Dwane Bravo
-
తూచ్! నిర్ణయం వెనక్కి.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు! స్టోక్స్ ఒక్కడేనా?
Who Reversed Retirement Decision: వరల్డ్ కప్ ఫైనల్-2019 హీరో బెన్ స్టోక్స్ తమ బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ వన్డేలు ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏడాది క్రితం వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సఫలమైంది. దాంతో న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. 15 మందితో కూడిన టీమ్‌ను ఈ సిరీస్ కోసం ఈసీబీ ప్రకటించింది. వరల్డ్ కప్ కోసం టీమ్‌ను ప్రకటించేందుకు మరింత సమయం ఉన్నా... సెలక్టర్ ల్యూక్ రైట్ చెప్పిన దాని ప్రకారం మార్పుల్లేకుండా ఇదే బృందం వరల్డ్ కప్‌కూ కొనసాగే అవకాశం ఉంది. మరి దేశం కోసం.. స్టోక్స్ మాదిరే తమ రిటైర్మెంట్ నిర్ణయాలు వెనక్కి తీసుకున్న ఆటగాళ్ల గురించి తెలుసా? షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తన కెరీర్లో ఏకంగా ఐదుసార్లు రిటైర్మెంట్ ప్రకటనలు ఇచ్చాడు. 2006లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాడు. అయితే, రెండు వారాల్లోనే తన నిర్ణయం మార్చుకున్నాడు మరోసారి సంప్రదాయ క్రికెట్లో పాక్ తరఫున బరిలోకి దిగాడు. ఎట్టకేలకు 2010లో టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అదే విధంగా.. 2011, మేలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆఫ్రిది.. నెలల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 2015 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల నుంచి తప్పుకొన్న ఆఫ్రిది.. 2017లో అంతర్జాతీయ టీ20 కెరీర్‌కూ స్వస్తి పలికాడు. మొయిన్ అలీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ 2021 సెప్టెంబరులో టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సొంతగడ్డపై ఆసీస్‌తో పోరులో జట్టుకు అండగా నిలిచే క్రమంలో బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ మైదానంలో దిగాడు. బజ్‌బాల్ విధానంతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ డ్రాతో గట్టెక్కడంలో తన వంతు సహకారం అందించాడు. ఇక ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మరోసారి తన రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇకపై ఇంగ్లండ్ తరఫున సంప్రదాయ క్రికెట్ ఆడబోవడం లేదని స్పష్టం చేశాడు. తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా వన్డే కప్, వన్డే వరల్డ్‌కప్-2023 వంటి మెగా ఈవెంట్లకు ముందు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించి బంగ్లాను సందిగ్దంలో పడేశాడు. అయితే, ప్రధాని షేక్ హసీనా జోక్యంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇకపై కూడా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని తమీమ్ చెప్పుకొచ్చాడు. డ్వేన్ బ్రావో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 2018, అక్టోబరులో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆ మరుసటి ఏడాది డిసెంబరులో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బ్రావో తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్వయంగా ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2021లో విండీస్ తరఫున బరిలోకి దిగిన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. చదవండి: జట్టులో చోటు లేకున్నా పర్లేదు.. వాటి కారణంగా రిటైర్ అవ్వను: టీమిండియా స్టార్ -
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్‌ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్.. సియాటిల్ ఆర్కాస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్సీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్ విజయాలతో టైటిల్‌ను నెగ్గింది. All the feels 🥰 💙 🤩 Congratulations to @MINYCricket for winning the inaugural #MajorLeagueCricket Championship Final 🏆 pic.twitter.com/Mk1agQmgo6 — Major League Cricket (@MLCricket) July 31, 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్ ఆర్కాస్పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్ చేరింది. ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్ టైటిల్‌ను, తాజాగా మేజర్ లీగ్ టీ20 టైటిల్‌ను నెగ్గాయి. MI are serial winners 🏆🏆🏆🏆🏆🏆🏆🏆 📸: IPL/BCCI pic.twitter.com/owVjc46r38 — CricTracker (@Cricketracker) July 31, 2023 ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్ మేజర్ లీగ్ టీ20 లీగ్ 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్సీ టైటిల్‌తో పోలార్డ్, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్ మాలిక్ (13), రోహిత్ శర్మ (10), ధోని (9), లసిత్ మలింగ (9) ఉన్నారు. RASHID WINS THE BATTLE!⚔️ Rashid Khan gets the last LAUGH 😄against Heinrich Klaasen! 9⃣1⃣/3⃣ (12.1) pic.twitter.com/cfgaAf5CRJ — Major League Cricket (@MLCricket) July 31, 2023 నిప్పులు చెరిగిన బౌల్డ్.. రషీద్ మాయాజాలం ఎంఎల్సీ 2023 ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. ట్రెంట్ బౌల్డ్ (4-0-34-3), రషీద్ ఖాన్ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 𝓞𝓷 𝓻𝓮𝓹𝓮𝓪𝓽 🔄 Can’t stop watching @nicholaspooran’s 1️⃣3️⃣ sixes he hit today‼️ #MLC2023 #MLCFINAL pic.twitter.com/OynKTi2xnD — Major League Cricket (@MLCricket) July 31, 2023 KHAN-TASTIC!🪄 Rashid Khan STRIKES FIRST💫 for the @MINYCricket! 2⃣5⃣/1⃣ (4.1) pic.twitter.com/ZPhVmSQhfA — Major League Cricket (@MLCricket) July 31, 2023 పూరన్ ఊచకోత.. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
#MS Dhoni: ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే
IPL 2023 Winner CSK: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రావోకు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు చెన్నై ఫ్రాంఛైజీతో కొనసాగిన బ్రావో.. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. 2011లో సీఎస్కేకు తొలిసారి ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2011, 2018, 2021 సీజన్లలో ధోని సేన టైటిల్ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. అదే విధంగా 2014 నాటి చాంపియన్స్ లీగ్ గెలిచిన ధోని సేనలో బ్రావో సభ్యుడు కూడా! అంతేగాక క్యాష్ రిచ్‌లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా ఈ రైట్ ఆర్మ్ పేసర్ ముందు వరుసలో నిలిచాడు. 161 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 183 వికెట్లు తీయడంతో పాటుగా.. 1560 పరుగులు సాధించాడు. సీఎస్కే బౌలింగ్ కోచ్‌గా ఇలా సీఎస్కేతో అనుబంధం పెనవేసుకున్న డ్వేన్ బ్రావో గతేడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని బౌలింగ్ కోచ్ నియమిస్తూ తమతోనే కొనసాగేలా చేసింది ఫ్రాంఛైజీ. ఇక సీఎస్కే ముఖచిత్రమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే ఇందుకు ప్రధాన కారణం అంటున్నాడు బ్రావో. ధోని నుంచి వచ్చిన ఆ ఒక్క కాల్ వల్లే ‘‘ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు! విజయవంతమైన ఐపీఎల్ కెరీర్‌కు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించడం నా జీవితంలో విచారకరమైన సమయం. అయితే, ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ ఐపీఎల్లో కొనసాగాలని నా నుదుటి రాతలో రాసిపెట్టింది. మహేంద్ర సింగ్ ధోని.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నుంచి వచ్చిన ఒ్క ఫోన్ కాల్ నన్ను కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేసింది. నా క్రికెట్ కెరీర్లో ముందుకు సాగేందుకు ఇదే సరైన దిశ అనిపించింది. కంగ్రాట్స్ ఆ దేవుడు.. క్రికెటర్‌గా నాకు ప్రసాదించిన నైపుణ్యాలను ఇకపై ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న సమయంలో కోచ్‌గా కొత్త అవతారం ఎత్తడం.. అది కూడా ఐపీఎల్ హిస్టరీలో విజయవంతమైన చరిత్ర ఉన్న జట్టుకు కోచ్‌గా ఉండటం అద్భుతం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా తన మనసులోని మాటను పంచుకన్న బ్రావో.. సీఎస్కే బౌలర్లు దీపక్ చహర్, మతీశ పతిరణ, రాజ్యవర్థన్ హంగార్కర్, రవీంద్ర జడేజా తదితరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఐపీఎల్-2023 విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌కు విజయోత్సవాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. చదవండి: Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47) -
Ind Vs WI: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు! టీమిండియా తొలి ఆల్‌రౌండర్‌గా..
India Vs West Indies 3rd T20: వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్.. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రెండో టీ20లో విండీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ బ్రాండన్ కింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక ఈ కీలక వికెట్ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా హార్దిక్ పాండ్యా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అదే విధంగా పొట్టి క్రికెట్లో 800కు పైగా పరుగులు, 50 లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం డ్వేన్‌బ్రావో, బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ వంటి ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఈ ఘనత సాధించిన భారత తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు. కాగా విండీస్‌తో మూడో టీ20లో హార్దిక్ పాండ్యా బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే రోహిత్ సేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. రెట్టించిన ఉత్సాహంతో.. ఫిట్నెస్ సమస్యలు అధిగమించి.. ఐపీఎల్-2022తో ఫామ్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్‌లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించి ట్రోఫీ అందించాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించి టీ20 సిరీస్ గెలిపించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 800కు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లు: 1. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- పరుగులు 2010- వికెట్లు 121 2. షాహిద్ ఆఫ్రిది(పాకిస్తాన్)- పరుగులు 1416, వికెట్లు 98 3. డ్వేన్ బ్రావో(వెస్టిండీస్)- పరుగులు 1255, వికెట్లు 78 4. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 1628 పరుగులు, వికెట్లు 76 5. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- పరుగులు 2514, వికెట్లు 61 6. కెవిన్ ఒబ్రెయిన్(ఐర్లాండ్)- పరుగులు 1973, వికెట్లు 58 7. హార్దిక్ పాండ్యా(ఇండియా)- పరుగులు 806, వికెట్లు 50 చదవండి: Rohit Sharma Retired-Hurt: రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్! -
IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..!
Bravo, Rahane, Rayudu Eye Big Milestones: ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 26) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ నుంచి సీఎస్కే, కేకేఆర్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. చెన్నై జట్టుకు రవీంద్ర జడేజా, కేకేఆర్‌ను శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సీఎస్కే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటికే 4 టైటిళ్లు సొంతం చేసుకుని మరో టైటిల్ కోసం తహతహలాడుతుండగా, 2 ఐపీఎల్ టైటిళ్లను సాధించిన కేకేఆర్ సైతం కొత్త కెప్టెన్ నేతృత్వంలో ప్రత్యర్ధులకు ఛాలెంజ్ విసురుతుంది. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 26 సార్లు తలపడగా, సీఎస్కే 17, కేకేఆర్ 8 సందర్భాల్లో విజయాలు సాధించాయి. మరో మ్యాచ్‌లో ఫలితంగా తేలలేదు. ఇక, నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అవి ఏంటంటే. సీఎస్కే సీనియర్ బ్యాటర్ అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్ 4000 పరుగుల క్లబ్లో చేరతాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (167) ఈ మ్యాచ్‌లో మరో 4 వికెట్లు తీస్తే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన మలింగ (170 వికెట్లు) రికార్డును బద్దలు కొడతాడు. ఈ సీజన్లో కేకేఆర్ తరఫున ఆడుతున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఐపీఎల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసేందుకు మరో 59 పరుగుల దూరంలో ఉన్నాడు. చదవండి: IPL 2022: శివాలెత్తిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలే..! -
Ind Vs Wi: ‘నిజంగా విచారకరం.. పొలార్డ్ మిస్సయాడు.. పోలీసులకు రిపోర్టు చేయండి’
Ind Vs Wi ODI Series- Kieron Pollard- Dwayne Bravo : టీమిండియాతో వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌లలోనూ ఓడి సిరీస్‌ను భారత జట్టుకు సమర్పించుకుంది. ముఖ్యంగా విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫామ్‌లేమి, గాయం జట్టును కలవరపెడుతోంది. మొదటి వన్డేలో అతడు వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. టీమిండియా బౌలర్ యజువేంద్ర చహల్ సంధించిన మొదటి బంతికే పొలార్డ్ వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక రెండో వన్డేలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విండీస్‌పై 44 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే, పొలార్డ్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. ఏ మేరకు రాణిస్తాడన్నది వేచిచూడాల్సిందే. అతడు బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొలార్డ్ సహచర ఆటగాడు, విండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘ఇది నిజంగా విచారకర దినం. నా బెస్ట్ ఫ్రెండ్ పొలార్డ్ తప్పిపోయాడు. ఒకవేళ మీకు ఏదైనా సమాచారం అందితే దయచేసి నాకు తెలియజేయండి. లేదంటే పోలీసులకు రిపోర్టు చేయండి’’ అంటూ ఏడుపు, నవ్వులు కలగలిసిన ఎమోజీలను జతచేశాడు. అంతేగాక.. ‘‘వయసు 34, ఎత్తు 1.85 మీటర్లు, చివరగా చహల్ పాకెట్లో చూశాం. కనిపిస్తే వెస్టిండీస్‌ను కాంటాక్ట్ చేయండి’’ అని పొలార్డ్ ఫొటోను షేర్ చేశాడు. ఇందుకు పొలార్డ్ సైతం సరదాగా స్పందించాడు. ‘‘అవునా బ్రావో.. నేను మిస్సయ్యానా.. ఎప్పుడు ఎలా?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో బదులిచ్చాడు. కాగా ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓడి విండీస్ వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. భారత పర్యటనలో ఇదే తరహాలో చేదు అనుభవం మూటగట్టుకుంది. చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్! Series lost, but the boys go again on Friday in the final ODI with the opportunity to gain some World Cup qualification points. #MenInMaroon #INDvWI pic.twitter.com/Ah8U8XAnzt — Windies Cricket (@windiescricket) February 9, 2022 View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆 (@djbravo47) View this post on Instagram A post shared by Kieron Pollard (@kieron.pollard55) -
అరుదైన రికార్డుకు చేరువలో హర్షల్ పటేల్..
Harshal Patel On The Brink Of Breaking This Huge IPL Record: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల తీసిన రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 30 వికెట్లు ఉన్నాయి. నేడు కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్‌లో మరో రెండు వికెట్లు సాధిస్తే ఆ ఘనత అతడి సొంతమవుతుంది. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా నేడు(సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో బయట పెట్టిన కోహ్లి... -
అందుకే బ్రావో ఈరోజు ఆడటం లేదు: ధోని
Why is DJ Bravo not playing today's CSK vs KKR match: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో లేకుండానే చెన్నై సూపర్‌కింగ్స్ మైదానంలో దిగింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో పిచ్ కాస్త స్లోగా ఉంటుందన్న విశ్లేషణల నేపథ్యంలో ధోని సేన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా స్లో పిచ్‌లపై బ్రావో మెరుగ్గా ఆడతాడన్న సంగతి తెలిసిందే. ఇక గత రెండు మ్యాచ్‌లలోనూ విండీస్ ఆల్‌రౌండర్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో ఫేజ్ పునః ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై విజయంలో బ్రావో తన వంతు పాత్ర పోషించాడు. 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే విధంగా శుక్రవారం నాటి ఆర్సీబీ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి, మాక్స్వెల్, హర్షల్ పటేల్ వికెట్లు తన ఖాతాలో వేసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో చెన్నై ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో బ్రావోకు విశ్రాంతినివ్వాలని ధోని భావించడం గమనార్హం. మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోని ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘అవును.. అతడు ఆడటం లేదు. తనకు రెస్ట్ అవసరం. సీపీఎల్‌లో భాగంగా బ్రావో గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ గాయం తాలూకు ప్రభావం ఉండే అవకాశం ఉంది. 48 గంటల లోపే(శుక్రవారం ఆర్సీబీతో, ఆదివారం కేకేఆర్‌తో) మరో మ్యాచ్ అంటే కష్టం. గాయం తిరగబెట్టే అవకాశం ఉంటుంది’’ అని, అందుకే నేటి మ్యాచ్‌లో బ్రావో ఆడటం లేదని చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల ముగిసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడే సమయంలో డ్వేన్ బ్రావో గాయపడ్డాడు. ఈ క్రమంలో కోలుకున్న అతడు.. ఐపీఎల్ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చాడు. ఫేజ్ 2 తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబైతో జరిగిన పోరులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 3 వికెట్లు తీయడం సహా... 8 బంతుల్లో 23 పరుగులు చేసి సత్తా చాటాడు. చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’! -
ధోని సూపర్ డైవ్ !
ఢిల్లీ: కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ధోని డైవ్ వేసి క్యాచ్ పట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ ఓడినప్పటికీ ధోని పట్టిన ఈ క్యాచ్‌కు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. వయస్సు కేవలం ఒక అంకె మాత్రమే అని కామెంట్లు చేస్తున్నారు. డ్వైన్ బ్రావో తన ఆఖరి ఓవర్లో శివమ్ మావీకి బంతి వేస్తుండగా 'స్లో బాల్' వేయమని ధోని సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఆఫ్‌సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన శివమ్ మావి బ్యాట్‌కు ఎడ్జ్ అయి బంతి ధోని చేతికి వెళ్లింది. మొదట బంతిని మిస్ చేసినా ఆ తర్వాత డైవ్ చేసి పట్టుకున్నాడు. On Loop 💥💥👌 Dhoni pic.twitter.com/trtRwnTwLJ — JON ¥ $NOW (@BeingKingSnow) October 7, 2020 జడేజా సూపర్ క్యాచ్... BRILLIANT CATCH! 😱 Incredible work from Jadeja in the deep, takes the diving catch, sees the rope coming as he slides and tosses it across to Du Plessis!#KKRvCSK #CSK #jadega pic.twitter.com/BYgryoxLu2 — Live CricVideos™ (@live_cricvideos) October 7, 2020 ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో దిగిన సునిల్ నరైన్, కరణ్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లాంగ్ ఆన్, 'డీప్ మిడ్‌వికెట్' మధ్యలో షాట్ ఆడబోయి జడేజా చేతికి చిక్కాడు. జడేజా అద్భుతమైన డైవ్ వేసి క్యాచ్ పట్టుకున్నాడు. ఐతే బౌండరీ లైన్ దగ్గర డైవ్ వేయడంతో జడేజా లైన్‌ను టచ్చేసే అవకాశం ఉంది. లాంగ్ ఆన్‌లో ఉన్న డూప్లెసిస్ జడేజా వద్దకు పరుగెత్తగా బంతిని అతడి చేతికి అందించాడు. సూపర్ క్యాచ్ అంటూ తమ కామెంట్లతో నెటిజన్లు జడేజాను ప్రశంచించారు. -
డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్ ఫిలిం
ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంఎల్ఏ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢచారి, ఓబేబి లాంటి వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాలు నిర్మించి అభిరుచి గల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ చిత్రాన్ని, అలాగే అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం అనే అంతర్జాతీయ చిత్రాన్ని కూడా ఈ సంస్థలో నిర్మిస్తున్నారు. అయితే... కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాలనే సదుద్దేశ్యంతో సోషల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల. ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్‌తో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా సోషల్ అవేర్నస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ చిత్రానికి ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె దర్శకత్వం వహించిన ల్యాండ్ ఆఫ్ విడోస్, వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంటరీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మహిళలకు శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డ్వేన్ బ్రావో తన అధికారిక ఫేస్ బుక్ పేజ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్ర విశేషాలను దర్శకురాలు ఆర్తి శ్రీవాత్సవ తెలియచేస్తూ.. ‘డ్వేన్ బ్రావోతో ఈ సినిమాని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గర్వంగాను ఉంది. జులైలో తమిళనాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియలో షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టులో వెస్టిండీస్ లోని ట్రినిడాడ్, టోబాగోలలో షూటింగ్ చేయనున్నాం’ అని తెలిపారు. -
‘డాడీ ఆర్మీ’ అన్నారు కదా.. ఏమైంది?
