
Why is DJ Bravo not playing today's CSK vs KKR match: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో లేకుండానే చెన్నై సూపర్‌కింగ్స్ మైదానంలో దిగింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో పిచ్ కాస్త స్లోగా ఉంటుందన్న విశ్లేషణల నేపథ్యంలో ధోని సేన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా స్లో పిచ్‌లపై బ్రావో మెరుగ్గా ఆడతాడన్న సంగతి తెలిసిందే. ఇక గత రెండు మ్యాచ్‌లలోనూ విండీస్ ఆల్‌రౌండర్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో ఫేజ్ పునః ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై విజయంలో బ్రావో తన వంతు పాత్ర పోషించాడు. 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే విధంగా శుక్రవారం నాటి ఆర్సీబీ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి, మాక్స్‌వెల్, హర్షల్ పటేల్ వికెట్లు తన ఖాతాలో వేసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో చెన్నై ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో బ్రావోకు విశ్రాంతినివ్వాలని ధోని భావించడం గమనార్హం. మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోని ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘అవును.. అతడు ఆడటం లేదు. తనకు రెస్ట్ అవసరం. సీపీఎల్‌లో భాగంగా బ్రావో గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ గాయం తాలూకు ప్రభావం ఉండే అవకాశం ఉంది. 48 గంటల లోపే(శుక్రవారం ఆర్సీబీతో, ఆదివారం కేకేఆర్‌తో) మరో మ్యాచ్ అంటే కష్టం. గాయం తిరగబెట్టే అవకాశం ఉంటుంది’’ అని, అందుకే నేటి మ్యాచ్‌లో బ్రావో ఆడటం లేదని చెప్పుకొచ్చాడు.
కాగా ఇటీవల ముగిసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడే సమయంలో డ్వేన్ బ్రావో గాయపడ్డాడు. ఈ క్రమంలో కోలుకున్న అతడు.. ఐపీఎల్ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చాడు. ఫేజ్ 2 తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబైతో జరిగిన పోరులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 3 వికెట్లు తీయడం సహా... 8 బంతుల్లో 23 పరుగులు చేసి సత్తా చాటాడు.
చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’!