జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు | Trolls On Dhoni Daughter Ziva Over CSK Lost IPL Match to KKR | Sakshi
Sakshi News home page

జీవా ధోనిపై విషం చిమ్మిన నెటిజన్లు

Published Fri, Oct 9 2020 3:30 PM | Last Updated on Fri, Oct 9 2020 5:49 PM

Trolls On Dhoni Daughter Ziva Over CSK Lost IPL Match to KKR - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్‌ మరే ఇతర క్రీడకు లేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధిస్తూ, ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని నేరుగా కలుసుకుని సంబరపడిపోతూ ఉంటారు ఫ్యాన్స్‌. వారి విజయాలను తమ గెలుపుగా భావిస్తూ, ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది ‘‘అభిమానం’’ పేరిట పిచ్చి వేషాలు వేయడమే గాకుండా హద్దులు దాటి కామెంట్లు చేస్తూ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగిపోతోంది.(చదవండి: ‘కేదార్‌ ఒక్కడేనా.. నువ్వూ సరిగ్గా ఆడలేదు’)

క్యాష్‌ రిచ్‌లీగ్‌ ఐపీఎల్‌-2020 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్‌ కాగా, సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. (చదవండి: సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌ ప్రభుత్వ ఉద్యోగులా?!)

దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్‌ చేజారిపోయిందంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్‌ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు. అయితే కొంతమంది మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్యకర కామెంట్లు చేశారు. ధోని చిన్నారి కూతురు జీవాపై విషం చిమ్ముతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు సరిగ్గా ఆడనట్లయితే తనపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ధోని ఫ్యాన్స్‌ వీళ్లకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన కామెంట్లు చేయరంటూ విరుచుకుపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement