ధోనితో కోహ్లి (పాత ఫొటో PC: BCCI)
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు తుది అంకానికి చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గట్టి పోటీ నెలకొంది.
బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే మాత్రం ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా చెన్నై టాప్-4కు దూసుకువెళ్తుంది.
బహుశా ఇదే ఆఖరిసారి
ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆర్సీబీ మేటి క్రికెటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహీ భాయ్.. నేను మరోసారి కలిసి(ప్రత్యర్థులుగా) ఆడబోతున్నాం.
బహుశా ఇదే ఆఖరిసారి కావొచ్చేమో ఎవరికి తెలుసు! ఏదేమైనా మా అభిమానులకు ఇదొక గొప్ప కానుకలాంటిదే. టీమిండియాలో ఇద్దరం కలిసి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాం.
మహీ భాయ్ తన ఫినిషింగ్ టచ్‌తో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడని అందరికీ తెలిసిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ధోనితో కలిసి ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావొచ్చంటూ.. ధోని రిటైర్మెంట్‌పై కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.
రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు
కాగా 42 ఏళ్ల ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన తలా.. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ సీజన్‌లో పలు మ్యాచ్‌లలో వింటేజ్ ధోనిని తలపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించిన మహీ.. 10 ఇన్నింగ్స్‌లో కలిపి 136 పరుగులు సాధించాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా సీఎస్‌కే తరఫున బరిలోకి దిగిన అతడు.. వచ్చే సీజన్‌లో ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.
చదవండి: MI: అంతా ఫేక్!.. అర్జున్ టెండుల్కర్ ఓవరాక్షన్.. ఆ తర్వాత ఇలా!
Comments
Please login to add a commentAdd a comment