గంభీర గర్జన.. కేకేఆర్‌పై గెలుపు అనంతరం లక్నో మెంటార్‌ ఉద్వేగం | Gautam Gambhir Angry Celebration After LSG Beat KKR Goes Viral | Sakshi
Sakshi News home page

గంభీర గర్జన.. కేకేఆర్‌పై గెలుపు అనంతరం లక్నో మెంటార్‌ ఉద్వేగం

Published Thu, May 19 2022 2:15 PM | Last Updated on Thu, May 19 2022 2:15 PM

Gautam Gambhir Angry Celebration After LSG Beat KKR Goes Viral - Sakshi

నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (మే 18) కేకేఆర్‌తో జరిగిన రసవత్తర సమరంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో లక్నో 2 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది. ఫలితంగా కేకేఆర్‌ ఇంటికి, లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరాయి.


మ్యాచ్‌ ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన సమయంలో స్టోయినిస్‌..ఉమేశ్‌ యాదవ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి లక్నో విజయాన్ని ఖరారు చేశాడు. ఈ సందర్భంగా లక్నో డగౌట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. అప్పటివరకు టెన్షన్‌ తట్టుకోలేక కళ్లు మూసుకుని డగౌట్‌లో కూర్చున్న లక్నో మెంటార్‌ జట్టు విజయం సాధించగానే తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా గర్జిస్తూ, గాల్లోకి పంచ్‌లు విసురుతూ తన ఆనందాన్ని సహచరులతో పంచుకున్నాడు. గంభీర గర్జనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

కాగా, లక్నో-కేకేఆర్‌ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ చాలాకాలం తర్వాత ప్రేక్షకులకు అసలుసిసలైన ఐపీఎల్‌ మజాను అందించింది. ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో కేకేఆర్‌ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. స్టోయినిస్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్ వరుసగా 4, 6, 6, 2 పరుగులు చేసి మ్యాచ్‌ను కేకేఆర్‌వైపు తిప్పాడు. ఇక కేకేఆర్‌ గెలుపు లాంఛనమే (2 బంతుల్లో 3 పరుగులు) అనుకుంటున్న తరుణంలో స్టోయినిస్‌ విజృంభించి చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీసి కేకేఆర్‌ పుట్టిముంచాడు. 
చదవండి: IPL 2022: కోల్‘కథ’ ముగిసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement