ధోని చేత కేక్‌ కట్‌ చేయించిన జీవా! | MS Dhoni Birthday Celebrates It With Family | Sakshi

ధోని చేత కేక్‌ కట్‌ చేయించిన జీవా!

Jul 7 2019 9:14 AM | Updated on Jul 7 2019 7:38 PM

MS Dhoni Birthday Celebrates It With Family - Sakshi

 టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన 38వ పుట్టిన రోజు వేడుకలను

లీడ్స్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన 38వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరుపుకున్నాడు. తన గారాల పట్టి జీవా ధోనియే స్వయంగా దగ్గరుండి మహేంద్రుడి పుట్టినరోజు వేడుకను చేసింది. తండ్రి చేయి పట్టుకొని మరి కేక్‌ కట్‌ చేయించింది. ఈ బర్త్‌డే సంబరాలకు సంబంధించిన ఫొటోలను ధోని సతీమణి సాక్షిసింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. కేదార్‌జాదవ్‌, ఆల్‌రౌండర్‌ పాండ్యాలు ధోనిని కేకులో ముంచెత్తారు. ఈ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా, ధోనితో కలిసి హెలికాప్టర్‌ షాట్‌ను ఇమిటేట్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశాడు. టీ20 ప్రపంచకప్‌.. వన్డేప్రపంచకప్‌.. చాంపియన్స్‌ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌గా..‌. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన మహేంద్రుడికి సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement