ముంబైతో మ్యాచ్‌.. సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..! | IPL 2021: Faf Du Plessis Call On His Selection Will Be Taken Just Before MI Game | Sakshi
Sakshi News home page

IPL 2021 Phase 2: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..

Published Sun, Sep 19 2021 4:33 PM | Last Updated on Sun, Sep 19 2021 6:09 PM

IPL 2021: Faf Du Plessis Call On His Selection Will Be Taken Just Before MI Game - Sakshi

ఫొటో కర్టెసీ: IPL/BCCI

Faf Du Plessis call on His selection MI Game: దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ మధ్య జరగునున్న మ్యాచ్‌తో మరి కొద్ది గంటల్లో ఐపీఎల్‌ సె​కండ్‌ ఫేజ్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో అభిమానులకు చెన్నై సూపర్‌ ​కింగ్స్‌ గుడ్‌ న్యూస్‌ అందించింది. గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ ఫాప్‌ డుప్లెసిస్  తుది జట్టు ఎంపికకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.

ఈ విషయాన్ని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథ్ తెలిపారు . ఆయన మాట్లడూతూ..  క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ సెషన్ కోసం డుప్లెసిస్  జట్టులో చేరాడని అన్నారు. ఈ నేపథ్యంలో ముంబైతో జరగునున్న మ్యాచ్‌ తుది జట్టు ఎంపికలో డుప్లెసిస్  అందుబాటులో ఉంటాడని.. ఒక వేళ ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గక పోతే అతని స్ధానంలో రాబిన్‌ ఉతప్పను తుది జట్టులో తీసుకుంటామని కాశీ విశ్వనాథ్ చెప్పారు. కాగా గజ్జల్లో గాయం కారణంగా  కరీబియన్ ప్రీమియర్ లీగ్ మధ్యలో నుంచి డుప్లెసిస్ తప్పకున్న సంగతి తెలిసిందే.

చదవండిIPL 2021: తొలి భాగం మొత్తం వీళ్లదే.. రాహుల్‌ మెరుపులు.. గబ్బర్‌ గర్జన.. సంజూ శతక్కొట్టుడు

.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement