ఎంఎస్ ధోని (ఫైల్ ఫొటో)
మొహాలి : కింగ్స్‌పంజాబ్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ధమాకా సరిపోలేదు. దీంతో విజయానికి చేరువగా వచ్చిన చెన్నై 4 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఓటమి అంచు నుంచి విజయాన్నందించిన విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోని కాదని స్పిన్నర్ రవింద్ర జడేజాను ముందు బ్యాటింగ్ పంపిచడంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. ధోని మాత్రం జడేజాకు మ్యాచ్ ఫినిష్ చేసే సత్తా ఉందని, అతను ఫినిషర్‌గా రాణించడమే తమ జట్టుకు కావాలని క్రిక్‌ఇన్‌ఫోతో అభిప్రాయపడ్డాడు.
‘బ్యాటింగ్‌కు ఎవరిని పంపిచాలని నిర్ణయం తీసుకోవడం ఆపరిస్థితుల్లో డగౌట్‌లో ఉన్న ఫ్లెమింగ్‌కు చాలా కష్టం. మేమంతా జడేజాపై నమ్మకం ఉంచాం. అతన్ని పంపిచాడనికి అతను లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ కావడం కూడా ఒక కారణం. ఎందుకంటే ఎడమ చేతివాటం ఆటగాళ్లకు బౌలర్లు స్థిరంగా బంతులు వేయలేరు. దీంతో అతనికి అవకాశం ఇచ్చాం. ఒకవేళ అతను విఫలమైతే మ్యాచ్‌ను ఫినిష్ చేసే సామర్థ్యం గల హిట్టర్ బ్రేవో ఎలాగు ఉన్నాడని భావించాం. బ్రేవో మా వెనుకాలే ఉంటూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. కానీ ఓవరాల్‌గా జడేజా లేదా ఎవరైనా ఫినిషర్‌గా రాణిస్తే అది మాకు మంచిదే. ఇక ఇలాంటి అవకాశం జడేజాకు ఎప్పుడివ్వలేదు. అతను ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరైన అర్హుడు. జడేజా రాబోయే మ్యాచ్‌ల్లో బాగా రాణించేలా అతని వెన్నంటే ఉండి ప్రోత్సాహిస్తానని ధోని స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment