
ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూతురు జీవా మూడేండ్ల ప్రాయంలోనే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. జీవా పలు సార్లు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. క్యూట్ క్యూట్‌గా డ్యాన్స్‌లు వేయడం,ముద్దు ముద్దు మాటలు మాట్లాడడం, తండ్రి మ్యాచ్ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనితో పాటు గ్రౌండ్‌లో డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తూ... జీవా నెటిజన్లను ఫిదా చేస్తోంది.
తాజాగా తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో జీవా ధోనికి రెండు భాషల్లో శుభాకాంక్షలు చెబుతోంది. మొదటగా మాతృభాష బోజ్‌పురి భాషలో, తర్వాత తమిళ భాషలో ఇరువురు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వీడియోని ధోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది. ఇంత చిన్న వయసులో రెండు భాషలు మాట్లాతుందని నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment