Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా కేకేఆర్ విజయంలో ఆ జట్టు పేసర్ ఉమేశ్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు రుత్‌రాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేను ఔట్ చేసి చెన్నై జట్టును ఉమేశ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్.. రెండు వికెట్లు పడగొట్టి 20 పరుగులు ఇచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఉమేశ్ యాదవ్ ముందే చెప్పాడు.
అయితే ఈ మ్యాచ్‌లో అది నిజం చేసి చూపించిన యాదవ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. అది నిజం చేశాడు" అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ధోని (50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో రహానే 44 పరుగులతో రాణించాడు.ఈ మ్యాచ్‌లో ఉమేశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
1st wicket of Tata IPL 2022 by Umesh Yadav #IPL2022 pic.twitter.com/wiDhG1IiBN
— Sumedh Shirke (@shirke_sumedh) March 26, 2022
.@y_umesh is adjudged Man of the Match for his bowling figures of 2/20 as @KKRiders win the season opener by 6 wickets.
— IndianPremierLeague (@IPL) March 26, 2022
Scorecard - https://t.co/b4FjhJcJtX #CSKvKKR #TATAIPL pic.twitter.com/qEArbeYYse
Comments
Please login to add a commentAdd a comment