ఆల్‌రౌండర్‌ ధోని.. దటీజ్‌ మహీ, వైరల్ | MS Dhoni Back To Daddy Duty | Sakshi
Sakshi News home page

ఆల్‌రౌండర్‌ ధోని.. దటీజ్‌ మహీ, వైరల్

Published Thu, Apr 26 2018 6:21 PM | Last Updated on Thu, Apr 26 2018 6:22 PM

MS Dhoni Back To Daddy Duty - Sakshi

తన గారాల పట్టి జీవాతో ధోని

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోని.. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తన గారాల పట్టి జీవాతో సమయం గడిపేందుకు ఇష్టపడతాడు. ఈ విషయం మరోసారి రుజువైంది.  తన ముద్దుల తనయకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులతో పంచుకోవడం ధోనికి అలవాటు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠపోరులో సిక్సర్ బాది మరో 2 బంతులుండగానే చెన్నైకి విజయాన్ని అందించాడు ధోని. మ్యాచ్‌ అనంతరం ధోని పోస్ట్‌ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ఐపీఎల్‌ 11 సీజన్‌తో ఆటగాడిగా, కెప్టెన్ గా బిజిబిజీగా ఉన్నప్పటికీ.. తండ్రిగా బాధ్యతను మాత్రం మరవలేదు. హెయిర్‌ డ్రైయర్‌తో తన గారాల పట్టి జీవా తడి జుట్టును ఆరబెడుతున్న వీడియోను ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఆట ముగిసింది. హాయిగా నిద్ర పోయాను. ప్రస్తుతం తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానంటూ’  ధోని పోస్ట్‌ చేసిన గంటలోపే సుమారు 4 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ‘కెప్టెన్‌గా, తండ్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆల్‌రౌండర్‌ ధోని. దటీజ్‌ తాలా’  అంటూ ఓ నెటిజన్‌ అభిమానాన్ని చాటుకున్నాడు.  
    

Game over, had a nice sleep now back to Daddy’s duties

A post shared by M S Dhoni (@mahi7781) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement