Ziva Dhoni
-
ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న రాధిక.. తలా ఎమోషనల్ నోట్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప మహీ ఫొటోలు పోస్ట్ చేయడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మిస్టర్ కూల్‌కు 49.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు అతడు పెట్టిన పోస్టులు కేవలం 111. అయితే, తాజాగా ధోని ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ జతచేశాడు.గ్రాండ్ వెడ్డింగ్ప్రస్తుతం అతడి పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే.. భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ పెళ్లి జరిగింది. ముంబైలో జూలై 12న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్రపంచ నలుమూలల నుంచి క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.మహేంద్ర సింగ్ ధోని సైతం తన సతీమణి సాక్షి, కుమార్తె జివా ధోనితో కలిసి అనంత్- రాధికల పెళ్లికి వెళ్లాడు. బారాత్‌లో డాన్స్ చేస్తూ సందడి చేశాడు కూడా!ఇక వివాహ తంతు ముగిసిన అనంతరం ధోని దంపతులు ప్రత్యేకంగా కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నవ వధువు రాధికా మర్చంట్ నవ్వులు చిందిస్తూ ధోనిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగా.. అనంత్ చిరునవ్వుతో మహీ చేతిని పట్టుకున్నాడు.రాధికా.. అనంత్ అంటూ ధోని ఎమోషనల్ నోట్ఇందుకు సంబంధించిన ఫొటోను మహేంద్ర సింగ్ ధోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అంబానీల నూతన జంటను ఉద్దేశించి.. ‘‘రాధికా.. నీ ప్రకాశవంతమైన చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే వెలిగిపోతూ ఉండాలి.అనంత్.. మేమందరం చుట్టూ ఉన్నపుడు ఎలాగైతే నువ్వు రాధిక పట్ల ప్రేమను కురిపించావో.. ఎల్లప్పుడూ అలాగే ఉండు ప్లీజ్.మీ వైవాహిక జీవితం సంతోషాలతో నిండిపోవాలి. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. వీరేన్ అంకుల్ కోసం ఓ పాట’’ అంటూ ధోని ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు. ఈ ఫొటోకు ఇప్పటికే 8 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అందించిన జార్ఖండ్ ‘డైనమైట్’ ధోని.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.ఇక ఈ ఏడాది చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన 43 ఏళ్ల ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: Copa America 2024: కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్ View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
MS Dhoni: ప్యారిస్ టూర్లో జీవాతో పాటు ధోని- సాక్షి (ఫొటోలు)
-
ధోని కూతురు స్కూల్ ఫీజు ఎంతో తెలుసా ?
-
ధోని గారాలపట్టి జివా క్యూట్ అండ్ వైరల్ ఫొటోలు
-
MS Dhoni: ధోని గారాలపట్టి జివా స్కూల్ ఫీజు తెలిస్తే షాక్! ఆ మాత్రం ఉండదా?
MS Dhoni's Daughter Ziva: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానుల్లో కుతూహలం ఉండటం సహజం. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలతో పాటు.. పర్సనల్ లైఫ్ గురించి ఆరా తీయడం షరా మామూలే. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫ్యాన్స్‌కు ఈ పని మరింత ఈజీ అయిపోయింది. సరిలేరు నీకెవ్వరు! టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఎంఎస్ క్రీడా జీవితం తెరిచిన పుస్తకమే. అదే విధంగా.. ఈ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పర్సనల్ లైఫ్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోని.. క్రికెటర్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కీర్తి ప్రతిష్టలతో పాటు లెక్కకు మిక్కిలి డబ్బు కూడా సంపాదించాడు. కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్న మహేంద్రుడు.. 2010, జూలై 4న సాక్షి సింగ్‌ను పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. గారాలపట్టి జివా అన్యోన్య దంపతులుగా పేరున్న ఈ జంటకు 2015, ఫిబ్రవరి 6న కూతురు జివా జన్మించింది. పాప పుట్టే సమయానికి ధోని.. వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌తో ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నాడు. భారత జట్టు కెప్టెన్‌గా తన బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే బిడ్డను చూడటానికి దేశానికి తిరిగి వచ్చాడు. ఇక ఒక్కగానొక్క కూతురు జివా అంటే ధోనికి పంచప్రాణాలు. కాస్త విరామం దొరికినా తన గారాలపట్టి కోసమే సమయం కేటాయిస్తాడు తలా. కోటీశ్వరుడైన ధోని తలచుకుంటే తన కూతురిని విదేశాల్లో టాప్ మోస్ట్ స్కూల్స్‌లో చదివించగలడు. కానీ.. బిడ్డకు దూరంగా ఉండటం అతడికి ఇష్టం లేదు. రాంచిలోనే.. ఫీజు ఎన్ని లక్షలంటే! అందుకే స్వస్థలం రాంచిలోనే పేరెన్నికగన్న ప్రముఖ పాఠశాలలో జివాను చేర్పించారు ధోని దంపతులు. ఎనిమిదేళ్ల జివా ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నట్లు సమాచారం. మరి.. ఇంటర్నేషనల్ స్కూళ్లో డే స్కాలర్‌గా ఉన్న జివా కోసం ధోని ఏడాదికి చెల్లిస్తున్న ఫీజు ఎంతో తెలుసా? అక్షరాలా రెండు లక్షల డెబ్బై ఐదువేల రూపాయలు!! తామే స్వయంగా.. సదరు పాఠశాల వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం గ్రేడ్ 2-8 వరకు డే స్కాలర్స్‌కు రూ. 2,75,000, హాస్టల్లో ఉండే వాళ్లకు రూ. 4,40,000 చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ లెక్కన జివా నెల ఫీజు సుమారు 23 వేల రూపాయలు! దాదాపు వెయ్యి కోట్ల మేర ఆర్జించిన తలాకు ఈ మొత్తం లెక్కకాదు. అయితే, కూతుర్ని విదేశాల్లో చదివించడమో.. హాస్టల్లో వేయడమో కాకుండా తామే స్వయంగా బిడ్డ ఆలనాపాలనా దగ్గరుండి చూసుకోవడం విశేషమే!! విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌లో.. కాగా ధోనికి రాంచిలో విలాసవంతమైన ఫామ్‌హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే. ధోని తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. ఇక తలా కూతురిగా జివాకు ఉన్న అభిమానగణం కూడా ఎక్కువే! ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.3 మిలియన్ ఫాలోవర్లు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇక తల్లి సాక్షితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ తండ్రిని ఉత్సాహపరిచే ఈ చిన్నారి ‘చీర్ లీడర్’కు సంబంధించిన స్కూల్ ఫీజు అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ఖతం! -
ప్రేమించేటపుడు వెంటపడతారు.. పెళ్లైన తర్వాత అంతే ఇక.. ఆ రొమాన్స్: సాక్షి ధోని
MS Dhoni- Sakshi Dhoni: ‘‘ఈ విషయంలో నేను నిజాయితీగా సమాధానం చెప్తాను. నిజానికి మగవాళ్లు తొలుత తాము ప్రేమించిన అమ్మాయిల వెంట పడతారు.. పెళ్లైన తర్వాత మాత్రం.. ‘ఓకే! ఇప్పుడు ఈమె నాదైపోయింది. ఇంకెక్కడికి పోతుందిలే! అన్న ధోరణిలో ఉంటారు. అలా కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోతారు. ఇక మా విషయానికొస్తే.. రోజంతా గొడవ పడుతూనే ఉంటాం(సరదాగా).. ఎప్పుడో ఓసారి మాత్రమే రొమాన్స్ ఉంటుంది. అయితే, రొమాన్స్ జరిగినంత మాత్రాన ఆ చిన్న చిన్న గొడవలు సమసిపోవు. మళ్లీ ఆటపట్టించుకోవడాలు.. స్నేహపూర్వక సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలాగే ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ నిర్మాతగా కొత్త ప్రయాణం తమ వైవాహిక బంధం గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది. కాగా ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట ఎంఎస్ సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ బ్యానర్‌పై సాక్షి నిర్మాతగా LGM(Lets Get Married) పేరిట తొలి సినిమాను తెరకెక్కించారు. వికాస్ హసిజా ఈ మూవీకి మరో నిర్మాత. ఈ నేపథ్యంలో LGM ప్రమోషన్లలో భాగంగా సాక్షి ధోని మీడియాతో ముచ్చటించింది. 13 ఏళ్ల వైవాహిక బంధం ఈ సందర్భంగా ధోనితో ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ఆమె ఏమాత్రం తొణక్కుండా మిస్టర్ కూల్‌తో తాను ఎలా ఉంటానన్న విషయాన్ని బయటపెట్టింది. కాగా 2010, జూలై 4న సాక్షి- ధోనిల వివాహం జరిగింది. ఇటీవలే 13వ పెళ్లిరోజు జరుపుకొన్న ఈ జంటకు కూతురు జీవా సంతానం. అన్యోన్యంగా ఉంటూ 2015లో జీవాకు జన్మనిచ్చిన ధోని దంపతులు.. ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ధోనికి ఏమాత్రం విరామం దొరికినా రాంచిలోని తమ ఫామ్‌హౌజ్‌లో కుటుంబంతో గడుపుతాడు. అన్యోన్య దంపతులుగా ధోని- సాక్షిలకు పేరుంది. ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించిన ఘనత ధోనిది. ఆటగాడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తలా.. కోలీవుడ్‌తో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ఇలా మరోసారి చాటుకున్నాడు. చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించి.. ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!
Who Is Jayanti Gupta?: మహేంద్ర సింగ్ ధోని.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియా స్టార్‌గా ఎదిగాడు. భారత్‌కు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి లెజెండరీ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. మరి క్రికెటర్‌గా ధోని ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో అతడికి నైతికంగా, ఆర్థికంగా అండగా ఉన్నది ఎవరో తెలుసా?! మధ్యతరగతి కష్టాలు రాంచిలో 1981, జూలై 7 పాన్ సింగ్- దేవకీ దేవి దంపతులకు మహేంద్ర సింగ్ ధోని జన్మించాడు. అతడికి అక్క జయంతి గుప్తా, అన్న నరేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ధోని తండ్రి చిన్నపాటి ప్రభుత్వోద్యోగి. మధ్యతరగతి కుటుంబానికి ఉండే కష్టాలన్నీ పడ్డారు. అయితే, టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించినప్పటికీ ధోనికి.. చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలని, దేశం కోసం ఆడాలనే కోరిక బలంగా ఉండేది. ఈ విషయం గురించి తండ్రికి చెప్తే.. ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలు కావని ఆయన కాస్త వెనుకడుగు వేశారట. నాన్నకు నచ్చజెప్పి ఆ సమయంలో తమ్ముడికి అండగా నిలబడింది జయంతి గుప్తా. తల్లిదండ్రులకు నచ్చజెప్పి.. క్రికెటర్ కావాలనుకుంటున్న తమ్ముడి ఆశయం గురించి వాళ్లకు అర్ధమయ్యేలా చేసింది. ధోనికి ఎలాంటి సాయం కావాలన్న ముందే ఉండేది. అలా ఇంట్లో వాళ్లను ఒప్పించి తన ప్రయాణం మొదలుపెట్టిన ఎంఎస్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వెయ్యి కోట్లకు అధిపతి! మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొంది అభిమానులతో జేజేలు కొట్టించుకున్నాడు. ఆటగాడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి దాదాపు వెయ్యి కోట్ల(DNA నివేదిక ప్రకారం)కు అధిపతి అయ్యాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మకుటం లేని మహారాజుగా కొనసాగుతూ ఏకంగా ఐదుసార్లు జట్టును విజేతగా నిలిపాడు. అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఏడాదికి దాదాపు 50 కోట్ల రూపాయలు(DNA రిపోర్టు ప్రకారం) వెనకేస్తున్నాడు. ఇటీవలే సినీ రంగంలోనూ ప్రవేశించాడు. ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు. అన్న, బావ, ధోని, అక్క మరి అక్క పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి క్రికెట్ లెజెండ్‌ను తొలినాళ్ల నుంచే ప్రోత్సహించిన అక్క జయంతి గుప్తా.. లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆమె రాంచిలోని పబ్లిక్ స్కూళ్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. బావ కూడా ధోని కోసం ఇక ధోనికి ప్రాణ స్నేహితుల్లో ఒకరైన గౌతం గుప్తా అనే వ్యక్తిని జయంతి పెళ్లి చేసుకుంది. ధోని దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో జయంతితో పాటు అతడు కూడా అండగా నిలబడినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా ధోని బయోపిక్‌లో జయంతి గుప్తా పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఎంఎస్ అన్న గురించి మాత్రం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కాగా ధోని సాక్షిని వివాహమాడగా.. వీరికి కూతురు జివా జన్మించింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
Did MS Dhoni Intentionally Choose To Not Show His Elder Brother In Biopic?: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినగానే.. మిస్టర్ కూల్.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన లెజెండరీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన తలా... ఠక్కున గుర్తుకువచ్చే విషయాలివే! భారత క్రికెటర్‌గా శిఖరాగ్రాలను అధిరోహించిన ధోని వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు! అదేంటి.. మేము కూడా ధోని బయోపిక్.. ఎంఎస్ ధోని:ది అన్‌టోల్డ్ స్టోరీ చూశాం! ధోని తల్లిదండ్రులు పాన్‌సింగ్, దేవకీ దేవి, ధోని సోదరి జయంతి గుప్తా గురించి తెలుసు! ఇక మహేంద్రుడి భార్య సాక్షి సింగ్, కుమార్తె జీవా ధోని గురించి తెలిసిందే! ఇంతకంటే.. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముందనుకుంటున్నారా?! ధోని తోబుట్టువు! ఉందండీ!.. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ధోని మరో తోబుట్టువు, సోదరుడి గురించి ప్రస్తావించలేదు. అవును.. ధోనికి ఓ అన్న ఉన్నాడు. అతడి పేరు నరేంద్ర సింగ్ ధోని. కొన్నాళ్ల క్రితం ధోని రాంచిలోని తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో దిగిన ఫొటోను నెట్టింట వైరల్ అయింది. అతడు నరేంద్రేనా? ఐపీఎల్-2023 టైటిల్ గెలిచిన తర్వాత నరేంద్ర.. ధోనిని కలిశాడని ది క్రిక్టైమ్ వెల్లడించింది. ధోని గ్యారేజీ టూర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న తరుణంలో ఈ ఫొటోలను తెరమీదకు తెచ్చారు కొంతమంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి దాదాపు వెయ్యి కోట్లకు అధిపతిగా ఎదిగిన ధోని.. అన్న గురించి మాత్రం ఎందుకు ఎప్పుడూ ప్రస్తావించలేదో అర్థం కావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది! అతడి పరిస్థితి చూస్తుంటే దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందని సానుభూతి చూపిస్తున్నారు. బయోపిక్‌లోనూ అతడి ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎంఎస్ అభిమానులు కూడా ఇందుకు దీటుగానే బదులిస్తున్నారు. నరేంద్ర సింగ్ ధోని గతంలో టెలిగ్రాఫ్ ఇండియా పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ట్రోల్స్‌కు సమాధానమిస్తున్నారు.\ తనకు నేను సాయం చేయలేదు.. అయినా ‘మహీ బాల్యం, యువకుడిగా ఉన్నపుడు కష్టాలు పడ్డ సమయంలో నేను తనకు సాయం చేసిందేమీ లేదు.. ఈ ప్రపంచానికి ఎంఎస్డీగా పరిచయమవడంలో కూడా నా ప్రమేయమేమీ లేదు. నిజానికి ఈ సినిమా మహీ గురించి.. అతడి కుటుంబం గురించి కాదు! ఇరికించాల్సిన అవసరం లేదు మహీ నాకంటే పదేళ్లు చిన్నవాడు. తను మొదటిసారి బ్యాట్ పట్టుకునే సమయానికి నేను రాంచి నుంచి వెళ్లిపోయాను. ఉన్నత విద్య కోసం అల్మోరాలోని కుమాన్ యూనివర్సిటీకి వెళ్లిపోయాను. అయితే, మహీకి కొన్ని విషయాల్లో నేను నైతికంగా అండగా ఉన్నప్పటికీ అవన్నీ సినిమాలో ఇరికించాల్సిన అవసరం లేదు’’ అని నరేంద్ర సింగ్ ధోని నాటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. రాజకీయ నాయకుడిగా కాగా నరేంద్ర సింగ్ ధోనికి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో అతడు సమాజ్‌వాదీ పార్టీలో చేరినట్లు సమాచారం. అంతకుముందు బీజేపీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2007లో వివాహం చేసుకున్న నరేంద్రకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. 42 ఏళ్ల ధోని ఐపీఎల్-2024లోనూ బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి. చదవండి: 20 లక్షలు పెట్టాడు.. గూస్బంప్స్ వచ్చాయి! ఏకంగా కోటి 70 లక్షలు.. కళ్లెమ్మట నీళ్లు.. సూర్యకు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలికా?: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్ -
Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే!
Ziva Singh Dhoni Praying For CSK Win Against DC Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోని కుమార్తె జీవా ధోని సింగ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవా స్టేడియంలో కనిపిస్తే చాలు కెమెరాలన్నీ తన వైపే తిరుగుతాయి. తన చిలిపి చేష్టలు, మైదానంలో ఉన్న తండ్రిని ఉత్సాహపరుస్తున్న దృశ్యాలను ఒడిసిపడతాయి. ప్రస్తుతం జీవా ధోనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా... చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తండ్రి ఆటను చూడటానికి తల్లి సాక్షితో కలిసి జీవా స్టేడియానికి వచ్చింది. చెన్నై విజిల్ పొడూ అంటూ ఉత్సాహపరిచేందుకు వీలుగా విజిల్ కూడా వెంట తెచ్చుకుంది. కానీ, ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధోని స్లో బ్యాటింగ్ అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో రెండు చేతులు జోడించి కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న జీవా ఫొటో వైరల్ అవుతోంది. ‘‘అయ్యో పాపం జీవా... డాడీ జట్టు ఓడిపోయింది. మరేం పర్లేదు.. నీ ప్రార్థనలు ఫలించి... ఫైనల్ మ్యాచ్‌లో గెలుస్తారులే’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని సేన 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్కోర్లు: చెన్నై సూపర్‌కింగ్స్- 136/5 (20) ఢిల్లీ క్యాపిటల్స్- 139/7 (19.4) Cute, Ziva Praying for CSK win ❤️#IPL2021 #DCvCSK pic.twitter.com/P5ZwB1al6M — Thyview (@Thyview) October 4, 2021 View this post on Instagram A post shared by MS Dhoni FC 🔵 (@bleed.dhonism) -
సాక్షి, జీవాలతో డ్యాన్స్ చేసిన ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి ఓ పార్టీలో డ్యాన్స్ చేశాడు. కుటుంబంతో పాటు వేడుకకు హాజరైన సన్నిహితులతో కలిసి సెప్టులేస్తూ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. "ఇది చూసేటప్పుడు మనం నవ్వకుండా ఉండగలమా? ఖచ్చితంగా కాదు" అని క్యాప్షన్ జతచేసింది. ఈ వీడియో ధోని అభిమానులు, నెటిజన్లను ఆకట్టకుంటోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఫ్రాంఛైజ్ క్రికెట్లో కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సీఎస్కేకు సారథ్యం వహిస్తునన్న ధోని.. 39 ఏళ్ల ధోని 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. కాగా ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. సీఎస్కే 2010, 2011, 2018 సీజన్లలో మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది. 2020 వరకు ఆడిన ప్రతీ సీజన్లో దాదాపుగా ప్లేఆఫ్స్ చేరుకుంది. కానీ 13వ సీజన్లోనే మొదటిసారిగా ప్లేఆఫ్ చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో ధోని రిటైర్ అవుతాడంటూ ఊహాగానాలు వినిపించగా.. "పసుపు జెర్సీలో ఈ మ్యాచ్ మీ చివరిది కదా?" అని విలేకరులు అడిగినపప్పుడు "ఖచ్చితంగా కాదు" అని ధోనీ గట్టిగా స్పందించాడు. 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4632 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు(136.75 స్ట్రైక్ రేట్) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల స్థానంలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. Can we stop ourselves from smiling while watching this? Definitely Not. 😊 #WhistlePodu #Yellove @msdhoni @SaakshiSRawat 🦁💛 pic.twitter.com/cuD8x3J7oS — Chennai Super Kings (@ChennaiIPL) November 26, 2020 -
ధోనికి ఇచ్చే గౌరవం ఇదేనా: అఫ్రిది
ఢిల్లీ: ధోని కూతురు జీవాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయమై పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. 'ధోని, అతని కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. అతడు భారత క్రికెట్‌ను ఉన్నత స్థాయిని తీసుకెళ్లాడు. తన జర్నీలో సీనియర్స్, జూనియర్స్ ఆటగాళ్లను కలుపుకొని ముందుకు వెళ్లాడు. ధోని పట్ల ఈ విధంగా ప్రవర్తించడం గౌరవం అనిపించుకోదు' అని షాహిద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించాడు. ప్లేయర్స్ సరిగ్గా ఆడకపోతే కుటుంబ సభ్యులను విమర్శించడం ఏంటని మండిపడ్డాడు. Shahid Afridi "I don't know what sort of threats were directed at MS Dhoni & his family but it's not right & shouldn't happen. Dhoni's the person who has taken Indian cricket to new heights. He's taken junior & senior players along this journey & doesn't deserve such treatment" — Saj Sadiq (@Saj_PakPassion) October 11, 2020 కోలకతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపొయిన విషయం తెలిసిందే. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: జీవాపై కామెంట్లు చేసిన బాలుడు అరెస్ట్) -
జీవాపై అభ్యంతరకర వ్యాఖ్యలు: బాలుడు అరెస్ట్
అహ్మదాబాద్: మహేంద్ర సింగ్ ధోని కూతురు జీవా ధోనిపై అసభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు గుజరాత్‌లోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అదుపులోని తీసుకొని విచారించగా, ఆ పోస్ట్ తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం నిందితుడిని వారికి అప్పగిస్తామని కచ్ జిల్లా (వెస్ట్) ఎస్పీ సౌరబ్ సింగ్ తెలిపారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని, మళ్లీ సరిగ్గా ఆడకపోతే జీవా ధోనిపై అత్యాచారం చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. పలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు దీన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. (జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు) (చదవండి: రాయల్స్ రైజింగ్..) -
జీవా ధోనికి భద్రత పెంపు
-
జీవా ధోనికి భద్రత పెంపు
రాంచీ : ఎంఎస్ ధోని గారాల పట్టి జీవాపై కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్‌గా స్పందించిన జార్ఖండ్ ప్రభుత్వం శనివారం అప్రమత్తమైంది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని.. ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. దీంతో పాటు రాంచీలోని ధోని ఇంటి వద్ద జీవాకు రక్షణగా అదనపు భద్రతను కల్పిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ కాగా, సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని, బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. (చదవండి : జీవా ధోనిపై విషం చిమ్మిన నెటిజన్లు) దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్ చేజారిపోయిందంటూ సీఎస్కే ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు. అయితే కొంతమంది మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్యకర కామెంట్లు చేశారు. ధోని చిన్నారి కూతురు జీవాపై విషం చిమ్ముతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు సరిగ్గా ఆడనట్లయితే తనపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ధోని ఫ్యాన్స్ వీళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన కామెంట్లు చేయరంటూ విరుచుకుపడ్డారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించి శుభారంభం చేసినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. మొదటి మ్యాచ్ విజయం తర్వాత వరుసగా హాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన చెన్నై.. కింగ్స్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఫామ్‌లోకి వచ్చినట్లు కనబడింది. కానీ కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. కాగా సీఎస్కే నేడు(శనివారం) దుబాయ్ వేదికగా ఆర్సీబీతో తలపడనుంది. (చదవండి : ఎన్నాళ్లకెన్నాళ్లకు దినేశ్ కార్తీక్..) -
జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధిస్తూ, ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని నేరుగా కలుసుకుని సంబరపడిపోతూ ఉంటారు ఫ్యాన్స్. వారి విజయాలను తమ గెలుపుగా భావిస్తూ, ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది ‘‘అభిమానం’’ పేరిట పిచ్చి వేషాలు వేయడమే గాకుండా హద్దులు దాటి కామెంట్లు చేస్తూ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగిపోతోంది.(చదవండి: ‘కేదార్ ఒక్కడేనా.. నువ్వూ సరిగ్గా ఆడలేదు’) క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ కాగా, సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని, బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. (చదవండి: సీఎస్కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!) దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్ చేజారిపోయిందంటూ సీఎస్కే ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు. అయితే కొంతమంది మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్యకర కామెంట్లు చేశారు. ధోని చిన్నారి కూతురు జీవాపై విషం చిమ్ముతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు సరిగ్గా ఆడనట్లయితే తనపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ధోని ఫ్యాన్స్ వీళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన కామెంట్లు చేయరంటూ విరుచుకుపడ్డారు. -
కూతురు ముచ్చట తీర్చిన ధోని
-
కూతురు ముచ్చట తీర్చిన ధోని
డెహ్రాడూన్ : టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని మంచు కొండల్లో కుటుంబంతో కలిసి విహరిస్తున్నాడు. అటు క్రికెట్‌కు ఇటు కుటుంబంతో గడపడానికి సమ ప్రాధాన్యమిచ్చే ధోని.. తాజాగా డెహ్రాడూన్ యాత్రకు వెళ్లాడు. తన అద్భుతమైన ఆటతోనే కాకుండా.. కూతురు చిన్నారి జీవాతో ఆడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను అలరిస్తుంటాడు ధోని. ఇక డెహ్రాడూన్‌లో.. కూతురు జీవా మంచు మనిషిని రూపొందిస్తుండగా.. ఆమెకు సాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోని అభిమానుల గ్రూప్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం ధోని ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తండ్రీ కూతుళ్ల అనుబంధంపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ధోని సూపర్ డాడ్’ అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు. -
జీవాతో కలిసి ధోనీ బిజీ, వైరల్ వీడియో
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఇటీవలే తన కార్ల లిస్టులో ‘నిసాన్ జొంగా’ జీప్‌ను కూడా చేర్చేశాడు మిస్టర్ కూల్. ఇక కూతురు జీవా కూడా తండ్రి బాటలోనే వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ వీడియో చుస్తుంటే. దీపావళి సందర్భంగా ధోని.. కూతురు జీవాతో కలిసి తన కొత్త జీప్‌ను శుభ్రం చేస్తున్న వీడియోను ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ప్యాంట్‌ను పైకి మడుచుకుని.. చేతిలో వాషింగ్ క్లాత్‌తో ఉన్న ధోని, జీవాలను చూస్తుంటే వారిద్దరు పనిలో చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పెద్ద పనికి.. చిన్న సాయం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది’ అనే టైటిల్‌తో షేర్ చేసిన వీడియోకి.. గంటలోనే దాదాపు 7 లక్షల వ్యూస్ రాగా వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ‘మేము కూడా మీకు సాయం చేస్తాం ప్లీజ్, నిరాండబరత చాలా ఉత్తమమైంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A little help always goes a long way specially when u realise it’s a big vehicle A post shared by M S Dhoni (@mahi7781) on Oct 24, 2019 at 3:02am PDT అలాగే ఎంఎస్ ధోనీ భార్య సాక్షి కూడా జీవా జొంగా కారుపై కుర్చుని నవ్వుతున్న ఫోటోతో పాటు, కారుపై ఉన్న చిన్ననాటి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘అవర్ డాడ్స్ రైడ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన పోస్ట్‌కి టన్నుల కొద్ది హార్ట్ ఎమోజీలు రాగా ‘జీవా అచ్చం తల్లీ సాక్షీ’ లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అయితే మిస్టర్ కూల్ ‘నిస్సాన్ జోంగా’పై తన స్వస్థలం రాంచీలో చక్కర్లు కొట్టిన వార్త కొన్ని రోజుల పాటు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ‘నిస్సాన్ జోంగా’ జీప్‌ను భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తయారు చేయించినది కావడంతో ధోని దానిని వాడటం ఆపేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram ❤️❤️❤️❤️❤️💋💋💋 our #dadsride ! A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Oct 24, 2019 at 5:05am PDT -
ధోని చేత కేక్ కట్ చేయించిన జీవా!
లీడ్స్ : టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన 38వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరుపుకున్నాడు. తన గారాల పట్టి జీవా ధోనియే స్వయంగా దగ్గరుండి మహేంద్రుడి పుట్టినరోజు వేడుకను చేసింది. తండ్రి చేయి పట్టుకొని మరి కేక్ కట్ చేయించింది. ఈ బర్త్‌డే సంబరాలకు సంబంధించిన ఫొటోలను ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. కేదార్‌జాదవ్, ఆల్‌రౌండర్ పాండ్యాలు ధోనిని కేకులో ముంచెత్తారు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా, ధోనితో కలిసి హెలికాప్టర్ షాట్‌ను ఇమిటేట్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. టీ20 ప్రపంచకప్.. వన్డేప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్‌గా... దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన మహేంద్రుడికి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
భారత్ విజయం జివా-పంత్ సెలబ్రేషన్స్..!
