CSK Training Camp Starts In Surat: ఐపీఎల్ 2022 ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉండగానే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగింది. సూరత్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో ధోని సేన ప్రాక్టీస్ మొదలెట్టేసింది. సూరత్‌లో పరిస్థితులు ముంబైకి దగ్గరగా ఉంటాయనే కారణంగా ప్రాక్టీస్ సెషన్స్‌ను అక్కడ నిర్వహించాలని సీఎస్‌కే యాజమాన్యం నిర్ణయించింది. కెప్టెన్ ధోనితో పాటు అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, సి హరి నిషాంత్, తుషార్ దేశ్‌పాండే తదితరులు మార్చి 2నే సూరత్‌లో ల్యాండైనట్లు తెలుస్తోంది.
𝐴𝑏ℎ𝑎𝑟𝑎 Surat! Those eyes that smile with 💛 give us the joy, everywhere we go! #SingamsInSurat #WhistlePodu 🦁 pic.twitter.com/T8xwHjoqeI
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022
బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరంతా మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్న అనంతరం, ఆదివారం స్థానిక లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సింగమ్స్ ఇన్ సూరత్ అనే క్యాప్షన్ జోడించి సీఎస్‌కే యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.
కాగా, మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కరోనా కారణంగా ఈసారి లీగ్ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణేల్లోని స్టేడియాల్లోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
https://t.co/9EmchH33HC #SingamsInSurat 🦁🔥
— 🌈 𝒥𝓊𝒿𝓊 ♡〽️SD🦁 (@Jxjx7x_x) March 7, 2022
చదవండి: ఐపీఎల్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేను ఢీకొట్టనున్న కేకేఆర్
Comments
Please login to add a commentAdd a comment