చెన్నై: గత ఏడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టుని అందరూ ‘డాడీ ఆర్మీ’ అని ఎగతాళి చేశారు. జట్టులోని ఆటగాళ్ల వయసు సరాసరి 30 ఉండటమే దీనికి కారణం. కానీ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత ఏడాది ఫైనల్‌కి చేరిన చెన్నై.. ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే గతేడాది చివర్లో జరిగిన ఆటగాళ్ల మార్పులు, వేలంలో సీఎస్కే ఎక్కువ మార్పులకు చోటివ్వకుండా.. పాత జట్టువైపే మొగ్గుచూపింది. దీంతో సోషల్ మీడియాలో ‘డాడీ ఆర్మీ’మళ్లీ టైటిల్ సాదిస్తుందా అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో మళ్లీ ఆ పదం తెగ ట్రెండ్ అవుతోంది. అయితే దీనిపై సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో స్పందించాడు. ‘మా జట్టును మళ్లీ అలానే అంటున్నారని తెలుసు, కానీ అనుభవం మించిన ఆయుధం లేదు. గతేడాది కూడా ఇలానే అన్నారు. ఏమైంది? టైటిల్ గెలిచాం. ప్రతీ సీజన్లోనూ కొత్తగా ఆడటానికి ప్రయత్నిస్తాం. ఈ సీజన్లో కూడా గత ఐపీఎల్‌కు మించి ప్రదర్శన చేస్తాం’ అంటూ బ్రేవో పేర్కొన్నారు. ఇక వయసు అనేది ఒక అంకె మాత్రమేనని, అనుభవం ఎంతో ముఖ్యమని సీఎస్కే సారథి ఎంఎస్ ధోని పేర్కొన్నాడు. ధోని, రాయుడు, రైనా, బ్రేవో, డుప్లెసిస్, వాట్సన్, తాహీర్, జాదవ్‌లతో సహా జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్లు అందరూ మూడు పదుల వయసు పై గలవారే కావడం విశేషం. ఇక అన్ని ఫ్రాంచైజీలతో పోలీస్తే సీఎస్కే విధానాలు వేరుగా ఉంటాయి. అన్ని ఫ్రాంచేజీలు ఆటగాళ్లకు యో-యో టెస్టు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎస్కే మాత్రం యో-యోకు దూరంగా ఉంది. ఆటగాళ్ల ఫిట్నెస్తో పాటు అనుభవం, సత్తా కూడా ముఖ్యమే కదా అంటూ ఆ జట్టు మేనేజ్మెంట్ పేర్కొంది. -
బ్రేవో.. బ్రెయిన్ ఉపయోగించు : రాయుడు
పుణే : చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రేవోపై ఆజట్టు స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు అసహనం వ్యక్తం చేశాడు. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ సందర్భంలో రాయుడు.. బ్రేవోని బ్రెయిన్ ఉపయోగించి బౌలింగ్ చేయమని సైగలతో సూచించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ విజయ్ శంకర్ అనూహ్యంగా వరుస సిక్స్‌లతో చెలరేగడం.. రాయుడిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అతను మైదానంలో తన హావభావాలతో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బ్రేవో వేసిన 15 ఓవర్ రెండో బంతికి విజయ్ శంకర్ వ్యక్తిగతంగా తొలి సిక్స్ సాధించాడు. అయితే శంకర్ సిక్స్ కొట్టడం ఏమిటని.. ‘బంతిని బ్యాట్ కింద ఎందుకు వేస్తున్నావు.. సరిగ్గా యార్కర్లు వేయచ్చు కదా.!’ అని రాయుడు బ్రేవోకు సూచించాడు. ఈ సైగలకు సంబంధించిన దృశ్యాలను టీవీలో పదేపదే చూపించారు. ఇక బ్రేవో వేసిన 19 ఓవర్లో శంకర్ ఏకంగా మూడు సిక్స్‌లు సాధించడం విశేషం. ఇందులో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఈ సమయంలో సైతం రాయుడు తన హావభావాలతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. -
బ్రేవోకు రాయుడు సైగలు
-
బ్రేవోను కాదని జడేజాను అందుకే..
మొహాలి : కింగ్స్‌పంజాబ్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ధమాకా సరిపోలేదు. దీంతో విజయానికి చేరువగా వచ్చిన చెన్నై 4 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఓటమి అంచు నుంచి విజయాన్నందించిన విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోని కాదని స్పిన్నర్ రవింద్ర జడేజాను ముందు బ్యాటింగ్ పంపిచడంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. ధోని మాత్రం జడేజాకు మ్యాచ్ ఫినిష్ చేసే సత్తా ఉందని, అతను ఫినిషర్‌గా రాణించడమే తమ జట్టుకు కావాలని క్రిక్ఇన్ఫోతో అభిప్రాయపడ్డాడు. ‘బ్యాటింగ్‌కు ఎవరిని పంపిచాలని నిర్ణయం తీసుకోవడం ఆపరిస్థితుల్లో డగౌట్లో ఉన్న ఫ్లెమింగ్‌కు చాలా కష్టం. మేమంతా జడేజాపై నమ్మకం ఉంచాం. అతన్ని పంపిచాడనికి అతను లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ కావడం కూడా ఒక కారణం. ఎందుకంటే ఎడమ చేతివాటం ఆటగాళ్లకు బౌలర్లు స్థిరంగా బంతులు వేయలేరు. దీంతో అతనికి అవకాశం ఇచ్చాం. ఒకవేళ అతను విఫలమైతే మ్యాచ్‌ను ఫినిష్ చేసే సామర్థ్యం గల హిట్టర్ బ్రేవో ఎలాగు ఉన్నాడని భావించాం. బ్రేవో మా వెనుకాలే ఉంటూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. కానీ ఓవరాల్‌గా జడేజా లేదా ఎవరైనా ఫినిషర్‌గా రాణిస్తే అది మాకు మంచిదే. ఇక ఇలాంటి అవకాశం జడేజాకు ఎప్పుడివ్వలేదు. అతను ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరైన అర్హుడు. జడేజా రాబోయే మ్యాచ్‌ల్లో బాగా రాణించేలా అతని వెన్నంటే ఉండి ప్రోత్సాహిస్తానని ధోని స్పష్టం చేశాడు. -
ఆ ఇద్దరూ ఒకే నంబర్ జెర్సీ ఎందుకు ధరించారంటే..
ముంబాయి: ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఒకే నంబర్ జెర్సీ 400 ధరించిన సంగతి తెల్సిందే. సహచర వెస్టిండీస్ ఆటగాడు, ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పోలార్డ్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో వారి వ్యక్తిగత మైలురాళ్లకు గుర్తుగా ఈ జెర్సీలను ధరించారు. రెండు జట్ల మధ్య శనివారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెన్నై గెలిచిన సంగతి తెల్సిందే. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో వివరణ ఇచ్చాడు. తాము 400 నెంబర్ గల జెర్సీ ధరించడానికి ఓ కారణముందన్నారు. కీరన్ పోలార్డ్‌కు ఇది 400వ టీట్వంటీ మ్యాచ్ అని, అలాగే టీట్వంటీలో 400 వికెట్లు తీసుకున్న తొలిబౌలర్ను తానేనని, ఇందుకు గుర్తుకు తామిద్దరం 400 నెంబర్ ఉన్న జెర్సీని ధరించామని తెలిపారు. ఈ టోర్నమెంట్ అనంతరం తమ పాత జెర్సీలు పోలార్డ్(47), బ్రావో(55)లు ధరిస్తామని వివరించారు. పోలార్డ్ ముంబై ఇండియన్స్ టీంతోనూ, తాను సీఎస్కే టీంతోనూ ముందే మాట్లాడి తుది జట్టులో అవకాశం కల్పించాలని కోరామన్నారు. శనివారం మ్యాచ్‌లో బ్రావో 30 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 68 పరుగులు చేసి చెన్నై జట్టును గెలిపించిన సంగతి తెల్సిందే. -
థంపి.. త్వరలోనే టీమిండియాకు ఆడతాడు
కేరళకు చెందిన యువ ఫాస్ట్‌బౌలర్ బాసిల్ థంపి మీద వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసలు కురిపించాడు. త్వరలోనే థంపి టీమిండియాలో స్థానం సంపాదించుకుంటాడని చెప్పాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ పదో సీజన్లో బ్రావో, థంపి ఇద్దరూ గుజరాత్ లయన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. బాసిల్ థంపి చాలా టాలెంట్ ఉన్న కుర్రాడని, దాదాపు ఒక ఏడాది లోపే అతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తుందని తనకు నమ్మకం ఉందని బ్రావో అన్నాడు. అతడికి మంచి టాలెంట్‌తో పాటు మంచి హృదయం, పేస్, నైపుణ్యం అన్నీ ఉన్నాయని, ఎప్పుడూ కూడా నేర్చుకోవాలని చూస్తుంటాడని చెప్పాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో వరుసపెట్టి యార్కర్లు వేసి అందరినీ థంపి బాగా ఇంప్రెస్ చేశాడు. గుజరాత్ లయన్స్ బౌలర్లందరినీ వరుసపెట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ ఊచకోత కోస్తుంటే.. థంపి మాత్రం కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అతడు వేసిన వాటిలో 11 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆర్సీబీ తరఫున 38 బంతుల్లోనే 77 పరుగులు చేసిన విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో మొట్టమొదటే పెద్ద వికెట్‌ను థంపి తీసినట్లయింది. ముందుగా యార్కర్ వేసి ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. తొడ కండరాల గాయంతో బాధపడి.. ఇప్పుడే కోలుకుంటున్న బ్రావో వెంటనే థంపి వద్దకు వెళ్లి అభినందించాడు. థంపి ఎప్పుడూ సరైన ప్రశ్నలే అడుగుతుంటాడని, ఇలాంటి వాళ్లు ఉంటే భారత క్రికెట్ సరైన దిశలో వెళ్తుందని బ్రావో అన్నాడు. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, థంపి లాంటివాళ్లు బౌలింగ్ చేయడం చాలా బాగుందని, వాళ్లకు తన హృదయపూర్వక అభినందనలని చెప్పాడు. ఇప్పుడు ఇంకా థంపి నేర్చుకునే దశలో ఉన్నాడని, మరిన్ని గేమ్స్ ఆడి మరింత అనుభవం పొందితే బాగా రాటుతేలుతాడని తెలిపాడు. గత సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు తీసిన బ్రావో.. ఈసారి లేకపోవడం గుజరాత్‌ను ఇబ్బంది పెడుతోంది.