డ్వేన్ బ్రావో, కీరన్ పోలార్డ్(ఫైల్ ఫొటో)
ముంబాయి: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఒకే నంబర్ జెర్సీ 400 ధరించిన సంగతి తెల్సిందే. సహచర వెస్టిండీస్ ఆటగాడు, ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పోలార్డ్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో వారి వ్యక్తిగత మైలురాళ్లకు గుర్తుగా ఈ జెర్సీలను ధరించారు. రెండు జట్ల మధ్య శనివారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెన్నై గెలిచిన సంగతి తెల్సిందే.
మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో వివరణ ఇచ్చాడు. తాము 400 నెంబర్ గల జెర్సీ ధరించడానికి ఓ కారణముందన్నారు. కీరన్ పోలార్డ్‌కు ఇది 400వ టీట్వంటీ మ్యాచ్ అని, అలాగే టీట్వంటీలో 400 వికెట్లు తీసుకున్న తొలిబౌలర్‌ను తానేనని, ఇందుకు గుర్తుకు తామిద్దరం 400 నెంబర్ ఉన్న జెర్సీని ధరించామని తెలిపారు. ఈ టోర్నమెంట్ అనంతరం తమ పాత జెర్సీలు పోలార్డ్(47), బ్రావో(55)లు ధరిస్తామని వివరించారు. పోలార్డ్ ముంబై ఇండియన్స్ టీంతోనూ, తాను సీఎస్‌కే టీంతోనూ ముందే మాట్లాడి తుది జట్టులో అవకాశం కల్పించాలని కోరామన్నారు. శనివారం మ్యాచ్‌లో బ్రావో 30 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 68 పరుగులు చేసి చెన్నై జట్టును గెలిపించిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment