
Courtesy: IPL Twitter
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్-2023లో తను ఆడతాడని తలైవా సృష్టం చేశాడు. వచ్చే ఏడాది సీజన్‌లో మరింత బలంగా తిరిగి వస్తామని ధోని తెలిపాడు. ఐపీఎల్-2022లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ సమయంలో మాట్లాడిన ధోని ఈ వాఖ్యలు చేశాడు. "ముంబై అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. అయితే చెన్నైలో ఆడకుండా అభిమానులకు ధన్యవాదాలు చెప్పడం అన్యాయం.
సీఎస్‌కే అభిమానులు నాపై ఎంతో ప్రేమ చూపించారు. వచ్చే ఏడాది చెన్నైలో మ్యాచ్‌లు ఆడుతామని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది సీజన్‌లో మరింత బలంగా తిరిగి వస్తాం. అయితే 2023 సీజన్ నాకు చివరి ఏడాది అవుతుందో లేదో ఇప్పుడే చేప్పలేను" అని ధోని పేర్కొన్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు.
చదవండి: IND Vs SA T20 2022: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత యువ పేసర్ దూరం..!
All I wanted to know today#CSKvRR #MSDhoni https://t.co/SExjm5tPDG
— Msdian Fanboy💚 (@msdian_fanboy) May 20, 2022