ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 12) మరో రసవత్తర పోరు జరగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నైసూపర్ కింగ్స్.. పటిష్టమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరి తలపడనున్నాయి. గతేడాది సీఎస్‌కే టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్ ఈ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సీఎస్‌కే తమ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ధోనిని తప్పించి రవీంద్ర జడేజాకు సారధ్య బాధ్యతలు అప్పగించింది. ఈ మ్యాచ్ బరిలోకి దిగే ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు (ధోని, కోహ్లి, డెప్లెసిస్, మ్యాక్స్‌వెల్) ఉండటం మ్యాచ్‌పై హైప్ పెరిగింది.
ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్‌కే ఈ మ్యాచ్‌తోనైనా బోణీ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. లీగ్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా సీఎస్‌కే అత్యధికంగా 18 సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
వ్యక్తిగత రికార్డుల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సీఎస్‌కే మాజీ సారధి ధోని, ఆర్సీబీ మాజీ కెప్టెన్ కోహ్లిలకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ధోని ఆర్సీబీపై అద్భుతమైన సగటు, స్ట్రైక్‌రేట్‌తో 748 పరుగులు సాధించగా, కోహ్లి.. చెన్నైసూపర్ కింగ్స్‌పై ఏ ఆటగాడికి సాధ్యం కాని విధంగా 9 హాఫ్ సెంచరీల సాయంతో 41 సగటున 962 పరుగులు చేశాడు. నేటి మ్యాచ్‌లో కోహ్లి మరో 38 పరుగులు చేస్తే సీఎస్‌కేపై 1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
తుది జట్లు (అంచనా):
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, రాజవర్థన్ హంగర్గేకర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగా, సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
చదవండి: సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ.. విజయం ఎవరిది..?
Comments
Please login to add a commentAdd a comment