KKR Ajinkya Rahane Ruled Out Of IPL 2022 And England Tour Due To Hamstring Injury - Sakshi
Sakshi News home page

IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్‌.. సీనియర్‌ ఆటగాడు దూరం..!

Published Mon, May 16 2022 6:10 PM | Last Updated on Mon, May 16 2022 10:10 PM

 KKRs Ajinkya Rahane ruled out with hamstring injury - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ అజింక్య రహానే గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే గాయపడ్డాడు. నివేదికల ప్రకారం.. రహానే బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో నాలుగు వారాలు పాటు ఉండనున్నాడు.

ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్‌.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కాగా జట్టుకు రహానే దూరం కావడంతో వెంకటేశ్‌ అయ్యర్‌తో కలిసి నితీష్‌ రాణా ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇక గ్రూపు దశలో తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌ మే 18న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది.

చదవండి: IPL 2022 RR Vs CSK: రాజస్థాన్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement