సాక్షి, బెంగళూరు: భారత్- ఆస్ట్రేలియా నాలుగో వన్డే మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.అంతకు ముందు వర్షంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భారత విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు అవసరం. ఇక టీమిడింయా బ్యాట్స్‌మన్ కేదార్‌జాదవ్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 6 ఫోర్లు ఒక సిక్సుతో 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక అంతకు ముందు భారత్ (పాండ్యా) నాలుగో వికెట్ కోల్పోయింది. 147 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి క్లిష్ట స్థితిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన జాదవ్‌తో పాండ్యా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ వీలిచిక్కినప్పుడుల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డు పరుగెత్తించారు.
అయితే ఇద్దరు హాఫ్‌సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సందర్భంలో పాండ్యా 41(1 ఫోర్, 3 సిక్సులు) ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(18 నాటౌట్)తో జాదవ్(55 నాటౌట్) పోరాడుతున్నాడు.