chennai superkings
-
స్టొయినిస్ విధ్వంసం
చెన్నై: నాలుగు రోజుల క్రితం లక్నో వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఇప్పుడు చెన్నైలో రీప్లేగా జరిగిన పోరులో లక్నోనే మళ్లీ ‘సూపర్’గా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ‘హిట్టర్’ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. పూరన్‌తో నాలుగో వికెట్‌కు 70 పరుగులు, దీపక్ హుడాతో అబేధ్యమైన ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించిన స్టొయినిస్ లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్... రహానే (1), వన్‌డౌన్‌లో మిచెల్ (11), జడేజా (16) చెన్నై టాప్–4 బ్యాటర్లలో ముగ్గురి స్కోరిది! పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 49/2 తక్కువే! ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ బౌండరీలతో పరుగుల వేగాన్ని అందుకున్నాడు. గైక్వాడ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 11.3 ఓవర్లలో వందకు చేరింది. అదే ఓవర్లో జడేజా నిష్క్రమించడంతో వచ్చిన దూబే ఓ రకంగా శివతాండవమే చేశాడు. 15 ఓవర్లలో చెన్నై 135/3 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత దూబే పవర్‌ప్లే మొదలైంది. భారీ సిక్సర్లతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. 16వ ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్స్‌లతో 19 పరుగులు, 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4లతో 16 పరుగులు, 19వ ఓవర్లో మళ్లీ దూబే దంచేయడంతో 17 పరుగులు, ఆఖరి ఓవర్లో 15 పరుగులతో స్కోరు 200 పైచిలుకు చేరింది. చివరి 5 ఓవర్లలో దూబే వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై 75 పరుగులు సాధించింది. గైక్వాడ్ 56 బంతుల్లో శతకాన్ని, దూబే 22 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. బ్యాటింగ్ గేర్ మార్చి... కొండంత లక్ష్యం ముందున్న లక్నోకు ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్లు డికాక్ (0), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (19 బంతుల్లో 13) నిరాశపరిచారు. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్టొయినిస్ ఒక్కడే గెలిపించేదాకా మెరిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తర్వాత నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరు పెంచగానే... పతిరణ మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ 56 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీపక్ హుడా కూడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌కు పని చెప్పడంతో అనూహ్యంగా లక్నో లక్ష్యం వైపు పరుగు పెట్టింది. 18 బంతుల్లో 47 పరుగుల కష్టమైన సమీకరణం ఇద్దరి దూకుడుతో సులువైంది. 18, 19వ ఓవర్లలో 15 పరుగుల చొప్పున వచ్చాయి. 6 బంతుల్లో 17 పరుగుల్ని స్టొయినిస్ 6, 4, నోబాల్4, 4లతో ఇంకో మూడు బంతులు మిగిల్చి ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రాహుల్ (బి) హెన్రి 1; రుతురాజ్ (నాటౌట్) 108; మిచెల్ (సి) హుడా (బి) యశ్ 11; జడేజా (సి) రాహుల్ (బి) మోసిన్ 16; దూబే (రనౌట్) 66; ధోని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–4, 2–49, 3–101, 4–205. బౌలింగ్: హెన్రీ 4–0–28–1, మోసిన్ ఖాన్ 4–0–50–1, రవి బిష్ణోయ్ 2–0–19–0, యశ్ ఠాకూర్ 4–0–47–1, స్టొయినిస్ 4–0–49–0, కృనాల్ పాండ్యా 2–0–15–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) దీపక్ 0; రాహుల్ (సి) రుతురాజ్ (బి) ముస్తఫిజుర్ 16; స్టొయినిస్ (నాటౌట్) 124; పడిక్కల్ (బి) పతిరణ 13; పూరన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 34; హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–88, 4–158. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–1, తుషార్ 3–0–34–0, ముస్తఫిజుర్ 3.3–0–51–1, శార్దుల్ 3–0–42–0, మొయిన్ అలీ 2–0–21–0, జడేజా 2–0–16–0, పతిరణ 4–0–35–2. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘ప్లే ఆఫ్స్’కు సూపర్ కింగ్స్... జెయింట్స్
ఐపీఎల్–2023లో మరో రెండు ‘ప్లే ఆఫ్స్’ స్థానాలు ఖరారయ్యాయి... గత సీజన్లో తొమ్మిదో స్థానంతో ముగించిన నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి మళ్లీ పైకెగసింది... చివరి లీగ్‌లో ఢిల్లీని చిత్తు చేసి రెండో స్థానంతో క్వాలిఫయర్–1కు అర్హత సాధించింది... సొంత గడ్డపై మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకుంది. మరో వైపు గత ఏడాదిలాగే ఈ సారి కూడా లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది... ఉత్కంఠభరితంగా సాగిన చివరి పోరులో పరుగు తేడాతో కోల్‌కతాను ఓడించి ఊపిరి పీల్చుకుంది... నాలుగో స్థానం ఎవరిదనేది నేడు జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్‌లతో తేలుతుంది. ఈ స్థానం కోసం ప్రధానంగా ముంబై, బెంగళూరు పోటీ పడుతుండగా... ఈ రెండూ ఓడితే రాజస్తాన్‌కు అవకాశం ఉంటుంది. న్యూఢిల్లీ: నాలుగుసార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇప్పటికే రేసుకు దూరమైన ఢిల్లీని సులువుగా చిత్తుచేసింది. సొంతగడ్డపై గెలుపుతో ముగిద్దామనుకున్న వార్నర్ సేన ఆశలపై నీళ్లుచల్లింది. ధోని సేన 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవాన్ కాన్వే (52 బంతుల్లో 87; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 79; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) శివమెత్తారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ వార్నర్ (58 బంతుల్లో 86; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) పోరాడాడు. ఓపెనర్ల వీరవిహారం ఆట మొదలవగానే చెన్నై ఓపెనర్లు పరుగుల బాట పట్టారు. ప్రత్యర్థి జట్టు పేస్, స్పిన్ మార్చిమార్చి ప్రయోగించినా రుతురాజ్, కాన్వే జోరును అడ్డుకోలేకపోయారు. పవర్‌ప్లేలో 52/0 స్కోరు చేసిన చెన్నై ఆ తర్వాత ఇంకాస్త వేగంగా ఆడారు. అక్షర్ పదో ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదిన రుతురాజ్ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. కాసేపటికే కుల్దీప్ 12వ ఓవర్లో ‘హ్యాట్రిక్’ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోరు వంద దాటాక కాన్వే ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయ్యింది. 14 ఓవర్ల పాటు దుర్బేధ్యంగా సాగిన 141 పరుగుల ఓపెనింగ్ జోడీకి 15వ ఓవర్లో సకారియా ముగింపు పలికాడు. రుతురాజ్ నిష్క్రమించగా, శివమ్ దూబే (9 బంతుల్లో 22; 3 సిక్సర్లు), కాన్వే ధాటిగా ఆడారు. ఆఖర్లో జడేజా (7 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించాడు. వార్నర్ ఒంటరిగా... ఢిల్లీ ముందున్న లక్ష్యం అతి కష్టమైంది. టాపార్డర్ దంచేస్తే తప్ప ఛేదన సాధ్యం కానేకాదు. కానీ టాపార్డరే కాదు... మిడిల్, లోయర్ ఆర్డర్, టెయిలెండర్లు అంతా చేతులెత్తేయడంతో చెన్నై గెలుపు సులువైంది. పృథ్వీ షా (5), సాల్ట్ (3), రోసో (0) ఇలా ధాటిగా ఆడే సత్తా వున్న బ్యాటర్లు పవర్‌ప్లే వరకైనా ఆడలేకపోయారు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్‌ను కెప్టెన్ వార్నర్ ఒంటరిగా నడిపించాడు. సహచరులు ధుల్ (13), అక్షర్ (15), అమన్ (7), లలిత్ యాదవ్ (6) చెన్నై బౌలర్ల ఉచ్చులో పడటంతో వార్నర్ ఎంత పోరాడినా జట్టు స్కోరు 150 పరుగులు దాటలేదు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) రోసో (బి) సకారియా 79; కాన్వే (సి) అమన్ (బి) నోర్జే 87; దూబే (సి) లలిత్ (బి) ఖలీల్ 22; ధోని (నాటౌట్) 5; జడేజా (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–141, 2–195, 3–195. బౌలింగ్: ఖలీల్ 4–0–45–1, లలిత్ 2–0–32–0, అక్షర్ 3–0–32–0, నోర్జే 4–0–43–1, సకారియా 4–0–36–1, కుల్దీప్ 3–0–34–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్విషా (సి) రాయుడు (బి) తుషార్ 5; వార్నర్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 86; సాల్ట్ (సి) రహానె (బి) చహర్ 3; రోసో (బి) చహర్ 0; ధుల్ (సి) తుషార్ (బి) జడేజా 13; అక్షర్ (సి) రుతురాజ్ (బి) చహర్ 15; అమన్ (సి) అలీ (బి) పతిరణ 7; లలిత్ (సి) అలీ (బి) తీక్షణ 6; నోర్జే నాటౌట్ 0; కుల్దీప్ (ఎల్బీ) (బి) తీక్షణ 0; సకారియా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–5, 2–26, 3–26, 4–75, 5–109, 6–131, 7–144, 8–146, 9–146. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–22–3, తుషార్ 4–0–26–1, తీక్షణ 4–1–23–2, జడేజా 4–0–50–1, పతిరణ 4–0–22–2. ♦ ఎలిమినేటర్‌కు లక్నో ♦ పరుగు తేడాతో కోల్‌కతాపై విజయం కోల్‌కతా: విజయలక్ష్యం 177 పరుగులు...కీలక బ్యాటర్లంతా వెనుదిరగ్గా, కోల్‌కతా విజయానికి చివరి 12 బంతుల్లో 41 పరుగులు కావాలి...క్రీజ్‌లో రింకూ సింగ్ ఉండటంతో కొంత ఆశ...దానిని వమ్ము చేయకుండా ఈ సీజన్లో పలు మార్లు ఆడినట్లుగా రింకూ మళ్లీ తన జోరు మొదలు పెట్టాడు. నవీనుల్ వేసిన 19వ ఓవర్లో 4, 4, 4, 2, 6, 0లతో 20 పరుగులు రాబట్టాడు. అంతే ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. 6 బంతులకు 21 పరుగులు కావాల్సి ఉండగా భారీ షాట్లమీదే దృష్టిపెట్టిన రింకూ సింగిల్స్ తీయలేదు. తీవ్ర ఒత్తిడిలో యశ్ ఠాకూర్ 2 వైడ్లు వేశాడు. ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు అవసరం కాగా, రింకూ వరుసగా 6, 4, 6 కొట్టినా ఈ సారి గెలిపించలేకపోయాడు. చివరకు పరుగు తేడాతో లక్నో గట్టెక్కింది. మొదట లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచేశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. రింకూ సింగ్ (33 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అలుపెరగని పోరాటం చేశాడు. జేసన్ రాయ్ (28 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆదుకున్న పూరన్ డికాక్‌తో కరణ్ శర్మ (3) ఓపెనింగ్ కుదరలేదు. ఆ తర్వాత వచ్చిన వారితో లక్నో ఆట కూడా తీసికట్టుగానే ఉంది. ప్రేరక్ మన్కడ్ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు)ను, స్టొయినిస్ (0)ను వైభవ్ అరోరా ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యా (9) నరైన్ ఉచ్చులో పడగా... డికాక్ (27 బంతుల్లో 28; 2 సిక్స్‌లు) భారీ షాట్‌కు యతి్నంచి నిష్క్ర మించాడు. 73 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆయుశ్ బదోని (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన పూరన్ జట్టు బాధ్యత మోశాడు. క్రీజులోకి వచి్చనప్పటినుంచే సిక్సర్లు, ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపిరిపోశాడు. శుభారంభం దక్కినా... కోల్‌కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, జేసన్ రాయ్ లక్ష్యానికి దీటైన పునాది వేశారు. 4.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. అయితే వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్)ను గౌతమ్ అవుట్ చేయడంతోనే ఆట మలుపు తిరిగింది. నితీశ్ రాణా (8), రాయ్, గుర్బాజ్ (10) పెవిలియన్‌కు వరుస కట్టారు. 27 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో రసెల్ అవుట్ కావడంతో కోల్‌కతా ఛేదన కష్టంగా మారిపోయింది. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: కరణ్ శర్మ (సి) శార్దుల్ (బి) హర్షిత్ 3; డికాక్ (సి) రసెల్ (బి) వరున్ 28; ప్రేరక్ (సి) హర్షిత్ (బి) వైభవ్ 26; స్టొయినిస్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 0; కృనాల్ (సి) రింకూ (బి) నరైన్ 9; బదోని (సి) శార్దుల్ (బి) నరైన్ 25; పూరన్ (సి) వెంకటేశ్ (బి) శార్దుల్ 58; గౌతమ్ నాటౌట్ 11; బిష్ణోయ్ (బి) శార్దుల్ 2; నవీనుల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–14, 2–55, 3–55, 4–71, 5–73, 6–147, 7–159, 8–162. బౌలింగ్: హర్షిత్ 3–0–21–1, వైభవ్ 4–0–30–2, వరుణ్ 4–0–38–1, నితీశ్ రాణా 1–0–3–0, శార్దుల్ 2–0–27–2, నరైన్ 4–0–28–2, సుయశ్ 1–0–12–0, రసెల్ 1–0–12–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రాయ్ (బి) కృనాల్ 45; వెంకటేశ్ (సి) బిష్ణోయ్ (బి) గౌతమ్ 24; నితీశ్ రాణా (సి) కృనాల్ (బి) బిష్ణోయ్ 8; గుర్బాజ్ (సి) బిష్ణోయ్ (బి) యశ్ 10; రింకూసింగ్ (నాటౌట్) 67; రసెల్ (బి) బిష్ణోయ్ 7; శార్దుల్ (సి) ప్రేరక్ (బి) యశ్ 3; నరైన్ రనౌట్ 1; వైభవ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–61, 2–78, 3–82, 4–108, 5–120, 6–134, 7–136. బౌలింగ్: మొహసిన్ 1–0–15–0, నవీనుల్ 4–0–46–0, కృనాల్ 4–0–30–1, గౌతమ్ 4–0–26–1, రవి బిష్ణోయ్ 4–0–23–2, యశ్ ఠాకూర్ 3–0–31–2. ఐపీఎల్లో నేడు కీలక మ్యాచ్‌లు ముంబై VS హైదరాబాద్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) బెంగళూరు VS గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
కండల కాంతారావులా ధోని.. ఈ ఫిట్నెస్తో సిక్సర్లు కొడితే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2023 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని చాలా రోజుల నుంచి కఠోరంగా శ్రమిస్తున్నాడు. సీఎస్కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్‌డి.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్ సాధించి, ఐపీఎల్ కెరీర్‌ను ఘనంగా ముగించాలని తపిస్తున్నాడు. ఈ క్రమంలో ధోని తన ఆటతీరుతో పాటు దేహాదారుడ్యాన్ని సైతం భారీగా మార్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక, కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమైన ధోని, కొద్ది రోజుల కిందటి వరకు ఫిట్‌నెస్‌పై ఎలాంటి కాన్సన్ట్రేషన్ పెట్టక బొద్దుగా తయరయ్యాడు. అయితే ఈసారి తన జట్టుకు ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ అందించాలని దృడసంకల్పంతో ఉన్న ధోని.. తన బాడీ వెయిట్‌ను భారీగా తగ్గించుకోవడంతో పాటు 100 పర్సెంట్ ఫిట్‌గా తయారయ్యాడు. ఫిట్నెస్ అంటే స్లిమ్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో కాకుండా భారీగా కండలు పెంచి కండల కాంతారావును తలపిస్తున్నాడు. The biceps of MS Dhoni. pic.twitter.com/is7ltAfUi2 — Johns. (@CricCrazyJohns) March 15, 2023 పురులు తిరగిన ఈ కండలతో ప్రాక్టీస్ చేస్తున్న ధోని అవలీలగా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. ఇది చూసి సీఎస్కే అభిమానలు తెగ సంబురపడిపోతున్నారు. ఓ పక్క రెజ్లర్‌ను తలపించే ధోని బాడీని చూడాలా లేక బరువెక్కిన కండలతో ధోని ఆడే మాన్స్టర్ షాట్లు చూడాలా అని తేల్చుకోలేకపోతున్నారు. ప్రాక్టీస్ సందర్భంగా పురులు తిరిగిన కండలతో ధోని భారీ షాట్ ఆడుతున్న ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. “Nonchalant!” 🚁💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/glafNLF1gk — Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2023 ధోని బన్ గాయా రెజ్లర్ అంటూ అభిమానులు నెట్టింట తెగ హడావుడి చేస్తున్నారు. 41 ఏళ్ల వయసులో ధోని కుర్రాళ్లకు సవాలుగా మారాడంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండ్రోజుల కిందట ధోని ఆడిన ఓ భారీ షాట్‌కు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ ధనాధన్ ధోని ఈజ్ బ్యాక్ అని చర్చించుకుంటున్నారు. కాగా, ధోని నేతృత్వంలోని సీఎస్కే మార్చి 31న 16వ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనున్న విషయం తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని చివరి సీజన్లోనైనా మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గతేడాది దారుణమైన ప్రదర్శన కనబర్చి ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించాలని అభిమానులు పరితపిస్తున్నారు. మరోవైపు ఈ సీజన్లో సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపడతాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. -
జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్!
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనబోతున్న జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్, కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జోబర్గ్ సూపర్ కింగ్స్ కూడా పసుపు రంగు జెర్సీని ధరించనున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రోటిస్ క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్లో మొత్తం ఆరు జట్లు పాల్గోనబోతున్నాయి. అయితే ఆరుకు ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. జొహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్ ఫ్రాంచైజీలను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా.. సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూస్నర్ను డర్బన్ ఫ్రాంచైజీ తమ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది. చదవండి: Ind Vs WI 5th T20I: వెస్టిండీస్‌తో ఐదో టీ20.. సూర్యకుమార్‌కు విశ్రాంతి! ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! -
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ధోని..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్-2023లో తను ఆడతాడని తలైవా సృష్టం చేశాడు. వచ్చే ఏడాది సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తామని ధోని తెలిపాడు. ఐపీఎల్-2022లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ సమయంలో మాట్లాడిన ధోని ఈ వాఖ్యలు చేశాడు. "ముంబై అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. అయితే చెన్నైలో ఆడకుండా అభిమానులకు ధన్యవాదాలు చెప్పడం అన్యాయం. సీఎస్కే అభిమానులు నాపై ఎంతో ప్రేమ చూపించారు. వచ్చే ఏడాది చెన్నైలో మ్యాచ్‌లు ఆడుతామని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తాం. అయితే 2023 సీజన్ నాకు చివరి ఏడాది అవుతుందో లేదో ఇప్పుడే చేప్పలేను" అని ధోని పేర్కొన్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్లో మాత్రం ఆడుతున్నాడు. చదవండి: IND Vs SA T20 2022: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత యువ పేసర్ దూరం..! All I wanted to know today#CSKvRR #MSDhoni https://t.co/SExjm5tPDG — Msdian Fanboy💚 (@msdian_fanboy) May 20, 2022 -
సీఎస్కే ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయం
-
సీఎస్కేకు మరో బిగ్ షాక్.. ఆ ఒక్కడు కూడా..!
Ambati Rayudu Injury: డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసి రావట్లేదు. ఓ పక్క వరుస పరాజయాలు, మరో పక్క గాయాల బెడద ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలకు దాదాపుగా గండికొట్టాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఆ జట్టుకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. మిడిలార్డర్లో అడపాదడపా రాణిస్తున్న అంబటి రాయుడు గాయం బారిన పడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అతని గాయం తీవ్రతరమైందని ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్(39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించిన రాయుడికి అప్పటికే గాయమైందని, గాయంతోనే అతను బ్యాటింగ్ కొనసాగించాడని, దాంతో గాయం మరింత తీవ్రమైందని ఫ్లెమింగ్ తెలిపాడు. మే 1న సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సమయానికి రాయుడు కోలుకుంటాడన్న నమ్మకం లేదని ఆయన పేర్కొన్నాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇచ్చిన అప్డేట్ను బట్టి చూస్తే.. సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు రాయుడు అందుబాటులో ఉండడని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుత సీజన్లో రాయుడు 8 మ్యాచ్‌ల్లో 35.14 సగటున 129.47 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 78. ఇదిలా ఉంటే, రాయుడుతో కలుపుకుని ఈ సీజన్లో గాయాల కారణంగా సీఎస్కేకు దూరమైన ఆటగాళ్ల సంఖ్య మూడుకి చేరింది. తొలుత దీపక్ చాహర్, ఆ తర్వాత ఆడమ్ మిల్నే గాయాల కారణంగా వైదొలిగారు. చదవండి: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా అతడే.. హెడ్‌కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ధోని ఫినిషింగ్ టచ్.. ముంబై ‘ఏడు’పు..!
IPL 2022 CSK Vs MI- ముంబై: 156 పరుగులను అందుకునే క్రమంలో చెన్నై తడబాటు...మ్యాచ్‌లో మరో ఐదు బంతులు మిగిలి ఉండగా ముంబైకే గెలుపు అవకాశాలు...మ్యాచ్ గెలిచి లీగ్‌లో రోహిత్ సేన బోణీ కొట్టేలా కనిపించింది. 5 బంతుల్లో చెన్నై చేయాల్సినవి 17 పరుగులు... అప్పుడే క్రీజులోకి వచ్చిన బ్రేవో పరుగు తీసి ధోనికి స్ట్రయిక్ ఇచ్చాడు. 4 బంతుల్లో 16 పరుగులు కావాలి. కానీ చాలా కాలంగా బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ధోని సామర్థ్యంపై కొంత అనుమానం! మరి ఇంకెమవుతుందోనన్న టెన్షన్ ఇరు శిబిరాల్లోనూ ఉంది. ఉనాద్కట్ మూడో బంతిని ధోని లాంగాఫ్‌లో సిక్సర్‌గా బాదాడు. ఎక్కడలేని ఆశలు. 4వ బంతికి ఫోర్. 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. ఐదో బంతికి చకచకా 2 పరుగులు పూర్తి. ఓ బంతి 4 పరుగులు. కొట్టేశాడు ధోని...ఒకనాటి తన ఆటను గుర్తు చేస్తూ ముంబైని మట్టికరిపించాడు! ధోని ఆడిన ఆఖరి 4 బంతులు సూపర్‌కింగ్స్‌ను 3 వికెట్ల తేడాతో గెలిపించాయి. మొదట ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఠాకూర్ తిలక్ వర్మ (43 బంతుల్లో 51 నాటౌట్; 3ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముకేశ్ చౌదరి 3 కీలక వికెట్లు తీశాడు. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు (35 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, ధోని (13 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అసలైన ఇన్నింగ్స్ ఆడాడు. డానియెల్ సామ్స్‌కు 4 వికెట్లు దక్కాయి. జీరో... జీరో! ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చూస్తే... ఈ జట్టా ‘5 స్టార్ చాంపియన్’ అని సందేహం కలుగకమానదు. ఐదు సార్లు ఐపీఎల్‌ను గెలిపించిన సారథి, ఓపెనింగ్‌లో విశేష అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ (0) ఆట మొదలైన రెండో బంతికే అవుటైతే... యువ డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ రెండు వికెట్లను అనామక బౌలరైన ముకేశ్ చౌదరి తీయడం విశేషం. రెండో ఓవర్లోనే జడేజా క్యాచ్ జారవిడవడంతో వచ్చిన లైఫ్‌ను బ్రెవిస్ (4) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముకేశ్‌కు మూడో వికెట్‌గా ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మూడు వికెట్లలో పరుగులు చేసి అవుటైంది అతనొక్కడే! సూర్యకుమార్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఓ నాలుగు ఓవర్లపాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అడపాదడపా బౌండరీలతో వేగంగా ఆడుతున్న సూర్యకుమార్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) సాన్‌ట్నర్ అవుట్ చేశాడు. జట్టు 50 పరుగులైనా చేయకమందే 47 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. తిలక్ నిలబడటంతో... క్రమం తప్పకుండా వికెట్లు రాలుతున్నా చెక్కు చెదరని ఏకాగ్రతతో తిలక్‌వర్మ బ్యాటింగ్ సాగింది. ఇతనికి హృతిక్ షౌకీన్ (25 బంతుల్లో 25; 3 ఫోర్లు) జతయినా వంద పరుగులకంటే ముందే అతనూ పెవిలియన్ బాటపట్టాడు. తర్వాత పొలార్డ్ తోడయ్యాక 15వ ఓవర్ ఆఖరి బంతికి ముంబై 100 పరుగులకు చేరింది. కానీ పొలార్డ్ (14) మిగిలిన ఆ కాసిన్ని ఓవర్లు ఆడలేకపోయాడు. భారీషాట్‌కు యత్నించి లాంగాన్‌లో శివమ్ దూబేకు క్యాచిచ్చాడు. 42 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్న తిలక్ అజేయంగా నిలువగా, ఉనాద్కట్ (9 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ఆఖర్లో మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఫీల్డింగ్ చెత్తగా ఉంది. జడేజా, బ్రేవో, శివమ్ దూబే సునాయాసమైన క్యాచ్‌లను నేలపాలు చేశారు. చెన్నై కష్టపడి... ఏమంత కష్టమైన లక్ష్యం కానేకాదు. అయినా చెన్నై సునాయాసంగా లక్ష్యం చేరలేదు. రుతురాజ్ (0)ను సామ్స్ తొలి బంతికే పెవిలియన్ చేర్చాడు. ఉతప్ప (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడితే సాన్‌ట్నర్ (11), శివమ్ దూబే (13), రవీంద్ర జడేజా (3) నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకున్నాడు. ఉన్నంతలో రాయుడు మెరుగైన ఆటతీరు కనబరిచాడు. కానీ ఈ 6 విలువైన వికెట్లన్నీ 106 స్కోరు వరకే పడిపోయాయి. 24 బంతుల్లో 48 పరుగుల సమీకరణం. ప్రిటోరియస్ (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో చెన్నై లక్ష్యం బాట పట్టింది. కానీ ఆఖరి ఓవర్ తొలిబంతికి అతను అవుటై ఆ జట్టు శిబిరంలో గుబులు రేపాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాన్‌ట్నర్ (బి) ముకేశ్ 0; ఇషాన్ (బి) ముకేశ్ 0; బ్రెవిస్ (సి) ధోని (బి) ముకేశ్ 4; సూర్యకుమార్ (సి) ముకేశ్ (బి) సాన్‌ట్నర్ 32; తిలక్ నాటౌట్ 51; హృతిక్ (సి) ఉతప్ప (బి) బ్రేవో 25; పొలార్డ్ (సి) దూబే (బి) తీక్షణ 14; సామ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బ్రేవో 5; ఉనాద్కట్ నాటౌట్ 19; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–23, 4–47, 5–85, 6–111, 7–120. బౌలింగ్: ముకేశ్ 3–0–19–3, సాన్‌ట్నర్ 3–0–16–1, తీక్షణ 4–0–35–1, జడేజా 4–0–30–0, ప్రిటోరియస్ 2–0–17–0, బ్రేవో 4–0–36–2. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) తిలక్ (బి) సామ్స్ 0; ఉతప్ప (సి) బ్రెవిస్ (బి) ఉనాద్కట్ 30; సాన్‌ట్నర్ (సి) ఉనాద్కట్ (బి) సామ్స్ 11; రాయుడు (సి) పొలార్డ్ (బి) సామ్స్ 40; దూబే (సి) ఇషాన్ (బి) సామ్స్ 13; జడేజా (సి) తిలక్ (బి) మెరిడిత్ 3; ధోని నాటౌట్ 28; ప్రిటోరియస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉనాద్కట్ 22; బ్రేవో నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–0, 2–16, 3–66, 4–88, 5–102, 6–106, 7–139. బౌలింగ్: సామ్స్ 4–0–30–4, బుమ్రా 4–0–29–0, మెరిడిత్ 4–0–25–1, ఉనాద్కట్ 4–0–48–2, హృతిక్ 4–0–23–0. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X రాజస్తాన్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సీఎస్కేకు మరో భారీ షాక్.. లీగ్‌ను వీడిన విదేశీ బ్యాటర్
Devon Conway Leaves IPL For His Wedding: ఓ పక్క వరుస ఓటములు మరో పక్క గాయాల బెడదతో సతమతవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాలో జరుగనున్న తన వివాహం కోసం ఆ జట్టు విదేశీ ఆటగాడు (న్యూజిలాండ్) డెవాన్ కాన్వే పాక్షికంగా లీగ్‌ను వీడాడు. ఇటీవలే భారతీయ సంప్రదాయ దుస్తుల్లో (తమిళ స్టైల్ పంచకట్టులో) ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకున్న కాన్వే పెళ్లి తర్వాత ఏప్రిల్ 24న భార్యతో కలిసి తిరిగి భారత్‌కు వస్తాడని తెలుస్తోంది. సీఎస్కే వర్గాల సమాచారం మేరకు కాన్వే ముంబై ఇండియన్స్ (ఏప్రిల్ 21), పంజాబ్ కింగ్స్ (ఏప్రిల్ 25)తో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ప్రస్తుత, మాజీ కెప్టెన్లు, జడేజా, ధోని, ఇతర జట్టు సభ్యులు హుషారుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. 2022 ఐపీఎల్ మెగా వేలంలో కాన్వేను సీఎస్కే కోటి రూపాయలకు సొంతం చేసుకుంది. డుప్లెసిస్ స్థానాన్ని భర్తీ చేస్తాడని సీఎస్కే అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే ప్రస్తుత సీజన్లో అతనికి ఒకే మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 పరాజయాలు ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గాయాల కారణంగా దీపక్ చాహర్, ఆడమ్ మిల్నే ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలిగిన విషయం తెలిసిందే. Maple & Machis! 📸 that go straight into the Yellove Album! 😍#SuperFam #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/qUAKbrCpYu— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 చదవండి: డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీ.. పంచ కట్టుతో రచ్చరచ్చ చేసిన సీఎస్కే ప్లేయర్లు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్..!
Adam Milne Ruled Out Of IPL 2022 Says Reports: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2022 సీజన్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో (6 మ్యాచ్‌ల్లో 5 ఓటములు) సతమతమవుతూ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైన ఆ జట్టును గాయాల బెడద పట్టిపీడిస్తుంది. ఇప్పటికే 14 కోట్లు పోసి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ సీజన్ మొత్తానికి దూరం కాగా, తాజాగా విదేశీ (న్యూజిలాండ్) పేసర్ ఆడమ్ మిల్నే కూడా చాహర్ బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. మోకాలి గాయం కారణంగా మిల్నే కూడా సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. ఈ సీజన్లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన మిల్నే.. రెండో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో మిల్నేను రెండు వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. గాయం తీవ్రతపై తాజాగా మరోసారి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మిల్నే కోలుకోవడానికి మరికొన్ని వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఏదో మిరకిల్ జరిగితే తప్ప సీఎస్కే లీగ్ దశ దాటి ముందుకెళ్లడం దాదాపుగా అసంభవం. దీంతో ఆడమ్ మిల్నే సీజన్ మొత్తానికే దూరం కావడం ఖాయంగా తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది మెగా వేలంలో మిల్నేను సీఎస్కే 1.9 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీఎస్కే ఏప్రిల్ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో ముంబై పరిస్థితి సీఎస్కేతో పోల్చుకుంటే మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చదవండి: అమితుమీ తేల్చుకోనున్న లక్నో, ఆర్సీబీ.. బలాబలాలు ఎలా ఉన్నాయంటే...? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: రికార్డులు బద్ధలు కొట్టిన చెన్నై, ఆర్సీబీ మ్యాచ్..!
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 12) జరిగిన రసవత్తర మ్యాచ్.. వ్యూయర్షిప్ పరంగా రికార్డులను బద్ధలు కొట్టింది. ఈ మ్యాచ్ ప్రస్తుత సీజన్లో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. సీఎస్కే బ్యాటింగ్ ఆఖరి 5 ఓవర్ల సమయంలో ఈ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 8.2 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే రికార్డు. చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటంతో మ్యాచ్‌కు అమాంతం వ్యూయర్షిప్ పెరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో మ్యాక్స్‌వెల్ (26), షాబాజ్ అహ్మద్ (41), సుయాష్ ప్రభుదేశాయ్ (34), దినేష్ కార్తీక్ (34) పోరాటం చేస్తుండగా కూడా వీక్షకుల సంఖ్య పీక్స్‌కు చేరింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్ 12) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ రంగాల్లో రాణించి సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022: రషీద్ ఖాన్ రేంజ్లో మేము లేము.. ఎస్ఆర్హెచ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ఆర్సీబీ టైటిల్ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..!
Amit Mishra Tweet: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్ 12) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ రంగాల్లో రాణించి సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. Really worried about her parents right now.. #CSKvsRCB pic.twitter.com/fThl53BlTX — Amit Mishra (@MishiAmit) April 12, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచేంతవరకు వరకూ పెళ్లి చేసుకోనంటూ ఓ అమ్మడు ప్లకార్డుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఐపీఎల్ లీడింగ్ వికెట్టేకర్లలో ఒకరైన అమిత్ మిశ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉందంటూ క్యాప్షన్ జోడించిన ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. భారీ స్థాయిలో ట్రోల్స్ పేలుతున్నాయి. మంగమ్మ శపథం చేయకు తల్లీ.. జీవితాంతం సింగిల్‌గానే మిగిలిపోగలవంటూ నెటిజన్లు ఆర్సీబీకి వ్యతిరేకంగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఐపీఎల్ 2022కు సంబంధించి కీలక అప్డేట్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ఆర్సీబీతో తలపడనున్న సీఎస్కే.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..!
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 12) మరో రసవత్తర పోరు జరగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నైసూపర్ కింగ్స్.. పటిష్టమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరి తలపడనున్నాయి. గతేడాది సీఎస్కే టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్ ఈ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సీఎస్కే తమ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోనిని తప్పించి రవీంద్ర జడేజాకు సారధ్య బాధ్యతలు అప్పగించింది. ఈ మ్యాచ్ బరిలోకి దిగే ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు (ధోని, కోహ్లి, డెప్లెసిస్, మ్యాక్స్‌వెల్) ఉండటం మ్యాచ్‌పై హైప్ పెరిగింది. ప్రస్తుత సీజన్లో ఇరు జట్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్కే ఈ మ్యాచ్‌తోనైనా బోణీ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. లీగ్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా సీఎస్కే అత్యధికంగా 18 సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. వ్యక్తిగత రికార్డుల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సీఎస్కే మాజీ సారధి ధోని, ఆర్సీబీ మాజీ కెప్టెన్ కోహ్లిలకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ధోని ఆర్సీబీపై అద్భుతమైన సగటు, స్ట్రైక్‌రేట్‌తో 748 పరుగులు సాధించగా, కోహ్లి.. చెన్నైసూపర్ కింగ్స్‌పై ఏ ఆటగాడికి సాధ్యం కాని విధంగా 9 హాఫ్ సెంచరీల సాయంతో 41 సగటున 962 పరుగులు చేశాడు. నేటి మ్యాచ్‌లో కోహ్లి మరో 38 పరుగులు చేస్తే సీఎస్కేపై 1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. తుది జట్లు (అంచనా): చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, రాజవర్థన్ హంగర్గేకర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగా, సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ చదవండి: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. విజయం ఎవరిది..? -
IPL 2022: లేటు వయసులో లేటెస్ట్ రికార్డు నెలకొల్పిన ధోని
MS Dhoni: గత రెండు ఐపీఎల్ సీజన్లలో జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎట్టకేలకు 2022 ఐపీఎల్ సీజన్లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. కేకేఆర్‌తో జరిగిన 15వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌లో (మార్చి 26) హాఫ్ సెంచరీ కొట్టిన ధోని, లేటు వయసులో ఓ లేటెస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చివరిసారిగా 2019 సీజన్లో ఆర్సీబీపై హాఫ్ సెంచరీ (48 బంతుల్లో 84) చేసిన ధోని.. శనివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఐపీఎల్లో 24వ అర్ధ సెంచరీ నమోదు చేయడంతో పాటు మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అతి పెద్ద వయసులో (40 ఏళ్ల 262 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ (40 ఏళ్ల 116 రోజులు), సచిన్ టెండూల్కర్ (39 ఏళ్ల 362 రోజులు) రికార్డులను అధిగమించాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. సీఎస్కే తరఫున తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగిన ధోని (38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 నాటౌట్) ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కేకేఆర్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ తరఫున రహానే ( 34 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్ ) టాప్ స్కోరర్‌గా నిలువగా, 2 వికెట్లతో రాణించిన ఉమేశ్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: ఇది ధోని అంటే.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు -
"ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. నిజం చేశాడు కదా"
ఐపీఎల్-2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా కేకేఆర్ విజయంలో ఆ జట్టు పేసర్ ఉమేశ్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు రుత్‌రాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేను ఔట్ చేసి చెన్నై జట్టును ఉమేశ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్.. రెండు వికెట్లు పడగొట్టి 20 పరుగులు ఇచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఉమేశ్ యాదవ్ ముందే చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో అది నిజం చేసి చూపించిన యాదవ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. అది నిజం చేశాడు" అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ధోని (50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో రహానే 44 పరుగులతో రాణించాడు.ఈ మ్యాచ్‌లో ఉమేశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! 1st wicket of Tata IPL 2022 by Umesh Yadav #IPL2022 pic.twitter.com/wiDhG1IiBN — Sumedh Shirke (@shirke_sumedh) March 26, 2022 .@y_umesh is adjudged Man of the Match for his bowling figures of 2/20 as @KKRiders win the season opener by 6 wickets. Scorecard - https://t.co/b4FjhJcJtX #CSKvKKR #TATAIPL pic.twitter.com/qEArbeYYse — IndianPremierLeague (@IPL) March 26, 2022 -
IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..!
Bravo, Rahane, Rayudu Eye Big Milestones: ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 26) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ నుంచి సీఎస్కే, కేకేఆర్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. చెన్నై జట్టుకు రవీంద్ర జడేజా, కేకేఆర్‌ను శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సీఎస్కే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటికే 4 టైటిళ్లు సొంతం చేసుకుని మరో టైటిల్ కోసం తహతహలాడుతుండగా, 2 ఐపీఎల్ టైటిళ్లను సాధించిన కేకేఆర్ సైతం కొత్త కెప్టెన్ నేతృత్వంలో ప్రత్యర్ధులకు ఛాలెంజ్ విసురుతుంది. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 26 సార్లు తలపడగా, సీఎస్కే 17, కేకేఆర్ 8 సందర్భాల్లో విజయాలు సాధించాయి. మరో మ్యాచ్‌లో ఫలితంగా తేలలేదు. ఇక, నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అవి ఏంటంటే. సీఎస్కే సీనియర్ బ్యాటర్ అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్ 4000 పరుగుల క్లబ్లో చేరతాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (167) ఈ మ్యాచ్‌లో మరో 4 వికెట్లు తీస్తే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన మలింగ (170 వికెట్లు) రికార్డును బద్దలు కొడతాడు. ఈ సీజన్లో కేకేఆర్ తరఫున ఆడుతున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఐపీఎల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసేందుకు మరో 59 పరుగుల దూరంలో ఉన్నాడు. చదవండి: IPL 2022: శివాలెత్తిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలే..! -
"దీపక్ చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అతడికే ఉంది"
ఐపీఎల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే సీఎస్కే స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడితో పాటు రుత్‌రాజ్ గైక్వాడ్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. సాధరణంగా చాహర్ పేస్ బౌలర్‌గా జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తాడు. అయితే అతడు దూరం కావడంతో అతడి స్ధానాన్ని జట్టులో ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్ధకమైంది. ఈ నేపథ్యంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అండర్-19 బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్‌కు ఉంది అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్ మెగా వేలంలో హంగర్గేకర్ను సీఎస్కే రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక రాజవర్ధన్ హంగర్గేకర్ అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. అతడు బంతితో పాటు బ్యాట్‌తో కూడా దుమ్ము దులిపాడు. "దీపక్ చాహర్ త్వరగా కోలుకోవాలని సీఎస్కే మేనేజేమెంట్ కోరుకుంటుంది. ఒక వేళ అతడు అందుబాటులో లేకుంటే హంగర్గేకర్తో ఆ స్ధానాన్ని భర్తీ చేయవచ్చు. అతడు తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టగలడు. అంతేకాకుండా అతడికి సిక్స్ హిట్టింగ్ చేసే సామర్థ్యం కూడా ఉంది. కాబట్టి చెన్నై విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తాడని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు. చదవండి: WTC Final: అటు ఇంగ్లండ్.. ఇటు ఆస్ట్రేలియా.. టీమిండియాకు అంత ఈజీ కాదు! no looks from hangargekar pic.twitter.com/e4gukWDVtE — ‘ (@Ashwin_tweetz) March 10, 2022 -
IPL 2022: సింగమ్స్ ఇన్ సూరత్.. అప్పుడే రంగంలోని దిగిన ధోని అండ్ కో
CSK Training Camp Starts In Surat: ఐపీఎల్ 2022 ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉండగానే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగింది. సూరత్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో ధోని సేన ప్రాక్టీస్ మొదలెట్టేసింది. సూరత్‌లో పరిస్థితులు ముంబైకి దగ్గరగా ఉంటాయనే కారణంగా ప్రాక్టీస్ సెషన్స్‌ను అక్కడ నిర్వహించాలని సీఎస్కే యాజమాన్యం నిర్ణయించింది. కెప్టెన్ ధోనితో పాటు అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, సి హరి నిషాంత్, తుషార్ దేశ్‌పాండే తదితరులు మార్చి 2నే సూరత్‌లో ల్యాండైనట్లు తెలుస్తోంది. 𝐴𝑏ℎ𝑎𝑟𝑎 Surat! Those eyes that smile with 💛 give us the joy, everywhere we go! #SingamsInSurat #WhistlePodu 🦁 pic.twitter.com/T8xwHjoqeI — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022 బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరంతా మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్న అనంతరం, ఆదివారం స్థానిక లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సింగమ్స్ ఇన్ సూరత్ అనే క్యాప్షన్ జోడించి సీఎస్కే యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. కాగా, మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కరోనా కారణంగా ఈసారి లీగ్ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణేల్లోని స్టేడియాల్లోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. https://t.co/9EmchH33HC #SingamsInSurat 🦁🔥 — 🌈 𝒥𝓊𝒿𝓊 ♡〽️SD🦁 (@Jxjx7x_x) March 7, 2022 చదవండి: ఐపీఎల్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్కేను ఢీకొట్టనున్న కేకేఆర్ -
13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ బ్యాటర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అలీ బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 సిక్స్‌లు, 3ఫోర్లు ఉన్నాయి. అదే విధంగా బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు అలీ చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన అలీ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన చటోగ్రామ్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. చటోగ్రామ్ బ్యాటర్లలో మెహది హసన్(44), అక్బర్ అలీ(33), పరగులుతో రాణించారు. ఇక కొమిల్లా బౌలర్లలో షాహిదుల్ ఇస్లాం, మొయిన్ అలీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా.. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 16 బంతుల్లోనే 57 పరుగులు చేసి కొమిల్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2022లో రూ. 8 కోట్లతో మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
IPL 2022: 'అతడి కోసం వేలంలో యుద్దమే!.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే'
IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా బీసీసీఐ వేలాన్ని నిర్వహించనుంది. మొత్తం 590 మంది ఆటగాళ్లు ఈ మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. దీంట్లో 370 మంది భారత ఆటగాళ్లు, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కాగా వేలానికి ముందు గరిష్టంగా కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకునే అవకాశం ఉండండంతో చాలా మంది స్టార్ ఆటగాళ్లని ఫ్రాంఛైజీలు విడిచి పెట్టాల్సి వచ్చింది. దీంతో చాలా మంది స్టార్ ఆటగాళ్లు వేలంలోకి వచ్చారు. అంతే కాకుండా మరో రెండు కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఫాఫ్ డు ప్లెసిస్‌ను సీఎస్కే రీటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. డు ప్లెసిస్‌ను తిరిగి దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కొన్నేళ్లుగా చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా డుప్లెసిస్ ఉన్నాడు. 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాంఫియన్స్‌గా నిలవడంలో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. "గత సీజన్లో డు ప్లెసిస్‌ను 1.5 కోట్లకు సొంతం చెన్నైసూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సారి అతడి కోసం తీవ్రమైన పోటీ నెలకొననుంది. సీఎస్కే ఈ సారి డు ప్లెసిస్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, గత సారి కంటే చాలా ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వేలంలో అతడికి మంచి డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం. అదే విధంగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్‌కు కూడా వేలంలో భారీ ధర దక్కడం ఖాయం" అని అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Ranji Trophy 2022: టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా! -
"నాకు ఐపీఎల్లో ఆ జట్టుకే ఆడాలి అని ఉంది"
IPL 2022- Ambati Rayudu: ఐపీఎల్-2022 సీజన్‌కు ముందు మెగా వేలం మరి కొద్ది రోజులో జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్ల రీటైన్ జాబితాను ఆయా ఫ్రాంచైజీలు ప్రకటించాయి. కాగా చాలా మంది స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోలేదు. దీంతో రానున్న మెగా వేలానికి ప్రాధన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అంబటి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఐపీఎల్-2022 సీజన్‌కు సీఎస్కే రాయుడిని రీటైన్ చేసుకోలేదు. అయితే, తనకు మాత్రం ఐపీఎల్లో మరో మూడేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడాలని ఉందని రాయుడు మనసులోని మాటను బయటపెట్టాడు. రాబోయే వేలంలో సీఎస్కే తనని కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాని రాయుడు తెలిపాడు. "సీఎస్కే తరుపున ఆడటానికి చాలా ఇష్టపడతాను. నాకైతే ఇప్పటివరకు జట్టు నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే మరోసారి నన్ను కొనుగోలు చేస్తారని భావిస్తున్నాను. అదే విధంగా 2021 సీజన్లో విజయం మాకు చాలా ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఈ విజయంలో నా వంతు పాత్ర పోషించాను. నేను ఏంటో నిరూపించుకోవడానికి సీఎస్కే నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. జట్టులో ఏ స్దానంలోనైనా ఆడటానికి సిద్దంగా ఉన్నాను. మెగా వేలంలో యువ ఆటగాళ్ల కోసం ఎక్కువ పోటీ ఉంటుంది. ఈ ఏడాది వేలం ఆసక్తికరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2021 సీజన్లో రాయుడు 257 పరుగులు సాధించాడు. చదవండి: Ind vs Sa ODI Series: టీమిండియాకు ఎదురుదెబ్బ... వాళ్లిద్దరూ డౌటే.. రుతు, అయ్యర్, షారుఖ్‌కు బంపరాఫర్! -
రాజస్తాన్‌కు బిగ్ షాక్: జట్టును వీడనున్న సంజూ శాంసన్.. సీఎస్కేకు!?
Sanju Samson Joins Chennai Super kings: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ జట్టులో చేరతాడన్న ఆసక్తి అందరిలో ఉండగా.. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు చేరనున్నట్లు సమాచారం. దీనికి కారణం సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్‌ను ఆన్ ఫాలో చేసిన శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫాలో అవుతుండడమే. దీంతో రాజస్తాన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వచ్చేందుకు శాంసన్ ఆసక్తి చూపిస్తున్నాడని వినికిడి. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో 14 మ్యాచ్‌లలో సంజూ 484 పరుగులు చేశాడు. అయితే బ్యాట్స్‌మన్‌గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి.. కెప్టెన్‌గా ఆ జట్టుకు శాంసన్ టైటిల్ అందించకలేకపోయాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్ లో ఐపీఎల్ మెగా వేలం జరిగే అవకాశం ఉంది. చదవండి: Gautam Gambhir: త్వరలో భారత్‌కు టీ20 ప్రపంచకప్ తీసుకువస్తారు... -
నడి సముద్రంలో క్రికెట్..!
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్ గెలుపును కాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ నడి∙సముద్రంలో స్కూబా డైవింగ్ ట్రైనర్లు ప్రదర్శించిన సాహసం శనివారం వెలుగులోకి వచ్చింది. నడి సముద్రంలో బ్యాట్ బాల్ పట్టి క్రికెట్ ఆడుతూ వీరు చేసిన వీడియో వైరల్‌గామారింది. ఇటీవల పుదుచ్చేరిలో స్కూబా డైవింగ్ శిక్షణ పొందుతున్న వారు నడి సముద్రంలో ఓ జంటకు వివాహం చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సంచలనానికి దారి తీసింది. ఈ సాహసాన్ని మరోమారు తలపించే విధంగా డైవింగ్ శిక్షణ పొందిన స్విమ్మర్లు వినాయక చవితిపర్వదినం వేళ గణపయ్య ›ప్రతిమను నడి సముద్రంలో నిమజ్జనం చేసి వార్తల్లోకి ఎక్కా రు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం దుబాయ్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో చెన్నై సూపర్ సింగ్స్ విజయాన్ని కాంక్షిస్తూ, «ధోని సేనకు శుభాకాంక్షలు తెలిపే విధంగా స్విమ్మర్లు నడి సముద్రంలో క్రికెట్‌తో అలరించారు. పుదుచ్చేరి – తమిళనాడుకు చెందిన టెంపుల్ అట్ వెంచర్స్ పేరిట స్కూబా డైవింగ్ శిక్షణలో ఉన్న అరవింద్ నేతృత్వంలోని బృందం ఈ సాహసం చేసింది. చెన్నై శివారులోని నీలంకరై నుంచి పుదుచ్చేరి మధ్యలో 12 నాటికన్ మైళ్ల దూరంలో నడి సముద్రంలో క్రికెట్ ఆడారు. స్టంపులు, బ్యాట్, బాల్ అంటూ అన్ని రకాల సామగ్రితో భద్రతా పరమైన ఏర్పా ట్లతో ఈ బృందం చెన్నై కింగ్స్ ఆటగాళ్లను తలపించే విధంగా జెర్సీ ధరించి సముద్రంలో క్రికెట్ ఆడారు. ఈ వీడియో శనివారం వైరల్‌గా మారింది. ఫైనల్స్ లో చెన్నైకింగ్స్ విజయ కేతనంతో ఈ స్కూబా డైవింగ్ ట్రైనర్లే కాదు, తమిళ క్రీడాభిమానులూ ఆనంద సాగరంలో మునిగిపోయారు. -
ఇద్దరు చిన్నారులకు బాల్ గిప్ట్గా ఇచ్చిన ధోని.. వీడియో వైరల్
Ms Dhoni Gifts The Match ball to Two Young Fans: మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ అనంతరం ధోనీ మ్యాచ్ బాల్‌పై సంతకం చేశాడు. అయితే ఆ బంతిని స్టాండ్స్‌లో ఉన్న ఇద్దరు చిన్నారులకు ధోని గిప్ట్గా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ధోని 6 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి జట్టును తొమ్మిదోసారి ఫైనల్‌కు చేర్చాడు. చదవండి: Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్ ఫినిషర్.. ధోనిపై ప్రశంసల జల్లు Dhoni's gift to his littles big hearted Fans pic.twitter.com/zbxcPvb9aW — Ashok Rana (@AshokRa72671545) October 10, 2021 -
ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’
Glenn Phillips: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్తాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేయడానికి వచ్చిన సామ్ కరన్.. తన రెండో డెలివరీ వేసే క్రమంలో అతడి చేతి బంతి నుంచి జారిపోయి వైడ్ దిశగా పైకి వెళ్లింది. అయితే స్ట్రైక్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఆ బంతిని ఎదుర్కోవడానకి క్రీజు వదిలి చాలా దూరం వెళ్లాడు. అయినప్పటికీ బంతిని అందుకోలేక చతికల పడ్డాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను నవ్వులు పూయిస్తుంది. ఫిలిప్స్ ‘ఫీట్’పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పరుగుల కోసం ఎంత దూరమైనా సిద్ధమా అని కొందరు.. ఏంటి ఫిలిప్స్ అంత దూరం వెళ్తున్న బంతిని కూడా వదలవా? అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఫిలిప్స్ ఆత్రం చూసి సామ్ నోరెళ్లబెట్టాడు అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సాధించింది. యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివమ్ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్‌ను గెలిపించాయి. దీంతో ప్లేఆఫ్ ఆశలను రాయల్స్ సజీవంగా నిలుపుకుంది. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే pic.twitter.com/I4heCusEzr — Jabjabavas (@jabjabavas) October 2, 2021 -
ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్.. జడేజాపై ప్రశంసల వర్షం
Ravindra Jadeja Earns Praise From Former Cricketers: ఐపీఎల్2021 ఫేజ్2లో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఖరి బంతికి చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నైకు ఒంటి చేత్తో గెలుపునందించాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలోనూ సూపర్ పెర్ఫార్మెన్స్తో కోల్‌కతా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ క్రమంలో మాజీలు, క్రికెట్ నిపుణులు జడేజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జడేజా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అంటూ భారత మాజీ ఆటగాడు బద్రీనాథ్ ట్విట్టర్లో అభినందించాడు. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా జడేజాను ప్రశంసించాడు. "చెన్నై అద్భుతమైన విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లోను ఆదరగొట్టిన జడేజా.. చెన్నైను పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిపాడు" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కాగా జడేజా కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 22 పరుగులు చేశాడు. 19వ ఓవర్ వేసిన ప్రసీద్ కృష్ణ బౌలింగ్‌లో 2ఫోర్లు, 2 సిక్స్‌లుతో జడేజా 22 పరుగులు రాబట్టాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ సమీకరణం 6 బంతుల్లో 4 పరుగులుగా మారిపోయింది. అయితే.. అఖరి ఓవర్ వేసిన నరైన్ తొలి ఐదు బంతులకీ మూడు పరుగులే ఇచ్చి శామ్ కరన్ (4), జడేజాని ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. కానీ.. చివరి బంతికి సింగిల్ తీసిన చాహర్.. చెన్నై సూపర్ కింగ్స్‌ని విజయతీరాలకు చేర్చాడు. చదవండి: Virender Sehwag: అతడిని టీ20 వరల్డ్ కప్ నుంచి ఎందుకు తప్పించారో తెలియదు! What a magnificent victory for Chennai. Ravindra Jadeja top class with bat and ball and Chennai are top of the table. After the situation last year, what a comeback. Just stand up and applaud #WhistlePodu #CSKvsKKR pic.twitter.com/IVK3KtHjVE — Virender Sehwag (@virendersehwag) September 26, 2021 -
డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్... వీడియో వైరల్
Faf Du Plessis Takes A Brillint Catch: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ అధ్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ వేసిన జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ లాంగాన్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్ బ్యాలన్స్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా ప్రస్తుతం13 ఓవర్లో మూడో వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ప్రస్తుతం నితీశ్ రాణా(9), ఆండ్రీ రసెల్(2) క్రీజులో ఉన్నారు. చదవండి: T20 World Cup: కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.. నేనైతే #CSKvKKR catch by faf 😍 Credits - @DisneyPlusHS pic.twitter.com/0hb1ZW0NSl — Jr.Power_STAR ⭐😎🤙 (@nithishjackson) September 26, 2021 -
Viral Video: విజిల్ వేసి అభిమానులను ఉత్సాహపరిచిన ధోని..
దుబాయ్: ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్,ముంబై ఇండియన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. ఈ నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని అభిమానులను తనదైన శైలిలో ఉత్సాహపరిచాడు. సీఎస్కే అంటేనే విజిల్ పోడు అనేలా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ధోని ఈల వేశాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🦁 Ready to roar & the 🕢 is ticking! 🔊 Namma Music ah Eraku le🎶#CSKvMI #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/lBR0QvNgjj — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) September 19, 2021 -
ముంబైతో మ్యాచ్.. సీఎస్కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!
Faf Du Plessis call on His selection MI Game: దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ మధ్య జరగునున్న మ్యాచ్‌తో మరి కొద్ది గంటల్లో ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్ అందించింది. గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫాప్ డుప్లెసిస్ తుది జట్టు ఎంపికకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథ్ తెలిపారు . ఆయన మాట్లడూతూ.. క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ సెషన్ కోసం డుప్లెసిస్ జట్టులో చేరాడని అన్నారు. ఈ నేపథ్యంలో ముంబైతో జరగునున్న మ్యాచ్ తుది జట్టు ఎంపికలో డుప్లెసిస్ అందుబాటులో ఉంటాడని.. ఒక వేళ ఫిట్నెస్ పరీక్షలో నెగ్గక పోతే అతని స్ధానంలో రాబిన్ ఉతప్పను తుది జట్టులో తీసుకుంటామని కాశీ విశ్వనాథ్ చెప్పారు. కాగా గజ్జల్లో గాయం కారణంగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ మధ్యలో నుంచి డుప్లెసిస్ తప్పకున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: తొలి భాగం మొత్తం వీళ్లదే.. రాహుల్ మెరుపులు.. గబ్బర్ గర్జన.. సంజూ శతక్కొట్టుడు . -
IPL 2021: అహ్మదాబాద్‌లో ఆగిన ఆట
కరోనా దెబ్బతో అర్ధాంతరంగా ఆగిన ఐపీఎల్ అభిమానులను అలరించేందుకు మరోసారి వచ్చేసింది. 2020లో యూఏఈలో విజయవంతంగా నిర్వహించినా... బీసీసీఐ అతి విశ్వాసం కారణంగా ఈ ఏడాది భారత్‌లోనే లీగ్ మొదలైంది. చివరకు కోవిడ్ దెబ్బకు టోర్నీని సగంలోనే ఆపి వేయాల్సి వచి్చంది. అయితే లీగ్‌తో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయలను దృష్టిలో ఉంచుకుంటూ మళ్లీ యూఏఈనే నమ్ముకున్న బోర్డు, విరామం తర్వాత మళ్లీ పోటీలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరిగే పోరుతో లీగ్ పునః ప్రారంభం కానుంది. దుబాయ్: ఐపీఎల్ తాజా సీజన్లో మే 2న అహ్మదాబాద్‌లో ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. మే 4న కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా... నైట్‌రైడర్స్ టీమ్‌లోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా పాజిటివ్‌గా తేలారు. దాంతో ఆ మ్యాచ్‌ను షెడ్యూల్ నుంచి తప్పించిన గవరి్నంగ్ కౌన్సిల్ తర్వాతి రోజు లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. ఆపై మన దేశంలో కరోనా రెండో వేవ్ ఉధృతంగా కొనసాగడంతో భారత్‌లో టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేలిపోయింది. దాంతో చర్చోపర్చల అనంతరం భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుంటూ బీసీసీఐ రెండో దశ పోటీల షెడ్యూల్ విడుదల చేసింది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన అనంతరం ఇప్పుడు ధనాధన్ క్రికెట్‌తో సగటు అభిమానులకు ధనాధన్ వినోదం లభించనుంది. అక్టోబర్ 15న ఫైనల్... ఒక్కో సీజన్ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ సహా మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ అర్ధాంతరంగా ఆగిపోయే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిశాయి. అంటే 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుంది. తొలి దశతో పోలిస్తే వేదికలు మారడమే కాకుండా పలు జట్లలో కూడా మార్పులు జరిగాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో కూడా ఆ తేడా కనిపిస్తుంది కాబట్టి తొలి దశలో జోరు ప్రదర్శించిన జట్లు ఇక్కడా దానినే కొనసాగించగలవా లేదా అనేది ఆసక్తికరం. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న టీమ్‌లు కూడా పుంజుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రతీ జట్లలో కొందరు కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. తొలి దశలో ఆడిన ప్యాట్ కమిన్స్ (కోల్‌కతా), స్టోక్స్, బట్లర్ (రాజస్తాన్), బెయిర్‌స్టో (సన్‌రైజర్స్), వోక్స్ (ఢిల్లీ), వాషింగ్టన్ సుందర్ (బెంగళూరు) వేర్వేరు కారణాలతో ఇప్పుడు బరిలోకి దిగడం లేదు. తొలి దశ పోటీలకు దూరమైన శ్రేయస్ అయ్యర్, నటరాజన్ ఈసారి ఆడనుండగా... షమ్సీ, హసరంగ, చమీరా, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ ఎలిస్, రషీద్, టిమ్ డేవిడ్, లూయీస్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్లో కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా నగరాల్లో జరిగే ఈ మ్యాచ్‌లలో స్థానిక ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తుండటం విశేషం. -
లండన్ నుంచి దుబాయ్‌కి చేరనున్న సీఎస్కే ఆటగాళ్లు
దుబాయి: ఇంగ్లండ్‌తో జరగల్సిన 5 టెస్ట్ మ్యాచ్ కరోనా కారణంగా రద్దుకావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమైన భారత ఆటగాళ్లను శనివారం నాటికి దుబాయ్‌కి తీసుకెళ్లాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ దృవీకరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, చేతేశ్వర్ పూజారా సీఎస్కే ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు చేరనున్నారు అని తెలిపారు. భారత శిక్షణా బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో గడుపుతారని కాశీ విశ్వనాథ్ చెప్పారు. సిఎస్కే జట్లులో భాగమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు మొయిన్ అలీ, సామ్ కుర్రాన్ అదే విమానంలో తమ సహచరులతో చేరతారా లేదా తరువాత దుబాయికి వస్తారా అనేది ఆయన సృష్టత ఇవ్వలేదు. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ నుంచి యూఏఈ వచ్చే ప్రతి ఆటగాడు వాళ్ల జట్టుతో బయోబబుల్ చేరడానికి ముందు ఆరు రోజుల క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా బయో బబుల్ నుంచి బయో బబుల్ ట్రాన్స్ఫర్కి అనుమతి ఉన్నా, భారత బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. చదవండి: చెలరేగిన లాథమ్ ..చివరి టీ20లో కివీస్ గెలుపు UK నుండి UAE కి వచ్చే ప్రతి ఆటగాడు జట్టు బుడగలలో చేరడానికి ముందు ఆరు రోజుల నిర్బంధంలో ఉండాల్సి ఉంటుందని BCCI మాకు తెలియజేసింది. సహజంగానే, UK నుండి UAE కి బబుల్-టు-బబుల్ బదిలీ అనేది ప్రస్తుత దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకోదు, ”అని ఫ్రాంచైజ్ అధికారి ఒకరు తాజా గా పేర్కొన్నారు. UK నుండి తమ ఆటగాళ్లను ఎయిర్‌లిఫ్టింగ్ చేస్తున్న అనేక ఫ్రాంచైజీల గురించి మాట్లాడుతూ, RCB తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు ఏస్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కోసం చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వారు శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో UK నుండి దుబాయ్ వెళ్తారు. ఆటగాళ్ల సురక్షిత రవాణా వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జట్టు మూలం జోడించింది. -
చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం
దుబాయ్: ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లకు వ్యక్తిగత కారణాల చేత దూరమైన ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్.. యూఏఈ వేదికగా జరుగనున్న రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎస్కే ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఆసీస్ స్పీడ్‌స్టర్ రాకతో చెన్నై జట్టులో జోష్ పెరిగిందని, తమ పేస్ విభాగం మరింత పదునెక్కిందని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ శనివారం మీడియాకు వెల్లడించారు. కాగా, జోష్ హేజిల్‌వుడ్ ఇటీవల బంగ్లాదేశ్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో మంచి ఫామ్‌ను కనబర్చాడు. అతనాడిన నాలుగు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జోష్ అదే ఫామ్‌ను కొనసాగించాలని సీఎస్కే కోరుకుంటోంది. జోష్ రాకతో చెన్నై ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జోష్ హేజిల్‌వుడ్‌ను సీఎస్కే యాజమాన్యం ఐపీఎల్ 2020కు ముందు రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్లో అతడు మూడు మ్యాచ్‌లే ఆడాడు. జట్టులో పేసర్లు ఎక్కువగా ఉండడం, విదేశీ ఆటగాళ్ల కోటా పరిమితుల కారణంగా అతడికి ఆడే అవకాశం లభించలేదు. ఇక ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లకు ముందు అతడు వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ఆసీస్‌కే చెందిన జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ సీఎస్కే జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం సీఎస్కే జట్టులో సామ్ కర్రన్, లుంగి ఎంగిడి, డ్వేన్ బ్రేవో, జోష్ హేజిల్‌వుడ్ వంటి విదేశీ ఫాస్ట్ బౌలర్లు, దీపర్ చాహర్, శార్దూల్ ఠాకూర్ వంటి దేశీయ స్టార్ పేసర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, సెప్టెంబరు 19 ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచ్‌ల కోసం చెన్నై సూపర్ కింగ్స్ సహా పలు జట్లు ఇప్పటికే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. సీఎస్కే కెప్టెన్ ధోని, రైనా, అంబటి రాయుడు సహా పలువురు ఆటగాళ్లు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు) నిలిచింది. చదవండి: ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్! -
ఐపీఎల్-14 ఫేజ్2 షెడ్యూల్ ఇదే.. ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్
ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ రీషెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఐపీఎల్-14 ఫైజ్2 తేదీలను వెల్లడించింది. ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్లో 29 మ్యాచ్‌లు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా జరగనున్నాయి. మెదటి మ్యాచ్ ఢిపిండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. నూతన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్, అక్టోబర్ 15న దుబాయి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. BCCI announces schedule for remainder of VIVO IPL 2021 in UAE. The 14th season, will resume on 19th September in Dubai with the final taking place on 15th October. More details here - https://t.co/ljH4ZrfAAC #VIVOIPL — IndianPremierLeague (@IPL) July 25, 2021 -
ప్రముఖ నటితో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడి ప్రేమాయణం..?
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రముఖ సీరియల్ నటితో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరాఠి బుల్లితెరపై పాపులర్ అయిన సయాలి సంజీవ్‌తో ఈ చెన్నై ఆటగాడు ప్రేమాయణం సాగిస్తున్నాడన్న విషయంపై నెట్టింట విస్తుృతంగా చర్చ నడుస్తోంది. జీ మరాఠిలో వచ్చే ‘కహ్ దియా పర్దేస్'తో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సయాలీ..'గౌరీ' తదితర సీరియళ్లతో మరింత పాపులర్ అయ్యింది. స్వతాహాగా మోడల్ అయిన సయాలీ.. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తోంది. కాగా, ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా రుతురాజ్, సయాలీ మధ్య జరిగిన సంభాషణ చూస్తే వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందన్న విషయం అర్థమవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. సయాలి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలపై తొలుత రుతురాజ్ స్పందిస్తూ.. "వావ్" అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సయాలీ బదులిస్తూ.. లవ్ సింబల్స్‌తో ఉన్న ఏమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరి మధ్య ఏదో నడుసోందన్న వార్తలు గుప్పుమన్నాయి. సయాలి అందానికి రుతురాజ్ క్లీన్ బౌల్డయ్యాడంటూ నెట్టింట మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే, ఆ పుకార్లను రుతురాజ్ పరోక్షంగా ఖండించాడు. బౌలర్లు తప్ప తననెవరూ బౌల్డ్ చేయలేరని, ఈ విషయం అర్ధం కావాల్సిన వాళ్లకు అర్ధమవుతుందని మరాఠీలో కామెంట్ చేశాడు. దీంతో ఈ లవ్ రూమర్స్‌కు ఆదిలోనే బ్రేక్ పడినట్లైంది. రుతురాజ్ పైకి ఇలా స్పందిస్తున్నా లోపలో మాత్రం ఏదో నడుస్తోందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రకు చెందిన రుతురాజ్.. గత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలో కరోనా బారిన పడటంతో జట్టుకు దూరమైన రుతురాజ్.. సీజన్ ఎండింగ్లో వరుస హాఫ్ సెంచరీలతో అలరించాడు. ప్రస్తుత సీజన్లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతను.. 128.94 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు సాధించాడు. చదవండి: కోహ్లి 70 సెంచరీలు చేశాడు.. మరి నువ్యు..? -
అత్యంత చెత్త రికార్డు సమం చేసిన ఆర్సీబీ బౌలర్
ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును సమం చేశాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని, 2011 సీజన్లో కొచ్చి టస్కర్స్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ 37 పరుగల చెత్త రికార్డును ఈక్వల్ చేశాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను(15 వికెట్లు) సొంతం చేసుకున్న హర్షల్ పటేల్.. ఈ మ్యాచ్‌లో మొదటి మూడు ఓవర్ల పాటు చాలా పొదుపుగా బౌలింగ్(14 పరుగలు) చేసి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్లో జడ్డూ విశ్వరూపం ప్రదర్శించడంతో హర్షల్ తేలిపోయాడు. జడేజా ధాటికి అతను 5 సిక్స్‌లు, ఒక ఫోర్, డబుల్ నోబాల్‌తో కలిపి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. గతంలో క్రిస్ గేల్ ధాటికి పరమేశ్వరన్ కూడా ఒకే ఓవర్లో 37 పరుగుల సమర్పించుకున్నాడు. పరమేశ్వరన్ బౌలింగ్‌లో గేల్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లు బాది 36 పరుగులు పిండుకున్నాడు. ఇందులో ఒక నోబాల్ ఉంది. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో వీరి తర్వాత స్థానాల్లో పంజాబ్ బౌలర్ పర్వీందర్ ఆవానా(33 పరుగులు), పంజాబ్ బౌలర్ రవి బొపారా(33 పరుగులు) ఉన్నారు. ఆవానా బౌలింగ్‌లో చెన్నై ఆటగాడు రైనా 2 సిక్సర్లు, 5 ఫోర్లు, ఓ నోబాల్ కలిపి 33 పరుగుల రాబట్టగా, బొపారా బౌలింగ్‌లో గేల్ 4 సిక్సర్లు, 7 వైడ్లు, 2 సింగల్స్‌తో కలిపి 33 పరుగులు పిండుకున్నాడు. చదవండి: భజ్జీ.. సెలబ్రిటీలకు మాత్రమే రిప్లై ఇస్తావా? -
సీఎస్కే అసలుసిసలైన ఆల్‌రౌండర్ అతనే..
ముంబై: మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా పరుగులు రాబట్టడమేకాకుండా, తన కోటా ఓవర్లను విజయవంతంగా పూర్తి చేస్తూ కీలకమైన వికెట్లు పడగొడుతున్న సీఎస్కే ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కీలకమైన వన్‌డౌన్‌లో రాణిస్తూ, బౌలర్ పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మొయిన్ అలీ ఈ సీజన్లో సీఎస్కే అసలుసిసలైన ఆల్‌రౌండర్‌గా అవతరించాడని ఆకాశానికెత్తాడు. ప్రస్తుత సీజన్లో చెన్నై ఆడిన మూడో మ్యాచ్‌ల్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి వరుసగా 36, 46, 26 పరుగులు స్కోర్ చేసిన మొయిన్.. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు కీలకమైన వికెట్లు(మిల్లర్, రియాన్ పరాగ్, మోరిస్) పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాశించాడని కొనియాడాడు. మొయిన్ లాంటి అసలుసిసలైన ఆల్‌రౌండర్ లేని కారణంగానే గత సీజన్లో చెన్నై ఆఖరి స్థానానికి పడిపోయిందని పేర్కొన్నాడు. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన మొయిన్ అలీని దక్కించుకోవడం సీఎస్కేకి కలిసొచ్చిందని, మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో అతని ఆల్‌రౌండ్ ప్రతిభ జట్టుకు మేలుచేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత సీజన్లో 3 మ్యాచ్‌ల్లో 108 విలువైన పరుగులతో పాటు 4 కీలకమైన వికెట్లు పడగొట్టిన మొయిన్..చెన్నై తరుపు ముక్కగా మారాడని ప్రశంసించాడు. అలాగే ఫామ్‌లోని లేని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఫ్లెమింగ్ వెనకేసుకొచ్చాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా రుతురాజ్ టెక్నిక్ పరంగా ఉత్తమ ప్లేయర్ అని కొనియాడాడు. రుతురాజ్‌కు మరిన్ని అవకాశలు కల్పిస్తామని, ఆతరువాతే ఉతప్పకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నాడు. జట్టులో ఎవ్వరూ భారీ స్కోర్లు సాధించకపోయినా.. ఆయా ఆటగాళ్లు తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయం సాధించిన సీఎస్కే.. బుధవారం(ఏప్రిల్ 21న) జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. చదవండి: డబ్యూటీసీ ఫైనల్ యధావిధిగా జరుగుతుంది: ఐసీసీ -
IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్...
ఒకరిద్దరు కాకుండా... కలసికట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 33 దాటకున్నా వచ్చిన వారందరూ క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడేసి తమవంతు పరుగులు చేసేసి వెళ్లారు. దాంతో చెన్నై జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. అనంతరం బౌలింగ్‌లోనూ చెన్నై సమష్టిగా మెరిసింది. మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ‘స్పిన్’తో తిప్పేయగా... పేస్‌తో స్యామ్ కరన్, శార్దుల్, బ్రావో హడలెత్తించారు. వెరసి ఐపీఎల్లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ముంబై: ఆల్‌రౌండ్ షోతో అలరించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వాంఖెడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని సీఎస్కే 45 పరుగుల ఆధిక్యంతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చెయ్యి వేశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌ను చెన్నై బౌలర్లు మొయిన్ అలీ (3/7), స్యామ్ కరన్ (2/24), రవీంద్ర జడేజా (2/28) కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరిసిన టాపార్డర్ టాస్ ఓడి సీఎస్కే బ్యాటింగ్‌కు దిగగా... రుతురాజ్ గైక్వాడ్ (10) మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ డు ప్లెసిస్ మాత్రం తన బ్యాట్‌ను స్వేచ్ఛగా ఝుళిపించాడు. ఉనాద్కట్ వేసిన ఐదో ఓవర్లో రెచ్చిపోయిన డు ప్లెసిస్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అయితే అదే దూకుడును కొనసాగించలేకపోయిన అతడు... మోరిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ పాయింట్ వద్ద పరాగ్ చేతికి చిక్కాడు. మరో ఎండ్‌లో ఉన్న మొయిన్ అలీ కూడా దూకుడుగా ఆడాడు. ముస్తఫిజుర్ వేసిన ఏడో ఓవర్లో షార్ట్ థర్డ్‌మ్యాన్, డీప్ మిడ్‌వికెట్ దిశగా రెండు బౌండరీలు బాదిన అలీ... ఆ మరుసటి ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ఫ్లాట్ సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే అలీ కూడా డు ప్లెసిస్లాగే తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోరు చేయడానికి ఉపయోగించుకోలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 82/3గా ఉంది. ఈ దశలో రైనా, రాయుడు కూడా హిట్టింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. 14వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సకారియా... ఆ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి రాయుడు, రైనాలను అవుట్ చేసి రాజస్తాన్‌కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ధోని (18), జడేజా (8) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరగా... చివర్లో బ్రావో (8 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్)... స్యామ్ కరన్ (6 బంతుల్లో 13; 1 సిక్స్) 14 బంతుల్లో 33 పరుగులు జోడించారు. బట్లర్ బాదినా... ఛేదనలో రాజస్తాన్ రాయల్స్‌ను స్యామ్ కరన్ దెబ్బ కొట్టాడు. తన వరుస ఓవర్లలో మనన్ వోహ్రా (14), కెప్టెన్ సామ్సన్ (1)లను అవుట్ చేసి చెన్నైకి శుభారంభం చేశాడు. మరో ఎండ్‌లో బట్లర్ బౌండరీలు బాదేస్తూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా... అతనికి శివమ్ దూబే (17; 2 ఫోర్లు) సహకరించాడు. దాంతో రాజస్తాన్ 10 ఓవర్లు ముగిసేసరికి 81/2గా నిలిచింది. 12వ ఓవర్ వేసిన జడేజా... మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గుడ్‌లెంగ్త్ బాల్‌తో బట్లర్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి దూబేను ఎల్బీగా అవుట్ చేసి మ్యాచ్‌ను సీఎస్కే వైపు తిప్పాడు. ఆ తర్వాత ఆశలు పెట్టుకున్న మిల్లర్ (2), పరాగ్ (3), మోరిస్ (0)లను మొయిన్ అలీ అవుట్ చేయడంతో... ఒకదశలో 87/2గా ఉన్న రాజస్తాన్ 8 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి 95/7గా నిలిచింది. చివర్లో తెవాటియా (20; 2 సిక్స్‌లు), ఉనాద్కట్ (24; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా ఫలితం లేకపోయింది. వావ్... ధోని 40 ఏళ్లకు చేరువలో ఉన్నా ధోని ఫిట్‌నెస్‌లో మాత్రం ఏ మార్పు లేదు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని... ఆ ఏడాది జరిగిన ఐపీఎల్లో తప్ప క్రికెట్ ఆడింది లేదు. అయినా సరే వికెట్ల వెనుక, వికెట్ల మధ్య అతడి వేగం ఏ మాత్రం తగ్గలేదు. ఈ విషయం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి నిరూపితమైంది. ఏడో నెంబర్లో బ్యాటింగ్ వచ్చిన ధోని... 15వ ఓవర్ రెండో బంతిని షార్ట్ ఎక్స్ట్రా కవర్లోకి ఆడి పరుగు కోసం పిచ్ మధ్య వరకు వచ్చాడు. అయితే బంతి బట్లర్ వద్దకు వెళ్లడంతో పరుగు వద్దంటూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న జడేజా ధోనిని వారించాడు. బట్లర్ రాకెట్ వేగంతో బంతిని కీపర్‌కు విసరగా... రెప్పపాటులో ధోని... వెనక్కి తిరిగి సామ్సన్ వికెట్లను గిరాటేసేలోపు సూపర్ డైవ్‌తో క్రీజును చేరుకున్నాడు. దాంతో అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) శివమ్ దూబే (బి) ముస్తఫిజుర్ 10; డు ప్లెసిస్ (సి) పరాగ్ (బి) మోరిస్ 33; మొయిన్ అలీ (సి) పరాగ్ (బి) తెవాటియా 26; రైనా (సి) మోరిస్ (బి) సకారియా 18; రాయుడు (సి) పరాగ్ (బి) సకారియా 27; జడేజా (సి) సామ్సన్ (బి) మోరిస్ 8; ధోని (సి) బట్లర్ (బి) సకారియా 18; స్యామ్ కరన్ (రనౌట్) 13; బ్రావో (నాటౌట్) 20; శార్దుల్ ఠాకూర్ (రనౌట్) 1; దీపక్ చహర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–25, 2–45, 3–78, 4–123, 5–125, 6–147, 7–163, 8–174, 9–180. బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 4–0–40–0; చేతన్ సకారియా 4–0–36–3; ముస్తఫిజుర్ 4–0–37–1; మోరిస్ 4–0–33–2; రాహుల్ తెవాటియా 3–0–21–1; రియాన్ పరాగ్ 1–0–16–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) జడేజా 49; మనన్ వొహ్రా (సి) జడేజా (బి) స్యామ్ కరన్ 14; సామ్సన్ (సి) బ్రావో (బి) స్యామ్ కరన్ 1; శివమ్ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 17; మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మొయిన్ అలీ 2; పరాగ్ (సి) జడేజా (బి) మొయిన్ అలీ 3; తెవాటియా (సి) రుతురాజ్ (బి) బ్రావో 20; మోరిస్ (సి) జడేజా (బి) మొయిన్ అలీ 0; ఉనాద్కట్ (సి) జడేజా (బి) శార్దుల్ ఠాకూర్ 24; సకారియా (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–30, 2–45, 3–87, 4–90, 5–92, 6–95, 7–95, 8–137, 9–143. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–0; స్యామ్ కరన్ 4–0–24–2; శార్దుల్ ఠాకూర్ 3–0–20–1; జడేజా 4–0–28–2; బ్రావో 3–0–28–1; మొయిన్ అలీ 3–0–7–3. -
IPL 2021 CSK vs PBKS: చెన్నై చమక్..
బౌలింగ్‌లో దీపక్ చహర్ మ్యాజిక్ స్పెల్... ఫీల్డింగ్‌లో జడేజా విన్యాసాలు... వెరసి రెండు కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పైచేయి సాధించింది. ఎలాంటి ఉత్కంఠభరిత క్షణాలు లేకుండా ఏకపక్షంగా ముగిసిన ఈ పోరులో నెగ్గి ఐపీఎల్ తాజా సీజన్లో ధోని జట్టు బోణీ కొట్టింది. ముంబై: వారం రోజులుగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో... ఊహించని ట్విస్ట్‌లతో అలరించిన ఐపీఎల్ తాజా సీజన్‌కు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్ల మధ్య మ్యాచ్ రూపంలో స్పీడ్ బ్రేకర్ తారసపడింది. మెరుపులు, అనూహ్య మలుపులు లేకుండానే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని సీఎస్కే 6 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై విజేతగా నిలిచి గెలుపు ఖాతాను తెరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (4/13) బెంబేలెత్తించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. షారుఖ్ ఖాన్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్యామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావోలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మొయిన్ అలీ (31 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్)... డు ప్లెసిస్ (33 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. నింపాదిగా... స్వల్ప ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్‌ను సీఎస్కే త్వరగానే కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మొయిన్ అలీ... డు ప్లెసిస్‌తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. గతి తప్పిన బంతులను బౌండరీలకు బాది పవర్‌ప్లేలో 32 పరుగులు సాధించారు. డు ప్లెసిస్ సింగిల్స్ తీస్తూ అలీకే స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. దాంతో కాస్త దూకుడు కనబర్చిన అలీ... అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్, మెరిడిత్ బౌలింగ్‌లలో మూడు ఫోర్లు బాదాడు. దాంతో సీఎస్కే ఛేజింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగింది. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన అలీ... అదే ఓవర్లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి షారుఖ్ ఖాన్ చేతికి చిక్కాడు. దాంతో 66 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రైనా (8), రాయుడు (0) వరుస బం తుల్లో అవుటైనా... క్రీజులోకి వచ్చిన స్యామ్ కరన్ (5 నాటౌట్) బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. షారుఖ్ ఖాన్ మినహా... తన ఐపీఎల్ కెరీర్లో రెండో మ్యాచ్ ఆడిన షారుఖ్ ఖాన్ మినహా పంజాబ్ కింగ్స్‌లో ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు సాధించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (5), క్రిస్ గేల్ (10), దీపక్ హుడా (10)లతో పాటు ఓపెనర్ మయాంక్ (0), నికోలస్ పూరన్ (0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో పంజాబ్ 10 ఓవర్లు ముగిసేసరికి 48/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న కొత్త కుర్రాడు షారుఖ్ ఖాన్... జే రిచర్డ్సన్ (15; 2 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు, మురుగన్ అశ్విన్ (6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అడపాదడపా బౌండరీలు కొట్టిన షారుఖ్ ఖాన్ పంజాబ్ స్కోరు 100 దాటేలా చేశాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన అతడు చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (రనౌట్) 5; మయాంక్ అగర్వాల్ (బి) దీపక్ చహర్ 0; గేల్ (సి) జడేజా (బి) దీపక్ చహర్ 10; దీపక్ హుడా (సి) డు ప్లెసిస్ (బి) చహర్ 10; పూరన్ (సి) శార్దుల్ ఠాకూర్ (బి) చహర్ 0; షారుఖ్ ఖాన్ (సి) జడేజా (బి) స్యామ్ కరన్ 47; జే రిచర్డ్సన్ (బి) మొయిన్ అలీ 15; మురుగన్ అశ్విన్ (సి) డు ప్లెసిస్ (బి) బ్రావో 6; షమీ (నాటౌట్) 9; మెరిడిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–19, 4–19, 5–26, 6–57, 7–87, 8–101. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–13–4, స్యామ్ కరన్ 3–0–12–1, శార్దుల్ ఠాకూర్ 4–0–35–0, జడేజా 4–0–19–0, మొయిన్ అలీ 3–0–17–1, బ్రావో 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) దీపక్ హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 5; డు ప్లెసిస్ (నాటౌట్) 36; మొయిన్ అలీ (సి) షారుఖ్ ఖాన్ (బి) మురుగన్ అశ్విన్ 46; సురేశ్ రైనా (సి) రాహుల్ (బి) షమీ 8; అంబటి రాయుడు (సి) పూరన్ (బి) షమీ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–24; 2–90, 3–99, 4–99. బౌలింగ్: షమీ 4–0–21–2, జే రిచర్డ్సన్ 3–0–21–0, అర్‡్షదీప్ సింగ్ 2–0–7–1, మెరిడిత్ 3.4–0–21–0, మురుగన్ అశ్విన్ 3–0–32–1. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X ముంబై ఇండియన్స్ వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
నాడు గుంపులో గోవిందా.. నేడు అదే గుంపుచే..?
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విన్నింగ్ షాట్ బౌండరీగా బాది తన జట్టును విజయతీరాలకు చేర్చిన ఢిల్లీ కెప్టెన్ పంత్‌ను చెన్నై ఆటగాళ్లు ఊహించని రీతిలో సత్కరించారు. మ్యాచ్ అనంతరం పంత్ పెవిలియన్ చేరుకునే క్రమంలో చెన్నై ఆటగాళ్లు అతన్ని ఘనంగా సన్మానించారు. పంత్ ముందు నడుస్తుండగా చెన్నై సభ్యులు అతని వెనుకనడుస్తూ అతనికి జేజేలు పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా పంత్‌కు సంబంధించిన మరో ఫోటో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో చెన్నై జట్టు గెలుపు సంబురాలు చేసుకుంటున్న తరుణంలో ప్రత్యర్ధి జట్టు సభ్యుడైనా పంత్, వారితో కలిసి సంబురాల్లో పాలుపంచుకుంటున్న ఫోటో అది. పంత్ అభిమానులు ఈ ఫోటోను, గత మ్యాచ్‌లో పంత్‌కు జరిగిన సన్మానికి సంబంధించిన ఫోటోను పోల్చుతూ రకరకాల కామెంట్లు చేశారు. ఇతరుల గెలుపును కూడా సెలబ్రేట్ చేసుకోగలిగితే, మనకు కూడా ఓ రోజు వస్తుంది. ఆ రోజు పంత్‌కు త్వరగా వచ్చిందంటూ కామెంట్లు చేశారు. ఈ రెండు ఫోటోలను కంపేర్ చేస్తూ అభిమానులు చేస్తున్న హడావిడి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇదిలా ఉండగా, టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ రిషబ్ పంత్‌కు 2021 సంవత్సరం బాగా కలిసొచ్చింది. గతేడాది ఆసీస్ పర్యటనలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న ఈ 23 ఉత్తరాఖండ్ కుర్రాడు.. ఆ సిరీస్ మొత్తంలో అదరగొట్టి, టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి నుంచి వెనుతిరిగి చూడని ఈ ఢిల్లీ డైనమైట్ అంచలంచెలుగా ఎదుగుతూ టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి మరో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో వన్డే సందర్భంగా గాయపడంతో అతని స్థానంలో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లక్కీ ఛాన్స్ పంత్‌కు దొరికింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే తన ఆరాధ్య ఆటగాడు మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన అతను.. గురువు(ధోని)తో సహా అందరి మన్ననలను అందుకున్నాడు. -
‘అతను క్రికెటర్ కాకపోయుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు’
న్యూఢిల్లీ: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మొయిన్ అలీపై ట్విటర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడని సంచలన కామెంట్స్ చేసింది. దీంతో తస్లీమాపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. క్రికెటర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ముస్లిం అయినంత మాత్రాన అతను టెర్రరిస్ట్ అవుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు నచ్చింది తాను చేస్తున్నాడని, తన చర్యల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించడం లేదు కదా? అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. తస్లీమా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కాగా, త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్తగా జెర్సీని రూపొందించింది. అయితే ఆ జర్సీపై మద్యం కంపెనీ లోగో ఉన్నందున దాని బదులు మరో జర్సీ ధరించేందుకు తనకు అనుమతివ్వాలని మొయిన్ అలీ జట్టు యాజమాన్యాన్ని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యమే మొయిన్ అలీపై తస్లీమా వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైంది. కాగా, లోగో అంశంలో మొయిన్ నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు. చదవండి: ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు 5 వికెట్లు సాధించడమే లక్ష్యం: షకీబ్ -
ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో భారత క్రికెటర్‌కు కరోనా
న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న భారత దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తొలుత సచిన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆతరువాత యూసఫ్ పఠాన్, తాజాగా సుబ్రమణ్యం బద్రీనాధ్ వైరస్ పీడిత జాబితాలో చేరారు. బద్రీనాధ్.. వైరస్ బారిన పడ్డ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. తేలికపాటి కోవిడ్ లక్షణాలు కలిగి ఉండడంతో టెస్టు చేయించుకున్నాని, కోవిడ్ నిర్ధారణ కావడంతో ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. తమిళనాడుకు చెందిన బద్రీనాధ్.. భారత్ తరఫున 2008-2011 మధ్యలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011లో వరుసగా టైటిల్లు సాధించడంలో బద్రీనాధ్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న క్రికెటర్లందరిలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా భారత లెజెండ్స్ సభ్యుల్లో తీవ్ర కలవరం మొదలైంది. వైరస్ బారిన పడ్డ క్రికటర్లకు సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. -
ఏంది రెడ్డి.. ఏకంగా ధోని వికెట్‌నే లేపేసావు
చెన్నై: టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని జీవితంలో ఒక్కసారి కలిస్తే చాలనుకున్న ఓ యువ ఆటగాడు.. ఏకంగా అతని వికెట్‌నే పడగొట్టేశాడు. తన అభిమాన ఆటగాడితో ఓ ఫొటో చాలనుకున్న ఆ కుర్రాడు.. ఏకంగా అతని సారథ్యంలోనే ఆడబోతున్నాడు. అతనెవరో కాదు మన తెలుగు బిడ్డ, రైతు బిడ్డ, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఈ సీమ బిడ్డను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. టైటిల్ సాధనే లక్ష్యంగా సన్నాహకాలను మొదలు పెట్టిన సీఎస్కే జట్టు.. అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. క్యాంప్‌లో కెప్టెన్ ధోనితో పాటు ఆ జట్టు ఆటగాళ్లు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, జగదీషన్, సాయి కిషోర్, హరి నిషాంత్, హరిశంకర్ రెడ్డి తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. Hari Shankar Reddy taking Dhoni's wicket during the practice#IPL2021 pic.twitter.com/zpEv8gHsp8 — Vinesh Prabhu (@vlp1994) March 17, 2021 ప్రాక్టీస్ సెషన్లో భాగంగా 22 ఏళ్ల హరిశంకర్ రెడ్డి.. అద్భుతమైన బౌలింగ్‌తో ధోనిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో హరిశంకర్ రెడ్డి వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన ధోని.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హరిశంకర్ రెడ్డి బంతి వేగం ధాటికి ధోని లెగ్ స్టంప్ గాల్లో పల్టీలు కొడుతుంది. దీంతో ఈ వీడియో చూసిన వారందరూ 'ఏంది రెడ్డి.. ఎంత పని చేశావ్.. ఫోటో దిగితే చాలనుకొని ఏకంగా ధోని వికెట్‌నే గాల్లోకి లేపేసావ్' అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు 'సూపర్ రెడ్డి.. అద్భుతంగా బౌలింగ్ చేశావు.. ఏకంగా ధోని లెగ్ స్టంప్‌కే ఎసరు పెట్టేసావు' అంటూ అభినందిస్తున్నారు. కాగా, ప్రాక్టీస్‌లో అదరగొడుతున్న హరిశంకర్ రెడ్డికి తుది జట్టులో ఆడే అవకాశం దొరుకుతుందో లేదో వేచి చూడాలి. చదవండి: ఐపీఎల్‌లోకి రాయచోటి క్రికెటర్ ఎంట్రీ.. చెన్నై ట్వీట్ -
కోల్‌కతాకు చెన్నై దెబ్బ
చెన్నై సూపర్ కింగ్స్ పోతూ పోతూ కోల్‌కతానూ లీగ్ నుంచే తీసుకెళ్లనుంది. మిగిలున్న రెండు మ్యాచ్‌ల్ని తప్పనిసరిగా గెలిచినా... అంతంత మాత్రమే ప్లే ఆఫ్స్ అవకాశాలున్న నైట్‌రైడర్స్‌పై సూపర్‌కింగ్స్ దెబ్బ వేసింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ వీరోచితంగా పోరాడగా... జడేజా మెరుపు బ్యాటింగ్‌తో ఉత్కంఠను విజయం వైపు మార్చేశాడు. 30 పరుగులు చేయాల్సిన సమయంలో జడేజా ఒక్కడే 29 పరుగులు బాది గెలిపించాడు. దుబాయ్: ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాక చెన్నై ఇప్పుడు వరుసగా గెలుస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన సూపర్‌కింగ్స్... తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెన్నై గెలిచేందుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడేయగా... జడేజా ఆఖర్లో సిక్సర్లతో జట్టును గెలిపించాడు. రాయుడు (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. రఫ్ఫాడించిన రాణా తొలి బంతి పడగానే శుబ్‌మన్ గిల్ బౌండరీతో కోల్‌కతాకు మంచి ఆరంభమిచ్చాడు. ఆ మరుసటి బంతి కూడా లైన్ దాటింది. నితీశ్ రాణా కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. అయితే సామ్ కరన్, ఇన్‌గిడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తర్వాత 4 ఓవర్లలో 20 పరుగులే వచ్చాయి. ఇక ఆరో ఓవర్‌ను రాణా రఫ్ఫాడించాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో గిల్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), సునీల్ నరైన్ (7) అవుట్ కావడంతో రన్‌రేట్ మందగించింది. కాసేపు నితీశ్‌తో జతకలిసిన రింకూ సింగ్ (11 బంతుల్లో 11; 1 ఫోర్) కూడా ఎక్కువ సేపు నిలువకపోయినా... ఉన్నంతసేపయినా ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో కాస్త చూసుకొని ఆడిన నితీశ్ రాణా 44 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. భారీ సిక్సర్లతో... కోల్‌కతా చేతిలో వికెట్లున్న స్కోరు ఆశించినంత వేగం అందుకోలేకపోయింది. తొలి 50 పరుగుల్ని 6.2 ఓవర్లలో చేసిన కోల్‌కతా రెండో 50 (100) పరుగులు చేసేందుకు మరో 8 ఓవర్లు పట్టింది. ఇలా ఆలస్యంగా... 15వ ఓవర్లో మూడంకెల స్కోరును అధిగమించిది. అప్పటిదాకా నింపాదిగా ఆడుతున్న నితీశ్ తర్వాత ఒక్కసారిగా చెలరేగాడు. చెన్నై స్పిన్నర్ కరణ్ శర్మపై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతను వేసిన 16వ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్, డీప్ స్క్వేర్‌లెగ్, లాంగాన్‌ల మీదుగా వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో ఆ ఓవర్లోనే కోల్‌కతా ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లోనూ రాణా దూకుడు కొనసాగింది. చెన్నై సారథి ధోని వెంటనే పేసర్ దీపక్ చహర్‌కు బంతిని అప్పగించగా... 17వ ఓవర్లో రాణా రెండు బౌండరీలు కొట్టాడు. ఇతని జోరుకు 18వ ఓవర్లో ఇన్‌గిడి బ్రేకువేయగా... ఆఖరి ఓవర్లలో మోర్గాన్ (15), దినేశ్ కార్తీక్ ( 10 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో స్కోరు పెంచారు. మొదటి 15 ఓవర్లు ఆడి 106/3 స్కోరు చేసిన నైట్‌రైడర్స్ చివరి 5 ఓవర్లలో 66 పరుగులు చేసింది. నడిపించిన రుతురాజ్ లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్లో పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డా... రెండో ఓవర్ నుంచి సిక్స్, మూడో ఓవర్లో బౌండరీలతో జోరందుకుంది. వాట్సన్ స్క్వేర్‌లెగ్ మీదుగా సిక్సర్ బాదగా... తర్వాత ఓవర్లో రుతురాజ్, వాట్సన్ చెరో ఫోర్ కొట్టారు. వరుణ్ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో రుతురాజ్ లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదేశాడు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా చెన్నై 44 పరుగులు చేసింది. జట్టు స్కోరు 8వ ఓవర్లో 50 పరుగులకు చేరగా... అదే ఓవర్లో వాట్సన్ (14)ను చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. రుతురాజ్‌కు రాయుడు జతయ్యాడు. నితీశ్ రాణా వేసిన పదో ఓవర్లో వరుసగా రాయుడు వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. 16 పరుగులు రావడంతో జోరు తగ్గిన చెన్నైలో జోష్ నింపాడు. ఆ తర్వాత ఓవర్‌ను రుతురాజ్ తన వంతుగా బాదేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో 4, 6 కొట్టాడు. 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రుతురాజ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో రాయుడు కూడా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. చెన్నై 100 పరుగులకు చేరుకుంది. ఇలా మెరుపులతో సాగిపోతున్న చెన్నై స్వల్పవ్యవధిలో కష్టాలెదురయ్యాయి. మొదట రాయుడు, ఆరు బంతుల తేడాతో కెప్టెన్ ధోని ఔటయ్యారు. చెన్నై విజయానికి 32 బంతుల్లో ఇంకా 52 పరుగులు కావాలి. గెలిపించిన జడేజా ఓవర్‌కు పది పరుగులు చేయాల్సిన పరిస్థితి చెన్నైది. ఇలాంటి దశలో సూపర్‌కింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఔట్ కావడంతో చెన్నై శిబిరంలో కలవరం మొదలైంది. రవీంద్ర జడేజా క్రీజులోకి రాగా ఆఖరి 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. 19వ ఓవర్ వేసిన ఫెర్గూసన్ లయతప్పాడు. దీన్ని అనువుగా మలచుకున్న జడేజా రెచ్చిపోయాడు. 4, 3, 6, 4 చకచకా పరుగులు జతచేశాడు. వైడ్, నోబాల్తోకలిపి ఫెర్గూసన్ 20 పరుగులిచ్చాడు. ఆట ఆఖరి ఓవర్‌కు చేరింది. చెన్నై 10 పరుగులు చేయాల్సివుండగా... కమలేశ్ నాగర్కోటి 0, 2, 1, 0 డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెంచాడు. 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో కాస్త ఉత్కంఠ రేగినా... జడేజా డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదేశాడు. ఇక బంతి మిగలగా పరుగు చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని కూడా జడేజా లాంగాన్ మీదుగా సిక్సర్ బాదేయడంతో చెన్నై గెలిచి కోల్‌కతాను ముంచింది. తాజా ఫలితంతో ఇప్పుడు అధికారికంగా ముంబై ఇండియన్స్ ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. మరోవైపు కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే! స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (బి) కరణ్ శర్మ 26; నితీశ్ రాణా (సి) స్యామ్ కరన్ (బి) ఇన్‌గిడి 87; నరైన్ (సి) జడేజా (బి) సాన్‌ట్నర్ 7; రింకూ సింగ్ (సి) రాయుడు (బి) జడేజా 11; మోర్గాన్ (సి) రుతురాజ్ (బి) ఇన్‌గిడి 15; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 21; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–53, 2–60, 3–93, 4–137, 5–167. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–31–0, స్యామ్ కరన్ 3–0–21–0, ఇన్‌గిడి 4–0–34–2, సాన్‌ట్నర్ 3–0–30–1, జడేజా 3–0–20–1, కరణ్ శర్మ 4–0–35–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (సి) రింకూ (బి) వరుణ్ 14; రుతురాజ్ (బి) కమిన్స్ 72; రాయుడు (సి) నరైన్ (బి) కమిన్స్ 38; ధోని (బి) వరుణ్ 1; స్యామ్ కరన్ (నాటౌ ట్) 13; జడేజా (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–50, 2–118, 3–121, 4–140. బౌలింగ్: కమిన్స్ 4–0–31–2, నాగర్కోటి 3–0–34–0, నరైన్ 4–0–23–0, ఫెర్గూసన్ 4–0–54–0, వరుణ్ 4–0–20–2, నితీశ్ రాణా 1–0–16–0. -
ధావన్ తొడగొట్టాడు
సుదీర్ఘ టి20 కెరీర్లో పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ‘గబ్బర్’ అలియాస్ శిఖర్ ధావన్‌కు సెంచరీ లేని లోటు మాత్రం ఇప్పటి వరకు ఉండేది. అయితే ఇప్పుడు తొలి శతకాన్ని సాధించి ఆ కోరికను కూడా తీర్చుకున్నాడు. అదీ సరైన సమయంలో, జట్టుకు అవసరమైన సందర్భంలో సాధించడం దానిని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఛేదనలో సహచరులంతా విఫలమైన వేళ, తనొక్కడే శిఖరంలా చివరి వరకు నిలిచి బౌండరీల వర్షం కురిపించిన ధావన్ ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచ్‌లలో అర్ధ సెంచరీ చేసిన అతను తన ప్రదర్శనకు మరింత దూకుడు జత చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. క్యాపిటల్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనడంలో ఇబ్బందిపడి సాధారణ స్కోరుకే పరిమితమైన సూపర్ కింగ్స్ బౌలింగ్‌లోనూ సత్తా చాటలేక పరాజయాన్ని కొనితెచ్చుకుంది. షార్జా: ఐపీఎల్లో తమ జోరును కొనసాగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... అంబటి తిరుపతి రాయుడు (25 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు), షేన్ వాట్సన్ (28 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు సాధించి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (58 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించగా... చివరి ఓవర్లో అక్షర్ పటేల్ (5 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్‌లు) అదరగొట్టాడు. డుప్లెసిస్ అర్ధ సెంచరీ... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. తుషార్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌లో మూడో బంతికే స్యామ్ కరన్ (0) అవుటయ్యాడు. అయితే డు ప్లెసిస్, వాట్సన్ భాగస్వామ్యం జట్టును ముందుకు నడిపించింది. నోర్జే ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో ప్లెసిస్ దూకుడు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్ ఓవర్లో వీరిద్దరు కలిసి 15 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో చెన్నై 85 పరుగులు చేయగలిగింది. తుషార్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన డుప్లెసిస్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా 15 ఓవర్లలో స్కోరు 112 పరుగుల వద్ద నిలిచింది. రెండో వికెట్‌కు ప్లెసిస్, వాట్సన్ 67 బంతుల్లో 87 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్... ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లు సూపర్ కింగ్స్‌కు బాగా కలిసొచ్చాయి. ధోని (3) మళ్లీ విఫలమైనా... రాయుడు, జడేజా జోడి ఒకరితో మరొకరు పోటీపడి చెలరేగారు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి జడేజా 4 సిక్సర్లు, రాయుడు 3 సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో మొత్తం 67 రావడం విశేషం. నోర్జే వేసిన చివరి ఓవర్లో జడేజా కొట్టిన రెండు వరుస సిక్స్‌లు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. బౌలర్ చావ్లా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జాదవ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అతనొక్కడే... విజయతీరం చేరే వరకు ఢిల్లీ ఇన్నింగ్స్ మొత్తం ధావన్ చుట్టూనే సాగింది. రెండో బంతికే పృథ్వీ షా (0) అవుట్ కాగా, రహానే (8) కూడా విఫలమయ్యాక ధావన్ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో కొట్టిన ఒక్క సిక్సర్ మినహా అతను ఫోర్ల ద్వారానే తన జోరును ప్రదర్శించాడు. స్యామ్ కరన్, జడేజా, కరణ్ శర్మ... ఇలా ఏ బౌలర్‌నూ వదలకుండా ఒక్కో ఓవర్లో రెండేసి ఫోర్లు కొడుతూ సాగిపోయిన ధావన్ 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్), స్టొయినిస్ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) కొంత సహకరించినా...మొత్తంగా మ్యాచ్‌లో ధావన్ షోనే కనిపించింది. వ్యక్తిగత స్కోర్లు 25, 50, 79 వద్ద ధావన్ ఇచ్చిన క్యాచ్‌లు చెన్నై వదిలేయడం కూడా అతనికి కలిసొచ్చింది. కొంత ఉత్కంఠ... చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 21 పరుగులు కావాల్సి ఉండగా... 19వ ఓవర్లో స్యామ్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి క్యారీ (4)ని అవుట్ చేశాడు. 99 పరుగుల స్కోరు వద్ద ధావన్ కీపర్ క్యాచ్ కోసం అప్పీల్ చేసిన ధోని రివ్యూకు కూడా వెళ్లాడు. అయితే రీప్లేలో అది నాటౌట్‌గా తేలింది. తర్వాతి బంతికి సింగిల్ తీసిన శిఖర్ ఐపీఎల్‌లోనే కాకుండా తన టి20 కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. జడేజా వేసిన చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా... అక్షర్ పటేల్ మూడు సిక్సర్లు బాది క్యాపిటల్స్‌కు గెలుపును ఖాయం చేశాడు. జడేజా ఎందుకంటే... సాధారణంగా చెన్నై బౌలర్లలో డెత్ ఓవర్లలో, ప్రత్యర్థి ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా సరే చివరి ఓవర్‌ను బ్రేవో బౌలింగ్ చేయడం పరిపాటి. ఐపీఎల్లో ఇది చాలా సార్లు కనిపించింది. అయితే ఈసారి స్పిన్నర్ జడేజా వేయడం ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ తర్వాత ధోని దీనిపై స్పష్టతనిచ్చాడు. ఫిట్‌గా లేని బ్రేవో మైదానం బయటే ఉండిపోవడం అందుకు కారణమని వెల్లడించాడు. మిగిలిన బౌలర్లలో కరణ్ శర్మ, జడేజా మాత్రమే ప్రత్యామ్నాయం. కరణ్కంటే జడేజా అనుభవాన్ని ధోని నమ్మాడు. నిజానికి క్రీజ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉన్నప్పుడు లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను చితక్కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ బౌలర్‌ను కెప్టెన్‌ను ఉపయోగించరు. చివరి ఓవర్‌కు ముందు వరకు జడేజా ఒకే ఒక ఓవర్ వేయడానికి కూడా ధావన్ క్రీజ్‌లో ఉండటమే కారణం. అయితే చివరకు అలా చేయాల్సి వచ్చి జడేజా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ చేతిలోనే చావుదెబ్బ తిన్నాడు. అయితే అది శిఖర్ కాకుండా స్వయంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ కావడం విశేషం. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) నోర్జే (బి) తుషార్ 0; డుప్లెసిస్ (సి) ధావన్ (బి) రబడ 58; వాట్సన్ (బి) నోర్జే 36; రాయుడు (నాటౌట్) 45; ధోని (సి) క్యారీ (బి) నోర్జే 3; జడేజా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179 వికెట్ల పతనం: 1–0; 2–87; 3–109; 4–129. బౌలింగ్: తుషార్ 4–0–39–1; రబడ 4–1–33–1; అక్షర్ 4–0–23–0; నోర్జే 4–0–44–2; అశ్విన్ 3–0–30–0; స్టొయినిస్ 1–0–10–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి అండ్ బి) చహర్ 0; ధావన్ (నాటౌట్) 101; రహానే (సి) స్యామ్ కరన్ (బి) చహర్ 8; అయ్యర్ (సి) డుప్లెసిస్ (బి) బ్రేవో 23; స్టొయినిస్ (సి) రాయుడు (బి) శార్దుల్ 24; క్యారీ (సి) డుప్లెసిస్ (బి) స్యామ్ కరన్ 4; అక్షర్ పటేల్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–0; 2–26; 3–94; 4–159; 5–159. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–18–2; స్యామ్ కరన్ 4–0–35–1; శార్దుల్ 4–0–39–1; జడేజా 1.5–0–35–0; కరణ్ శర్మ 3–0–34–0; బ్రేవో 3–0–23–1. ► ఐపీఎల్ టోర్నీలోనే కాకుండా తన టి20 కెరీర్లోనే శిఖర్ ధావన్‌కిది తొలి సెంచరీ కావడం విశేషం. తన 265వ ఇన్నింగ్స్‌లో ధావన్ సెంచరీ సాధించాడు. ► ఈ సీజన్లో ఢిల్లీ గెలిచిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు భించాయి. ► ఈ ఐపీఎల్ సీజన్లో నమోదైన సెంచరీల సంఖ్య. ధావన్‌కంటే ముందు మయాంక్, రాహుల్ ఒక్కో శతకం కొట్టారు. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మన్ సెంచరీ చేయడం ఇది తొమ్మిదోసారి. -
నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా : రైనా
-
కొత్త లుక్‌లో మెరిసిపోతున్న ధోని
తన ఆట తీరుతోను కోట్లాది మంది క్రికెట్ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికే దక్కుతుంది. అంతకముందు ధోని తన కూతురు జీవాతో కలిసి చేసే అల్లరిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉండేవాడు. అయితే ఈ మధ్య ధోని సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారక్కడ ఇంటికే పరిమితమయిన వేళ గత నాలుగైదు నెలలుగా అప్పుడప్పుడూ మాత్రమే ధోని ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నాడు. తాజాగా ధోని శుక్రవారం నాడు ఒక వీడియోలో కనిపించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ..ధోని కనిపిస్తున్న ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. చదవండి: ధోని అంటే తెలియని వారు ఉన్నారా? ఈ వీడియోలో ధోని కాస్తంత కొత్తగా కనిపిస్తున్నాడు. ధోనీ వయసు తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతూ ధోని వారికి హాయ్ చెబుతున్నాడు. ఈ వీడియోలో ధోనిని చూసిన ఫ్యాన్స్, తిరిగి గ్రౌండ్లోకి దిగేందుకు సిద్ధమైపోయాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే, ధోనిని క్రికెట్ మైదానంలో తిరిగి చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ధోని ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాధన్ మాట్లాడుతూ, వచ్చే పది సంవత్సరాల పాటు ధోనినే చైన్నై సూపర్ కింగ్స్ బాస్ అని నా అభిప్రాయం అని పేర్కొన్నారు. చదవండి: భారత అభిమానుల గుండె పగిలిన రోజు The much needed pawsitivity at 7! #Thala @msdhoni #WhistlePodu 🦁💛 pic.twitter.com/fEVrG0Gubc — Chennai Super Kings (@ChennaiIPL) July 17, 2020 -
పంజాబ్ ఆఖరి గెలుపు
మొహాలి: ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయిన తర్వాత పంజాబ్ ఆట గెలుపుతో ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (55 బంతుల్లో 96; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకానికి 4 పరుగులతో దూరమయ్యాడు. స్యామ్ కరన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. మెరుపులు మెరిపించిన లోకేశ్ రాహుల్ (36 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. హర్భజన్ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. డు ప్లెసిస్ జోరు చెన్నై ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లలో వాట్సన్ (7) విఫలమయ్యాడు. కానీ డు ప్లెసిస్ వేగం, నిలకడ కలగలిపిన ఇన్నింగ్స్ ఆడాడు. వీలు చిక్కితే బౌండరీ లేదంటే ఒకట్రెండు పరుగులతో జట్టును నడిపించాడు. ఇతనికి జతయిన రైనా దూకుడు కనబరచడంతో చెన్నై స్కోరు పరుగెత్తింది. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. వీళ్లిద్దరు ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆడారు. ఈ క్రమంలో డు ప్లెసిస్ 37 బంతుల్లో, రైనా 34 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 15వ ఓవర్ నుంచి ఈ జోడీ వేగం పెంచింది. మురుగన్ అశ్విన్ 15వ ఓవర్లో రైనా ఒక ఫోర్ కొడితే డుప్లెసిస్ 4, 6 బాదాడు. టై 16వ ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. జట్టు స్కోరు 150 పరుగుల వద్ద కరన్ ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. రైనా (38 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఔట్ చేయడంతో 120 పరుగులు రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్లో సిక్స్‌తో సెంచరీకి చేరువైన డు ప్లెసిస్‌ను కరనే ఔట్ చేశాడు. ధోని (10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. పంజాబ్ 57/0...రాహుల్ 52 పంజాబ్ లక్ష్యఛేదనను రాహుల్ సిక్స్‌తో, క్రిస్ గేల్ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫోర్‌తో ఆరంభించారు. ముఖ్యంగా రాహుల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రెండో ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టాడు. అతడు తొలి 8 బంతుల్లో చేసిన 18 పరుగులు సిక్స్‌ల రూపంలోనే వచ్చాయి. హర్భజన్ సింగ్ వేసిన నాలుగో ఓవర్లో ఐదు సార్లు బంతి బౌండరీ లైనును దాటింది. రాహుల్ వరుసగా 4, 4, 4, 6, 0, 6లతో ఏకంగా 24 పరుగులు సాధించాడు. అంతే 3.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరగా... 19 బంతుల్లోనే రాహుల్ అర్ధశతకం పూర్తయింది. ఇమ్రాన్ తాహిర్ ఏడో ఓవర్‌ను గేల్ ఆడుకున్నాడు. 4, 6, 6తో 17 పరుగులు చేశాడు. అడ్డుఅదుపులేని బౌండరీలతో జట్టు స్కోరు 9 ఓవర్లలోనే వందకు చేరింది. ఇక మిగిలింది 11 ఓవర్లలో 71 పరుగులే. అయితే 11వ ఓవర్ వేసిన హర్భజన్ వీళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో 108 స్కోరు వద్ద 2 వికెట్లను కోల్పోయింది. భజ్జీ మరుసటి ఓవర్లో మయాంక్ అగర్వాల్ (7) ఆటను ముగించాడు. కానీ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపుల బాధ్యతను తీసుకోవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. 164 పరుగుల వద్ద అతను ఔటైనా... మిగతా లాంఛనాన్ని మన్దీప్ సింగ్ (11 నాటౌట్), స్యామ్ కరన్ (6 నాటౌట్) పూర్తి చేశారు. -
తాహిర్ అలా పరిగెత్తుతుంటే.. ధోనీ జోకులు!
వికెట్ పడిందంటూ ఎంపైర్ వేలెత్తడమే ఆలస్యం.. ఇమ్రాన్ తాహిర్ సంబరాల్లో మునిగిపోతాడు. చేతులు విశాలంగా చాచి.. అభిమానుల గ్యాలరీ వైపు పరిగెత్తుతూ.. ఛాతి బాదుకుంటూ.. కొన్నిసార్లు సింహంలా గర్జిస్తూ.. అతను ఆకాశమే హద్దుగా ఆనంద డొలికల్లో తేలిపోతాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న 40 ఏళ్ల వెటరన్ సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ తాహిర్ ఎనర్జీ ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తోంది. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యే వయస్సులో చక్కని బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టడంలోనే కాదు.. మైదానమంతా హల్చల్ చేస్తూ సంబరాల్లో మునిగిపోవడంలోనూ అతను తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. చెన్నై అభిమానులు ‘పరాశక్తి ఎక్స్‌ప్రెస్’ అని ముద్దుగా పిలుచుకునే తాహిర్ హోమ్‌గ్రౌండ్‌లో జరిగిన తాజా ఐపీఎల్ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఢిల్లీని చిత్తుచేయడంతో.. సూపర్‌కింగ్స్ 80 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు పడగొట్టిన తాహిర్.. వికెట్ పడిన ప్రతిసారి చెప్పాక్ స్టేడియంలో అభిమానుల వద్దకు పరిగెత్తి.. సింహంలా గర్జిస్తూ సంబరాలు జరిపాడు. మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా తాహిర్ ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్స్ ధోనీ చాలా ఒకింత ఫన్నీగాస్పందించాడు. ‘తాహిర్ సెలబ్రేషన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ, వికెట్ తీయగానే అతనికి దగ్గరికి వెళ్లకూడదని నాకు, వాట్సన్ చాలా బాగా తెలుసు. ఎందుకంటే వికెట్ పడగానే మరోవైపునకు అతను పరిగెత్తుకు వెళుతాడు. ఇది నాకు, వాట్సన్‌కు కొంత కష్టమే. మేం 100శాతం ఫిట్‌గా లేనప్పుడు అలా పరిగెత్తి అభినందించడం కూడా కొంచెం కష్టమే. అందుకే అతను సంబరాలు ముగించుకొని.. వెనక్కి వచ్చాక.. అతని దగ్గరికి వెళ్లి బాగా బౌలింగ్ చేశావని అభినందిస్తాం. మళ్లీ మా ఫీల్డింగ్ పొజిషన్‌కి వచ్చేస్తాం’ అని ధోనీ సరదాగా వివరించాడు. చెన్నై లీడింగ్ వికెట్ టేకర్ అయిన తాహిర్ ఈ ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్‌ల్లో మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను రెండోస్థానంలో ఉండగా.. ఢిల్లీ బౌలర్ రబడ 25 వికెట్లతో ఆగ్రస్థానంలోఉన్నాడు. -
ధోనీ సతీమణి పోస్ట్‌పై నెటిజన్ల మండిపాటు
ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మోను కుమార్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది.. గడ్డి ఈ సైడ్ పచ్చగా లేదనుకుంటా.. 'అంటూ మోను కుమార్ తలపై సాక్షి ముద్దు పెట్టింది. మోను కుమార్ బట్టతలపై సెటైర్ వేస్తూ బీపాజిటివ్ హ్యాష్ ట్యాగ్‌తో సరదాగా సాక్షి చేసిన పోస్ట్‌పై ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొందరు హర్ట్ అయ్యారు. మీరు ఇలా పోస్ట్ పెట్టడం మమ్మల్ని బాధించింది, మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నామంటూ మెసేజ్‌లు పెట్టారు. సాక్షిని అనుసరిస్తూ మరికొందరు.. ఫ్లాట్ పిచ్ బాగుంది బ్యాటింగ్‌కు పనికొస్తుంది అంటూ బట్టతలపై సెటైర్లు వేస్తున్నారు. ఇంతకు ముందు సాక్షిసింగ్‌ను ప్రపంచంలోనే ఉత్తమ వదిన అంటూ మోను కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. View this post on Instagram Banjar zameen ... hariyaaalii ka intezaar.... Grass is not green on this side yet ! @monu_singh31 #bepositivealways A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Apr 23, 2019 at 1:44pm PDT -
మిత్రులకు, అభిమానులకు గుడ్‌బై..
సాక్షి, చెన్నై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చెన్నై నుంచి ముంబై వెళ్తూ విమానంలో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. చెన్నైలో తన సొంత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడగా కోల్‌కతా ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ అనంతరం షారుఖ్ ఖాన్ ముంబై బయలు దేరాడు. తిరుగు ప్రయాణంలో కేకేఆర్ జట్టుకు చెందిన టీ షర్ట్ ధరించి ఉన్న తన సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టాడు. ‘ముంబై వెళ్లడానికి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఈ సెల్ఫీ దిగడానికి ప్రత్యేక కారణాలేమి లేవు. దక్షిణాదిలోని నా సినీ మిత్రులకు, క్రీడా మైదానంలోని క్రికెట్ అభిమానులకు గుడ్‌బై’ అంటూ ఈ ఫోటోకు కామెంట్ పెట్టాడు. అంతేకాకుండా ‘విజిల్ పోడు’ యాష్‌ట్యాగ్ జోడించడం ద్వారా తమిళుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో ఏడు లక్షలకు పైగా లైకులు రాగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఫర్హా ఖాన్ ‘ఎంతో అందగాడు’ అంటూ ఫోటోపై స్పందించారు. దీనికి ముందు, మ్యాచ్ సందర్భంగా కెమెరాకు చిక్కిన ధోని, షారుఖ్‌ల ఫోటోను చెన్నై సూపర్ కింగ్స్ తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తున్న ధోని, స్టాండ్స్‌లో నిలబడి ఉన్న షారుఖ్ పరస్పరం నవ్వుతూ పలకరించుకోవడం కనిపిస్తుంది. -
చెన్నై చెడుగుడు
కోల్‌కతా నైట్‌రైడర్స్... ఈ సీజన్లో రెండు మ్యాచ్‌ల్లో 18 బంతుల్లోనే 53 పరుగులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జట్టు. అలాంటి జట్టుతో చెన్నై చెడుగుడు ఆడుకుంది. 20 ఓవర్లు ఆడినా... 108 పరుగులకు మించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని కష్టపడి ఛేదించింది.ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ రోజు ‘పసుపు సేన’ది. కాబట్టే చెపాక్‌లో ‘సూపర్’ కింగ్స్ అజేయంగా నిలిచింది. చెన్నై: సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ ఎదురేలేకుండా సాగిపోతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఒకే ఒక్కడు ఆండ్రీ రసెల్ (44 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి గెలిచింది. డుప్లెసిస్ (45 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. 0, 6, 11, 0... కోల్‌కతా టాపార్డర్ స్కోరిది! ఆట మొదలైందో లేదో... ఇంకా సీట్లలోకి ప్రేక్షకులు పూర్తిగా కూర్చోకముందే నైట్‌రైడర్స్ పతనం ఫటాఫట్‌గా మొదలైంది. చెన్నై పేసర్ దీపక్ చహర్ నిప్పులు చెరిగాడు. ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున లిన్ (0), నితీశ్ రాణా (0), రాబిన్ ఉతప్ప (11)లను పెవిలియన్ చేర్చాడు. ఇది చాలదన్నట్లు హర్భజన్ స్పిన్ మాయలో నరైన్ (6) పడ్డాడు. అంతే 24 పరుగులకే 4 టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఔట్. తర్వాత తాహిర్ కూడా ఓ చెయ్యి వేశాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 19; 3 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (9)లను పెవిలియన్ పంపించాడు. ఆదుకున్న రసెల్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసిన చెపాక్ పిచ్‌పై టెయిలెండర్లు పీయూష్ చావ్లా (8), కుల్దీప్ (0), ప్రసిధ్ కృష్ణ (0) మాత్రం ఏం చేస్తారు. 79 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి వంద కంటే ముందే ఆలౌటయ్యేందుకు కోల్‌కతా సిద్ధమైంది. కానీ ఒక్కడు పోరాటం చేశాడు. పిచ్ పూర్తిగా బౌలర్ల వశమైన తరుణంలో రసెల్ నిలబడ్డాడు. కానీ మిస్సైల్ షాట్లు మాత్రం అంత ఈజీగా రాలేదు. బంతిని బలంగా బాదే క్రమంలో అతను కొద్దిసేపు కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయినా మొండిగా కడదాకా బ్యాట్‌ను ఝళిపించాడు. జట్టు స్కోరును వందకు చేర్చాడు. తను 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. హర్భజన్, తాహిర్ చెరో 2 వికెట్లు తీశారు. రాణించిన డుప్లెసిస్... సూపర్‌కింగ్స్ సునాయాస లక్ష్యఛేదన వాట్సన్ బౌండరీతో మొదలైంది. కానీ పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పలేదు. 2 ఫోర్లు, సిక్సర్‌తో ఊపుమీదున్న వాట్సన్ (9 బంతుల్లో 17), క్రీజులో నిలబడేందుకు సాహసించిన రైనా (13 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్)లు నరైన్ ఉచ్చులో పడ్డారు. దీంతో 35 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. అందుకేనేమో తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పిచ్‌ను గౌరవించారు. ఆచితూచి ఆడుతూ తమ ఆటను మెల్లిగా కొనసాగించారు. డుప్లెసిస్, రాయుడు (31 బంతుల్లో 21; 2 ఫోర్లు) ఒకట్రెండు పరుగులతో, వీలుచిక్కినపుడు బౌండరీతో స్కోరు బోర్డును నడిపించారు. అంతేగానీ అనవసర మెరుపులకు ఆస్కారమివ్వలేదు. ఇద్దరు మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 81 వద్ద రాయుడు షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. తర్వాత కేదార్ జాదవ్ (8 నాటౌట్)తో కలిసి డుప్లెసిస్ మిగతా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. నరైన్‌కు 2 వికెట్లు దక్కాయి. -
అతడు ఏబీని తలపించాడు
ఈ సీజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే మళ్లీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమయ్యాయి. టోర్నీలో మిగతా జట్లకంటే మేటి జట్లే టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఐపీఎల్ చరిత్రలో సాధారణంగా రెండో స్థానంలో నిలిచిన జట్లే ఎక్కువ సార్లు టైటిల్స్ గెలిచాయి. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభసూచకం. దీంతో చెన్నై అభిమానులు మరోసారి మన జట్టే టైటిల్ గెలుస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు. పునరాగమనాన్ని టైటిల్‌తో ఘనంగా చాటుతుందనే అంచనాలు సూపర్ కింగ్స్ అభిమానుల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గెలిచి నేరుగా ఫైనల్ చేరిన చెన్నై ఒక దశలో ఓటమికి దగ్గరైంది. డు ప్లెసిస్ అద్వితీయ పోరాటంతో చివరకు గెలిచింది. అయితే ఫైనల్లో ఫామ్‌లో ఉన్న రాయుడిని కాదని డు ప్లెసిస్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుందని నేననుకోను. ఇది అంత తెలివైన పని కాదు. బౌండరీలు, సిక్సర్లు బాదే అతన్ని మిడిలార్డర్లోనే కొనసాగించాలి. ఛేదనలో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌కు తిరుగులేదనే చెప్పాలి. ఎలాంటి ప్రత్యర్థి ఎదురైనా... ఎంతటి పెద్ద స్కోరున్నా... చెన్నై బ్యాట్స్‌మెన్ ఛేదించగలరు. ఇలాంటి జట్టుకు స్వల్ప స్కోరు చేసినా... నిలబెట్టుకునే సన్‌రైజర్స్ ఎదురైంది. హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చెన్నై సూపర్ కింగ్స్‌తో పోలిస్తే అంత పటిష్టమైందేమీ కాదు. ఓపెనర్ ధావన్, కెప్టెన్ విలియమ్సన్లపైనే సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆధార పడి ఉంది. మిగతా వారున్నప్పటికీ వాళ్లెవరూ వీళ్లిద్దరిలా నిలకడగా ఆడలేరు. పరిస్థితులకు తగ్గట్లు ఆదుకోలేరు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన కీలకపోరులో ‘వన్ మన్ ఆర్మీ షో’తో హైదరాబాద్ గెలవగలిగింది. ఒకే ఒక్కడు రషీద్ ఖాన్ మొదట బ్యాటింగ్‌లో, తర్వాత బౌలింగ్‌లో సన్‌రైజర్స్ ఆశలను నిలబెట్టాడు. ముఖ్యంగా అతను డివిలియర్స్ ఆడే ఫ్లిక్ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతని బ్యాటింగ్‌లో ఈ షాట్లే అత్యుత్తమం. ఇక బౌలింగ్‌లోనూ తన మాయాజాలంతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చాడు. ఇది సరిపోదన్నట్లు అద్భుతమైన రనౌట్, రెండు క్యాచ్‌లతో రషీద్ మెరిశాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన నితీశ్ రాణాను బుల్లెట్ వేగంతో విసిరిన త్రోతో రనౌట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్‌ను ఫైనల్లోకి తెచ్చిందే రషీద్ ఖాన్. మైదానంలో అతని సత్తా, సామర్థ్యం అమోఘం. ఇదే రీతిలో ఫైనల్లోనూ చెలరేగితే సన్‌రైజర్స్ కొత్త చరిత్ర లిఖించడం ఖాయం. -
'ఫైనల్' నీదా... నాదా?
సన్‌రైజర్స్ హైదరాబాద్... లీగ్‌కు ముందే నాయకుడు దూరమై డీలా... కొత్త సారథి ఎలా నడిపిస్తాడోనని ఆందోళన... అంతంతమాత్రం బ్యాటింగ్ లైనప్‌పై బెంగ... బౌలర్ల సామర్థ్యంపై భారంవేసి బరిలో దిగింది..! చెన్నై సూపర్‌కింగ్స్... రెండేళ్ల నిషేధం వీడి పునరాగమనం... ‘సీనియర్ల’ జట్టంటూ వ్యంగ్యాస్త్రాలు... ఒక్క మ్యాచ్‌కే దూరమైన సొంత మైదానం... వెయ్యేనుగుల బలమైన కెప్టెన్‌పైనే భరోసా ఉంచింది! ముంబై: ఐపీఎల్–11 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్, సూపర్ కింగ్స్ రెండింటి పయనంపై అనుమానాలు, అనిశ్చితి. అయితే, వాటిని లీగ్ ప్రారంభం నుంచే పటాపంచలు చేస్తూ రెండు జట్లు పోటీకి ఎదురొడ్డాయి. కఠిన పరిస్థితులను తట్టుకుని టాప్–2లో నిలిచాయి. స్వల్ప స్కోర్లే చేసినా కట్టుదిట్టంగా బంతులేసే భీకర బౌలింగ్ దళం హైదరాబాద్‌ను గెలిపించగా, ఎంతటి భారీ లక్ష్యాన్నైనా కొట్టిపడేసే దుర్బేధ్యమైన బ్యాటింగ్ బలగం చెన్నైని ముందుకు నడిపించింది. మంగళవారం ముంబైలోని వాంఖెడేలో జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను బంతికి, బ్యాట్‌కు మధ్య సిసలైన సమరంగా పేర్కొనవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్ రూపంలో ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాలేమిటి? బలహీనతలేమిటి? అని విశ్లేషిస్తే...! దుమ్మురేపే బ్యాటింగ్ దన్నుగా... బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు, బౌలింగ్ ఆల్‌రౌండర్లతో ఆడుతున్నది పదకొండు మందా..? లేక పదముగ్గురా? అన్నట్లుంటుంది చెన్నైను చూస్తే. ఆదివారం పంజాబ్‌పై మ్యాచ్‌లో పేసర్ దీపక్ చహర్ ఇన్నింగ్సే ఇందుకో ఉదాహరణ. జట్టుగానే అత్యంత పటిష్ఠం అనుకుంటే... దానికి కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యూహాలు తోడైతే తిరుగేముంటుంది? ఓపెనర్లు వాట్సన్, అంబటి రాయుడు తిరుగులేని ఫామ్‌లో ఉండగా, రైనా సరైన సమయంలో జోరందుకున్నాడు. బిల్లింగ్స్, ధోని, బ్రేవోలతో మిడిలార్డర్ నిండుగా కనిపిస్తోంది. జడేజా, హర్భజన్‌ల స్పిన్, చహర్, శార్దుల్ ఠాకూర్, ఇన్‌గిడిల పేస్‌ను తట్టుకోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. అయితే, బ్యాట్స్‌మన్‌గా డు ప్లెసిస్, బిల్లింగ్స్‌లో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఈ ఒక్కటి తప్ప మిగతా పేర్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. దీనికి తగ్గట్లే క్వాలిఫయర్స్‌కు సన్నాహకమా? అన్నట్లు చివరి లీగ్ మ్యాచ్‌లో వనరులన్నింటినీ పరీక్షించుకుని సంసిద్ధమైంది సూపర్ కింగ్స్. బలాబలాల రీత్యా సమంగా కనిపిస్తున్నా, పెద్దగా లోపాలు లేనందున చెన్నై వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. కట్టిపడేసే బౌలింగ్ తోడుగా... జట్టుగా అంత బలంగా కనిపించకున్నా, మైదానంలో అనూహ్య ప్రదర్శనతో నెగ్గుకొచ్చింది సన్‌రైజర్స్. మిగతా జట్లు ప్లే ఆఫ్స్ చేరేందుకే ఆపసోపాలు పడుతుంటే... చివరి మూడు లీగ్ మ్యాచ్‌లలో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి అర్హత సాధించడం హైదరాబాద్ సత్తాను చాటుతోంది. ఈ ఘనతంతా బ్యాటింగ్‌లో చుక్కల్లో చంద్రుడిలా నిలిచిన కెప్టెన్ విలియమ్సన్కు, బౌలింగ్‌లో ప్రత్యర్థులను కట్టిపడేసిన పేసర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, స్పిన్నర్లు రషీద్ ఖాన్, షకీబ్ హసన్లదే. అద్భుత ఇన్నింగ్స్‌లతో తనలోని మరో కోణాన్ని చూపిన విలియమ్సన్కు... బ్యాటింగ్ కంటే జట్టు బౌలింగ్ వనరులే పెద్ద బలం. అయితే, అన్ని రంగాల్లోనూ రాణిస్తేనే చెన్నైలాంటి ప్రత్యర్థిని ఓడించగలదు. కీలక మ్యాచ్ కాబట్టి శిఖర్ ధావన్‌కు తోడుగా హేల్స్‌ను ఓపెనింగ్‌కు పంపే అవకాశం ఉంది. మిడిలార్డర్ మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తోంది. మనీశ్‌పాండే నుంచి మెరుపుల్లేకపోగా, యూసుఫ్ పఠాన్ ఫామ్ సరేసరి అన్నట్లుంది. దీంతో భారమంతా టాప్ ఆర్డర్‌దే అవుతోంది. షకీబ్ లోటును కొంత తీరుస్తున్నా అది అన్నిసార్లు కుదరదు. వికెట్ కీపర్ గోస్వామిని మిడిలార్డర్లో దింపితే ప్రయోజనం ఉండొచ్చు. చివరి మూడు మ్యాచ్‌ల వైఫల్యాలను సరిదిద్దుకుంటే భువీ ఆధ్వర్యంలోని బౌలింగ్ బృందం ప్రత్యర్థికి కొరకరాని కొయ్య కావడం ఖాయం. తుది జట్లు (అంచనా) చెన్నై: ధోని (కెప్టెన్), రైనా, రాయుడు, వాట్సన్, బిల్లింగ్స్/డు ప్లెసిస్, బ్రేవో, జడేజా, హర్భజన్, చహర్, శార్దుల్, ఇన్‌గిడి. హైదరాబాద్: విలియమ్సన్ (కెప్టెన్), ధావన్, హేల్స్/బ్రాత్‌వైట్, మనీశ్ పాండే, గోస్వామి, యూసుఫ్ పఠాన్, షకీబ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్. ►ఐపీఎల్–11లో 4 శతకాలు నమోదైతే మూడు సన్‌రైజర్స్‌పైనే వచ్చాయి. ఇందులో రెండు చెన్నై ఓపెనర్లు వాట్సన్, రాయుడు చేసినవే. ►అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ రేసులో విలియమ్సన్ (661) రెండో స్థానంలో ఉండగా, అతడిని అందుకునే అవకాశం రాయుడి (586)కి మాత్రమే ఉంది. ►రెండు జట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిద్ధార్థ్ కౌల్ (17) కాగా, రషీద్ ఖాన్ (16) తర్వాత ఉన్నాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ (14) ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ► పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు లీగ్ విజేత కావడం రెండుసార్లు మాత్రమే జరిగింది. 2008లో రాజస్తాన్, 2017లో ముంబై ఈ ఘనత సాధించాయి. ►ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్‌పై చెన్నైదే గెలుపు. రాయుడు (79, 100 నాటౌట్) రెండుసార్లూ మెరిశాడు. -
నా సెంచరీ మామయ్యకు అంకితం: రాయుడు
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తన సెంచరీని దివంగత మేనమామ మెండు సత్యనారాయణకు అంకితమిస్తున్నానని రాయుడు చెప్పాడు. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి అయిన సత్యనారాయణ (68) ఆదివారం కన్నుమూశారు. గుంటూరు జిల్లా ఖాజీపాలెంకు చెందిన సత్యనారాయణ సెంట్రల్ డ్రగ్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండ్ హోదాలో పని చేశారు. రిటైర్మెంట్ అనంతరం హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో నివాసముంటున్నారు. గత నెలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు సాయంత్రం హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాయుడు హాజరయ్యే అవకాశముందని రాయుడి తండ్రి సాంబశివరావు తెలిపారు. -
ఆమె పేరు స్వాతి.. సాక్షికి చెప్పొద్దు ప్లీజ్!
చెన్నై: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను తన తొలిప్రేమపై పెదవి విప్పాడు. తన బయోపిక్ ‘ధోని–ది అన్‌టోల్డ్ స్టోరీ’లో లేని ముచ్చటొకటి చెప్పాడు. మెజీషియన్ సరదాగా ధోని తొలి ప్రేమ గురించి వివరించమన్నప్పుడు ఈ కహానీ వెలుగులోకి వచ్చింది. మొదట ఆమె పేరులో ‘ఎ’ అక్షరముంటుందన్నాడు. తర్వాత అది పేరులోని మూడో అక్షరమన్నాడు. చివరకు ‘ఆమె పేరు స్వాతి. కానీ నా భార్య (సాక్షి)కు మాత్రం చెప్పకండి. ప్లీజ్..’ అని నవ్వుతూ చెప్పేశాడు. దీనిపై ఇంకాస్త వివరణ ఇస్తూ... 1999లో తను 12వ తరగతి చదువుతుండగా తొలిప్రేమ చిగురించిందని చెప్పాడు. ఆ ఏడాది తర్వాత తననెప్పుడూ చూడలేదన్నాడు. -
‘భాజీ.. మీ లుక్ అస్సలు బాలేదు’
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్బజన్ సింగ్ బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టడమే కాదు.. తనకు ఉచిత సలహాలు ఇచ్చిన వారికి దిమ్మ తిరిగే సమాధానాలు ఇవ్వడంలోనూ దిట్ట. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపించాడు భజ్జీ. విషయమేమిటంటే.. సీఎస్కే జట్టుతో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో హర్బజన్ క్యాప్ ధరించి.. తోటి ఆటగాళ్లతో సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన ఓ నెటిజన్.. ‘భాజీ.. (వయసులో నాకంటే చిన్న వారైనా మీరెంతో సాధించారు. అందుకే భాజీ అని సంబోధిస్తున్నా) మీ ట్విటర్ అకౌంట్‌కు హర్బజన్ టర్బోనేటర్ అని పేరు పెట్టుకున్నారు కదా. మరి మీరు చిన్న జడతో కూడిన పర్కా (సిక్కులు ధరించే తలపాగా వంటిది) ధరించవచ్చు కదా. అప్పుడే నిజమైన సర్దార్‌లా ఉంటారు. ప్రస్తుతం మీ లుక్ విసుగు తెప్పిస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందనగా హర్బజన్.. ‘భాయ్ మీ ఇంటి ఙ్ఞానాన్ని నాకు పంచకండి. ఒక సర్దార్ ఎలా ఉండాలో మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదం’టూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. Was that you ???? Ufff 🙈🙈 @DJBravo47 according to @mvj888 it was you 💨💨💨 @ChennaiIPL #nofartzone 😜 pic.twitter.com/UcnA6UdkSh — Harbhajan Turbanator (@harbhajan_singh) May 3, 2018 Bhaji... (U r younger to me inspite of that I said Bhaji to u becoz ur acheivments r much better then me) u kept title Harbhajan Turbanator.If u can't afford to wear Turban.Pls wear patka with little juda So u look Sardar.presant look is disgusting. https://t.co/j6Zikk8a79 — Mitwa (@Mitwa34Mitwa) May 3, 2018 -
గిల్ గెలిపించాడు
కోల్‌కతాకు కీలక విజయం... తొలుత చెన్నైను బ్యాటింగ్‌లో కట్టడి చేసి, తర్వాత బ్యాటింగ్‌లో స్థిరమైన ఆటతో ఛేదనను పూర్తి చేసిన ఆ జట్టు గెలుపును తన ఖాతాలో వేసుకుంది. నరైన్ ఆల్‌రౌండ్ ప్రతిభ, యువ శుబ్‌మన్ గిల్ సంయమనం, కెప్టెన్ దినేశ్ కార్తీక్ మెరుపులతో నైట్ రైడర్స్...ధోని జట్టును మట్టికరిపించింది. కోల్‌కతా: సొంతగడ్డపై ఛేదనలో అద్భుత రికార్డున్న తమను ఓడించడం కష్టమేనని కోల్‌కతా నైట్‌రైడర్స్ మరోసారి చాటిచెప్పింది. పటిష్టమైన చెన్నై సూపర్‌కింగ్స్‌తో గురువారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా చక్కటి ఆటతీరుతో 6 వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై... కెప్టెన్ ధోని (25 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఓపెనర్ వాట్సన్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సురేశ్ రైనా (26 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (2/20), పీయూష్ చావ్లా (2/35) ప్రత్యర్థిని కట్టడి చేశారు. యువ శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరు, కెప్టెన్ దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 4 వికెట్లే కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఛేదనను సునాయాసంగా పూర్తి చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నరైన్ (20 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి ఉపయుక్త ఇన్నింగ్స్ ఆడాడు. తలా ఓ చేయి... క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మన్ తమ వంతు పరుగులు చేయడంతో చెన్నై మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఓపెనర్లలో వాట్సన్ తడబడినా డు ప్లెసిస్ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. వీరు తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రైనా వస్తూనే ఫోర్లు కొట్టి రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. రెండో వికెట్‌కు 43 పరుగులు జతయ్యాక రైనా, వాట్సన్ వరుస ఓవర్లలో వెనుదిరిగారు. మంచి ఫామ్‌లో ఉన్న రాయుడు (21)ను నరైన్ బోల్తా కొట్టించగా, ధోని కుదురుకోవడానికి సమయం తీసుకోవడంతో పరుగుల రాక మందగించింది. అయితే, మావి, జాన్సన్, కుల్దీప్ల ఓవర్లలో నాలుగు సిక్స్‌లు కొట్టిన మహి గేరు మార్చాడు. మరో ఎండ్‌లో జడేజా (12) ఎప్పటిలాగే కిందా మీదా పడుతూ ఆడాడు. నరైన్ 19వ ఓవర్లో నాలుగే పరుగులిచ్చినా, చావ్లా వేసిన చివరి ఓవర్లో మూడు ఫోర్లు సహా 15 పరుగులు రావడంతో సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను గౌరవప్రదమైన స్కోరుతో ముగించింది. నైట్ రైడర్స్ సునాయాసంగా... ఇన్‌గిడి వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి కోల్‌కతా ఛేదనను ఘనంగా ప్రారంభించిన ఓపెనర్ క్రిస్ లిన్ (12) చివరి బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరుసటి ఓవర్లో ఆసిఫ్ బౌలింగ్‌లో జడేజా రెండు సులభ క్యాచ్‌లు వదిలేసి నరైన్‌కు లైఫ్లిచ్చాడు. అడపాదడపా బ్యాట్ ఝళిపిస్తూ ఈ అవకాశాన్ని అతడు బాగానే ఉపయోగించుకున్నాడు. ఉతప్ప (6) విఫలమైనా గిల్... వాట్సన్ బౌలింగ్‌లో చక్కటి షాట్లతో మూడు ఫోర్లు కొట్టి ఆకట్టుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి నరైన్ వెనుదిరగడం, రింకూ సింగ్ (16) పరుగులకు ఇబ్బంది పడటంతో చెన్నై పైచేయి సాధిస్తున్నట్లు కనిపించింది. కానీ, దినేశ్ కార్తీక్, గిల్ సంయమనంతో ఆడారు. 36 బంతుల్లో 58 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆసిఫ్ బౌలింగ్‌లో గిల్ రెండు, కార్తీక్ ఒక సిక్స్ కొట్టి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. తర్వాతి ఓవర్లోనూ 14 పరుగులు రావడంతో లక్ష్యం మరింత కరిగిపోయింది. నిబ్బరంగా ఆడిన గిల్ ఈ క్రమంలో ఐపీఎల్లో తొలి అర్ధ శతకం (32 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రేవో వేసిన 18వ ఓవర్లో కార్తీక్ మూడు ఫోర్లు కొట్టి 14 బంతులు ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (సి) శివమ్ మావి (బి) నరైన్ 36; డు ప్లెసిస్ (బి) చావ్లా 27; రైనా (సి) జాన్సన్ (బి) కుల్దీప్ 31; రాయుడు (బి) నరైన్ 21; ధోని నాటౌట్ 43; జడేజా (సి) కార్తీక్ (బి) చావ్లా 12; కరణ్ శర్మ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–48, 2–91, 3–101, 4–119, 5–173. బౌలింగ్: జాన్సన్ 4–0–51–0, చావ్లా 4–0–35–2, శివమ్ మావి 3–0–21–0, నరైన్ 4–0–20–2, రసెల్ 1–0–12–0, కుల్దీప్ 4–0–34–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) వాట్సన్ (బి) ఇన్‌గిడి 12; నరైన్ (సి) బ్రేవో (బి) జడేజా 32; ఉతప్ప (సి) బ్రేవో (బి) ఆసిఫ్ 6; శుబ్‌మన్ గిల్ నాటౌట్ 57; రింకూ సింగ్ (బి) హర్భజన్ 16; కార్తీక్ నాటౌట్ 45; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–12, 2–40, 3–64, 4–97. బౌలింగ్: ఇన్‌గిడి 3–0–36–1, ఆసిఫ్ 3–0–32–1, వాట్సన్ 2–0–19–0, జడేజా 4–0–39–1, హర్భజన్ 3–0–20–1, బ్రేవో 1.4–0–22–0, కరణ్ శర్మ 1–0–11–0 -
ఆల్‌రౌండర్ ధోని.. దటీజ్ మహీ, వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తన గారాల పట్టి జీవాతో సమయం గడిపేందుకు ఇష్టపడతాడు. ఈ విషయం మరోసారి రుజువైంది. తన ముద్దుల తనయకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకోవడం ధోనికి అలవాటు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠపోరులో సిక్సర్ బాది మరో 2 బంతులుండగానే చెన్నైకి విజయాన్ని అందించాడు ధోని. మ్యాచ్ అనంతరం ధోని పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ 11 సీజన్‌తో ఆటగాడిగా, కెప్టెన్ గా బిజిబిజీగా ఉన్నప్పటికీ.. తండ్రిగా బాధ్యతను మాత్రం మరవలేదు. హెయిర్ డ్రైయర్‌తో తన గారాల పట్టి జీవా తడి జుట్టును ఆరబెడుతున్న వీడియోను ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఆట ముగిసింది. హాయిగా నిద్ర పోయాను. ప్రస్తుతం తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానంటూ’ ధోని పోస్ట్ చేసిన గంటలోపే సుమారు 4 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ‘కెప్టెన్‌గా, తండ్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆల్‌రౌండర్ ధోని. దటీజ్ తాలా’ అంటూ ఓ నెటిజన్ అభిమానాన్ని చాటుకున్నాడు. Game over, had a nice sleep now back to Daddy’s duties A post shared by M S Dhoni (@mahi7781) on Apr 26, 2018 at 2:54am PDT -
‘భాయ్.. ఐపీఎల్ కప్‌లో టీ తాగించాలి’
రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేసిన ధోని జట్టు ఈ సీజన్లో అదరగొడుతోంది. 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై జట్టు ఐదింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సిక్సర్ల మోత మోగించి జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ధోని, కోహ్లిల జట్లు ఈ సీజన్లో తొలిసారి తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌ను కెప్టెన్ కూల్, కెప్టెన్ అగ్రెసివ్‌ల మధ్య పోరుగా అభిమానులు అభివర్ణించారు. అయితే ప్రస్తుతం మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఆసక్తికర సన్నివేశం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోని, విరాట్లు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘చెన్నై- కర్ణాటక ఇప్పుడు స్నేహితులయ్యారు. కావేరీ జలాల సమస్య తీరిపోయింది ఇక’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘మహీ భాయ్ ఐపీఎల్ కప్‌లో నాకు చాయ్ తాగించాలి ప్లీజ్’ అంటూ మరొకరు సరదాగా కోహ్లిని ఉద్దేశించి కామెంట్ చేశారు. ‘ఈ ఫొటో చాలా మాట్లాడుతోందంటూ’ ధోని, కోహ్లిల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Congratulations everyone. Tamil Nadu and Karnataka are friends. Cauvery issue is resolved. #RCBvCSK pic.twitter.com/leJCudDk4C — SAGAR (@sagarcasm) April 25, 2018 " Maahi bhai #IPL cup me chai pila na plz" pic.twitter.com/wPMeHOEZNc — Freelance 007 (@James_Beyond) April 25, 2018 These pictures speaks a lot ! #RCBvCSK #IPL2018 pic.twitter.com/SaCfDtejLV — Freelance 007 (@James_Beyond) April 25, 2018 -
చెన్నై సూపర్ రాయుడు
ఐపీఎల్లో మరోసారి ఆఖరి బంతి మాయ చేసింది. ఈ సీజన్లో ఒకసారి చివరి బంతికి గెలిచి మరోసారి ఆఖరి బంతికి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ పక్షానే మరోసారి చివరి బంతి నిలిచింది. మూడు బంతుల్లో16 పరుగులు కావాల్సిన స్థితిలో బ్రేవో బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ఉత్కంఠ పెంచిన రషీద్ ఖాన్ చివరి బంతికి సింగిల్‌కు పరిమితం కావడంతో రైజర్స్‌కు వరుసగారెండో పరాజయం ఎదురైంది. ఉప్పల్‌లో తమ గత మ్యాచ్‌లో ఆఖరి బంతికే ఫోర్‌తో గట్టెక్కిన హైదరాబాద్ ఈసారి గెలుపు గీత దాటలేకపోయింది. తొలి బంతి నుంచి దాదాపు ఒకే తరహాలో సాగిన మ్యాచ్‌లో చివరకు హైదరాబాద్‌పై చెన్నైదే పైచేయి అయింది. రెండు అత్యుత్తమ ప్రదర్శనల్లో అంబటి తిరుపతి రాయుడు గెలుపు వైపు నిలబడగా... విలియమ్సన్ ఓటమి పక్కనే నిలవాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో జోరు పెంచింది. ఆదివారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంబటి రాయుడు (37 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌కు సురేశ్ రైనా (43 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 112 పరుగులు జోడించడం విశేషం. అనంతరం రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేయగలిగింది. విలియమ్సన్ (51 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్‌కు తోడు యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 45 బంతుల్లోనే 79 పరుగులు జత చేశారు. దీపక్ చహర్‌కు 3 వికెట్లు దక్కాయి. భారీ భాగస్వామ్యం... 2, 2, 4... తొలి మూడు ఓవర్లలో చెన్నై చేసిన పరుగులు ఇవి. గత మ్యాచ్ సెంచరీ హీరో వాట్సన్ పరుగులు తీసేందుకు తీవ్రంగా తడబడ్డాడు. భువీ వేసిన నాలుగో ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన వాట్సన్ (9) తర్వాతి బంతికే వెనుదిరగడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న డు ప్లెసిస్ (11) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆరు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసిన చెన్నై ఈ సీజన్లో పవర్‌ప్లేలో అతి తక్కువ పరుగులు నమోదు చేసిన జట్టుగా గుర్తింపు పొందింది. అయితే రైనా, రాయుడు జత కలిసిన తర్వాత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. పది ఓవర్లు ముగిసేసరికి 54 పరుగులు మాత్రమే ఉన్న చెన్నై స్కోరు వీరిద్దరి జోరుతో వేగంగా దూసుకుపోయింది. రషీద్ ఓవర్లో రైనా వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టి దూకుడు పెంచాడు. ఈ జంట విధ్వంసం సృష్టిస్తున్న తరుణంలో సమన్వయ లోపం రాయుడు రనౌట్‌కు కారణమైంది. కౌల్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన అనంతరం ఓవర్‌త్రోకు మరో పరుగు చేసేందుకు వీరిద్దరు ప్రయత్నించారు. రైనా పిలుపుపై రాయుడు ముందుకు దూసుకొచ్చాడు. అయితే బంతి దగ్గరలోనే ఉండటం గమనించి రైనా మళ్లీ నివారించడంతో వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించి రాయుడు విఫలమయ్యాడు. అనంతరం 39 బంతుల్లో రైనా అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో ధోని (12 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. భువనేశ్వర్ స్థాయి బౌలర్ పూర్తి కోటా వేయలేకపోవడం సన్ వ్యూహ వైఫల్యాన్ని చూపించింది. విలియమ్సన్ మెరుపులు... గత ఐదు సీజన్లలో వార్నర్, ధావన్ లేకుండా తొలి మ్యాచ్ ఆడుతున్న సన్‌రైజర్స్ ఊహించినట్లుగానే తడబడింది. రెండు ఏళ్ల పాటు జట్టులో సభ్యుడిగా ఉన్నా మ్యాచ్ దక్కని రికీ భుయ్ తొలి అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. తీవ్ర ఒత్తిడిలో ఓపెనింగ్ చేసి భుయ్ (0) ఐదో బంతికి డకౌటయ్యాడు. పాండే (0), హుడా (1) కూడా అతడినే అనుసరించడంతో సన్ 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు చహర్‌కే దక్కడం విశేషం. ఇలాంటి దశలో విలియమ్సన్, షకీబ్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ఆదుకున్నారు. షకీబ్ అవుటయ్యాక విలియమ్సన్, పఠాన్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి వేగంగా పరుగులు సాధించడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. ముఖ్యంగా కరణ్ శర్మ వేసిన ఓవర్లో విలియమ్సన్ మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో 22 పరుగులు వచ్చాయి. బ్రేవో వేసిన తర్వాతి ఓవర్లో పఠాన్ మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే ఏడు పరుగుల వ్యవధిలో వీరిద్దరు అవుట్ కావడంతో చెన్నై ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (సి) హుడా (బి) భువనేశ్వర్ 9; డు ప్లెసిస్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 11; సురేశ్ రైనా నాటౌట్ 54; అంబటి రాయుడు రనౌట్ 79; ధోని నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–14, 2–32, 3–144. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–22–1, స్టాన్లేక్ 4–0–38–0, షకీబ్ 4–0–32–0, సిద్ధార్థ్ కౌల్ 4–0–33–0, రషీద్ ఖాన్ 4–0–49–1, దీపక్ హుడా 1–0–8–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: రికీ భుయ్ (సి) వాట్సన్ (బి) చహర్ 0; విలియమ్సన్ (సి) జడేజా (బి) బ్రేవో 84; మనీశ్ పాండే (సి) కరణ్ శర్మ (బి) చహర్ 0; హుడా (సి) జడేజా (బి) చహర్ 1; షకీబ్ (సి) రైనా (బి) కరణ్ శర్మ 24; యూసుఫ్ పఠాన్ (సి) రైనా (బి) ఠాకూర్ 45; సాహా నాటౌట్ 5; రషీద్ ఖాన్ నాటౌట్ 17 ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–0, 2–10, 3–22, 4–71, 5–150, 6–157. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–15–3, శార్దుల్ ఠాకూర్ 4–0–45–1, వాట్సన్ 2–0–23–0, రవీంద్ర జడేజా 4–0–28–0, కరణ్ శర్మ 3–0–30–1, బ్రేవో 3–0–37–1. ముందుండి నడిపించి... రాయుడు... రాయుడు... ఆదివారం ఉప్పల్ స్టేడియం ఈ పేరుతో మార్మోగిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలవాలని కోరుకుంటూ వచ్చిన ఫ్యాన్స్ కూడా అంతే అభిమానంతో తమవాడిగా భావించి స్టేడియంలో ప్రతీ బంతికి తనను ప్రోత్సహిస్తుంటే రాయుడు ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రత్యేక ఇన్నింగ్స్ ఆడాడు. బహుశా అతనికి కూడా మొదటిసారి సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగినట్లుంది. ఎందుకంటే అతను ఐపీఎల్ ప్రారంభమయ్యాక దేశవాళీ క్రికెట్లో తొలిసారి ఇటీవలే హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వచ్చిన ఐపీఎల్ ఇదే. అంబటి రాయుడు 2010 నుంచి 2017 వరకు ఎనిమిది సీజన్ల పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇన్నేళ్ళలో అతను బరోడాకు చెందిన ఆటగాడిగానే గుర్తింపు పొందాడు. ఒక సీజన్ విదర్భకు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇదే మైదానంలో 2017 ఫైనల్లో పుణే 4 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితిలో డీప్ కవర్లో స్మిత్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకొని గర్జించిన రాయుడు అదే వేదికపై తన తర్వాతి మ్యాచ్‌లో మరో జట్టు తరఫున బ్యాటింగ్‌తో చెలరేగాడు. గతంలో సన్‌రైజర్స్‌పై హైదరాబాద్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో రాయుడు 34, 68, 54 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ పరిస్థితి వేరు. మరొకరికి సహాయపాత్రలో కాకుండా తాను ముందుండి దూకుడుగా నడిపించిన తీరు చూస్తే ఈ ఇన్నింగ్స్ విశేషమైనదే. చెన్నై స్కోరు 2 వికెట్లకు 32 వద్ద రాయుడు క్రీజ్‌లోకి వచ్చాడు. రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను, భువనేశ్వర్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. ఇదే సూపర్‌కింగ్స్ జోరుకు బీజం వేసింది. ముఖ్యంగా స్టాన్లేక్ వేసిన ఓవర్లో అతను రౌద్ర రూపం చూపించాడు. మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో ప్రత్యర్థి పనిపట్టాడు. ఈ మ్యాచ్‌లో రాయుడు ఆడిన ప్రతీ షాట్లో అమితమైన ఆత్మవిశ్వాసం కనిపించింది. ఏ దశలోనూ, ముఖ్యంగా రివర్స్ స్వీప్ ఆడేటప్పుడు కూడా అతను తడబాటుకు గురి కాలేదు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X పంజాబ్ వేదిక: ఢిల్లీ, రా.గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
అత్యుత్తమ ఆటగాడు అతనే :వాట్సన్
పుణే : ఐపీఎల్ సీజన్ 11 లో సెంచరీ చేసిన రెండో ఆటగాడు షేన్‌వాట్సన్ క్రిస్‌గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆసీస్ ఆల్ రౌండర్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. సెంచరీల మోత మోగించే క్రిస్‌గేల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ 20 ఆటగాడని కీర్తించాడు. టీ 20ల్లో అధిక సెంచరీలు చేయగలిగే ప్రతిభ క్రిస్‌గేల్ సొంతమని కొనియాడాడు. ఆ కారణంగానే గేల్‌ను యూనివర్స్ బాస్ అంటారంటూ ప్రశంసలు కురిపించాడు. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీఎస్కే జట్టులో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వాట్సన్ పేర్కొన్నాడు. రాత్రి జరిగిన మ్యాచులో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచులో 57 బంతుల్లో 106 పరుగులు చేసిన వాట్సన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. తద్వారా ఈ సీజన్లో క్రిస్‌గేల్ తర్వాత సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్‌గేల్.. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. -
సరైన ఆరంభమే సునీల్ గావస్కర్
చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనం చిరస్మరణీయం. కఠిన పరిస్థితుల్లోనూ అద్భుతంగా ఆడగల బ్రేవో వంటి అనుభవజ్ఞులతో కూడిన ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఓటమి అంచుల నుంచి సూపర్ కింగ్స్ సాధించిన విజయంతో ఐపీఎల్–11వ సీజన్‌కు సరైన ఆరంభం లభించినట్లయింది. జట్టులో ఆల్‌రౌండర్లు ఉండటం ఎంతటి సౌలభ్యమో బ్రేవో అసాధారణ ఇన్నింగ్స్ చెబుతోంది. అంతకుముందు బ్రేవో జిత్తులమారి బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరు 180కి చేరకుండా నిలువరించాడు. చివరి ఓవర్లలో అతడి నెమ్మదైన బంతులు, వేగవంతమైన యార్కర్లను ముంబై బ్యాట్స్‌మెన్ భారీ షాట్లుగా మలచలేకపోయారు. ఛేదనలో 16వ ఓవర్ ముగిసేసరికి చెన్నై దాదాపు 11 రన్‌రేట్‌తో పరుగులు సాధించాల్సి ఉంది. ఈ దశలో బ్రేవో భారీ హిట్టింగ్తో ఫలితాన్ని మార్చేశాడు. లీగ్‌లో పునరాగమనం చేస్తున్న మరో జట్టు రాజస్తాన్ రాయల్స్ కూడా చెన్నైను చూసి స్ఫూర్తి పొందుతుందనడంలో సందేహం లేదు. స్టీవ్ స్మిత్ దూరమైనా... వార్న్ వంటి వారు మెంటార్‌గా ఉండటంతో జట్టు సమతూకంతో కనిపిస్తోంది. రహానే కెప్టెన్సీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలడు. సిక్స్‌లు కొట్టలేకపోయినా బౌండరీలతో పరుగులు రాబట్టగలడు. వార్నర్ లేకపోవడం సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. బ్యాటింగ్‌లో అతడే జట్టు మూలస్తంభం. తన కెప్టెన్సీ కూడా అద్భుతం. అతడి స్థానంలో వస్తున్న విలియమ్సన్ ఈ సీజన్లో తమ దేశం తరఫున బాగా ఆడాడు. కెప్టెన్‌గా అతడు బాగా ఎదిగాడు. భావాలను బహిరంగంగా ప్రదర్శించే అతడు... పరిస్థితులను అంతే చక్కగా అర్థం చేసుకుంటాడు. గొప్ప బ్యాట్స్‌మన్, గొప్ప బౌలర్ మధ్య జరిగినట్లే కెప్టెన్ల మధ్య కూడా పోరాటం ఉంటుంది. ఏదేమైనా... ఈ ఏడాది ఏ కెప్టెనైతే మ్యాచ్‌ను మలుపుతిప్పగల వ్యూహాలు పన్నుతాడో ఆ జట్టే విజేతగా నిలుస్తుంది. -
ఐపీఎల్- 11 లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి
-
చెన్నై చమక్
ఐపీఎల్ సీజన్ తొలి పోరు. తలపడుతున్నది దిగ్గజ జట్లు. అటు ఇటు మంచి హిట్టర్లు. అయినా సాదాసీదా ప్రదర్శన. ‘ఇదేం ఆట’ అంటూ నిట్టూర్పులో అభిమానులు! కానీ ఒకే ఒక్కడు మలుపు తిప్పాడు. ప్రేక్షకులను రంజింపజేశాడు. పేలవంగా సాగుతున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చాడు. ఓటమి ఖాయమనుకున్న తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అతడే డ్వేన్ బ్రేవో. అతడి దెబ్బకు ముంబై విసిరిన లక్ష్యం ‘బ్రేవ్ బ్రేవ్’మంటూ కరిగిపోయింది. చెన్నైకు అనూహ్య గెలుపు దక్కింది. ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఘన పునరాగమనం. మొదట బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన డ్వేన్ బ్రేవో (0/25), అనంతరం బ్యాటింగ్ (30 బంతుల్లో 69; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు)లోనూ విరుచుకుపడటంతో శనివారం ఇక్కడ జరిగిన ఐపీఎల్–11వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు వికెట్ తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై... సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. బ్రేవో దూకుడుతో చెన్నై 19.5 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. బ్రేవోకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు వాట్సన్ (16), రాయుడు (22) చెన్నై ఇన్నింగ్స్‌ను కొంత మెరుగ్గానే ఆరంభించారు. వీరితో పాటు రైనా (4), ధోని (5) తర్వగా అవుటవడంతో జట్టు కష్టాల్లో పడింది. ముందుగా వచ్చిన జడేజా (12) నిరాశపరిచాడు. ఈలోగా కేదార్ జాదవ్ (22 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా బ్రేవో ధైర్యంగా ఆడాడు. చివరి 3 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో రెండే వికెట్లున్నాయి. మెక్లనగన్ వేసిన 18వ ఓవర్లో బ్రేవో రెండు సిక్స్‌లు, 1 ఫోర్‌తో, బుమ్రా వేసిన 19వ ఓవర్లో 3 సిక్స్‌లు సహా 20 చొప్పున పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా తిరిగి క్రీజులోకి వచ్చిన జాదవ్... ముస్తఫిజుర్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ముగించాడు. అంతకుముందు ఐపీఎల్ ఆరంభ వేడుకలు శనివారం అట్టహాసంగా సాగాయి. సినీ తారలు హృతిక్ రోషన్, ప్రభుదేవా, వరుణ్ ధావన్, జాక్లిన్ ఫెర్నాండెజ్, తమన్నాలు ప్రత్యేక నృత్యాలతో అలరించారు. -
దిగ్గజాలు దున్నేస్తాయా?
జట్టులో లెక్కకు మిక్కిలి స్టార్లు... మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే ఆటగాళ్లు... తడబడినా ఎదురీదగలిగేంత స్థైర్యం... నిలదొక్కుకుని గెలవగల బలగం... ...ఇదీ ముంబై ఇండియన్స్ పరిచయంజట్టును నడిపించేదే ఓ దిగ్గజం... ప్రతికూలత ఎదురైనా వెరవని వైనం... ఉన్న వనరులతోనే గెలవగల నేర్పు... సమష్టి ఆటతీరుకు పెట్టింది పేరు... ...ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం సాక్షి క్రీడా విభాగం : ఐపీఎల్ పది సీజన్లలో ఐదుసార్లు విజేతలు ముంబై ఇండియన్స్ (3), చెన్నై సూపర్‌కింగ్స్ (2) జట్లే. అంటే, మొత్తం టైటిళ్లలో సగం ఈ రెండింటి వద్దే ఉన్నట్లు. దీంతోపాటు ముంబై ఒకసారి, చెన్నై నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచాయి. గణాంకాలు చూస్తేనే తెలిసిపోతుంది ఈ రెండు ఫ్రాంచైజీలు ఎంత బలమైనవో! క్రమంగా ఊపందుకుని కప్‌ను ఎగరేసుకుపోవడం ముంబై తీరైతే, అడ్డంకులను అధిగమిస్తూ, నిలకడైన ఆటతో టైటిల్ కొట్టేయడం చెన్నై లక్షణం. ఈ ఏడాది రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతుండగా, రెండేళ్ల నిషేధం తొలగిన చెన్నై మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో పూర్వ వైభవం పొందాలని ఆశిస్తోంది. మరి వీటి బలాబలాలేమిటో, బలహీనతలేమిటో చూద్దాం...! క్రమంగా... బలంగా... తొలి రెండు సీజన్లు లీగ్ దశలో నిష్క్రమణ, తర్వాత మూడేళ్లలో ఒకసారి రన్నరప్, రెండుసార్లు ప్లే ఆఫ్స్, చివరి ఐదేళ్లలో మూడుసార్లు చాంపియన్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్రయాణాన్ని ఇలా మూడు దశలుగా చెప్పుకోవాలి. ఒక దశలో స్టార్లు ఎక్కువై, ఆటగాళ్లు తక్కువై ఫలితాల పరంగా ఈ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. కానీ, రోహిత్ చేతికి పగ్గాలు వచ్చాక పరిస్థితి మారింది. 2013లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఈ హిట్‌మ్యాన్... తర్వాతి ఏడాది నుంచి పూర్తిస్థాయి సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. ముఖ్యంగా 2015, 2017లలో టైటిల్ గెలవడంలో రోహిత్‌దే ముఖ్య పాత్ర. వేలంలోనూ మంచి ఆటగాళ్లను ఎంచుకుని ఈసారి సైతం భారీ అంచనాలతోనే రంగంలోకి వస్తోంది. అయితే... రోహిత్ కాక చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయీస్, డుమిని, సౌరభ్ తివారీ మాత్రమే కావడంతో బ్యాటింగ్ భారమంతా కెప్టెన్‌పైనే పడేలా కనిపిస్తోంది. హార్దిక్, కృనాల్ పాండ్యా, పొలార్డ్ వంటి ఆల్‌రౌండర్లు, బుమ్రా, కమిన్స్, ముస్తాఫిజుర్ వంటి పేసర్లు ఉండటం భరోసానిస్తోంది. ఇదీ జట్టు: రోహిత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సౌరభ్ తివారీ, సూర్యకుమార్, సిద్దేశ్ లాడ్, శరద్లాంబా, తజిందర్ దిల్లాన్, మయాంక్ మార్కండే, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, తారే, బుమ్రా, రాహుల్ చహర్, మొహిసిన్ ఖాన్, నిధీశ్, ప్రదీప్ సాంగ్వాన్ (స్వదేశీ), డుమిని, లూయీస్, కట్టింగ్, ధనంజయ, పొలార్డ్, బెహ్రన్‌డార్ఫ్, కమిన్స్, ముస్తాఫిజుర్, మెక్లీనగన్ (విదేశీ). ఘన పునరాగమనం కోసం... ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టంటే చెన్నై సూపర్ కింగ్సే. 2008 నుంచి 2015 వరకు ఎనిమిది సీజన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిందీ జట్టు. నాలుగుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకోగా, రెండుసార్లు సెమీఫైనల్స్‌కు చేరింది. పరిస్థితులకు తగ్గట్లు జట్టు సభ్యులను వాడుకునే ధోని నాయకత్వ ప్రతిభ, రైనా మెరుపులకు మిగతా ఆటగాళ్ల సహకారం తోడవడంతో లీగ్‌లో చెన్నై ఎప్పుడూ పేలవ ప్రదర్శన చేయలేదు. ఉన్న వనరులతోనే ఫలితం రాబట్టగలడం ధోని శైలి కాబట్టి ఈసారి కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే... టి20 స్థాయికి తగిన ఓపెనర్లు లేకపోవడం లోటు. వాట్సన్ మునుపటి స్థాయిలో ఆడట్లేదు. దీంతో బిల్లింగ్స్, విజయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. డు ప్లెసిస్, జాదవ్, రైనా, రాయుడు, ధోనిలతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బ్రావో, ఇన్‌గిడి, శార్దుల్ పేస్ బాధ్యతలు మో స్తారు. రెండేళ్ల నిషేధంతో జట్టు స్వరూపం కొంత మారినా... మహి నాయకత్వ పటిమ, స్థానిక అభిమానుల మద్దతు చెన్నైకి పెద్ద బలం. దీంతో ఎప్పటిలానే ఈ ఫ్రాంచైజీ కనీసం సెమీస్‌కు చేరగలదని చెప్పొచ్చు. ఇదీ జట్టు ధోని (కెప్టెన్), రైనా, మురళీ విజయ్, హర్భజన్, జాదవ్, రాయుడు, ధ్రువ్ షోరే, జడేజా, కరణ్ శర్మ, క్షితిజ్ శర్మ, నారాయణ్ జగదీశన్, కేఎం ఆసిఫ్, చైతన్య బిష్ణోయ్, దీపక్ చహర్, మోను కుమార్, కనిష్క్ సేథ్, శార్దుల్ ఠాకూర్ (స్వదేశీ). డు ప్లెసిస్, బ్రావో, వాట్సన్, బిల్లింగ్స్, ఇన్‌గిడి, తాహిర్, మార్క్ వుడ్ (విదేశీ). -
సీఎస్కే వీడియో వైరల్.. ఫ్యాన్స్ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ప్రచారంలో భాగంగా సీఎస్కే ఫ్రాంచైజీ రూపోందించిన ఓ వీడియో ఇప్పుడు సచిన్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. దీంతో అప్రమత్తమైన సీఎస్కే జట్టు తమ అధికారిక ఫేస్బుక్ పేజీ నుంచి ఈ వీడియోను తొలగించింది. అయినప్పటికి తమ ఆరాధ్య దైవం, అభిమాన క్రికెటర్‌ను కించపరిచేలా సీఎస్కే వ్యవహరించిందని సచిన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. అభిమానులను ఆకట్టుకోవాడినికి తమిళ బాషలో రూపొందించిన ఈ వీడియో సచిన్ జెర్సీ కిందపడే సన్నివేశంతో మొదలవుతోంది. ఇదే అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అనంతరం తమిళ నెటివిటికి తగ్గట్టు.. సూపర్ స్టార్ రజనీకాంత్ పోస్టర్లు, ఐపీఎల్ సమయంలో యువత గడిపే సన్నివేశాలతో ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం అభిమానులు ఈ వీడియోను ‘షేమ్ చెన్నై సూపర్ కింగ్స్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. -
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ధోని.. మరి రైనా?
సాక్షి, చెన్నై: ఫిక్సింగ్ వివాదం ఆరోపణలతో రెండేళ్లు నిషేదం ఎదుర్కోన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఐపీఎల్-11 సీజన్లో పునరాగమనం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ జట్లు తమ ప్లేయర్లనే వెనక్కు తీసుకోవాడానికి మొగ్గు చూపుతున్నాయి. రైజింగ్ పుణే, గుజరాత్ లయన్స్‌లో ఆడిన చెన్నై, రాజస్థాన్ ప్లేయర్లు రిటెన్షన్ పాలసీలో భాగంగా తిరిగి వారి జట్లలోకి వెళ్లేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం త్వరలో కౌన్సిల్ నుంచే ప్రకటన వెలవడనుంది. దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్లులోకి మహేంద్రసింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, డుప్లెసిస్‌లు పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే చెన్నై మాజీ ప్లేయర్ సురేశ్ రైనాకు మాత్రం తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. చెన్నై జట్టు ఈ ముగ్గురు ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలనే కృతనిశ్చయంతో ఉందని ఓ చెన్నై దినపత్రిక పేర్కొంది. అయితే తొలి 8 సీజన్లో చెన్నై తరుపున ఆకట్టుకున్న రైనాపై చెన్నైటీమ్ యాజమాన్యం ఆసక్తి చూపడం లేదని ప్రచురించింది. ఇక 11 ఐపీఎల్ సీజన్‌ను కొత్త సెట్‌తో నిర్హహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో 500 మంది ప్లేయర్లను వేలంలోకి అందుబాటులో ఉండనున్నారు. గవర్నింగ్ కౌన్సిల్ నియమ నిబంధనలు రూపోందించే వరకు జట్లు తమ వ్యూహాలను రచించలేవు. నవంబర్ 21న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విధివిధానాలను ఖరారు చేయనుంది. పుకార్లు నమ్మొద్దు... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సురేశ్ రావడం లేదని ఆన్లైన్లో వచ్చె పుకార్లు నమ్మొద్దని ఆ జట్టు అధికారిక ట్విట్టర్లో అభిమానులను కోరింది. ‘చిన్న తలా తిరిగి జట్టులోకి రావడం లేదని ఆన్లైన్లో పుకార్లు వస్తున్నాయని, ఇవి నమ్మొద్దని, జట్టు తిరిగి గౌరవం పొందడానికి ప్రయత్నిస్తున్నాం.’అని ట్వీట్ చేసింది. Lots of rumours online about not retaining #ChinnaThala. Don't Believe! We want to bring the pride back together. A roaring #SummerIsComing #WhistlePodu 🦁💛 — Chennai Super Kings (@ChennaiIPL) 14 November 2017 -
సీఎస్కే కోసం నా నిరీక్షణ ముగిసింది: ధోని
చెన్నై: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌ది సుస్థిర ప్రస్థానం. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లపాటు జట్టు నిషేధానికి గురైంది. తాజాగా నిషేధం ముగియడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇటీవల అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఈ శుభవార్తను షేర్ చేసుకుంది. ఇటీవల సీఎస్కే జట్టు ఆటగాడిగా 7వ నెంబర్ జెర్సీపై తలా' అని రాసిన టీషర్ట్‌ను ధరించిన ఫొటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్! అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అయితే చెన్నై ఫ్యాన్స్ చూపిన అభిమానానికి ధోని ఫిదా అయ్యాడు. తన పట్ల చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు. ఇటీవల ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో కూడ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను గుర్తు చేస్తూ ఎల్లో కలర్ టీషర్ట్ ధరించాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ 'ఇది చాలా మంచి సందర్భం. అభిమానుల ఉత్సాహం అద్భుతంగా ఉంది. వారు నామీద లెక్కలేనంత ప్రేమ, అభిమానం చూపించారు. చెన్నై నా రెండో ఇళ్లని ఇది వరకే చాలా సార్లు చెప్పాను. ఎల్లో జెర్సీలో మరింత రాణిస్తాం. చెన్నై సూపర్ కింగ్స్ కోసం మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వచ్చే ఏడాది మేం ఇక్కడ ఆడుతుంటే మీరంతా సంతోషంగా చూస్తారు.' అంటూ తెలిపాడు. అంతేకాకుండా అభిమానుల గురించి మాట్లాడుతూ "మేము ఇక్కడ రెండు ఏళ్లు చెన్నై తరపున ఆడలేదు, కానీ మా అభిమానుల సంఖ్య మాత్రం గత రెండు సంవత్సరాలలో పెరిగింది. అభిమానులు వారు మాతోనే ఉన్నారు. వారి ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ మాతోనే ఉంది, సీఎస్కే తిరిగి ఇక్కడ మొదటి ఆటను ఆడటానికి వచ్చినప్పుడు ఆ అభిమానం మరింత పెరుగుతుందని' ఎంఎస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెన్నై ఫ్రాంచైజీ ఇదివరకే ప్రకటించింన విషయం తెలిసిందే. -
నిషేధం ముగిసింది.. బాస్ ఈజ్ బ్యాక్!
రాంచీ: నిషేధం ముగియడంతో ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంట వ్యవధిలోనే లక్షల లైక్స్, వేల కామెంట్లతో ధోని పోస్ట్ దూసుకుపోతోంది. తమపై నిషేధం ముగిసిందంటూ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఈ శుభవార్తను షేర్ చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుతో విడదీయరాని అనుబంధం ఉంది. సీఎస్కే జట్టు ఆటగాడిగా 7వ నెంబర్ జెర్సీ ధరించిన ధోని తన ఇంటి ఆవరణలో దిగిన ఓ ఫొటోను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేయగా విపరీతమైన స్పందన వస్తోంది. చెన్నైపై నిషేధం ముగిసింది.. బాస్ ఈజ్ బ్యాక్! అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తమిళంలో నాయకుడు అనే అర్థం వచ్చేలా ధోని జెర్సీపై 'తలా' అని రాసి ఉంది. 2016, 2017 సీజన్లలో చెన్నై జట్టుపై నిషేధం ఉండటంతో ధోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరఫున బరిలోకి దిగాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పుణే ఫైనల్లో ముంబై చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ధోనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెన్నై ఫ్రాంచైజీ ఇదివరకే ప్రకటించింది. -
ధోనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం!
చెన్నై: ఆయా జట్లతో 10 ఏళ్ల ఐపీఎల్ ఒప్పందం ముగియడంతో వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. వచ్చే ఐపీఎల్‌పై చెన్నై టీమ్ ప్రతినిధి జార్జ్ జాన్ మాట్లాడుతూ... 'కాంట్రాక్టు ముగియడంతో ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలి. అయితే ఓ ఆటగాడిని కచ్చితంగా పాత జట్టు తీసుకునే ఛాన్స్ ఉంటే మాత్రం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తీసుకుంటాం. ఈ ఏడాది పుణెతో ధోని కాంట్రాక్టు ముగుస్తుంది. జట్టును ముందుకు నడిపించే సమర్థవంతమైన వ్యక్తి ధోని. ఆయనపై పూర్తి విశ్వాసం ఉంది. కెప్టెన్‌గా ధోనిని, ప్రధాన కోచ్‌గా స్టీవెన్ ఫ్లెమింగ్‌ను తీసుకోవాలని ఫ్రాంచైజీ యోచిస్తోంది. త్వరలో మేనేజ్మెంట్ విషయంపై చర్చిస్తామని' వెల్లడించారు. అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ప్లేయర్‌గానూ రికార్డు ధోని సొంతం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2018 ఐపీఎల్లో తిరిగి అడుగుపెట్టనున్నాయి. 2015లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో తీవ్రంగా స్పందించిన బీసీసీఐ ఆ రెండు జట్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ కారణంగా 2016, 2017 సీజన్లలో ఈ జట్లు ఆడలేదు. వీటి స్థానాల్లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ వచ్చి చేరినా వాటి రెండేళ్ల కాంట్రాక్టు కాలం పూర్తవడంతో ఆ జట్లు రద్దయ్యాయి. మరోవైపు గురువారంతో చెన్నై, రాజస్థాన్ జట్లపై విధించిన నిషేధం గడువు ముగిసిపోయింది. ఈ విషయాన్ని చెన్నై ఐపీఎల్ జట్టు అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. Not just @msdhoni! #CSKReturns https://t.co/fAcVs8sqRX — Chennai Super Kings (@ChennaiIPL) 14 July 2017