంచరీ అతని భవిష్యత్తుపై భరోసా కల్పించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లండ్ తో విజయంలో వంద శాతం న్యాయం చేసి ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రాబోయే కాలంలో టీమిండియా జట్టులో జాదవ్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశిద్దాం. జయహో కేదర్ జాదవ్.