-
జోష్‌ఫుల్‌గా జివా-పంత్ సెలబ్రేషన్స్..!
ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌ను భారత్ 86 పరుగులతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించడంతో ఇటు మైదానంలో, అటు దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. ఈ సంబరాల్లో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోనీ తనయ జివా ప్రత్యేకంగా నిలిచారు. మ్యాచ్ ముగియగానే ఈ ఇద్దరు భారత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ కేకలు వేశారు. ఫన్నీగా టీమిండియా విజయాన్ని పంత్-జివా సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ భారత జట్టులోకి లేకపోయినప్పటికీ.. ఓపెనర్ శిఖర్ ధావన్‌కు గాయం కావడంతో స్టాండ్‌బై ఆటగాడిగా అతను ఇంగ్లండ్‌కు వచ్చాడు. అతన్ని ఇంకా అధికారికంగా భారత జట్టులోకి తీసుకోలేదు. జివా-సైఫ్ ఫొటో వైరల్ దాయాదులు భారత్-పాకిస్థాన్ పోరు సందర్భంగా మాంచెస్టర్‌లో పలువురు సినీ స్టార్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్, సైఫ్ అలీఖాన్, మంచులక్ష్మి, రకుల్‌ప్రీత్ సింగ్ తదితర స్టార్లు ఈ మ్యాచ్‌లో హల్చల్ చేశారు. ప్రస్తుతం లండన్‌లో ‘జవానీ జానేమన్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సైఫ్ అలీఖాన్, తన కోస్టార్ అలైయా ఫర్నిచర్వాలాతో కలిసి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. మ్యాచ్‌లో కోహ్లి సేనను ఉత్సాహపరుస్తూ కేరింతలు కొట్టారు. మ్యాచ్ అనంతరం మహేంద్రసింగ్ ధోనీ కూతురు జివా ధోనీతో సైఫ్ ఫొటో దిగాడు. క్యూట్ జివాతో సైఫ్ దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
జీవాధోని క్యూట్ ఎక్స్ప్రెషన్స్
లండన్ : భారత క్రికెట్ మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోనీ గారాల పట్టీ జీవాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యూట్ ఎక్స్ప్రెషన్తో ముద్దు ముద్దు మాటలతో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది జీవా. తల్లి సాక్షి ధోని సాయంతో ఆమె సొంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా హ్యాండిల్ చేస్తోంది. ధోని మైదానంలో ఉన్నప్పుడు తప్పక మ్యాచ్‌ను వీక్షించే ఈ లిటిల్ స్టార్ తాజా ప్రపంచకప్ నేపథ్యంలోనూ తల్లితో కలిసి ఇంగ్లండ్ పయనమైంది. ఎయిర్‌పోర్టులో దిగిన ఓ ఫొటోను ‘ట్రావెల్ టైమ్స్’ అని పోస్టు చేసింది. (కమాన్ పప్పా.. జీవాధోని హల్చల్) ఇక బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ధోని 34 పరుగులు జోడించి జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. ఇక ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జీవా ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌పై నెటిజన్లు ముచ్చడపడ్డారు. ‘లిటిల్ స్టార్ డాడీ ఆటను ఎంజాయ్ చేస్తూ చీర్‌లీడర్‌గా మారారు’ అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, జీవా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు 98 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. (పంత్‌కు పాఠాలు నేర్పిస్తున్న జీవా) -
ధోనీ.. నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తా ..!
హైదరాబాద్ : కింగ్స్ పంజాబ్ యజమాని చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్లో భాగంగా గత ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించడంపై ప్రీతిజింటా ఆనందం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం ధోనితో కరచాలనం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె.. "కెప్టెన్ కూల్‌కి చాలామంది అభిమానులు ఉన్నారు. వారిలో నేనొకరిని. అయితే, ఈ మధ్య కాలంలో నేను ధోనితో పాటు ఆయన కూతురు జీవాకు కూడా ఫ్యాన్‌ని అయ్యా. నా దృష్టి ఆమెపై పడింది. జీవా విషయంలో జాగ్రత్తగా ఉండమని ధోనీని హెచ్చరిస్తున్నా. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను" అని ట్విటర్లో సరదా వ్యాఖ్యలు చేశారు. కాగా, ధోని.. ప్రీతి మైదానంలో దిగిన ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలు, ట్విటర్లో 3.3 లక్షల లైకులు రావడం విశేషం. ఐపీఎల్ 12వ సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోని సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సమానంగా 12 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్‌రేట్ (-0.251) తక్కువగా ఉండటంతో కింగ్స్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఇంటిదారి పట్టింది. Captain cool has many fans including me, but off-late my loyalties are shifting to his little munchkin Ziva. Here I’m telling him to be careful - I may just kidnap her 😜 Now it's time for you guys to Caption THIS photo...#Ting pic.twitter.com/bD1ADSXopc — Preity G Zinta (@realpreityzinta) May 7, 2019 -
కమాన్ పప్పా.. జీవాధోని హల్చల్
న్యూఢిల్లీ : ఐపీఎల్ వచ్చిందంటే చాలు భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని అభిమానులకు పండుగే పండుగ. మైదానంలో ధోని అలరిస్తే.. ప్రేక్షకుల గ్యాలరీలో అతని కూతురు జీవా తన అల్లరితో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అయిపోయే వరకు ఆమె గురించి సోషల్ మీడియా ముచ్చటించాల్సిందే.. టీవీ చానళ్లు, వెబ్‌సైట్స్ వార్తలు రాయాల్సిందే. మొన్న ఆరు భాషల్లో సమాధానం చెప్పి అబ్బుర పరిచిన జీవా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన అల్లరితో మరోసారి వార్తల్లో నిలిచింది. చదవండి : ఆరు భాషల్లో అదరగొడుతున్న జీవా ధోని బ్యాటింగ్ చేస్తుండగా గ్యాలరీలో ఉన్న జీవా.. ‘పప్పా.. కమాన్ పప్పా’ అని బిగ్గరగా అరుస్తూ తండ్రిని ప్రోత్సహించింది. ఈ వీడియోను చెన్నైసూపర్ కింగ్స్ తన అధికారిక ట్విటర్లో పంచుకోగా తెగ వైరల్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో ఘనవిజయం సొంతం చేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ధోని(35 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జాదవ్ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. చదవండి : ఢిల్లీలోనూ ‘సూపర్ కింగ్స్’ -
ఆరు భాషల్లో అదరగొడుతున్న జీవా
చెన్నై సూపర్ కింగ్స్ సారథి(సీఎస్కే) ఎంఎస్ ధోని సోషల్ మీడియాలో కనిపించేదే చాలా తక్కువ. ఒకవేళ అలా కనిపించినా.. ధోనితో పాటు అతని కూతురు జీవా కూడా ఉండాల్సిందే. తన ముద్దుల కూతురుతో కలిసి ధోనీ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరి అల్లరికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు ధోని. తాజాగా ఈ తండ్రికూతుళ్లిద్దరికి సంబంధించిన మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ధోని. ఈ వీడియోలో జీవా.. ధోని అడిగిన ఓ ప్రశ్నకు ఆరు భాషల్లో సమాధానం చెప్పి అదరగొట్టింది. ధోనీ తన కూతుర్ని ‘హౌ ఆర్ యూ’(ఎలా ఉన్నావు) అని తమిళ్, బెంగాలీ, గుజరాత్, పంజాబీ, భోజ్‌పూరి, ఉర్దూ భాషల్లో అడుగుతాడు. జీవా కూడా ధోని ఏ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం చెప్పి ఔరా అనిపించుకుంది. View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) on Mar 24, 2019 at 6:19am PDT ఇకపోతే ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా ఇక్కడి చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలిచింది. -
అందుకే ధోని అంటే ఇష్టం: సన్నీ లియోన్
ముంబై: టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోని అంటే తనకు చాలా ఇష్టమని అంటున్నారు బాలీవుడ్ నటి సన్నీ లియోన్. ఓ కార్యక్రమంలో ‘మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు?’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు ధోని పేరు చెప్పారు సన్నీ. ఎందుకు? అని అడగ్గా.. ధోని ఫ్యామిలీ పర్సన్ అని ఆయనలో తనకు నచ్చే విషయం అదేనని తెలిపారు. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం ఏదో రకంగా సమయం కేటాయించుకుంటారని సన్నీ లియోన్ పేర్కొన్నారు. కుమార్తె జీవాతో కలిసి దిగే ఫొటోలంటే తనకు చాలా ఇష్టమని, చాలా క్యూట్‌గా ఉంటాయని పేర్కొన్నారు. చివరిగా ‘తేరా ఇంత్‌జార్’ అనే చిత్రంతో సన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2017లో విడుదలైన ఆ సినిమాలో అర్బజ్ ఖాన్‌తో కలిసి సన్నీ నటించారు. ప్రస్తుతం ఆమె మళయాళం సినిమా ‘రంగీలా’ తో పాటు తమిళ సినిమా ‘వీరమదేవి’లో నటించనున్నారు. -
బీచ్‌లో కూతురితో సందడి చేసిన ధోని
-
ఇసుక తిన్నెల్లో చిన్నపిల్లాడిలా ధోని..!
చెన్నై: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బిజీగా ఉంటే... మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని మాత్రం భారత్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో 10 రోజుల తరువాత వన్డేలు, టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనున్న ధోని.. తాజాగా చెన్నై బీచ్‌లో సందడి చేశాడు. తన కుటుంబంతో సహా వచ్చిన ధోని.. కూతురు జీవాతో కలిసి మెరీనా బీచ్‌లో కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా అక్కడి ఇసుకలో గూళ్లు కట్టాడు. సొరంగం లాంటి గొయ్యి తీయడమే కాకుండాఅందులోకి తన కూతురిని దింపాడు. ఆ క్షణంలో తను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి బీచ్‌లో కూతురితో కలిసి ధోని ఆడుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది. ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అనేది చాలా మధురంగా ఉంటుంది. ఆ క్రమంలోనే చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి కూడా మనల్ని అప్పుడప్పుడు తట్టి లేపుతూ ఉంటాయి కూడా. అలా ఇసుకలో ఆడుకున్న ధోని తన చిన్ననాటి జ్ఞాపకాన్ని కూతురితో కలిసి ఇలా నెమరవేసుకున్నాడు. ఇదే విషయాన్ని క్యాప్షన్ రూపంలో చెప్పిన ధోని ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ధోని-జీవాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నేను బస్సులో ఉంటాను. నాకు ఇల్లు లేదు: ధోని
-
నాకు ఇల్లు లేదు : ధోని
రాంచీ : టెస్ట్ సిరీస్‌తో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లిసేన బిజీగా ఉండటంతో మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తనకు లభించిన విరామాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నాడు. పెళ్లి విందులు.. బర్త్‌డే పార్టీలు, షాపింగ్‌లతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ చిన్నారితో ధోని ముద్దుగా ముచ్చటించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరుకు తీసుకుని మరి ఎత్తుకున్న ధోని.. ‘మీరు ఎక్కడ ఉంటారని ఆ పాప ముద్దుగా అడిగిన ప్రశ్నకు.. నేను బస్సులో ఉంటాను. నాకు ఇల్లు లేదు’ అని సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోను ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. ధోనికి ఇల్లు అవసరం లేదని.. అతన్ని గుండెల్లో ఉంచుకున్నామని అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ధోని ఇటీవల తన కూతురు జీవాతో కలిసి డ్యాన్స్ చేసే వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోలో జీవా ధోనికి డ్యాన్స్ నేర్పించడం గమనార్హం. విరామం దొరికితే సతీమణి సాక్షిసింగ్, కూతురు జీవాలతో గడిపే ధోని ఈ సారి కూడా తన పూర్తి సమయాన్ని వారికే కేటాయించాడు. దీంతో వీరు ఏది చేసినా నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. జనవరి12న ఆసీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌తోనే ఈ రాంచీ క్రికెటర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. -
ధోని గారాలపట్టి నోట తమిళ మాట
ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూతురు జీవా మూడేండ్ల ప్రాయంలోనే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. జీవా పలు సార్లు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. క్యూట్ క్యూట్‌గా డ్యాన్స్‌లు వేయడం,ముద్దు ముద్దు మాటలు మాట్లాడడం, తండ్రి మ్యాచ్ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనితో పాటు గ్రౌండ్లో డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తూ... జీవా నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో జీవా ధోనికి రెండు భాషల్లో శుభాకాంక్షలు చెబుతోంది. మొదటగా మాతృభాష బోజ్‌పురి భాషలో, తర్వాత తమిళ భాషలో ఇరువురు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వీడియోని ధోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది. ఇంత చిన్న వయసులో రెండు భాషలు మాట్లాతుందని నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. -
నాన్న... నీ వయసు పైబడుతోంది!
కార్డిఫ్: భారత మాజీ కెప్టెన్ ధోని శనివారం 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఒకటి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా వచ్చింది. ‘నీ వయసుపైబడుతోంది’ అని..! ఈ మాట ధోని గారా లపట్టి జీవా నోటి నుంచి వచ్చింది. ‘హ్యాపీ బర్త్‌డే పాపా... హ్యాపీ బర్త్‌డే. యూ ఆర్ గెట్టింగ్ ఓల్డర్’ (వయసుపైబడుతోంది నాన్న) అని జీవా పాడుతూ విష్ చేసింది. ప్రస్తుత జట్టు సహచరుల వీడియో శుభాకాంక్షలతో పాటు జీవా చిట్టిపొట్టి పలుకుల్ని బీసీసీఐ వెబ్సైట్లో ఉంచారు. ఈ వేడుకల్లో కోహ్లి, అనుష్క శర్మ, సహచరులు పాల్గొన్నారు. -
ధోని బర్త్‌డే: బీసీసీఐ సర్ప్రైజ్!
హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్.. వన్డేప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఈ దిగ్గజ క్రికెటర్ నేడు 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అంతే భారత క్రికెట్ నియంత్రంణ మండలి (బీసీసీఐ) అతని బర్త్‌డే సందర్భంగా ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ‘స్పెషల్ విషెస్ ఫర్ ఏ స్పెషల్ మ్యాన్’ అంటూ ఓ వీడియోతో శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ వీడియోలో ధోని కూతరు జీవాతో విషెస్ చెప్పించడం ప్రత్యేకం. ‘ఐ లవ్ వ్యూ పప్పా హ్యాపీ బర్త్ డే అంటూ’... అంటూ సరదాగా జీవా విషెస్ చెప్పింది. జీవాతో పాటు టీమిండియా ఆటగాళ్లు కోహ్లి, రోహిత్, ధావన్, కార్తీక్, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్లు ఈ జార్ఖండ్ డైనమైట్‌కు విషెస్ తెలియజేశారు. అతనితో ఉన్న మధుర క్షణాలను నెమరవేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు చూసేయండి! చదవండి: ధోని బర్త్‌డే స్పెషల్.. పదిలం నీ మెరుపులు! ఓం ఫినిషాయ నమః : ధోని బర్త్‌డేపై సెహ్వాగ్ -
స్పెషల్ విషెస్ ఫర్ ఏ స్పెషల్ మ్యాన్
-
నాకొక చీర్ లీడర్ దొరికిందోచ్: పాండ్యా
న్యూఢిల్లీ : తనకోచీర్ లీడర్ దొరికిందంటున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. శుక్రవారం పసికూన ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఈ యువ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 32 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ బరోడా ఆటగాడిన విధ్వంసమైన బ్యాటింగ్‌కు టీమిండియా రెండొందల మార్కును దాటగలిగింది. అంతకుముందు కెవిన్ ఓబ్రైన్ ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్(70), రోహిత్ శర్మ(0)లను ఔట్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు. ఒకానొక దశలో టీమిండియా 200 పరుగుల మార్క్ దాటుతుందా లేదా అనిపించింది. కానీ ఆఖర్లో పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి ఓవర్లో రెండు సిక్స్‌లు, ఫోర్ బాదడంతో భారత్ అలవోకగా 200 మార్క్‌ను దాటేసింది. పాండ్యా జోరుగా బ్యాటింగ్ చేస్తుండటాన్ని టీవీలో చూసిన భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కూతురు జీవా సంతోషంతో ఎగిరి గంతేసింది. సునాయాసంగా బౌండరీలు బాదుతున్న పాండ్యాను ఉత్సాహపరుస్తూ.. కమాన్.. హార్దిక్, కమాన్..హార్దిక్ అంటూ సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హార్దికే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఓ..! నాకొక చీర్ లీడర్ దొరికిందోచ్’ అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. Oh I think that I found myself a cheerleader 🎵 🎶🎵🎶🎵🎶 @zivasinghdhoni006 😍❤️👼Video courtesy: @sakshisingh_r A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jun 29, 2018 at 12:42pm PDT -
నా బంగారమే నన్ను మార్చేసింది: ధోని
ముంబై : తండ్రి అయినప్పటి నుంచి క్రికెటర్‌గా తనలో మార్పు వచ్చిందో.. లేదో కానీ.. వ్యక్తిగా మాత్రం ఎంతో మారానని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. ఈ మార్పుకు తన కూతురు, గారలపట్టీ జీవానే కారణమని అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ నోరు విప్పని ధోని.. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షోలో తన కూతురితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ‘కూతుర్లందరూ వారి తండ్రులను ఇష్టపడుతారు.. కానీ నా విషయంలో అలా జరగలేదు. జీవా పుట్టినప్పుడు నేను అక్కడలేను. ఎక్కువ సమయం క్రికెట్లోనే గడచిపోయేది. ఈ మధ్యలో నా పేరు చెప్పి ఇంట్లోవాళ్లు తనకు భయం చెప్పేవారు. జీవా అన్నం తినకపోతే నాన్న వస్తున్నాడు అని చెప్పి బెదిరించే వారు. ఏదైనా అల్లరి పనులు చేస్తున్నా ఇలాగే చేసేవారు. దీంతో నాన్న అనగానే ఏదో తెలియని భయాన్ని ఆమెలో కల్పించారు. నేను దగ్గరకు తీసుకోవాలని చూస్తే భయపడుతూ దూరంగా ఉండేదని’ ధోని చెప్పుకొచ్చాడు. ఆ దూరాన్ని ఈ ఐపీఎల్.. ఈ సీజన్ ఐపీఎల్‌తో జీవాతో ఆ దూరం తగ్గిందని ధోని సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ సీజన్లో నా కూతురితో గడిపే సమయం ఎక్కువగా దొరికింది.నా వెంట ఉన్నప్పుడు ఎప్పుడూ గ్రౌండ్‌కు వెళ్లాలని మాత్రమే అడిగేది. అక్కడ జట్టు సహచరుల పిల్లలతో ఎంతో సరదాగా ఆడుకునేది. నేను 1.30, 2.30, 3 గంటలకు లేచేవాడిని. జీవా మాత్రం 9 గంటల్లోపే లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని, పిల్లలతో ఆడుకునేది. అది చూసినప్పుడు నాకు ఎంతో ఉల్లాసంగా ఉండేది.’ అని ధోని మురిసిపోయాడు. క్రికెట్‌ను జీవా ఎంతగా ఇష్టపడుతుందో తెలియదు కానీ, ఏదో ఒకరోజు ఆమెను మ్యాచ్ ప్రజెంటేషన్‌కు తీసుకువస్తానన్నాడు. అప్పుడు అన్నింటికీ ఆమే సమాధానమిస్తుందని ధోని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సమయంలో తాను జిమ్‌లో కన్న తన రూమ్‌లో ఉన్న రోలర్ మీదనే కసరత్తులు చేసేవాడినన్నాడు. ఈ సీజన్లో ధోని సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు సమయం ఉండటంతో ఈ ఖాళీ సమయాన్ని ధోని తన కూతురితో ఆస్వాదిస్తున్నాడు. -
ఆల్‌రౌండర్ ధోని.. దటీజ్ మహీ, వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తన గారాల పట్టి జీవాతో సమయం గడిపేందుకు ఇష్టపడతాడు. ఈ విషయం మరోసారి రుజువైంది. తన ముద్దుల తనయకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకోవడం ధోనికి అలవాటు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠపోరులో సిక్సర్ బాది మరో 2 బంతులుండగానే చెన్నైకి విజయాన్ని అందించాడు ధోని. మ్యాచ్ అనంతరం ధోని పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ 11 సీజన్‌తో ఆటగాడిగా, కెప్టెన్ గా బిజిబిజీగా ఉన్నప్పటికీ.. తండ్రిగా బాధ్యతను మాత్రం మరవలేదు. హెయిర్ డ్రైయర్‌తో తన గారాల పట్టి జీవా తడి జుట్టును ఆరబెడుతున్న వీడియోను ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఆట ముగిసింది. హాయిగా నిద్ర పోయాను. ప్రస్తుతం తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానంటూ’ ధోని పోస్ట్ చేసిన గంటలోపే సుమారు 4 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ‘కెప్టెన్‌గా, తండ్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆల్‌రౌండర్ ధోని. దటీజ్ తాలా’ అంటూ ఓ నెటిజన్ అభిమానాన్ని చాటుకున్నాడు. Game over, had a nice sleep now back to Daddy’s duties A post shared by M S Dhoni (@mahi7781) on Apr 26, 2018 at 2:54am PDT -
వైరల్ : ధోని ఫన్ టైం విత్ ఫ్యామిలీ.!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్ నుంచి ధోనికి విశ్రాంతి లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ విలువైన సమయాన్ని ఈ సీనియర్ క్రికెటర్ కుటుంబంతో ఆస్వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన సతీమణి సాక్షి, కూతురు జీవాతో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఓ వీడియోను ధోని తన ఇన్‌స్టాగ్రాంలో ‘ఫన్ టైం విత్ ఫ్యామిలీ’ అనే క్యాఫ్షన్‌తో పంచుకున్నాడు. అయితే ఈ వీడియోలో తన పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలంటే ధోనికి ఎంతో ఇష్టమనే విషయం అందరికి తెలిసిందే. ధోనీ పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం తన విశ్రాంతి సమయాన్ని సతీమణి అనుష్కశర్మతో ఆస్వాదిస్తున్నాడు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ క్రికెటర్లకు మైదానానికి దూరమైనా వ్యక్తిగత ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఐపీఎల్ నిర్వాహకులు సోమవారం విడుదల చేసిన ప్రచార గీతాన్ని కూడా ధోనీ తన ట్విటర్లో పంచుకున్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ ఈ సీజన్ ఐపీఎల్లో పునరాగమనం చేయనుంది. ఏప్రిల్ 7న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
ధోని కూతురు.. సోషల్ మీడియా సెలబ్రిటీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారాల పట్టి నెట్టింట్లో సందడి చేస్తోంది. మూడేళ్ల ధోని కుమార్తె... జివా ధోని ఇప్పటికే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ తెచ్చుకుంది. జివాకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిన్నారి.. ఒక మలమాళం పాటను పాడుతుండగా తీసిన వీడియో ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. తాజాగా జివా ధోని ‘ఒకన్కుట్టం’ మలయాళ సూపర్ హిట్ చిత్రంలోని ‘కనికుణ్ నేరమ్ కమలంతెరంటే’ అనే పాటను జివా ధోని ముద్దుముద్దగా ఆలపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష 60 వేలమందికి పైగానే వీక్షించారు. చిన్నారి జివా ధోనిసింగ్ పేరుతో ధోని దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచారు. ఈ అకౌంట్నుంచే జివాకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ధోని దంపతులు అభిమానులతో పంచుకుంటున్నారు. #unwell n yet singing away #winterishere A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on Dec 1, 2017 at 9:30am PST -
సోషల్ మీడియాలో ధోని కూతురు హల్చల్..
-
సోషల్ మీడియాలో ధోని కూతురు హల్చల్..
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారాలపట్టి జీవా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీ స్టేటస్ సాధించిన ఈ చిన్నారి.. ఏం చేసినా అది కాస్త నెట్టింట్లో సెన్సేషన్ అవుతోంది. కొద్ది రోజుల క్రితమే మళయాళం సాంగ్ ‘అంబాలపుజాయ్ ఉన్నికన్నానోడు నీ’ పాడిన వీడియో వైరల్ కాగా.. తాజాగా తన బుజ్జి బుజ్జి చేతులతో గుండ్రటి రోటీ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జీవా సింగ్ ధోని పేరిట ఇన్‌స్టాగ్రమ్ ఖాతాను తెరిచిన ధోని దంపతులు.. జీవాకు సంబంధించిన ప్రతీ వీడియోలను ఈ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. Round round Roti ! A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on Nov 23, 2017 at 7:53am PST -
జివా.. గానం.. ధోని మురిపెం
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారాల పట్టి జివా.. సోషల్ మీడియాకు కూడా ముద్దుల పట్టిగా మారింది. ఈ మథ్యే తండ్రితో కలిసి లడ్డూ తినే వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. వచ్చీరానీ పదాలు.. చిట్టిచిట్టి మాటలతో ధోనీ అభిమానులను, క్రికెట్ ప్రియులను సైతం అలరిస్తోంది. తాజాగా మలయాళంలోని శ్రీకృష్ణుడిమీద విన్న భక్తి గీతాన్ని... తన ముద్దుముద్దు మాటలతో పాడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటిదాకా లక్షన్నర మంది వీక్షించారు. వేల సంఖ్యలో అభిమానుల కామెంట్లు పెడుతున్నారు. మలయాళంలో జివా పాను విన్న వారంతా.. అధ్భుతంగా పాడిందని కితాబిచ్చారు. కేరళ ధోనీ అబిమానులైతే.. ఇది పండుగ చేసుకోవాల్సిన విషయం అని కామెంట్లు పెడుతున్నారు. @mahi7781 @sakshisingh_r ❤️❤️ A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on Oct 24, 2017 at 5:26am PDT -
లడ్డు కోసం కూతురితో ధోని పోటీ..
-
లడ్డూ కావాలా ధోని..
సాక్షి,రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తన గారాల పట్టి.. కూతురు జీవాతో గడుపుతాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నెల 22న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు సమయం ఉండటంతో దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా ఆస్వాదిస్తున్నాడు. తన గారాల పట్టీ చిలిపి చేష్టలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే ధోని.. తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. ధోని తనకూతురు జీవాతో లడ్డు కోసం పోటీ పడ్డాడు. చివరికి ఈ పోటీలో గెలుపు జీవానే వరించగా.. ఈ వీడియోని ధోని మురిపంగా ‘అటాక్ ఆన్ బెసన్ లడ్డు’ అంటూ ఇన్‌స్ట్రాగమ్‌లో పోస్టు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 అనంతరం టీమిండియా ధోని నివాసాన్ని సందర్శించింది. ఆ సమయంలో కెప్టెన్ కోహ్లి జీవాతో సరదాగా ముచ్చటించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. -
ఈ బుజ్జీ ధోనీ అప్పుడే ఫోన్ వాడేస్తోంది!
కెప్టెన్ ధోనీ- వైస్ కెప్టెన్ కోహ్లి జోడీ కలిసి ఆడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు! ఈ జోడీ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారత జట్టును సెమీస్‌కు చేర్చింది. ఇప్పుడు కోహ్లి మాత్రం ధోనీతో కాకుండా బుజ్జీ ధోనీ జివాతో జట్టు కట్టాడు. తన ఫోన్ తీసి ఆ బుజ్జాయి చేతుల్లో పెట్టాడు. మరీ బుజ్జీ ధోనీ ఏం తక్కువ తిన్నదా? తనకు ఫోన్ గురించి ఏ టు జెడ్ తెలిసినట్టు ఏకంగా చెవి దగ్గర మొబైల్ పెట్టుకొని మాట్లాడినట్టు ఫోజు కూడా ఇచ్చింది. ఈ ఆడోరబుల్ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ధోనీ గారాలపట్టి జివాతో విరాట్ కోహ్లి దిగిన ఈ సెల్ఫీకి 24 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 లక్షల లైకులు వచ్చాయి. 5వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. 'బుజ్జి జివాను చూడండి అప్పుడు నా ఫోన్‌తో ఆడుకుంటోంది. ఫోన్ ఎలా వాడాలో తెలిసినట్టు. ఎంత క్యూట్‌గా, ఆడోరబుల్గా ఉందో కదా. పిల్లలే అంతా. వాళ్లు పక్కన ఉంటే ప్రపంచాన్ని మరిచిపోయి.. వారి అమాయకపు కళ్లలో చూస్తూ ఉండవచ్చు. ఎంత బావుంటుందో' అంటూ జివాతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు కోహ్లి. మరోవైపు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ద్వేన్ బ్రేవో కూడా కూతురిని ఎత్తుకున్న ధోనీ, బౌలర్ భజ్జీతో ఫొటో దిగి ట్విట్టర్లో షేర్ చేశాడు. It was great running into 2 of the greatest #Champions. Captain Kool @msdhoni and @harbhajan_singh.. #ChampionDance pic.twitter.com/fHXgQG5hmD — Dwayne DJ Bravo (@DJBravo47) 29 March 2016