Bravo, Rahane, Rayudu Eye Big Milestones: ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 26) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ నుంచి సీఎస్‌కే, కేకేఆర్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.
చెన్నై జట్టుకు రవీంద్ర జడేజా, కేకేఆర్‌ను శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సీఎస్‌కే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటికే 4 టైటిళ్లు సొంతం చేసుకుని మరో టైటిల్ కోసం తహతహలాడుతుండగా, 2 ఐపీఎల్ టైటిళ్లను సాధించిన కేకేఆర్ సైతం కొత్త కెప్టెన్ నేతృత్వంలో ప్రత్యర్ధులకు ఛాలెంజ్ విసురుతుంది.
బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 26 సార్లు తలపడగా, సీఎస్‌కే 17, కేకేఆర్ 8 సందర్భాల్లో విజయాలు సాధించాయి. మరో మ్యాచ్‌లో ఫలితంగా తేలలేదు. ఇక, నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అవి ఏంటంటే.
- సీఎస్‌కే సీనియర్ బ్యాటర్ అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్ 4000 పరుగుల క్లబ్‌లో చేరతాడు.
- చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (167) ఈ మ్యాచ్‌లో మరో 4 వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన మలింగ (170 వికెట్లు) రికార్డును బద్దలు కొడతాడు.
- ఈ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడుతున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసేందుకు మరో 59 పరుగుల దూరంలో ఉన్నాడు.
చదవండి: IPL 2022: శివాలెత్తిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలే..!
Comments
Please login to add a commentAdd a comment