
కార్డిఫ్: భారత మాజీ కెప్టెన్ ధోని శనివారం 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఒకటి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా వచ్చింది. ‘నీ వయసుపైబడుతోంది’ అని..! ఈ మాట ధోని గారా లపట్టి జీవా నోటి నుంచి వచ్చింది.
‘హ్యాపీ బర్త్‌డే పాపా... హ్యాపీ బర్త్‌డే. యూ ఆర్ గెట్టింగ్ ఓల్డర్’ (వయసుపైబడుతోంది నాన్న) అని జీవా పాడుతూ విష్ చేసింది. ప్రస్తుత జట్టు సహచరుల వీడియో శుభాకాంక్షలతో పాటు జీవా చిట్టిపొట్టి పలుకుల్ని బీసీసీఐ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ వేడుకల్లో కోహ్లి, అనుష్క శర్మ, సహచరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment