బ్రేవో.. బ్రెయిన్‌ ఉపయోగించు : రాయుడు | Ambati Rayudu Disappoints on Bravo Bowling | Sakshi
Sakshi News home page

Published Tue, May 1 2018 5:38 PM | Last Updated on Fri, May 25 2018 7:45 PM

Ambati Rayudu Disappoints on Bravo Bowling - Sakshi

సైగ చేస్తున్న రాయుడు

పుణే : చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌, వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రేవోపై ఆజట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు అసహనం వ్యక్తం చేశాడు. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ సందర్భంలో రాయుడు.. బ్రేవోని బ్రెయిన్‌ ఉపయోగించి బౌలింగ్‌ చేయమని సైగలతో సూచించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ విజయ్‌ శంకర్‌ అనూహ్యంగా వరుస సిక్స్‌లతో చెలరేగడం.. రాయుడిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అతను మైదానంలో తన హావభావాలతో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 

అసలేం జరిగిందంటే..
బ్రేవో వేసిన 15 ఓవర్‌ రెండో బంతికి విజయ్‌ శంకర్‌ వ్యక్తిగతంగా తొలి సిక్స్‌ సాధించాడు. అయితే శంకర్‌ సిక్స్‌ కొట్టడం ఏమిటని.. ‘బంతిని బ్యాట్‌ కింద ఎందుకు వేస్తున్నావు.. సరిగ్గా యార్కర్‌లు వేయచ్చు కదా.!’ అని రాయుడు బ్రేవోకు సూచించాడు. ఈ సైగలకు సంబంధించిన దృశ్యాలను టీవీలో పదేపదే చూపించారు. ఇక బ్రేవో వేసిన 19 ఓవర్‌లో శంకర్‌ ఏకంగా మూడు సిక్స్‌లు సాధించడం విశేషం. ఇందులో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఈ సమయంలో సైతం రాయుడు తన హావభావాలతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పింగ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement